'వాడెవడో సినిమా యాక్టర్ అట' కేసీఆర్ సెటైర్!
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని విమర్శిస్తే తాటా తీస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు.
'వాడెవడో సినిమా యాక్టర్ అట. వాడి సినిమాలు నేనైతే చూడలేదు. తెలంగాణ గడ్డ వరంగల్ లో నా తీట తీస్తానని అన్నాడట. నన్ను రోజు పది కుక్కలు తీడుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోను. కాని తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు' అని కేసీఆర్ అన్నారు. నాలుగు రోజులాగితే ఎవడి తాట ఎవడు తీస్తాడో చూడాల్సిందే' అని కేసీఆర్ అన్నారు.
అలాగే మోడీపై మరోసారి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిచ్చి మోడీ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. వన్+వన్+వన్=మేం ముగ్గురం (మోడీ, పవన్, చంద్రబాబు) అని మోడీ అన్నారని.. తెలంగాణలో మూడు ఒకట్లు అంటే పంగనామాలు అని అర్ధం అంటూ ఎద్దేవా చేశారు.
బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోడీని, దళిత నాయకులను తిట్టినా, ఆరోపణలు చేసినా టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు తాట తీస్తామని జనసేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.