sobhita
-
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: చేనెత చీరలో శోభితా స్టన్నింగ్ లుక్..!
టాలీవుడ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శోభితా ధూళిపాళ, నాగచైతన్య నిశ్చితార్థం దుస్తులను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇక్కడ ఆమె చీరను తన నేపథ్యం, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేలా చేనెత పట్టు చీరును ఎంచుకోవడమే గాక తలలో ధరించిన కనకాంభరం పూలు ఆరణాలా తెలుగింటి ఆడపడచంటే ఏంటో తనదైన ఫ్యాషన్ స్టైల్లో చెప్పకనే చెప్పింది. మనీష్ శోభితాకు పీచ్ కలర్ ఉప్పాడ సిల్క్ చీరను ఎంపిక చేశారు. దీనికి జల్వర్క్ చేసిన బ్లౌజ్‌ని మ్యాచ్ చేశారు. అలాగే కొత్త పెళ్లికూతురు లుక్ కనిపించేలా జుట్టుని వదులుగా ఉండేలా అల్లి, కనకాంభరాలను బన్ స్టైల్లో పెట్టారు.ఇక్కడ శోభిత ఉప్పాడ సిల్క్ చీరను సెలక్ట్ చేసుకున్నారు. ఇక నాగ చైతన్య ఆంధ్రప్రదేశ్ అబ్బాయిలు ఎక్కువగా ధరించే పట్టుపంచ, లాల్చీ, కండువాన్ని ధరించడం విశేషం. వీరిద్దరూ తాము వచ్చిన మూలాలను, సంస్కృతిని మర్చిపోలేదు అనే చెప్పేలా వారి ఆహార్యం ఉంది. ఈ మేరకు డిజైనర్ ఇన్స్టాగ్రాం వేదికగా ఈ జంటను అభినందించారు. వారి సాంస్కృతిక నేపథ్యం, మూలాలను సూచించేలా దుస్తులు ధరించడం ఎంత ముఖ్యమో నొక్కిచెప్పారు. సంప్రదాయ వస్త్రాలతో వివాహ బంధంలోకి అడుపెట్టనున్న ఆ జంట భావోద్వేగాన్ని తెలిపేలా వారి దస్తులను డిజైన్ చేయడంలో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు మనీష్ మల్హోత్రా. (చదవండి: వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?) -
యావరేజ్ ‘లైఫ్’ ఇష్టం
శోభితా ధూళిపాళ్ల తెనాలి అమ్మాయి. 1992 బ్యాచ్. ఆ ఇయర్లో పుట్టింది. ఉండడం ముంబైలో. 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ టైటిల్ తనదే. అనురాగ్ కాశ్యప్ మూవీ ‘రమణ్ రాఘవ్ 20.0’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పక్కన హీరోయిన్ తనే. శోభిత ఫస్ట్ మూవీ అది. ఆ మూవీ కాన్స్ ఫెస్టివల్‌కు కూడా వెళ్లింది. ‘‘అరె! అక్కడ అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా మంచి మంచి మూవీలకు, మరి అంత మంచి మూవీలు తీసికూడా, చూసి కూడా మనకు మనం రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చుకోమో.. నాకు స్ట్రేంజ్‌గా ఉంటుంది’’ అని శోభిత ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. మన ఇండస్ట్రీలో శోభితకు నచ్చనిది ఇంకోటి కూడా ఉంది. బాలీవుడ్ సినిమాల్లో అమ్మాయిలు షార్ట్స్, ట్యాంక్ టాప్ వేసుకుని, కాళ్లకు స్నీకర్స్ తొడుక్కుని, హెయిర్‌ని బ్లో డ్రై చేయించుకుని కనిపించడం! కనిపించడం అంటే.. ఈ దర్శకులు, నిర్మాతలు చూపించడం. మెట్రోపాలిటన్స్‌లో సింపుల్‌గా జీన్స్, షార్ట్ కుర్తా వేసుకుని కాలేజీలకు, ఉద్యోగాలకు పరుగులు తీస్తుండే యావరేజ్ అమ్మాయిల లైఫ్ స్టెయిల్‌ని ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా మనం చూపించలేమా అని శోభిత తరచూ వండర్ అవుతుంటుంది. హోమ్ మేకర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, ఒక టైలరు కూతురు.. ఇలాంటి పాత్రలు వేయడం ఆమెకు ఇష్టం. అయితే ఇచ్చేవారెవరు? శోభితను చూస్తే ఇవ్వాలనే అనిపిస్తుంది. (అంత ‘డౌన్ టు ఎర్త్’గా ఉంటుంది శోభిత) కానీ తీసేవాళ్లెవరు? జనవరి 12న ఆమె నటించిన బ్లాక్ కామెడీ బాలీవుడ్ మూవీ ‘కాలకాండీ’ విడుదల అవుతోంది. అందులో సైఫ్ అలీ ఖాన్ పక్కన శోభిత నటించింది. బహుశా అందులో ఆమె అభీష్టం నెరవేరే ఉంటుంది. ‘కాలకాండీ’ అంటే మరాఠీలో ఏదీ కోరుకున్నట్లు జరగకపోవడం. -
త్వరలో చెబుతా!
‘‘నేను జర్నలిస్ట్‌గా పని చేశా. నాన్నగారు (యలమంచిలి సాయిబాబు) ‘శ్రీరామరాజ్యం’ సినిమా నిర్మించారు. నేను హీరోగా నటించిన ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదల ఆలస్యం కావడంతో కాస్త నిరాశ పడ్డా’’ అన్నారు నటుడు రేవంత్. లాస్య, శోభిత, రేవంత్, నోయల్, హేమంత్ ముఖ్య పాత్రల్లో కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం నిర్మించిన ‘రాజా మీరు కేక’ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ పాత్రికేయులతో మాట్లాడారు.‘‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తా. నేను, నా స్నేహితులు కుటుంబానికి విలువ ఇస్తుంటాం. మన వ్యవస్థలోని ఓ సమస్యను మేం ఎలా పరిష్కరించామన్నదే కథ. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో ఉంది. కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించా. దర్శకునికి కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. నిర్మాతగారు అందరికీ స్వేచ్ఛ ఇవ్వడంతో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. నా తర్వాతి చిత్రం గురించి త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్
శోభిత క్యాట్‌వాక్... నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) స్ప్రింగ్స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఫ్యాషన్‌షో అదిరింది. మిస్ ఇండి యా ఎర్త శోభిత దూళిపాళ క్యాట్‌వాక్ చేసి ఫ్యాషన్‌షోకు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలి చారు. పలువురు నిట్ విద్యార్థులు విభిన్న డిజైన్ దుస్తులు ధరించి ఉర్రూతలిగించారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ సందడి.. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ నిట్ ఆడిటోరియంలో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌కు జడ్జిగా వ్యవహరించారు. ప్రేమ, సామాజిక అంశాలపై విద్యార్థులు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను తిలకించారు. నిట్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌లను చూసి అభినందించారు. అంతేగాక స్ప్రింగ్ స్ప్రీలో భాగం గా నిట్మన్ పేరుతో మాక్ ఐక్యరాజ్యసమితి, మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఆశయం పేరుతో వీధిబాలలకు చదువు చెప్పారు. విద్యార్థుల శాస్త్రీయ నృత్యాలు, జానపదనృత్యాలు అలరించారుు. మ్యూజిక్లవ్ పేరిట సంగీత కచేరి నిర్వహించారు. రంగోళి పేరిట వేసిన ముగ్గులు ఎంతగానో ఆకర్షించారుు. పెయిం టింగ్ కాంపిటీషన్లో భాగంగా విద్యార్థుల ముఖాలపై వేసిన చిత్రాలను నిట్ ఆడిటోరియంలో ప్రద ర్శించారు. అప్పటికప్పుడు ఆర్ట్ పెయింటింగ్ లో భాగంగా స్కెచ్‌లతో చిత్రాలు వేసి డ్రాయిం గ్లో, పెయింటింగ్‌లో ప్రతిభ చూపారు. వివిధ రకాల కార్టూన్లు వేశారు. యాహో పేరిట క్విజ్ నిర్వహించారు. ఫొటోగ్రఫీలో భాగంగా ఫొటోషాపు నిర్వహించారు. -
‘నిట్’లో స్ప్రింగ్ స్ప్రీ జోష్
శోభిత అందాలకు మంత్రముగ్దులైన యువతరం అనూప్ రూబెన్స్ పాటతో గొంతుకలిపిన స్టూడెంట్స్ నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమం అందాల వనిత మిస్ ఇండియా ఎర్త శోభిత, సంగీ త కెరటం అనూప్‌రూబెన్స్ పాటలతో ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా ఈసారి స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. వేడుకలను ప్రారంభించేందుకు శోభిత ధూళి పాల, సంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ను నిర్వాహకులు ఆహ్వానించారు. అనుకున్న సమయానికన్నా మూడు గంటల ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైనా శోభితను చూసేందుకు నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిరీక్షించారు. ఫ్యాషన్‌షోలో వేసుకునే డ్రెస్స్‌తో తలపై కిరీటం పెట్టుకుని గురువారం రాత్రి 8 గంటలకు అనూప్‌రూబెన్స్‌తో కలిసి ఆమె రాగానే విద్యార్థుల ఈలలు, కేకలతో నిట్ ఆడిటోరియం మార్మోగిపోయింది. స్ప్రింగ్‌స్ప్రీ ప్రారంభం.. స్ప్రింగ్ స్ప్రీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మ్యూజిక్ డైరక్టర్ అనూప్‌రూబెన్స్, మిస్ ఇండియా ఎర్త శోభిత దూళిపాల, నిట్ డైరక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి, స్ప్రింగ్ స్ప్రీ కో ఆర్డినేటర్ శరత్‌కుమార్, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఎస్.శ్రీనివాసరావు, నిట్ఫ్యాకల్టీ అడ్వయిజర్ శ్రీనాథ్ మాట్లాడారు. శోభితను చూస్తూ మంత్రముగ్ధులైన విద్యార్థులు మిస్ఇండియా శోభిత దూళిపాల అందాలకు విద్యార్థులు మంత్రముగ్దులయ్యారు. ఆమెను ఫొటోలు తీసేందుకు కెమెరాలు పట్టుకుని పోటీపడ్డారు. ఆమె మాటలకు,చిరునవ్వుకు, చూపులకు ఈలల వేస్తూ, కేరింతలు కొట్టారు. -
‘కింగ్’ క్యాలెండర్లో తెలుగు ‘క్వీన్’
మనకు తెలిసిన క్యాలెండర్లో తేదీలు మాత్రమే ఉంటాయి. ‘ఆ క్యాలెండర్..’ మాత్రం తేదీల సంగతి మరిచిపోయేలా చేస్తుంది. కళ్లార్పకుండా తనవైపే చూసేలా చేస్తుంది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ అంటే పోతపోసిన సౌందర్యం. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ అంటే అందాల రాణుల ఆవాసం. లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన విలాసపురుషుడు విజయ్‌మాల్యా సృష్టించిన అందాల ఇంద్రజాలం అది. కత్రినాకైఫ్, దీపికా పదుకునే... వంటి ఎందరో బాలీవుడ్ తారలను మోసుకొచ్చి, గ్లామర్ రంగంలో విజయానికి తొలి అడుగులా పేరొందిన... ఆ క్యాలెండర్లో స్థానం సంపాదించాలని భారతదేశంలోని ప్రతి అందాలరాశి ఉవ్విళ్లూరుతుంది. అలాంటి అందాల క్యాలండర్లో మరో తెలుగమ్మాయి త‘లుక్’మంది. ఆమే శోభిత. నగరానికి చెందిన శిల్పారెడ్డి తర్వాత సదరు ‘కింగ్’డమ్‌లో పాదం మోపిన శోభిత ధూళిపాళ చెప్పిన క్యాలెండర్ కబుర్లు... నేపథ్యం జన్మతః మాది విశాఖపట్టణం. బిజినెస్ ఇన్ కార్పొరేట్ లా లో మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్నాను. దక్షిణాది తరఫున హైదరాబాద్‌లో జరిగిన మిస్ ఇండియా ఆడిషన్స్‌లో పాల్గొనడమే గ్లామర్ రంగంలో నా తొలి అడుగు. అనంతరం అదే పోటీల్లో బెంగళూరులో మిస్ సౌత్‌గా గెలిచాను. ఫైనల్స్‌లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నాను. అది నాకు మోడలింగ్ అవకాశాల్ని పెంచింది. అసలు మోడలింగ్ అనేదే నా కెరీర్ప్లాన్లో లేదు. అలాంటిది అనుకోకుండా బిజీమోడల్ అయిపోయాను. క్యాలెండర్లోనా.. నేనా? ముంబయిలో జరిగిన మిస్‌దివా కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్ అతుల్కస్బేకర్ కనిపించారు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు పనిచేస్తారా..! అనడిగారు. ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ చూడకపోయినా... పెద్ద పెద్ద స్టార్స్ అంతా చేసిన క్యాలెండర్ అని తెలుసు. గ్లామర్ రంగంలో తొలిమెట్టు మీదే ఉన్న నేను ఆ క్యాలెండర్లోనా? అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పేశాను. అతుల్ నా ఫొటోలు విజయ్‌మాల్యాకు పంపారు. షార్ట్ లిస్టింగ్, ఎన్నో వడపోతల త ర్వాత సెలక్టయ్యాను. తర్వాత కొంచెం ఆలోచించాను. అయితే ‘నువ్వు హ్యాపీగా ఫీలైతే చేసెయ్’ అంటూ ఇంట్లోవాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక అన్నీ మరిచిపోయాను. ఉప్పునీళ్లు నోట్లో.. ఆనందం చూపుల్లో ఫొటో షూట్ కోసం కొన్ని సార్లు కఠినమైన ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఒకసారి నీళ్లలో తేలుతూ 20 నిమిషాల పాటు కదలకుండా ఉండాలి. కిందంతా ఉప్పునీళ్లు, పైన చుర్రుమనే ఎండ, నీళ్లు నోట్లోకి వెళ్లిపోతున్నాయి. అలాంటి స్థితిలోనూ అద్భుతమైన ఆనందాన్ని చూపించాలి. అలాగే ఇంకో సారి చేపల మధ్యలో అవి మన చుట్టూ ఉండగా... షూట్... నిజంగా ఇవన్నీ భలే అనుభవాలు. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. క్యాలెండర్ చూశాక నేనేనా అని ఆశ్చర్యపోయాను. నేను ఇవన్నీ చేస్తానని చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. చాలా మంది మోడల్స్‌కి కలలాంటిది నాకు మాత్రం ఈజీగా అందుబాటులోకి వచ్చిందనిపించింది. అందానికి అందలం కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గురించి కొన్ని వర్గాల్లో ఉన్నవన్నీ అపోహలే. ఈ క్యాలెండర్ కోసం పలువురు ప్రతిభావంతులు ఎంతో కష్టపడతారు. దీనికి ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా ఉన్న అతుల్ దేశంలోనే టాప్ ఫొటోగ్రాఫర్. ఈస్థటిక్సెన్స్-వల్గారిటీకి మధ్య ఉన్న సన్నని గీతను ఆయన అద్భుతంగా డీల్ చేశారు. టాప్‌లెస్‌గా చేసినా, మరెంత అందాన్ని ఒలికించినా... ఈ క్యాలెండర్లో మేమంతా దేవాలయాల్లో ఉండే అందమైన శిల్పాల్లా ఉంటాం తప్ప అశ్లీలంగా కనబడం. ఫొటో షూట్ ఓ అద్భుతమైన అనుభవం ఈ క్యాలెండర్ కోసం విభిన్న ప్రాంతాల్లో ఫొటోషూట్ చేశారు. ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత అందమైన దీవుల్లో ఫొటోషూట్ జరిగింది. చుట్టూ ఎందరో గ్రేట్ పీపుల్. ఆ షూట్ అంతా ఒక హ్యాపీ ఫెస్టివల్‌లా మొత్తం 10 రోజులు జరిగింది. మొత్తం 6గురు గ్లామర్ క్వీన్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారితో స్నేహం ఎన్నో నేర్పింది. వాళ్లంతా అప్పటికే ప్రొఫెషనల్ మోడల్స్. వయసులోనూ, అనుభవంలోనూ అందరికంటే చిన్నదాన్ని నేను. దీవుల మధ్యలో బోటులో ప్రయాణం, షూట్ అయిపోయాక ఆటపాటలు... మాకంటూ ఉన్న స్పెషల్ కుక్ రోజుకో రకమైన క్యుజిన్ వంటకాలు వండి పెట్టడం... వంటివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు. భవిష్యత్తు ప్రస్తుతం మోడలింగ్ ఆఫర్స్ ఉన్నాయి. మన టాలీవుడ్ సహా మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇటీవలే ఇండియా బ్రైడల్ వీక్ కోసం ర్యాంప్‌వాక్ చేశాను. త్వరలో జరగనున్న లాక్మేకి ప్రిపేరవుతున్నాను. వచ్చిన మంచి ఆఫర్స్ మిస్సవ్వకుండా అదే సమయంలో కీలక దశలో ఉన్న చదువు దెబ్బతినకుండా ప్లాన్ చేసుకుంటున్నాను. స్ఫూర్తి గ్లామర్ రంగంలో రాణిస్తున్న ప్రతి ఒక్కరిలో గ్రేస్ ఉంటుంది. అంత తేలికగా ఎవరూ ఈ రంగంలో ఉన్నత స్థాయికి రాలేరు. అందుకే ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కో మంచి పాయింట్‌ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను.