కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మృతికి కారణమైన గూభగుండం సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ సాయినాథ్ సోమవారం రాత్రి తెలిపారు.
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మృతికి కారణమైన గూభగుండం సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ సాయినాథ్ సోమవారం రాత్రి తెలిపారు. ఏప్రిల్ 24న జాతీయ రహదారిపై ఆరబోసిన వరిధాన్యం కుప్పల కారణంగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే.
ప్రమాదానికి కారణం వరి ధాన్యం కుప్పలే కావడంతో ఆరబోసిన గూభగుండం సుబ్బారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.