ఆళ్లగడ్డటౌన్, న్యూస్‌లైన్ : పొదుపు సంఘాల సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించవద్దని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శారదా నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా టీడీపీ చాగలమర్రి మండల ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా, కాంగ్రెస్, టీడీపీకి చెందిన దుర్వేష్ అహమ్మద్, సుభాన్, ఖాదర్‌బాషా, అబ్దు ల్లా, మహమ్మద్‌హుస్సేన్, నాయబ్, తాజుద్దీన్, ఓబులంపల్లె మహబూబ్‌బాషా, మరో 200 మంది ముస్లింలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరా రు. పార్టీ మండల కన్వీనర్ అన్షర్‌బాషా, నిజాముద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శోభానాగిరెడ్డి మాట్లాడా రు. మహిళలకు తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రుణాలను రద్దు చేయాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు.
అధికారంలోకి వస్తే సుమా రు రూ.17 వేల కోట్ల రుణాలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మళ్లీ వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పార్టీలో చేరిన ముస్లింలు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో 4శా తం రిజర్వేషన్లు అమలు చేయడంతో లబ్ధిపొందామని, ఆయన కుమారుడిని సీఎం చేయాలనే పార్టీలో చేరామన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.ఎన్.పుల్లయ్య, ఖాదర్‌బాషా, ఖాజారసూల్ ఉన్నారు.
పార్టీలో చేరిన బాచేపల్లె టీడీపీ నాయకులు బాచేపల్లెకి చెందిన ఉప సర్పంచ్ నరసింహులు, గొల్ల లక్ష్మీనరసింహులు, పాములేటి, లక్ష్మీనరసయ్య, నాగేంద్ర, బుజ్యయ్య, రెండోఖాశీంసా, ఖాజావళి, నాగన్న, టీడీపీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బాచ్చాపురం శేఖరరెడ్డి, లక్ష్మీరెడ్డి, గురుస్వామి, రెండోమస్తాన్ ఉన్నారు.
విశ్వసనీయతకు కట్టుబడిన నేత జగన్
విశ్వసనీయతకు కట్టుబడి రాష్ర్టం సమైక్యంగా ఉంచేందుకు జగన్‌మోహన్ రెడ్డి పోరాటం చేశారని ఎమ్మెల్యే శోభానాగి రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జాతీయస్థాయిలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని ఓబులంపల్లెలో ఆమె ప్రచారం చేశారు.
గ్రామంలో దర్గావద్ద ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించా రు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు.. బీజేపీ అగ్రనాయకుడు మోడీని పొగుడుతూ ముస్లింలను దగా చేస్తున్నారన్నారు. తన సొంత సర్వేలో వైఎస్సార్సీపీకి 140 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలిసి కంగారు పడుతూ.. చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీనాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారన్నారు.
డ్వాక్రా రుణాలు చెల్లించొద్దు
Published Sat, Mar 29 2014 2:55 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement
Advertisement