
ఆత్మీయత ఆమె ఆరోప్రాణం
కుటుంబాన్ని తీర్చి దిద్దుతూనే రాయలసీమ రాజకీయాల్లో ఓ మహిళ రాణించడమంటే మామూలు విషయం కాదు.
కుటుంబాన్ని తీర్చి దిద్దుతూనే రాయలసీమ రాజకీయాల్లో ఓ మహిళ రాణించడమంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ సాధించడంతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కీలకమైన నేతగా శోభా నాగిరెడ్డి ఎదిగారు.
నేటితరం రాజకీయ నాయకులలో రెండు రకాల వారు కనిపిస్తుంటారు. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాగానే తమ కు ఓ పదవి వచ్చిందని కాలర్ ఎగరేసి ప్రజలకు దూర మైపోయేవారు మొదటిరకం. జనం తమకు ఓ బాధ్యత అప్పగించారనుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత మెరుగ్గా పనిచేసేవారు రెండోరకం. దివంగత శోభా నాగిరెడ్డి రెండో కోవకు చెందినవారు. ప్రజలకు, అభిమానులకు, ఆత్మీయులకు, పార్టీ శ్రేణులకు ఆమె దూరమై అప్పుడే ఏడాది గడచిపోయింది.
పార్టీ శ్రేణులు ఆప్యాయంగా, ఆత్మీయంగా ‘శోభ మ్మ’, ‘శోభక్క’ అని పిలుచుకునే శోభా నాగిరెడ్డికి కుటుంబ నేపథ్యం వల్లనో ఏమో రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి పంచాయ తీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్నపుడే ఆయనతోపాటు కార్యాలయానికి వెళ్లేవారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ ఆయన వెన్నంటి ఉండేవారు. ప్రజల సమస్యలను సన్ని హితంగా పరిశీలించడంతో పాటు పరిష్కారాల గురిం చి తండ్రితో చర్చించేవారు.
తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శోభ 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలబడాల్సి వచ్చింది. అప్పుడే కాదు ఆ తర్వాత మరో నాలుగుసార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై సంచల నం సృష్టించారు. రోడ్డు ప్రమాదం కబళించడంతో భౌతికంగా లేకపోయినా 2014 ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఆమె పేరు బ్యాలెట్ పత్రంలో ఉండడం, 18 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఓ అరుదైన సంఘటన.
మంచి వాగ్ధాటి, సమస్యల పట్ల అవగాహన వంటి ప్రత్యేక లక్షణాలు ఆమె ఏ పార్టీలో ఉన్నా కీలకమైన బాధ్యతలను నిర్వర్తించేలా చేశాయి. విమర్శలను దీటు గా తిప్పికొట్టడమే కాదు ప్రత్యర్థులను సునిశితమైన విమర్శలతో ఎదుర్కొనడం ఆమెకు ప్రత్యేకమైన గుర్తిం పును తెచ్చిపెట్టింది. రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శోభ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేశారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే వైఎస్ కుటుంబంతో ఆమె అనుబంధం మరో ఎత్తు. వైఎస్ మరణానంతరం తలె త్తిన సంక్షోభ సమయంలో శోభా నాగిరెడ్డి కుటుంబం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచారు. జగన్ అక్రమ నిర్బంధ సమయంలో ఆ కుటుంబానికి వెన్నంటే ఉండి మనోధైర్యాన్నిస్తూ కొండంత అండలా నిలబడ్డారు. పార్టీ శ్రేణులలో ఆత్మస్థయిర్యాన్ని నింపడంలోనూ, పార్టీని ముందుకు నడిపించడంలోనూ కీలకంగా ఉన్న అతి కొద్దిమంది నేతలలో శోభ కూడా ఒకరు. ‘మహా నేత వైఎస్ మరణం తర్వాత జగన్‌ను అంతలా కుంగ దీసిన మరో ఘటన ఏదైనా ఉందంటే అది సోదరి సమానురాలైన శోభ దూరం కావడమే’ అని పార్టీ నాయకులు అంటారు. అందుకే వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబమూ ఓ ఆడపడుచును కోల్పోయామన్నంతగా బాధపడింది.
ఆమెకు ఒక్కసారి పరిచయమైతే చాలు పేరుతో సహా గుర్తుంచుకుని పలకరిస్తారని చెబుతారు. సీమ యాసలో ‘అన్నా’ అని ఆప్యాయంగా పిలుస్తారని జర్న లిస్టు సోదరులూ గుర్తుచేసుకుంటుంటారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ ఆమెకు చిరపరి చితమైనవే. అనేక గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, హాస్పి టల్స్, రోడ్లు, తాగునీటి సదుపాయాలను కల్పించి జనం గుండెల్లో ఆ కుటుంబం చోటు సంపాదించింది. కర్నూలు, వైఎస్‌ఆర్ కడప జిల్లాల రైతులకు సాగునీరు, తాగునీటికి అత్యంత కీలకమైన కేసీ కెనాల్ నీటి కోసం శోభ తరచూ అధికారులతో గొడవ పడుతుండేవారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తుండేవారు. ఆళ్లగడ్డ రైతుల కోసం అనేక సార్లు ధర్నాలు చేశారు. సాగునీటి సలహా మండలి, డీడీఆర్‌సీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యే శోభ తప్పనిసరిగా హాజరయ్యేవారు.
ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గానికే శోభ పరిమితం కాలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, పార్టీ కేంద్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా, పార్టీ అత్యు న్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన పొలిటికల్ అఫై ర్స్ కమిటీ సభ్యురాలిగా అనేక రకాల బాధ్యతలు నిర్వ ర్తించారు. 2011 కడప లోక్‌సభ ఉప ఎన్నికల సంద ర్భంగా మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన శోభ, అక్కడి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి పార్టీని పటిష్టం చేశారు.
అలా డీఎల్ రవీంద్రారెడ్డి కం చుకోట బద్దలు కొట్టడంలో తన వంతు పాత్ర పోషించా రు. బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజక వర్గాల్లో సైతం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో శోభ స్ఫూర్తిని నింపారు. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్ని కతో పాటు పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా, దీక్ష చేపట్టినా, పోరాటం చేసినా విజయమ్మ వెన్నంటి శోభ ఉన్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర సమ యంలోనూ తోడుగా నడిచారు.
భార్యగా, తల్లిగా కుటుంబాన్ని తీర్చి దిద్దుతూనే రాజకీయంగానూ.. అందులోనూ రాయలసీమ రాజ కీయాల్లో ఓ మహిళ రాణించడమంటే మామూలు విష యం కాదు. ఇవన్నీ సాధించడంతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కీలకమైన నేతగా శోభా నాగిరెడ్డి ఎదిగారు. జీవితంలో ఎన్నో కష్టాలకు, ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచినా విధి చేతిలో ఓడిపోయారు. భౌతి కంగా దూరమైనా శోభమ్మ జ్ఞాపకాలు మాత్రం మాసి పోవు. అవి ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి.
- పోతుకూరు శ్రీనివాసరావు