త్వరలో చెబుతా! | "Raja meeru keka" release on 16th of june. | Sakshi
Sakshi News home page

త్వరలో చెబుతా!

Published Wed, Jun 7 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

త్వరలో చెబుతా!

త్వరలో చెబుతా!

‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా  నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో  కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్‌. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్‌ ముఖ్య పాత్రల్లో   కృష్ణ కిషోర్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది.

ఈ సందర్భంగా రేవంత్‌ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా.  దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement