
'విభజనకు కిరణ్, బాబు సహకరిస్తున్నారు'
హైదరాబాద్ : సమైక్య తీర్మానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సమైక్య ముసుగులో సీఎం, చంద్రబాబు విభజనకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమగ్ర సమాచారం లేకుండా బిల్లుపై చర్చ సాధ్యం కాదని శోభా నాగిరెడ్డి స్పష్టం చేశారు.
సమైక్య తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఆమె అన్నారు. ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలను బిల్లులో తెలియచేయలేదన్నారు. సోనియాగాంధీ ఆదేశాలతో సీఎం కిరణ్ సభను నడిపిస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిపక్షనేత బాబు సహకరిస్తున్నారని అన్నారు.