నిబంధనల మేరకే శోభా నాగిరెడ్డి పేరు ఉంచాం
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరగడానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భూమా శోభా నాగి రెడ్డి మరణించినప్పటికీ.. ఎన్నికల నిబంధనల మేరకే ఆమె పేరును బ్యాలెట్ పేపర్‌లో యథాతథంగా కొనసాగించామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. ఎన్నికలకు ముందు గుర్తింపు పొం దని రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిం చినప్పుడు, సదరు అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించే పక్షంలో.. ఎన్నికల్లో గెలిచేందుకు లేదా ఫలితాన్ని తారుమారు చేసేం దుకు ప్రత్యర్థులు సదరు అభ్యర్థిని అంతమొందించేందుకు ప్రయత్నించే అవకాశం ఉం టుందని తెలిపింది. గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి మరణించినట్లైతే ఎన్నిక వాయిదా వేయడానికి గానీ, అభ్యర్థిని మార్చడానికి గానీ ఎన్నికల నిబంధనలు అంగీకరించవని వివరించింది.
ఇటీవలి సాధారణ ఎన్నికల్లో శోభా నాగి రెడ్డి గెలుపొందారని, ఆమె మరణించినందున ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమని నివేదిం చింది. ఎన్నిక ప్రక్రియను న్యాయస్థానాల్లో సవాలు చేయడంపై రాజ్యాంగంలోని అధికరణ 329 (బి)లో నిషేధం ఉందని తెలి పింది. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని అభ్యర్థిం చింది. మంగళవారం ఈ కౌంటర్‌ను పరిశీ లించిన జస్టిస్ ఖండవ్లలి చంద్రభాను నేతృత్వం లోని ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయూలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను పది రోజు లకు వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించారు. అయినా ఎన్నికల సంఘం ఆమె పేరును బ్యాలెట్ పేపరులో ఉంచింది. ఎన్నికల సంఘం చర్యలను కర్నూలు జిల్లాకు చెందిన బి.హర్షవర్థన్‌రెడ్డి, జంగా వినోద్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు.