
బుల్లితెర నటి శోభిత.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న బ్రహ్మగంతు, నీనిదలే అనే సీరియల్స్ ద్వారా శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

సెప్టెంబరు 23, 1992న బెంగళూరులో జన్మించిన శోభిత బెంగళూరులోని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.

మొదట్లో రాజ్ మ్యూజిక్ ఛానల్‌లో వీజేగా పనిచేసింది శోభిత

ఆ తర్వాత 2015లో రంగితరంగ అనే కన్నడ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత యు టర్న్(2016), కేజీఎఫ్ 1 అండ్2 చిత్రాల్లోనూ శోభిత కీలక పాత్ర పోషించింది.

శాండల్‌వుడ్‌లో అటెంప్ట్ టు మర్డర్, జాక్‌పాట్, శతభిషే అనే సినిమాల్లోనూ నటించింది.

కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అయితే గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత ఆ తర్వాత బుల్లితెరకు దూరమైంది.

అంతేకాదు తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

ఇవాళ ఆమె సూసైడ్ చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాకింగ్‌కు గురయ్యారు.










