noyal
-
తెలుగు టెక్నీషియన్స్‌కి గౌరవం పెరిగింది: అజయ్ పట్నాయక్
పదేళ్ల క్రితం ఏదైనా ఒక సాంగ్ మిక్సింగ్ కోసం ముంబై వెళ్తే మమ్మల్ని స్టూడియో లోపలికి కూడా అనుమతించేవాళ్లు కాదు. బయటే కూర్చొబెట్టేవారు. కానీ ఇప్పుడు ముంబైలో ఫ్లైట్ దిగగానే కారు పంపిస్తున్నారు. హోటల్ బుక్ చేస్తున్నారు. వాళ్లతో సమానంగా చూసుకుంటున్నారు. దీనంతటికి కారణం రాజమౌళినే. ఆయన వల్లే తెలుగు టెక్నీషియన్స్‌కి ఇప్పుడు గౌరవం పెరిగింది’ అని అన్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘బహిర్భుమి’. నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అజయ్ పట్నాయక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ నేను పుట్టి పెరిగిందంతా విజయనగరంలోనే. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ నాకు నా కజిన్ అవుతాడు. మా ఫ్యామిలీ వాళ్లంతా మ్యుజిషియన్సే. అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే ఇష్టం పెరిగింది.⇢ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టం. రోజా సినిమా థీమ్‌కి బాగా ఆట్రాక్ట్ అయ్యాను. అప్పుడే నేను కీబోర్డు స్టార్ట్ చేశాను. బయట నేర్చుకున్న సంగీతానికి సినిమాల్లోని సంగీతానికి చాలా వ్యత్యాసం ఉంది. మళ్లీ హైదరాబాద్‌కి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నాను. ⇢ 2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాను. కానీ నేను సంగీతం అందించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘బహిర్భూమి’ చిత్రంతో నా పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.⇢ ‘బహిర్భూమి’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఓ నిర్మాత నా స్టూడియో దగ్గరకు వచ్చి..ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే మూడింతలు ఎక్కువ ఇచ్చి తన కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు.⇢ అన్నయ్య(ఆర్పీ పట్నాయక్) ఎఫెక్ట్ నాపై చాలా ఉంది. గతంలో నేను సంగీతం అందించిన ఓ పాటకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చినా.. అందరూ ఆర్పీ పట్నాయక్ సాంగ్ అనుకున్నారు. దాని వల్ల నాకు ఒక అవకాశం కూడా రాలేదు. కానీ బహిర్భూమి చిత్రం పాటలకు వ్యూస్ తక్కువే ఉన్నా.. చాలా మందికి రీచ్ అయింది. అందుకే వరుస చాన్స్‌లు వస్తున్నాయి.⇢ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని ఇంట్లో వాళ్లకు చెప్పినప్పుడు. ముందుకు చదువు ఉండాలని చెప్పారు. ఇండస్ట్రీలో క్లిక్ అవ్వకపోయినా ఏదైనా జాబు చేయాలంటే చదువు మస్ట్ అనిపించింది. అందుకే చదవు పూర్తయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చాను.ఇప్పటి వరకు 12 సినిమాలకు సంగీతం అందించాను.⇢ నోయల్ నాకు మంచి స్నేహితుడు. సంగీతంలో నోయల్ నాకంటే సీనియర్ .కానీ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఈ చిత్రంలో ర్యాంప్ సాంగ్ పాడాడు.⇢ ఈ సినిమాకు మంచి బీజీఎం ఇచ్చాను. క్వాలిటీలో పోల్చుకోలేం కానీ.. ‘మంగళవారం’ స్థాయిలో నేపథ్య సంగీతం ఉంటుంది.⇢ కథతో పాటు నటీనటుల ప్రభావం కూడా సంగీతంపై ఉంటుంది. మంచి కథ, పేరున్న హీరో అయితే దానికి తగ్గట్టుగా నేపథ్య సంగీతం అదించొచ్చు. నోయల్ ఉన్నాడు కాబట్టే.. బహిర్భుమికి మంచి బీజీఎం కుదిరింది. వేరే కొత్త హీరో ఉంటే నేను ఈ సినిమాపై అంత ఫోకస్ చేయకపోవచ్చు.⇢ సినిమా దర్శకుడికి మ్యూజిక్ పరిజ్ఞానం ఉండాలి. అలా ఉన్నప్పడే మంచి సంగీతం తీసుకోగలడు. ట్యూన్ విన్నవెంటనే పాటలో బాగుందో బాలేదో చెప్పేంత నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మంచి సాంగ్స్ వస్తాయి.⇢ నా గత 12 సినిమాలు వేరు. బహిర్భుమి సినిమా వేరు. ఈ సినిమా పాట విని చాలా మంది ఫోన్ చేసి అభినందించారు.⇢ ఏఐ టెక్నాలజీ ఎఫెక్ట్ సంగీతంపై అంతగా ఉండదు. దాని సహయంతో కొత్తరకమైన సంగీతం అందించే చాన్స్ ఉంది కానీ.. సహజమైన సంగీతానికి అది ఎప్పుడూ పోటీ కాదు.⇢ డైరెక్టర్‌కి ఇది తొలి సినిమా. చాలా సాఫ్ట్ తను. సెట్లో నవ్వుతూ కనిపిస్తాడు. ఏదైనా చెప్పడానికి కూడా మొహమాటం పడతాడు. కానీ నా నుంచి మంచి సంగీతం అందుకున్నాడు.⇢ నిర్మాత మచ్చ వేణుమాధవ్ ఈ సినిమాకు చాలా సపోర్ట్‌గా నిలిచాడు. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.⇢ పూరీ జగన్నాథ్ సినిమాకు సంగీతం అందించాలనేది నా లక్ష్యం. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. -
ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు చిరంజీవితో చెయ్యాలనే ఆశ ఉంటుంది కానీ.. : నోయల్
టాలీవుడ్లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌కి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని ఉంటుంది. కానీ దర్శకనిర్మాతలు మంచి అవకాశాలు ఇచ్చి.. మనం ప్రూవ్చేసుకుంటే అలాంటి చాన్స్‌లు వస్తాయి. నన్ను నమ్మి ‘ఈఎంఐ.. ఈ అమ్మాయి’అనే సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలు దొంతు రమేష్, డి. రమేష్ గౌడ్ లకు ధన్యవాదాలు’అని నటుడు నోయల్ అన్నారు. నోయల్, బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ఈఎంఐ.. ఈ అమ్మాయి. చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ.. ఒక తండ్రి కృషి, కొడుకు ప్రయత్నం అని చాలా సార్లు విన్నాను. అయితే ఈ సినిమా ద్వారా ఈ తండ్రి కొడుకులను కళ్లారా చూశాను. చాలా మంది సినిమాల్లోకి వెళతాను అంటే ఎంకరేజ్ చెయ్యరు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే ‘ఈఎంఐ..ఈ అమ్మాయి’. ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రక రకాల సమస్యలను కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాము. నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’అని సమర్పకులు దొంతు బుచ్చయ్య అన్నారు. ‘అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం మాకుంది’అని దర్శకుడు దొంతు రమేష్ అన్నారు.‘దర్శకుడు ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే చేయడానికి ఒప్పుకున్నాను, మా చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాను’అని హీరోయిన్ భాను అన్నారు. -
బిగ్‌బాస్ 5: శ్రీరామ్ చంద్రకు షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి మద్దతు
బిగ్‌బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఫినాలే టికెట్ సాధించడానికి ఇంటి సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వారికి దశల వారిగా టాస్కులు పెడుతున్నాడు బిగ్‌బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్లో పెట్టిన ఐస్ గేమ్‌తో ఇంటి సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఐస్ టబ్బులో కాళ్లు పెట్టి ఉండాలని.. మధ్యలో కాళ్లు బయటకు తీయవచ్చని సూచించాడు బిగ్‌బాస్. కానీ హౌస్మేట్స్ మొండితనంతో ఐస్‌లోనే కాళ్లు పెట్టి ఉంచడంతో చివరికి కాళ్లు కదపలేని స్థితికి చేరుకున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి కాళ్లు వాపులు వచ్చాయి. అయితే గేమ్ తర్వాత వెంటనే ఎవరు వేడి నీళ్లు ఉపయోగించకూడదని బిగ్‌బాస్ ముందుగానే హెచ్చరించాడు. కానీ అవేం పట్టించుకోకుండా ప్రియాంక.. శ్రీరామచంద్రకు సహయం చేయడానికి వచ్చి వేడి నీళ్లు అతడి కాళ్లపై చల్లింది. అంతేగాక నూనేతో మర్దన చేసింది. కాళ్లకు వేడినీళ్లు చల్లడంతో శ్రీరామచంద్ర పూర్తిగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని మెడికల్ రూంకు తీసుకెళ్లి .. కాళ్లకు కట్లు కట్టి పంపించాడు బిగ్‌బాస్. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! అనంతరం పవన్ కల్యాణ్ తీన్మార్ మూవీలోని ‘గెలుపు తలుపూలే తీసే..’ పాట ప్లే చేయడంతో శ్రీరామచంద్ర కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే శ్రీరామచంద్ర పరిస్థితి చూసి సన్నీ కూడా బాధపడ్డాడు. ఎప్పటికప్పుడు శ్రీరామచంద్రకు సహాయంగా ఉంటూ అతడిని నవ్విస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర పరిస్థితి చూసి ప్రేక్షకులకు సైతం కళ్లు చెమ్మగిల్లకమానవు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శ్రీరామ్ పరిస్థితి చూసి బిగ్‌బాస్ మాజీ కంటెస్టేంట్స్తో పాటు ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. చదవండి: థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ, రంగంలోకి పోలీసులు తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లతో పాటు కొందరూ సెలబ్రెటీలు ‘సంగీతం మాస్టర్’కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ ప్రియురాలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయన శ్రీరామ్‌కు సపోర్ట్ ఇవ్వడం విశేషం. ‘మోర్ పవర్ టూ యూ’ అంటూ దిప్తీ, శ్రీరామ్‌కు మద్దతు ప్రకటించింది. అలాగే ప్రియ సైతం ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేస్తూ ‘ఇంట్లో జెన్యూన్ పర్సన్ , రామ్ నీకోసం మేమంతా ఉన్నాము.. ప్లే స్ట్రాంగ్.. నీకోసం ప్రార్థిస్తుంటాను త్వరగా కోలుకోవాలి’అని శ్రీరామ్‌కు అండగా నిలిచింది. వీరితో పాటు అఖిల్ సార్థక్, దేత్తడి హారికా, నోయల్ సైతం ‘మోర్ పవర్ టూ యూ.. గెట్ వెల్ సూన్’ అంటూ మద్దతు ఇస్తున్నారు. -
ఆసక్తికరంగా ‘14’ మూవీ టీజర్
రాయల్ పిక్చర్స్ పతాకంపై నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగార్, రతన్,జబర్దస్త్ మహేష్ నటీ,నటులుగా లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్న ‘14’.ఈ చిత్రం టీజర్‌ను తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నోయల్ కు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం .నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఈ సినిమా నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నాను సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు శ్రీవిష్ణు మా చిత్రానికి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.తన ద్వారా మా చిత్రానికి మంచి బూస్టప్ వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉన్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు తో చేసే అవకాశం వస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను’అన్నాడు హీరో నోయల్. -
ఆలోచింపజేసే 14
‘కుమారి 21 ఎఫ్’ నోయల్ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ‘బిగ్ బాస్’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్‌కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి. -
ఈఎమ్ఐ నేపథ్యంలో...
నోయల్, భానుశ్రీ జంటగా దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈఎమ్ఐ’. దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంతు రమేష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ఇది. బ్యాంకాక్‌లో కొన్ని పాటలు చిత్రీకరించనున్నాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మా సినిమా చూసిన తర్వాత నచ్చలేదు అనే వాళ్ల ఈఎమ్ఐ నేను చెల్లిస్తాను’’ అన్నారు. ‘‘నెలవారీ వాయిదాలు చెల్లించలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది’’ అన్నారు భానుశ్రీ. ‘‘ప్రస్తుతం ఈఎమ్ఐ అంటే తెలియనివారుండరు. ఆ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి అన్నారు. -
సరికొత్త కథతో...
‘బిగ్ బాస్’ ఫేమ్, నటి భానుశ్రీ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఈ అమ్మాయి’. గాయకుడు నోయల్ హీరోగా నటిస్తున్నారు. దొంతు రమేష్ దర్శకత్వంలో అవధూత వెంకయ్యస్వామి ప్రొడక్షన్స్‌పై దొంతు బుచ్చయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్త కథాంశంతో రమేష్ తెరకెక్కిస్తున్నాడు. నోయల్, విలన్ పాత్రధారి ‘దిల్’ రమేశ్‌లపై హకీంపేట పోలీస్ స్టేషన్లో రసవత్తరమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆగస్టులో విదేశాల్లో పాటలు చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధన్‌రాజ్, భద్రం, చలాకీ చంటి, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రవి శంకర్. -
టీనేజ్ లవ్‌స్టోరీ
‘‘కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ లవ్‌స్టోరీ అని అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా బాగా ఆడుతుంది. అవి ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ సముద్ర అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేసిన నిఖిల్ హీరోగా, సాహితి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. నీరజ ప్రధాన పాత్రలో నటించారు. అల్లాడి రవీందర్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మికాంత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ సముద్ర రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను నటుడు నోయల్ విడుదల చేశారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాట్సప్‌తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్‌తోనే రోజు ముగుస్తుంది. ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే ఈ టైటిల్ పెట్టాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. మంచి కథాం శంతో తెరకెక్కింది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ చిత్రానికి సమర్పణ: రామ్ రెడ్డి, సహ నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి (దేవ కర్ర), సంగీ తం: రాజేష్ తేలు, కెమెరా: భాస్కర్ దోర్నాల. -
ముగ్గురి ప్రేమ
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన చిత్రం ‘ఎందుకో ఏమో’. నందు, నోయల్, పునర్నవి భూపాలం నాయకా నాయికలుగా నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ‘‘వినాయక చవితి సందర్భంగా ఈ నెల 12న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత మాలతి తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇది నా తొలి సినిమా. ఎంతో నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ అంశాలు ఉన్న చిత్రం. మంచి కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను ప్రజలు ఆదరిస్తారు. మా సినిమా అలాంటిదే’’ అన్నారామె. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇది ముగ్గురి మధ్య జరిగే ప్రేమకథ . ఫ్యామిలీ, యూత్‌ను మా సినిమా ఆకట్టుకుంటుంది. నందు, నోయల్, పునర్నవి ఎవరికి వారు పోటి పడి నటించారు. క్లైమాక్స్ మా చిత్రానికి హైలెట్. కథ, కధనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు. నందు మాట్లాడుతూ– ‘‘మహిళా నిర్మాత సినిమాలో నటించడం నాకిది ఫస్ట్ టైమ్. ఎంతో అభిరుచితో నిర్మించిన ఈ చిత్రంలో నటించినందుకు హ్యాపీగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కోటి గారికి థ్యాంక్స్. ఈ సినిమా ద్వారా నోయల్, పునర్నవి మంచి స్నేహితులయ్యారు’’ అన్నారు. -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ!
నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మహేశ్వర క్రియేషన్స్పతాకంపై మాలతి వద్దినేని నిర్మించిన సినిమా ‘ఎందుకో ఏమో’. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కోటి వద్దినేని మాట్లాడుతూ–‘‘ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’అన్నారు. ‘‘మా బ్యానర్లో తొలి చిత్రమిది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్‌స్టోరీకి కమర్షియల్ హంగులు జోడించాం’’ అన్నారు మాలతి. పోసాని కృష్ణ మురళి, ‘సుడిగాలి’ సుధీర్, నవీన్, ‘రాకెట్’ రాఘవ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సంగీతం అందించారు. -
టైటిల్ క్యాచీగా ఉంది – బోయపాటి శీను
నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శకుడు బోయపాటి శీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ క్యాచీగా ఉంది. పాట చాలా బాగుంది. సినిమా కూడా బావుంటుందని అర ్థమవుతోంది. నందు హార్డ్ వర్కర్. ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తేవాలి’’ అన్నారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మొత్తం నాలుగు పాటలున్నాయి. ప్రవీణ్ ఒక్కో పాటను ఒక్కో విధంగా చాలా బాగా కంపోజ్ చేశారు. ఇటీవల వినాయక్‌గారు విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బోయపాటిగారు లాంచ్ చేసిన పాట నా ఫేవరేట్. దర్శక–నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు’’ అన్నారు నందు. సంగీత దర్శకుడు ప్రవీణ్ పాల్గొన్నారు. -
పేరు.. డబ్బులు రావాలి – వినాయక్
‘‘ఎందుకో ఏమో’ టైటిల్‌లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న సినిమా ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మా నిర్మాత రాజీ పడకుండా, నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగా. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ హంగులు మా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు మాలతి. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, కెమెరా: జీయస్ రాజ్ (మురళి). -
ప్రతిక్షణం ఉత్కంఠ!
అర్జున్ కల్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయెల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ద ప్రాంక్’. అమోఘ్ పాటలను స్వరపరుస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. సరికొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని ఆకాక్షించారు మారుతి. కొత్త సబ్జెక్ట్‌ను మంచి టెక్నికల్ వేల్యూస్ రూపొందిస్తున్నారని అన్నారు రాజ్ కందుకూరి. ‘‘సరదా పట్టించడానికో లేదా భయపెట్టడానికో ప్రాంక్ ఫోన్‌కాల్స్ చేయడం, వీడియోలు రూపొందించడం నేటి ట్రెండ్‌లో సాధారణ విషయమే. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్, గోవా, సింగపూర్లలో చిత్రీకరణ జరుపనున్నాం. కథ సింగపూర్‌లో మొదలై అనూహ్య మలుపులతో సాగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మహేశ్ కోడి. -
రాజమౌళి శిష్యుడి నయనం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ‘ఈగ, మర్యాద రామన్న, మగధీర’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన క్రాంతికుమార్ వడ్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నయనం’. ఎస్తేర్, నోయల్, శ్రీ మంగం, అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో రామ్ కేతు, కృష్ణమోహన్, శ్రీరామ్ కందుకూరి, నరేన్ లేబాకు నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు క్రాంతికుమార్. నిర్మాతల్లో ఒకరైన శ్రీరామ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘దీపావళికి టీజర్‌ను, నవంబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
త్వరలో చెబుతా!
‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్ ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా. దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు.