pujitha
-
మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ గా విశాఖకు చెందిన పూజిత ఎన్నిక
-
శంషాబాద్ లో యువతి ఆత్మహత్య
-
‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం!
ఓ.టి.టిలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ తరహా కంటెంట్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఆ నమ్మకంతో రిలీజైన ఫిల్మ్ ‘గతం’. ఎన్నారైలైన ఐ.టి. ఉద్యోగులే నటిస్తూ, సమష్టిగా నిర్మిస్తూ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. కథేమిటంటే..: ఆస్పత్రి మంచం మీద కోమాలో నుంచి లేచి, గతం మర్చిపోయిన ఓ అబ్బాయి (రిషి పాత్రలో రాకేశ్). అతని ప్రియురాలిగా గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించే ఓ అమ్మాయి (పూజిత). గతాన్ని తెలుసుకోవడానికంటూ వారిద్దరూ కారులో బయలుదేరతారు. మార్గమధ్యంలో, చిమ్మచీకటిలో కారు ఆగిపోతే, అపరిచిత వ్యక్తి అర్జున్ (భార్గవ పోలుదాసు) తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ జంటకు ఎదురైన విచిత్రమైన అనుభవాలు ఏమిటి, మర్చిపోయిన ఆ గతం ఏమిటి, ఆ గతానికీ ఈ వ్యక్తులకూ సంబంధం ఏమిటన్నది కథ. ఎలా చేశారంటే..: ‘‘ప్రతి మనిషిలోనూ ఓ సైకోపాత్ ఉంటాడు’’ అంటూ ఔత్సాహికులు చేసిన ఈ సినిమాలో నటీనటులంతా కొత్తవాళ్ళే. అపరిచిత ముఖాలే. అయినా, వెండితెరపై విలన్ పాత్రలకు సరిపోయే అర్జున్ పాత్రధారి భార్గవ ఆకట్టుకుంటారు. రిషి పాత్రధారి రాకేశ్ గొంతు, ఉచ్చారణ కళ్ళు మూసుకొని వింటే, హీరో విజయ్ దేవరకొండ గుర్తుకొస్తారు. ‘మాయాబజార్’ దర్శకులు కె.వి. రెడ్డికి ముని మనుమరాలైన పూజితారెడ్డి పాత్ర పరిధిలో ఉన్నంత మేరకు చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథలో భాగంగా వచ్చిపోయేవి. ఎలా తీశారంటే..: మొత్తం అమెరికా నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో మనోజ్ రెడ్డి కెమెరాలో అమెరికాలో మంచుతో నిండిన లొకేషన్లు తెరపై అందంగా కనిపించాయి. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం. థ్రిల్లర్ కథనూ, సన్నివేశాలనూ బలంగా చెప్పడంలో చరణ్ పనితనం బాగా ఉపయోగపడింది. షార్ట్ ఫిల్ముల నుంచి దర్శకుడిగా మారిన అమెరికన్ ఐ.టి. ఉద్యోగి కిరణ్ రెడ్డి మంచి పాయింట్‌ను ఎంచుకున్నారు. కానీ, అంతకు తగ్గ పటిష్ఠమైన కథనం అల్లుకోలేదనిపిస్తుంది. ఇన్ని నేరాలు జరుగుతున్నా ప్రధాన పాత్రధారి తప్ప పోలీసులెవరూ పరిశోధిస్తున్నట్టు కనపడరు. కొడుకు చేసే ఘోరాలకు తండ్రి ఎందుకు సహకరిస్తున్నాడన్న దానికీ పెద్దగా లాజిక్ లేదు. కథనంలో కొన్ని సన్నివేశాలు ముందుగా ఊహించేసే తీరులో ఉండడమూ మరో బలహీనత. సినిమా ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. అసలు కథ మొదలైన సెకండాఫ్ చివరికొచ్చే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందని వీక్షకులు భావిస్తేనే కష్టం. అయితే, ఐ.టి. ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే, క్రిస్మస్ సెలవుల్లో, వీకెండ్స్ లో తీస్తూ, వీలైనంత తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ యూనిట్‌తో చేసిన ప్రయత్నంగా కథలోని చాలా లోపాలను క్షమించ బుద్ధేస్తుంది. కమర్షియల్ లెక్కలతో కాకుండా, ప్రేమతో ప్రవాస భారతీయులు చేసిన ప్రయత్నంగా ‘గతం’ను అభినందించాలని అనిపిస్తుంది. కానీ, గ్రిప్పింగ్‌గా ఉన్న ట్రైలర్‌కు భిన్నంగా స్లోగా సాగే ఈ నూటొక్క నిమిషాల కథాకథనాన్ని అందరూ ఆనందించగలరా? కొసమెరుపు: ‘గతం’... గుర్తు పెట్టుకోలేం! అలాగని మరిచిపోలేం! బలాలు: ► నేపథ్య సంగీతం ► క్రై మ్, ఇన్వెస్టిగేషన్ అంశం ► సినిమా చివరి అరగంట ► భార్గవ అభినయం. బలహీనతలు: ∙ ► అంతా కొత్తవాళ్ళే కావడం ► సీన్లలోని ప్రిడిక్టబిలిటీ ► ఫస్టాఫ్‌లోని స్లో నేరేషన్ ► కథ నడిపిన విధానం. – రెంటాల జయదేవ -
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి మృతి చెందింది’
మియాపూర్: ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. ఈ సంఘటన మదీనాగూడ అర్చనా ఆస్పత్రి ముందు మంగళవారం జరిగింది. వివరాలు.. పటాన్‌చెరులోని కర్దనూర్ గ్రామానికి చెందిన పాండు, కవతి దంపతుల కూతురు పూజిత(18) మదీనాగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు డిసెంబర్ 26న కడుపునొప్పి రావడంతో పటాన్‌చెరులోని సాయిగణేష్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు అర్చన ఆస్పత్రికి తీసుకెళ్ళాలని సూచించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రికి అపెండిక్స్ ఆపరేషన్‌ను డాక్టర్లు పూర్తి చేశారు. రెండు రోజుల తర్వాత డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళవచ్చని సూచించారు. అంతలోనే అపెండిక్స్ గడ్డ పగిలిందని ఇన్ఫెక్షన్ అధికంగా అయిందని సూచించారని కుటుంబసభ్యులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. సోమవారం రాత్రి మళ్ళీ ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం వరకు బాగానే ఉన్నా 11 గంటల ప్రాంతంలో మృతి చెందింది. బీపీ నియంత్రలో లేనప్పుడు ఆపరేషన్ చేయడంతోనే మా అమ్మాయి పూజిత మరణించిందని వారు ఆరోపించారు. అనంతరం వారు ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. మియాపూర్ పోలీసులు ఆందోళనను విరమింపచేశారు. అపెండిక్స్ గడ్డ పగలడంతో పేగులకు ఇన్ఫెక్షన్ ఎక్కువై ఆమె చనిపోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం ఎక్కడా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్..
శ్రీనగర్‌కాలనీ: ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. పట్నంలో చదువుకునేటప్పుడు దొరబాబును ప్రేమించింది. దొరబాబు అంటే తమ్ముడు చిట్టిబాబుకు అమితమైన ప్రేమ. అనుకోకుండా దొరబాబు వాళ్ల ఊరి ప్రెసిడెంట్‌ను ఎదిరించాడు. ఎన్నికల్లో కూడా అతనికి పోటీగా నిలబడ్డాడు. ఇంత బిజీగా ఉన్నాసరే ఆదివారం వచ్చిందంటే మాత్రం దొరబాబు ఆమెను చూడ్డానికి పట్నం వెళుతుంటాడు. ఈ కథ ఎక్కడో విన్నట్టో.. చూసినట్టో ఉంది కదూ..! అదేనండి ‘రంగస్థలం’ చిత్రంలోని సన్నివేశం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కథలో కీలకమైనదే. ఇందులో దొరబాబు(ఆది పినిశెట్టి) ప్రేమించిన ఎమ్మెల్యే కూతురు పేరు గుర్తుందా.. ‘పద్మ’. ఆమె అసలు పేరు ‘పూజిత పొన్నాడ’. అంతకుముందే యూట్యూబ్‌లో ఎంతోమందికి పరిచమైన పూజిత.. పద్మగా మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మరో కీలక పాత్ర చేసి మెప్పించింది. ఈ సందర్భంగా పూజిత తన వెండి తెర ఎంట్రీని ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. నాన్న బిజినెస్మెన్, అమ్మ గృహిణి. పుట్టింది వైజాగ్‌లోనే కానీ ఢిల్లీలో చదువుకున్నా. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరాను. స్కూలింగ్, కాలేజీ రోజుల్లో చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. నా హాబీస్ బుక్స్ చదవడం, ఆర్ట్స్ వేయడం. జాబ్ చేస్తున్న సమయంలో ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ ద్వారా ‘ఉప్మా తినేసింది’ షార్ట్‌ఫిలిం యూనిట్ అప్రోచ్ అయ్యారు. అలా షార్ట్‌ఫిలింస్‌లో అనుకోకుండా నటించాను. ఫస్ట్‌టైం కెమెరా ముందు ధైర్యం తెచ్చుకొని నటించాను. సింగిల్ టేక్‌లో షాట్స్ ఓకే అవుతుంటే నాపై నమ్మకం పెరిగింది. అలా ‘పరిచయం, బూచి, అను నేను తను’ లాంటి 10 షార్ట్ ఫిలింస్‌లో నటించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసా.. నేను నటించడం ఇంట్లో వారికి అసలు ఇష్టం లేదు. జాబ్ పైనే దృష్టిపెట్టమన్నారు. అయితే, నా షార్ట్ఫిలింస్ చూసిన అమ్మ ఫ్రెండ్స్ అభినందిస్తూ మెజేస్‌లు చేయడంతో అమ్మ కూడా ఆనందించింది. జాబ్‌తో పాటు అప్పుడప్పుడు షార్ట్ ఫిలింస్ చేస్తుండటంతో ఇంట్లో వాళ్లు కూడా ప్రోత్సహించారు. ఓ షార్ట్‌ఫిలింలో నన్ను చూసిన దర్శకుడు సుకుమార్ ‘దర్శకుడు’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో డేట్స్ కుదరక యాక్టింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకొని జాబ్ మానేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసి పేరెంట్స్ చాలా కోప్పడ్డారు. తర్వాత నా డెడికేషన్ నచ్చి సినీ రంగంలోకి వెళ్లమని, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా ఆశీర్వదించారు. ‘రంగస్థలం’తో గుర్తింపు రంగస్థలం చిత్రంలో ప్రకాష్‌రాజ్ కుమార్తె పద్మగా ఆది పినిశెట్టికి జోడిగా నటించాను. సినిమా ఘన విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్‌తో పాటు చిత్రంలోని అందరూ చాలా ప్రోత్సహించారు. తర్వాత దర్శకుడు మారుతి నిర్మాణంలోని ‘బ్యాండ్ బాబు’, దర్శకురాలు సంజనారెడ్డి చిత్రం ‘రాజుగాడు’లో నటించాను. రీసెంట్గా ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మంచి ప్రాతలో నటించాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా రాజశేఖర్ ‘కల్కి, సెవెన్’తో పాటు మరో పెద్ద ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను. దర్శకులు సుకుమార్, మారుతి నన్ను ప్రోత్సహించారు. రిజర్వ్డ్ పర్సన్‌ని.. స్కూలింగ్ నుండి కాలేజీ డేస్‌తో పాటు జాబ్‌లో కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. ఎవరితోనూ అంత క్లోజ్ అయ్యేదాన్ని కాదు. చదువే ఫస్ట్ అన్నట్లుగా నా ప్రయాణం సాగింది. తొమ్మిదో తరగతిలో లంచ్ టైమ్‌లో ఓ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఒక్క నిమిషం చేయి వాష్ చేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుండి నేను జంప్. టెన్త్‌లో నా ఫ్రెండ్ స్కూల్ ఫంక్షన్లో నా ఫస్ట్ లవ్ పూజితకి ఈ పాట అంకితం అని స్టేజీ మీద అందరి మందు చెప్పేసాడు. నేను వెంటనే ఫంక్షన్ నుండి వెళ్లిపోయాను. ఆ వయసులో భయంతో పాటు సిగ్గు, బిడియం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా ధైర్యంతో ఉన్నాను. తెలుగమ్మాయిలు‘ది బెస్ట్’ అనిపించుకోవాలి అందరూ బాగా నటిస్తారు. కానీ తెలుగమ్మాయిలు ‘ద బెస్ట్’ అనిపించుకొనేలా చేయాలని ఉంది. నా వరకూ నేను కష్టపడతాను. హావభావాలను పలికిస్తూ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి కృషి చేస్తాను. ‘సమ్మోహనం’ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. కథాబలమున్న పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. పెద్ద బ్యానర్లో పనిచేయాలని ఉంది. నటిగా నన్ను నేను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రంలో అన్ని షేడ్స్ ఉన్న రోల్లో నటించాను. గ్లామెరెస్ రోల్స్‌తో పాటు అన్ని పాత్రలు చేయగలను. రూమర్స్‌ని నేను పట్టించుకోను. నా వ్యక్తిత్వంతో ముందుకు సాగుతాను’ అంటూ ముగించింది పద్మ. -
వర్మగారే నాకు స్ఫూర్తి
‘‘మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు పని చేశా. జర్నలిస్ట్‌గా కూడా వర్క్ చేశాను. సినిమా రంగంపై ఆసక్తితో ఓ స్నేహితుడి ద్వారా రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘రౌడీ’ సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. నేను డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అమైరా దస్తూర్, పూజిత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజనారెడ్డి మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా 25 వసంతాల సమయంలో అమలగారిని కలిశాను. ఆమె నన్ను ఓ యాడ్‌ను డైరెక్ట్ చేయమన్నారు. నేను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో నాలో నమ్మకం పెరిగింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో రాజ్‌తరుణ్ పరిచయం అయ్యారు. ‘రాజుగాడు’ నిర్మాతల్ని ఆయనే పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోకి క్లిప్టోమేనియా అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే దొంగతనం చేస్తుంటారు. ఈ వ్యాధి వల్ల హీరో ఉద్యోగాలన్నీ కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్రసాద్ సూపర్‌మార్కెట్ నడుపుతుంటాడు. ఇద్దరి మధ్య కామెడీ చక్కగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లయిమాక్స్ సినిమాటిక్‌గా ఉంటాయి. మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ప్రతిక్షణం ఉత్కంఠ!
అర్జున్ కల్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయెల్ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ద ప్రాంక్’. అమోఘ్ పాటలను స్వరపరుస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. సరికొత్త ప్రయోగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని ఆకాక్షించారు మారుతి. కొత్త సబ్జెక్ట్‌ను మంచి టెక్నికల్ వేల్యూస్ రూపొందిస్తున్నారని అన్నారు రాజ్ కందుకూరి. ‘‘సరదా పట్టించడానికో లేదా భయపెట్టడానికో ప్రాంక్ ఫోన్‌కాల్స్ చేయడం, వీడియోలు రూపొందించడం నేటి ట్రెండ్‌లో సాధారణ విషయమే. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్, గోవా, సింగపూర్లలో చిత్రీకరణ జరుపనున్నాం. కథ సింగపూర్‌లో మొదలై అనూహ్య మలుపులతో సాగుతుంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మహేశ్ కోడి. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
అశ్వరావుపేట: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టిలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంపసాటి పూజిత(3) ఇంటి ముందు ఆడుకుంటు వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడింది. తల్లిదండ్రులు ఇది గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందింది. తల్లిదండ్రులు గమనించేసరికి తమ ముద్దుల కూతురు నీటితొట్టెలో శవమై కనిపించడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. -
'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే'
హైదరాబాద్ : ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి తనకు ప్రాణ భయం ఉందని సినీనటి పూజిత తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని అన్నారు. పలు క్రిమినల్ కేసులు కూడా అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పూజిత డిమాండ్ చేశారు. విజయ్ గోపాల్ కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూజిత మంగళవారం హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డిని కలిసి, తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చూసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ రేఖారాణి, విజయ్ గోపాల్ పెళ్లికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు. తనకు కొంతమంది నుంచి ప్రాణహాని కూడా ఉందని, ఈ పెళ్లికి ఐపీఎస్ అంజనా సిన్హానే మొదటి సాక్షి అన్నారు. చట్ట విరుద్ధంగా వివాహం చేసుకున్న వారితో పాటు, వారికి సహకరించినందుకు అంజనా సిన్హాపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విచారణ నుంచి అంజనా సిన్హాను తప్పించాలని, లేకుంటే తనకు న్యాయం జరగదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తనకు భద్రత కల్పించి న్యాయం చేయాలని పూజిత వేడుకున్నారు. న్యాయం జరిగేవరకూ తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు. మీడియా కూడా తనకు సహకరించాలని పూజిత విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై విజయ్ గోపాల్ స్పందిస్తూ పూజితతో తనకు వివాహం జరగలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశానని తెలిపారు. -
చదలాడ.. వ్యధవాడ
చాక్లెట్ కొనుక్కుంటానని చెంగుచెంగున గెంతుతూ వీధిలోకి వెళ్లిన చిన్నారి.. శవమై కాలువలో కనిపించడం అయినవారినే కాదు.. ఆ ఊరినే కలచివేసింది. అందరి కనులనూ చెమ్మగిల్లజేసింది. బరువెక్కిన వారి హృదయూలను ‘ఈ విషాదం ఎలా జరిగింది? ఎందుకు జరిగింది?’ అన్న ప్రశ్నలు పీడిస్తున్నాయి. పెద్దాపురం మండలంలోని చదలాడలో బుధవారం అదృశ్యమైన దొడ్డిపట్ల పూజిత (7) శుక్రవారం ఏలేరు కాలువలో మృతదేహమై కనిపించడంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. * ఆ గ్రామంలో బుధవారం అదృశ్యమైన ఏడేళ్ల పూజిత * రెండురోజుల తర్వాత ఏలేరు కాలువలో కనిపించిన మృతదేహం * పాప మృతిపై వ్యక్తమవుతున్న పలు అనుమానాలు పెద్దాపురం (సామర్లకోట) : కిర్లంపూడి మండలం వీరవరానికి చెందిన దొడ్డిపట్ల నారాయణరావు ఆ మండల తహశీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి బావమరిది సతీష్ వివాహం జరగనుండడంతో భార్య విజయకుమారిని, కుమార్తె పూజితను ఆరోజు ఉదయం చదలాడలోని మామ వరుపుల రూపులయ్య ఇంటి వద్ద దింపి వెళ్లారు. ఇంట్లో పెద్దలు పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆడుకుంటున్న పూజిత చాక్లెట్ కొనుక్కుంటానని తాతకు చెప్పి బయటకు వెళ్లింది. అరుుతే ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పరిసరాల్లో గాలించినా పాప జాడ కానరాలేదు. దాంతో తాత రూపులయ్య పెద్దాపురం పోలీసు స్టేషన్లో, తండ్రి నారాయణరావు కిర్లంపూడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు. బుధవారం రాత్రి జరగాల్సిన వివాహాన్ని పాప అదృశ్యం కారణంగా వాయిదా వేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పూజితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారనే అనుమానాలు వ్యక్తం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు బాలిక కోసం విస్తృతంగా గాలించారు. ఎలా జరిగిందో ఈ ఘోరం.. కాగా శుక్రవారం తాటిపర్తి సమీపంలోని ఏలేరు కాలువఒడ్డున బాలిక మృతదేహాన్ని చూసిన ఆ గ్రామస్తులు రూపులయ్య బంధువులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని ఆ మృతదేహం పూజితదే కావడంతో హతాశులయ్యూరు. పాప ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో పడిపోయి రెండు కిలోమీటర్ల దూరంలోని తాటిపర్తి వద్దకు కొట్టుకు వచ్చిందా లేక ఎవరైనా చంపి వేసి కాలువలో పారేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తల్లిదండ్రులు, తాత తమకు ఎవరూ శత్రువులు లేరని చెపుతున్నారు. ఆ ఇంట జరగాల్సిన వివాహాన్ని నిలిపివేయడానికే ఎవరో పూజితను కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానమూ రేకెత్తింది. అయితే ఇరువైపులా అంగీకారంతోనే వివాహం నిశ్చయమైందని బంధువులు అంటున్నారు. జగ్గంపేట సీఐ జీవీవీ సత్యనారాయణ, పెద్దాపురం ఎస్సై వై.సతీష్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహానికి పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా అటు పూజిత విషాదాంతంతో అటు వీరవరంలోనూ దుఃఖపూరిత వాతావరణం అలముకుంది. -
విషాదాంతమైన పూజిత అదృశ్యం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన పూజిత ఉదంతం విషాదంగా ముగిసింది. ఏలేరు కాలువ వద్ద పూజిత మృతదేహం లభ్యం కావడంతో ఆ కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం మేనమమా వివాహానికి ..పూజిత కుటుంబం చదలాడ వచ్చింది. బుధవారం ఉదయం చాక్లెట్ కొనుక్కునేందుకు బయటకు వచ్చిన చిన్నారి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు పూజితను ఇద్దరు మహిళలు ...ఆటోలో తీసుకు వెళ్లినట్లు సమచారం. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
-
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
కడప : కడప నగరంలోని నారాయణ ప్రైవేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతి ఘటనపై విచారణాధికారులను నియమించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి. రమణకుమార్ వెల్లడించారు. ఈ కేసులో విచారణాధికారులుగా ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం, స్పెషల్ పోలీస్ బెటాలియన్ డీఎస్పీ సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. బుధవారం కడపలో రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థినుల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థినుల మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు రక్తంతో రాసినట్లు చెప్పబడుతున్న లేఖను డీఎన్ఏ టెస్ట్‌కు పంపామని... అలాగే విద్యార్థినుల సూసైడ్ నోట్‌ను కూడా పరీక్షల కోసం ఫోరెన్సిక్ లేబ్‌కు పంపినట్లు చెప్పారు. విద్యార్థినుల మృతిపై ఎవరైనా సమాచారం ఇవ్వాలంటే 9440796935 ఈ సెల్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పోలీసుల విచారణపై ఎలాంటి అనుమానాలు అక్కరలేదని... ఈ కేసు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా రమణకుమార్ తెలిపారు. మృతి చెందిన విద్యార్థినుల ఫ్రెండ్స్‌తో పాటు రూమ్మేట్స్, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అందర్నీ విచారిస్తామని ఆయన వివరించారు. -
పూజిత కేసులో కొత్త కోణం!
-
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత