క్లైమాక్స్‌లో కేక... | Nandamuri Taraka Ratna Plays Negative Role In Raja Meeru Keka | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌లో కేక...

Published Sun, Jan 15 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

క్లైమాక్స్‌లో కేక...

క్లైమాక్స్‌లో కేక...

నందమూరి తారకరత్న, రేవంత్, నోయెల్, ‘మిర్చి’ హేమంత్‌... ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిన ‘రాజా మీరు కేక’లో ఈ నలుగురూ కీలక పాత్రలు చేశారు. నలుగురిలో రాజు ఎవరు? అనడిగితే... ‘వచ్చే నెల వరకూ ఆగండి. సినిమా చూపిస్తాం’ అని టి. కృష్ణకిశోర్‌ చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఆర్‌.కె. స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌. ఎం ఈ చిత్రం నిర్మించారు. యాంకర్‌ లాస్య ఓ హీరోయిన్‌గా నటించారు. ఆడియో ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త కథతో తీసిన చిత్రమిది. క్లైమాక్స్‌లో తారకరత్న నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంత అద్భుతంగా నటించారు’’ అన్నారు కృష్ణ కిశోర్‌. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement