'పవన్ కళ్యాణ్, మోడీలను చంద్రబాబు వాడుకుంటున్నాడు'
'పవన్ కళ్యాణ్, మోడీలను చంద్రబాబు వాడుకుంటున్నాడు'
Published Mon, Apr 7 2014 6:44 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
కర్నూలు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీవే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్నూల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై శోభానాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ, బీజేపీ పొత్తు చరిత్రాత్మక తప్పు అన్న చంద్రబాబు..ప్రస్తుత పొత్తుపై మైనారిటీలకు ఏం సమాధానం చెప్తారని శోభానాగిరెడ్డి నిలదీశారు.
ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఓ పరాన్నజీవి అని వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా గెలువాలని చంద్రబాబు కేఏ పాల్, పవన్ కళ్యాణ్, మోడీలను వాడుకుంటున్నారని శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఐనా అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని శోభానాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement