ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు చిరంజీవితో చెయ్యాలనే ఆశ ఉంటుంది కానీ.. : నోయల్‌ | Noyal Sen Talk About Ee Ammayi EMI Movie At Trailer Launch Program | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు చిరంజీవితో చెయ్యాలనే ఆశ ఉంటుంది కానీ.. : నోయల్‌

Published Sun, Mar 5 2023 3:41 PM | Last Updated on Sun, Mar 5 2023 3:41 PM

Noyal Sen Talk About Ee Ammayi EMI Movie At Trailer Launch Program - Sakshi

టాలీవుడ్‌లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌కి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని ఉంటుంది. కానీ దర్శకనిర్మాతలు మంచి అవకాశాలు ఇచ్చి.. మనం ప్రూవ్‌చేసుకుంటే అలాంటి చాన్స్‌లు వస్తాయి. నన్ను నమ్మి ‘ఈఎంఐ.. ఈ అమ్మాయి’అనే సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలు  దొంతు రమేష్, డి. రమేష్ గౌడ్ లకు ధన్యవాదాలు’అని నటుడు నోయల్‌ అన్నారు. నోయల్‌, బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ఈఎంఐ.. ఈ అమ్మాయి. చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధనరాజ్, భద్రం, చలాకి చంటి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా చిత్ర హీరో నోయల్ మాట్లాడుతూ.. ఒక తండ్రి కృషి, కొడుకు   ప్రయత్నం అని చాలా సార్లు విన్నాను. అయితే ఈ సినిమా ద్వారా ఈ తండ్రి కొడుకులను కళ్లారా చూశాను. చాలా మంది  సినిమాల్లోకి వెళతాను అంటే ఎంకరేజ్ చెయ్యరు. అలాంటి తన కొడుకు కలను నిజం చేస్తూ చాలా కష్టపడి నిర్మించిన చిత్రమే ‘ఈఎంఐ..ఈ అమ్మాయి’. ఈ నెల 10 న  వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

‘వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కొనే రక రకాల సమస్యలను కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాము. నటీ, నటులు  టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’అని సమర్పకులు దొంతు బుచ్చయ్య అన్నారు.  ‘అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం మాకుంది’అని దర్శకుడు  దొంతు రమేష్ అన్నారు.‘దర్శకుడు ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెంటనే చేయడానికి ఒప్పుకున్నాను, మా చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాను’అని హీరోయిన్‌ భాను అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement