
క్రాంతి, కె.సీమర్ జంటగా నటించిన చిత్రం ‘పిచ్చోడు’. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ శ్రీనివాస్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు సుధీర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు ట్రైలర్ చాలా బావుంది.
టైటిలే సినిమాకు సగం సక్సెస్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన నూతన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు’’ అన్నారు. హేమంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన సుధీర్‌బాబు గారికి ధన్యవాదాలు. యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన మా చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment