మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్‌.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్‌ | Vijay Devarakonda Rowdy Brand Clothes Market Strategy | Sakshi
Sakshi News home page

మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్‌.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్‌

Published Mon, Nov 11 2024 9:59 AM | Last Updated on Mon, Nov 11 2024 10:33 AM

Vijay Devarakonda Rowdy Brand Clothes Market Strategy

రెండురోజుల క్రితం విజయ్‌ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్‌ అయింది. కొందరైతో ట్రోల్స్‌ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ​ దేవరకొండ  ఆ వీడియోను షేర్‌ చేస్తూ ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు.  ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్‌ దుస్తుల షాప్‌ ప్రమోషన్‌ కోసం విజయ్‌ ఉపయోగించాడు. ఇలా బిజినెస్‌లో కూడా తన మార్కెట్‌ స్ట్రాటజీని విజయ్‌ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్‌ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్‌ బ్రాండ్‌ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్‌ ఇస్తున్నారు.

'సాహిబా'  అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ   రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే,  ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్‌ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్  ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్‌తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్‌ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.

'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్‌ని విజయ్‌  ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్‌ స్టైల్‌ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్‌ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్‌ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్‌  కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్‌ చేసి విజయ్‌ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ  ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్‌ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement