ప్రతిక్షణం ఉత్కంఠ! | The Prank Movie Motion Poster | Sakshi
Sakshi News home page

ప్రతిక్షణం ఉత్కంఠ!

Nov 5 2017 12:33 AM | Updated on Nov 5 2017 12:33 AM

The Prank Movie Motion Poster  - Sakshi

అర్జున్‌ కల్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయెల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ద ప్రాంక్‌’. అమోఘ్‌ పాటలను స్వరపరుస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్‌ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. సరికొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని ఆకాక్షించారు మారుతి.

కొత్త సబ్జెక్ట్‌ను మంచి టెక్నికల్‌ వేల్యూస్‌ రూపొందిస్తున్నారని అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘సరదా పట్టించడానికో లేదా భయపెట్టడానికో ప్రాంక్‌ ఫోన్‌కాల్స్‌ చేయడం, వీడియోలు రూపొందించడం నేటి ట్రెండ్‌లో సాధారణ విషయమే. ఈ కాన్సెప్ట్‌ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్‌ కంప్లీట్‌ అయ్యింది. హైదరాబాద్, గోవా, సింగపూర్‌లలో చిత్రీకరణ జరుపనున్నాం. కథ సింగపూర్‌లో మొదలై అనూహ్య మలుపులతో సాగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మహేశ్‌ కోడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement