‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్ | NIIT Fashion Show | Sakshi
Sakshi News home page

‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్

Published Sat, Feb 22 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్

‘నిట్’లో ఫ్యాషన్ షో అదుర్స్

 శోభిత క్యాట్‌వాక్...
 నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) స్ప్రింగ్‌స్ప్రీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఫ్యాషన్‌షో అదిరింది. మిస్ ఇండి యా ఎర్‌‌త శోభిత దూళిపాళ క్యాట్‌వాక్ చేసి ఫ్యాషన్‌షోకు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలి చారు. పలువురు నిట్ విద్యార్థులు విభిన్న డిజైన్ దుస్తులు ధరించి ఉర్రూతలిగించారు.  
 
 ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ సందడి..


 ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ నిట్ ఆడిటోరియంలో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌కు జడ్జిగా వ్యవహరించారు. ప్రేమ, సామాజిక అంశాలపై విద్యార్థులు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను తిలకించారు. నిట్ విద్యార్థులతో ఆనందంగా గడుపుతూ ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌లను చూసి అభినందించారు. అంతేగాక స్ప్రింగ్ స్ప్రీలో భాగం గా నిట్‌మన్ పేరుతో మాక్ ఐక్యరాజ్యసమితి, మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఆశయం పేరుతో వీధిబాలలకు చదువు చెప్పారు. విద్యార్థుల శాస్త్రీయ నృత్యాలు, జానపదనృత్యాలు అలరించారుు. మ్యూజిక్‌లవ్ పేరిట సంగీత కచేరి నిర్వహించారు. రంగోళి పేరిట వేసిన ముగ్గులు ఎంతగానో ఆకర్షించారుు. పెయిం టింగ్ కాంపిటీషన్‌లో భాగంగా విద్యార్థుల ముఖాలపై వేసిన చిత్రాలను నిట్ ఆడిటోరియంలో ప్రద ర్శించారు. అప్పటికప్పుడు ఆర్ట్ పెయింటింగ్ లో భాగంగా స్కెచ్‌లతో చిత్రాలు వేసి డ్రాయిం గ్‌లో, పెయింటింగ్‌లో ప్రతిభ చూపారు. వివిధ రకాల కార్టూన్లు వేశారు. యాహో పేరిట  క్విజ్ నిర్వహించారు. ఫొటోగ్రఫీలో భాగంగా ఫొటోషాపు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement