తమిళ హీరో కమల్ హాసన్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో 'విక్రమ్' మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఏడాది 'ఇండియన్ 2' రూపంలో దెబ్బ తగిలినప్పటికీ.. 'కల్కి'లో డిఫరెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో తనవంతు ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మీడియా మిత్రులు, అభిమానులని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.
'నా పనిని మెచ్చి 'ఉలగనాయగన్' లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు థ్యాంక్యూ. ప్రేక్షకులు, సహ నటీనటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమా విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. కళా కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్స్‌ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను'
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
'నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు.. నన్ను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. మూలాలకు కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
కమల్ హాసన్ అనే కాదు తమిళ హీరో అజిత్ కూడా గతంలో ఇలానే చేశాడు. తనని వేరే పేర్లతో పిలవొద్దని.. అజిత్ కుమార్ లేదా అజిత్ అని పిలవండి చాలు అని రిక్వెస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్)
உங்கள் நான்,
கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024
Comments
Please login to add a commentAdd a comment