హైదరాబాద్: తమ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల నేడు, రేపు తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే వీరు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్కు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ అప్పటికప్పడు తన కార్యక్రమాలను రద్దుచేసుకుని హైదరాబాద్ వచ్చారు. కేర్ ఆస్పత్రికి వెళ్లి శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు.
వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కడప నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రేపు శోభానాగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.
ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్న జగన్, విజయమ్మ
Published Thu, Apr 24 2014 1:57 PM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM
Advertisement
Advertisement