'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం' | We will try to Allagadda by elections unanimous, says M V Mysura reddy | Sakshi
Sakshi News home page

'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం'

Published Sat, Oct 11 2014 2:53 PM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం' - Sakshi

'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం'

హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున దివంగత శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ పోటీ చేయనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ...  ఆ ఉప ఎన్నికల్లో మిగిలిన రాజకీయ పార్టీలు పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని అనుసరించాలని సదరు పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదే విషయంపై ఈ నెల 15న టీడీపీ నేతలను కలుస్తామన్నారు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. ఆయా పార్టీలు తమ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నాయని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో తాము ఇదే సంప్రదాయం పాటించామని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement