కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి దిగింది.
కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారానికి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డికి వేసే ఓటు చెల్లదంటూ టీడీపీ కార్యకర్తలు ఓటర్లకు ప్రచారం చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో గత నెల 24న శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
మరోవైపు ఆత్మకూరులో టీడీపీ కోడ్ ఉల్లంఘించింది. పోలింగ్ బూత్ల వద్ద శిల్పా మోహన్ రెడ్డికి ఓటేయాలంటూ బ్యానర్లు పెట్టారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు.