IAS rekha rani
-
మరోసారి సీపీని కలిసిన నటి పూజిత
హైదరాబాద్ : సినీనటి పూజిత మరోసారి సీపీ మహేందర్ రెడ్డిని కలిసింది. విడాకులివ్వకుండానే తన భర్త విజయ్‌గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని రెండో పెళ్లి చేసుకున్నాడని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె గురువారం విజ్ఞప్తి చేశారు. ( చదవండి....నాకు ప్రాణహాని: నటి పూజిత) రేఖారాణి, తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పూజిత తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే పూజిత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'ఆ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే'
హైదరాబాద్ : ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి తనకు ప్రాణ భయం ఉందని సినీనటి పూజిత తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండో పెళ్లి చూసుకున్న విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని అన్నారు. పలు క్రిమినల్ కేసులు కూడా అతడిని తక్షణమే అరెస్ట్ చేయాలని పూజిత డిమాండ్ చేశారు. విజయ్ గోపాల్ కొద్దిరోజుల క్రితం ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూజిత మంగళవారం హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డిని కలిసి, తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చూసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ రేఖారాణి, విజయ్ గోపాల్ పెళ్లికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు. తనకు కొంతమంది నుంచి ప్రాణహాని కూడా ఉందని, ఈ పెళ్లికి ఐపీఎస్ అంజనా సిన్హానే మొదటి సాక్షి అన్నారు. చట్ట విరుద్ధంగా వివాహం చేసుకున్న వారితో పాటు, వారికి సహకరించినందుకు అంజనా సిన్హాపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విచారణ నుంచి అంజనా సిన్హాను తప్పించాలని, లేకుంటే తనకు న్యాయం జరగదన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తనకు భద్రత కల్పించి న్యాయం చేయాలని పూజిత వేడుకున్నారు. న్యాయం జరిగేవరకూ తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టంచేశారు. మీడియా కూడా తనకు సహకరించాలని పూజిత విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై విజయ్ గోపాల్ స్పందిస్తూ పూజితతో తనకు వివాహం జరగలేదని, కేవలం సహజీవనం మాత్రమే చేశానని తెలిపారు. -
'పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా'
హైదరాబాద్: తాను పూజితను పెళ్లి చేసుకోలేదని విజయ్ గోపాల్ తెలిపాడు. పలువురు అమ్మాయిలను మోసం చేసి తాజాగా విజయ్ గోపాల్ రెండో పెళ్లి చేసుకున్నాడని, అతడు పెద్ద మోసగాడని నటి పూజిత ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించాడు. పూజితను తాను పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనం చేశానని చెప్పాడు. తమకు ఓ కొడుకు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తమ పెళ్లి లాంటిదేమీ జరగలేదని, అయితే పది నుంచి పన్నేండేళ్లపాటు ఆమెతో సహజీవనం చేసినట్లు వెల్లడించాడు. గత ఏడేళ్లుగా తనకు పూజితతో కాంటాక్ట్ లేదని, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదని విజయ్ గోపాల్ చెప్పుకొచ్చాడు. పూజితకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని అన్నాడు. పూజిత అసలు ఏ రకమైన న్యాయం కావాలనుకుంటుందో, ఆమె అసలు ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అన్ని విషయాలు కోర్టులో తేలుతాయని చెప్పాడు. పూజిత వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందని, కావాలనే ఆమెను రెచ్చగొడుతున్నారని అన్నాడు. ఆ విషయాలన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. కాగా ఐఏఎస్ అధికారిణి రేఖారాణితో వివాహం గురించి ప్రశ్నించగా ఫోన్ పెట్టేశాడు. -
'ఇక భయపడను.. నడిబొడ్డున తేల్చుకుంట'
హైదరాబాద్: విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని నటి పూజిత అన్నారు. అతడిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. మంగళవారం తన భర్త మోసం చేశాడని, న్యాయం చేయాలని ఆమె హైదరాబాద్ నగర్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. విజయ్ గోపాల్ తన భర్తే అనేందుకు కావాల్సిన ఆధారాలన్నీ ఆమె కమిషనర్ కు అందజేసినట్లు తెలిపారు. విజయ్ గోపాల్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఎంతోమందిని మోసం చేసిన విజయ్ గోపాల్ ఇటీవల ఐఏఎస్ రేఖారాణిని వివాహం చేసుకున్నాడని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. తనకు కొంతమంది నుంచి ప్రాణహానీ ఉందని, ముఖ్యంగా ఈ వ్యవహారం చూస్తున్న ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి కూడా తనకు ప్రాణభయం ఉందని చెప్పారు. అందుకే తాను ఆరు రోజులపాటు అండర్ గ్రౌండ్లో ఉన్నానని, ఇప్పుడు బయటకు వచ్చానని నగరం నడిమధ్యలోనైనా ఈవిషయం తేల్చుకునేందుకు తాను సిద్ధమని ఆమె చెప్పారు. ఐఏఎస్ రేఖా రాణి, విజయ్ గోపాల్ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే అని ఆమె అన్నారు. ఐపీఎస్ అంజనా సిన్హాని ఈ కేసు విచారణ నుంచి తప్పించాలని, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
నాకు ప్రాణహాని: నటి పూజిత
తనకు ప్రాణహాని ఉందంటూ ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి పూజిత మీడియా ముందుకొచ్చింది. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాల్సిన వాళ్లే అన్యాయం చేస్తే ఎలా ? అని ప్రశ్నిస్తోంది. తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె భయపడుతున్నారు. భర్త విజయ్ గోపాల్ తనతో పాటు పలువురు మహిళలను మోసం చేసి తాజాగా ఓ ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడినట్లు పూజిత తెలిపారు. వివరాల్లోకి వెళితే... ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సహా అనేక తెలుగు సినిమాల్లో పూజిత హీరోయిన్గా నటించింది. రుతురాగాలు వంటి ఫేమస్ సీరియల్స్‌లో సైతం బిజీ నటిగా వెలిగిపోయిన పూజిత తన భర్త విజయ్‌గోపాల్ ఓ ఎంపి వద్ద పిఏగా పని చేస్తున్నాడని తెలిపారు. ఆయన తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వెల్లడించారు. తమకు ఓ బాబు కూడా ఉన్నాడని పూజిత చెప్పారు. అయితే 13 సంవత్సరాలు తనతో కాపురం చేసిన తన భర్త తాజాగా ఓ ఐఎఎస్ ఆఫీసర్ రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండా, తననూ, తన కుమారుడిని పట్టించుకోకుండా, ఎలా రెండో పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి తననే బెదిరించారని పూజిత ఆరోపించారు. పోలీస్ అధికారిణి అంజనా సిన్హా తనను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు. కాగా విజయ్ గోపాల్ డ్రగ్స్ వ్యాపారం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. దీనిపై శాప్ ఎండీ రేఖారాణి 'సాక్షి' ఫోన్ లైన్లో మాట్లాడుతూ ...'విజయ్ గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారు. వారిద్దరికీ వివాహం జరగలేదు. కేవలం సహజీవనం చేశారు. నేను అన్ని లీగల్‌గా చూసుకునే ఈ పెళ్లి చేసుకున్నా. పూజతి మీడియా వరకూ రావటం అనేది సరైన పద్ధతి కాదు. మనకు కోర్టులు, చట్టాలు ఉన్నాయి. మీడియాలో పర్సనల్ విషయాలు ఎంతవరకూ బహిర్గతం చేయాలనేదానికి ఓ లైన్ ఉంటుంది. ఈ విషయం వివాదం కావడం ఇష్టం లేదు. పూజిత, విజయ్‌గోపాల్‌కు పదేళ్ల నుంచి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చిందో తెలియదు. నేను అమ్మాయినే, ఆమె కూడా అమ్మాయే. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మోసపోయానంటున్న ఆమెపై నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా రోడ్డు మీదకు వచ్చేది తనకు అన్యాయం జరిగితేనే. అయితే పూజిత అప్రోచ్ అవాల్సింది మీడియాను కాదు. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. అయితే అది ఆమె వ్యక్తిగతం. అయితే అది నేను డిసైడ్ చేయలేదు. విజయ్ గోపాల్‌తో రిలేషన్ వద్దని వదిలేసుకుంది. ఇక మా తల్లిదండ్రులు కూడా ఆమెకు సపోర్ట్ చేయటం నా బ్యాడ్‌లక్. ఇక నావైపు నుంచి పూజితకు ఎలాంటి అపాయం లేదు. ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగినట్లు అయితే నేను పూజితకు మద్దతుగా నిలుస్తా. షీ ఈజ్ గుడ్ గాళ్. ఆమెపై ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆమెకు అన్నివిధాల సహకరిస్తా...' అని తెలిపారు. రేఖారాణి గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా నటి పూజిత మాట్లాడుతూ విజయ్‌గోపాల్, రేఖారాణి వివాహం జరిగిన తర్వాత ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు తనను వారి వద్దకు పిలిచారన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భర్త తనతో పాటు కొడుకును పట్టించుకోకుండా ఉంటే, న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. మరోవైపు పూజిత ఆరోపణలు, ఫిర్యాదులపై ఆమె అడ్వకేట్ అనిల్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విజయ్ గోపాల్, రేఖారాణి పెళ్లి మూడు రోజుల క్రితం జరిగిందన్నారు. గోల్కొండ రిజిస్ట్రార్ వాళ్ల ఇంటికి వెళ్లి ఈ వివాహం చేశారన్నారు. గోల్కొండ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారి పెళ్లికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తాము తీసుకున్నామన్నారు. దీనిపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి గారిని కలిశామన్నారు. అయితే తాము ఏమీ చేయలేమని, ఇందుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని సూచించారన్నారు. అలాగే పూజితతో పాటు ఆమె కుమారుడికి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశామని, వారికి రక్షణ కల్పించాలని ఎస్సార్ నగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. చట్టపరంగా తాము ముందుకు వెళతామని అనిల్ కుమార్ తెలిపారు.