'సీమాంధ్రలో 145కు పైగా సీట్లు వైఎస్ఆర్ సీపీవే'
కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకే కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. సీమాంధ్రలో 145 నుంచి 150 స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టీడీపీని ఎవరూ నమ్మరని శోభానాగిరెడ్డి అన్నారు. కరెంట్ తీగలపై బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ అంటూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. 9గంటల ఉచిత విద్యుత్ అంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్ని ఓట్ల కోసమే అని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు.