నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: చేనెత చీరలో శోభితా స్టన్నింగ్‌ లుక్‌..! | Manish Malhotra Decodes Naga Chaitanya Sobhita Dhulipala Engagement Looks | Sakshi
Sakshi News home page

నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: చేనెత చీరలో శోభితా స్టన్నింగ్‌ లుక్‌..!

Published Thu, Aug 8 2024 5:07 PM | Last Updated on Thu, Aug 8 2024 5:07 PM

Manish Malhotra Decodes Naga Chaitanya Sobhita Dhulipala Engagement Looks

టాలీవుడ్‌ హీరో, యువసామ్రాట్‌ అక్కినేని నాగతచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుకగా జరిగింది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. 

శోభితా ధూళిపాళ, నాగచైతన్య నిశ్చితార్థం దుస్తులను మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేశారు. ఇక్కడ ఆమె చీరను తన నేపథ్యం, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేలా చేనెత పట్టు చీరును ఎంచుకోవడమే గాక తలలో ధరించిన కనకాంభరం పూలు ఆరణాలా తెలుగింటి ఆడపడచంటే ఏంటో తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌లో చెప్పకనే చెప్పింది. మనీష్‌ శోభితాకు పీచ్‌ కలర్‌ ఉప్పాడ సిల్క్‌ చీరను ఎంపిక చేశారు. దీనికి జల్‌వర్క్‌ చేసిన బ్లౌజ్‌ని మ్యాచ్‌ చేశారు. అలాగే కొత్త పెళ్లికూతురు లుక్‌ కనిపించేలా జుట్టుని వదులుగా ఉండేలా అల్లి, కనకాంభరాలను బన్‌ స్టైల్లో పెట్టారు.

ఇక్కడ శోభిత ఉప్పాడ సిల్క్‌ చీరను సెలక్ట్‌ చేసుకున్నారు. ఇక నాగ చైతన్య ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయిలు ఎక్కువగా ధరించే పట్టుపంచ, లాల్చీ, కండువాన్ని ధరించడం విశేషం. వీరిద్దరూ తాము వచ్చిన మూలాలను, సంస్కృతిని మర్చిపోలేదు అనే చెప్పేలా వారి ఆహార్యం ఉంది. ఈ మేరకు డిజైనర్‌ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఈ జంటను అభినందించారు. వారి సాంస్కృతిక నేపథ్యం, మూలాలను సూచించేలా దుస్తులు ధరించడం ఎంత ముఖ్యమో నొక్కిచెప్పారు. సంప్రదాయ వస్త్రాలతో వివాహ బంధంలోకి అడుపెట్టనున్న ఆ జంట భావోద్వేగాన్ని తెలిపేలా వారి దస్తులను డిజైన్‌ చేయడంలో తాను పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు మనీష్‌ మల్హోత్రా. 

(చదవండి: వాటర్‌ పాయిజనింగ్‌'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement