శోభానాగిరెడ్డికి భూమా అఖిలప్రియ నివాళులు
కర్నూలు: దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి ఘాట్ వద్ద ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదివారం ఉదయం నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అఖిలప్రియ ఆళ్లగడ్డకు వచ్చారు. ఆళ్లగడ్డలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అఖిలప్రియకు ఘనస్వాగతం పలికారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.