టైటిల్‌ క్యాచీగా ఉంది – బోయపాటి శీను | Enduko Emo Song Launch By Boyapati Srinu | Sakshi
Sakshi News home page

టైటిల్‌ క్యాచీగా ఉంది – బోయపాటి శీను

Published Wed, Feb 14 2018 1:24 AM | Last Updated on Wed, Feb 14 2018 1:24 AM

Enduko Emo Song Launch By Boyapati Srinu - Sakshi

కోటి, బోయపాటి శీను, నందు

నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఎందుకో ఏమో’. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శకుడు బోయపాటి శీను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ క్యాచీగా ఉంది. పాట చాలా బాగుంది. సినిమా కూడా బావుంటుందని అర ్థమవుతోంది. నందు హార్డ్‌ వర్కర్‌.

ఈ సినిమా తనకు హీరోగా మంచి పేరు తేవాలి’’ అన్నారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘మొత్తం నాలుగు పాటలున్నాయి. ప్రవీణ్‌ ఒక్కో పాటను ఒక్కో విధంగా చాలా బాగా కంపోజ్‌ చేశారు. ఇటీవల వినాయక్‌గారు విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బోయపాటిగారు లాంచ్‌ చేసిన పాట నా ఫేవరేట్‌. దర్శక–నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు’’ అన్నారు నందు. సంగీత దర్శకుడు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement