Sajjala Ramakrishna Reddy Gives Clarity On YSRCP Permanent President Post - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ

Published Thu, Sep 22 2022 2:32 PM | Last Updated on Thu, Sep 22 2022 4:58 PM

Sajjala Ramakrishna Reddy Gives Clarity on Lifetime President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు. దీంతో శాశ్వత అధ్యక్షుడు అనేది లేదని సజ్జల స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల తెలిపారు. ఆ తర్వాత ఎన్నిక జరగనున్నట్లు వెల్లడించారు. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు వివరించారు. శాశ్వత అధ్యక్షుడు పదవికి సంబంధించి స్పష్టత ఇవ్వమని ఎన్నికల సంఘం అడిగిందని, ఇదే అంశాన్ని ఈసీకి చెప్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

చదవండి: (గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement