మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.
సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.
'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.
(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు)
Comments
Please login to add a commentAdd a comment