రాజా మీరు... హిట్టవ్వాలి | D. Suresh Babu released raja meru keka movie trailer | Sakshi
Sakshi News home page

రాజా మీరు... హిట్టవ్వాలి

Published Sun, Feb 5 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

రాజా మీరు... హిట్టవ్వాలి

రాజా మీరు... హిట్టవ్వాలి

– డి. సురేశ్‌బాబు
తారకరత్న, రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య, శోభిత ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాజా మీరు కేక’. కృష్ణ కిశోర్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, ఆర్‌.కె. స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్‌ బాబు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో పలు విజయవంతమై చిత్రాలకు కృష్ణ కిశోర్‌ కో–డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకునిగా ‘రాజా మీరు కేక’ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం హిట్‌ అయి తనకు, యూనిట్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు.

‘‘మా బ్యానర్లో నిర్మించిన మొదటి చిత్రం ‘గుంటూరు టాకీస్‌’ హిట్‌ అయింది. మలి ప్రయత్నంగా నిర్మించిన ‘రాజా మీరు కేక’ సినిమా కూడా మా సంస్థకు మరో హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి’’ అని చిత్రనిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ ప్రసాద్‌ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement