ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన | Maa Nanna Superhero Movie OTT Release Details Latest | Sakshi
Sakshi News home page

Maa Nanna Superhero OTT: తెలుగు సినిమా.. నెలలో ఓటీటీలో రిలీజ్

Nov 11 2024 12:00 PM | Updated on Nov 11 2024 12:49 PM

Maa Nanna Superhero Movie OTT Release Details Latest

యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇ‍ప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్‌లో వచ్చేస్తుంది. అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్‌, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.

'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయ‌లు జానికి అవ‌స‌ర‌మ‌వుతాయి. అదే టైంలో ప్ర‌కాష్ (సాయిచంద్‌)కి కోటిన్న‌ర రూపాయ‌ల లాట‌రీ త‌గులుతుంది. ఆ డ‌బ్బులు తీసుకురావ‌డానికి త‌న‌కు తోడుగా కేర‌ళ‌కు ర‌మ్మ‌ని జానిని ప్ర‌కాష్‌ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.

(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement