
అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న శోభానాగిరెడ్డి
సమైక్యంపై శాసనసభలో కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు పెదవి విప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు ఆ రెండు పార్టీలు ఉన్న సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆరోపించారు.
కానీ సమైక్యంపై మాట్లాడేందుకు నోరు రావడం లేదంటూ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు సమయం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు చర్చలో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటుందని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.