'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే' | Actress Pujitha marriage issue: advocate reveals shocking news | Sakshi
Sakshi News home page

'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే'

May 3 2016 2:34 PM | Updated on Apr 3 2019 9:13 PM

'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే' - Sakshi

'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే'

ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి తనకు ప్రాణ భయం ఉందని సినీనటి పూజిత తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని అన్నారు.

హైదరాబాద్ : ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి తనకు ప్రాణ భయం ఉందని సినీనటి పూజిత తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని అన్నారు.  పలు క్రిమినల్ కేసులు కూడా అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పూజిత డిమాండ్ చేశారు. విజయ్ గోపాల్ కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూజిత మంగళవారం హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డిని కలిసి, తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చూసుకున్నాడని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ రేఖారాణి, విజయ్ గోపాల్ పెళ్లికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు.  తనకు కొంతమంది నుంచి ప్రాణహాని కూడా ఉందని, ఈ పెళ్లికి ఐపీఎస్ అంజనా సిన్హానే మొదటి సాక్షి అన్నారు. చట్ట విరుద్ధంగా వివాహం చేసుకున్న వారితో పాటు, వారికి సహకరించినందుకు అంజనా సిన్హాపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విచారణ నుంచి అంజనా సిన్హాను తప్పించాలని, లేకుంటే తనకు న్యాయం జరగదన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తనకు భద్రత కల్పించి న్యాయం చేయాలని పూజిత వేడుకున్నారు. న్యాయం జరిగేవరకూ తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు. మీడియా కూడా తనకు సహకరించాలని పూజిత విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై విజయ్ గోపాల్ స్పందిస్తూ పూజితతో తనకు వివాహం జరగలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement