Maa Nanna Superhero Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు
గురువారం థియేటర్లో రిలీజైన సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయారు. ఇదే టైంలో ఓటీటీల్లో ఈ శుక్రవారం ఒక్కరోజే 12 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. అంతకు ముందు రోజు మరో 8 మూవీస్-సిరీసులు వచ్చాయి. ఆదివారం మరో మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ)ఇలా చూసుకుంటే ఈ వీకెండ్లో ఏకంగా 20కి పైగా సినిమాలు-సిరీసులు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. కాకపోతే వీటిలో మా నాన్న సూపర్ హీరో సినిమా, అల్లు అర్జున్ 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతా వాటిలోనూ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. కానీ వాటి టాక్ బయటకు రావాల్సి ఉంది.ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (నవంబర్ 15)జీ5మా నాన్న సూపర్ హీరో - తెలుగు సినిమాపైథనీ - హిందీ సిరీస్ఆహాఅన్స్టాపబుల్ 4 ఎపిసోడ్ 04 - అల్లు అర్జున్ ఎపిసోడ్రేవు - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)నందన్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సోనీ లివ్ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్నెట్ఫ్లిక్స్కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ - ఇంగ్లీష్ సినిమాద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)అన్ హ్యాపీ ఫర్ యూ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)అమెజాన్ ప్రైమ్హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ సీజన్ 2 - హిందీ సిరీస్గన్నర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)క్రాస్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ - ఇంగ్లీష్ సినిమాజియో సినిమాద డే ఆఫ్ ది జకల్ - ఇంగ్లీష్ సిరీస్బ్యాక్ టూ బ్లాక్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 17)ద మ్యాజిక్ ఆఫ్ శిరి - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)ద వాచర్స్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఆపిల్ ప్లస్ టీవీసిలో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేఆపరేషన్ బ్లడ్ హంట్ - తెలుగు డబ్బింగ్ మూవీమనోరమ మ్యాక్స్ఆదితట్టు - మలయాళ సినిమా(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ) -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా) -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
నా కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ..
-
మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్‌తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్‌తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి)