సినీనటి పూజిత మరోసారి సీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. విడాకులివ్వకుండానే తన భర్త విజయ్గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని...
హైదరాబాద్ : సినీనటి పూజిత మరోసారి సీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. విడాకులివ్వకుండానే తన భర్త విజయ్గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె గురువారం విజ్ఞప్తి చేశారు. ( చదవండి....నాకు ప్రాణహాని: నటి పూజిత) రేఖారాణి, తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పూజిత తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే పూజిత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.