'పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా' | i maintained living relation with pujitha: vijay gopal | Sakshi
Sakshi News home page

'పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా'

Published Tue, May 3 2016 1:56 PM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

'పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా' - Sakshi

'పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా'

హైదరాబాద్: తాను పూజితను పెళ్లి చేసుకోలేదని విజయ్ గోపాల్ తెలిపాడు. పలువురు అమ్మాయిలను మోసం చేసి తాజాగా విజయ్ గోపాల్  రెండో పెళ్లి చేసుకున్నాడని, అతడు పెద్ద మోసగాడని నటి పూజిత ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించాడు. పూజితను తాను పెళ్లి చేసుకోలేదని, కేవలం సహజీవనం చేశానని చెప్పాడు. తమకు ఓ కొడుకు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తమ పెళ్లి లాంటిదేమీ జరగలేదని, అయితే పది నుంచి పన్నేండేళ్లపాటు ఆమెతో సహజీవనం చేసినట్లు వెల్లడించాడు.

గత ఏడేళ్లుగా తనకు పూజితతో కాంటాక్ట్ లేదని, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదని విజయ్ గోపాల్ చెప్పుకొచ్చాడు. పూజితకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని అన్నాడు. పూజిత అసలు ఏ రకమైన న్యాయం కావాలనుకుంటుందో, ఆమె అసలు ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అన్ని విషయాలు కోర్టులో తేలుతాయని చెప్పాడు. పూజిత వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందని, కావాలనే ఆమెను రెచ్చగొడుతున్నారని అన్నాడు. ఆ విషయాలన్ని త్వరలోనే బయటకు వస్తాయన్నారు. కాగా ఐఏఎస్ అధికారిణి రేఖారాణితో వివాహం గురించి ప్రశ్నించగా ఫోన్ పెట్టేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement