ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా అఖిల
హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత నేత భూమా శోభా నాగిరెడ్డి, ప్రస్తుత పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డిల కు మార్తె భూమా అఖిలను పేరును పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఆయన గురువారం తన నివాసంలో పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, భూమా నాగిరెడ్డితో చర్చ లు జరిపి వారి సమక్షంలో అఖిల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయడం కోసం జగన్ పార్టీలోని సీనియర్ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావుతో ఒక ద్విసభ్య కమిటీని నియమించారు.
ముగిసిన వాదనలు: ఆళ్లగడ్డ ఎన్నిక వ్యవహా రానికి సంబంధించి గురువారం హైకోర్టులో దా దాపుగా వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూ డిన ధర్మాసనం మూడు రోజులుగా చేసిన వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలని పిటిషనర్లను, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
పోటీపై సీఎం సమాలోచన: ఆళ్లగడ్డలో వచ్చేనెలలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డితో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రభాకర్‌రెడ్డి గురువారం సచివాల యంలో కలిశారు. ఉప ఎన్నికలో పార్టీ పోటీచేస్తుందని, పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారని ప్రభాకర్‌రెడ్డి అనంతరం తనను కలసిన విలేకరులతో చెప్పారు.