జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం | Ranchi Hemant Soren Birthday | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం

Published Sat, Aug 10 2024 1:34 PM | Last Updated on Sat, Aug 10 2024 3:06 PM

Ranchi Hemant Soren Birthday

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన  ఎక్స్‌ హ్యాండిల్‌లో ఒక చిత్రాన్ని షేర్‌ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత  ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.

ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి  చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు  మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.

హింసకు గురవుతూ, న్యాయం అందని  ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement