akhila priya
-
పార్టీకి సంబంధం లేదు.. ఎమ్మెల్యే అఖిలప్రియవి ఉద్దేశపూర్వక ఆరోపణలు
-
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు అది ఎప్పటికీ అంతమవుతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఓ ప్లాన్ బెడిసికొట్టింది. చేసింది ఎవరు , చేయించింది ఎవరు ? ఎవరు ఎవరిని టార్గెట్చేశారన్న విషయం తెలిసి కూడా వాళ్లు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ? ఇంతకీ ఈ ఫాక్ష్యన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెరెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయకక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టు కోసం ఇరువర్గాలు సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. పోలింగ్ తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవీ, భూమాకుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, అతడు తృటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నంద్యాలజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతికారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌ని చంపేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడంలేదు. సరికదా కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట. అందుకే బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవీ సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. -
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు
-
అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ విలీనమైంది) లోన్ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది. అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్ ముందు కూడా ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. -
అఖిలప్రియ ధిక్కార స్వరం
ఆళ్లగడ్డ: పరిషత్ ఎన్నికల్లో పాల్గొనరాదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి అఖిలప్రియ ధిక్కారస్వరాన్ని వినిపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు. సోమవారం ఆమె ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కడా పరిషత్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. వారి తరఫున ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు. పోటీలో టీడీపీ అభ్యర్థులు లేని చోట, అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానాల్లో సైకిల్ గుర్తుకు బదులు నోటాకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. -
అఖిలప్రియ బెయిల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్ పటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణను సెషన్స్ కోర్టు రేపటికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా వాయిదా వేసింది. దీంతో ఈ మూడు బెయిల్ పిటిషన్లపై సికింద్రాబాద్ కోర్టు రేపు మరోసారి విచారించనుంది. కాగా మూడు బెయిల్ పిటీషన్లపై కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియకు సంబంధించి రెండుసార్లు బెయిల్ పిటీషన్లు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో శుక్రవారం నాడు ఎటువంటి తీర్పు వెలువడనుందే ఆసక్తి నెలకొంది. -
ఏ క్షణమైనా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను రెండవరోజు కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో ఆమెను బోయినపల్లి పోలీసులు విచారిస్తున్నారు. భార్గవ్ రామ్ సహా ఇతర నిందితులు ఎక్కడున్నారు అన్న కోణంలోనూ విచారణ జరగనుంది. అంతేకాకుండా బాధిత కుటంబంతో బలవంతంగా సంతకాలు సేకరించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించనున్నారు. (కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. భూమా అఖిలప్రియ!) మరోవైపు ఈ కేసులలో నిందితులు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటుమొత్తం మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీనులు పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులు ఉపయోగించిన కార్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు ) -
కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే కర్త, కర్మ, క్రియ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. పాత్రధారుల వెనుక ఉండి కథ నడిపించేందుకే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ఆమె వ్యక్తిగత సహాయకుడు సహా మరో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సోమవారం వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పక్కాగా రెక్కీ చేసుకున్నాకే... ముగ్గురు బాధితుల్ని టార్గెట్‌గా చేసుకున్న అఖిలప్రియ నేరానికి ముందు పక్కాగా రెక్కీ చేయించారు. ఆళ్లగడ్డకు చెందిన సంపత్, కడపకు చెందిన బాల చెన్నయ్య ద్విచక్ర వాహనంపై వెళ్లి ఈ పని చేసి వచ్చారు. తమ రెక్కీలో గుర్తించిన వివరాలను భార్గవ్‌రామ్‌తో పాటు శ్రీనుకు తెలిపారు. కూకట్‌పల్లిలో ఉన్న ప్రాధ గ్రాండ్ హోటల్లో నిందితులు బస చేశారు. కిడ్నాప్‌నకు కొన్ని రోజుల ముందు గుం టూరు వెళ్లిన అఖిలప్రియ నేరం చేసే రోజు ఆ వ్యవ హారాన్ని పర్యవేక్షించడానికి తన నివాసమైన లోథ అపార్ట్‌మెంట్స్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో వీరి మధ్య 50కి పైగా ఫోన్ కాల్స్ జరిగాయి. మధ్యాహ్నమే మొదలైన సన్నాహాలు.. కిడ్నాప్ జరిగిన గత మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచే నిందితులు అఖిలప్రియ నివాసంలోనే గడిపారు. నాలుగు తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన నిందితులు ఆ రోజు సాయంత్రం 4 గంటలకు యూసుఫ్‌గూడలోని భార్గవ్‌కు చెందిన ఎంజీఎం ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వస్త్రాలు, కార్ల నంబర్ ప్లేట్లు మార్చుకుని బోయిన్పల్లి బయలుదేరారు. నకిలీ గుర్తింపుకార్డులు, వాహనాల కోసం 12 నకిలీ నంబర్ ప్లేట్లు తయారుచేశారు. మూడు వాహనాల్లో బోయిన్పల్లి వెళ్లిన వీరు ముగ్గురు బాధితుల్ని కిడ్నాప్ చేసి మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లారు. కీలక సాక్షిగా నార్త్‌జోన్ డీసీపీ.. వీరి కదలికలు, వ్యవహారాలకు సంబంధించిన కీలక ఆధారాలను సాంకేతిక అంశాలైన టవర్ లొకేషన్లు, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) సిస్టం అందించాయి. కిడ్నాపర్లు వాడిన వాహనం నగరంలోని ఏఏ ప్రాంతాల్లో సంచరించింది అనే అంశాన్ని సీసీ కెమెరాలకు అనుసంధానించి ఉన్న ఏఎన్పీఆర్ సిస్టం గుర్తించింది. అఖిలప్రియ ఆదేశాల మేరకు బాధితుల్ని విడిచిపెట్టాలని కిడ్నాపర్లు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగెన్వర్కు బాధితుడు సునీల్‌రావు అర్ధరాత్రి 1.01 గంటలకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో గుంటూరు శ్రీను వినియోగించిన తాత్కాలిక నంబర్ కలిగిన ఫోన్‌ను వాడారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో డీసీపీ సైతం కీలక సాక్షిగా మారనున్నారు. మరో మూడు తాత్కాలిక నంబర్లు వాడిన వాళ్లే కీలకం, వారు ఎవరనేది గుర్తిస్తున్నాం. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి బోయ సంపత్‌కుమార్, ఎన్.మల్లికార్జున్‌రెడ్డి, రెక్కీ నిర్వహించిన బాల చిన్నయ్యలను అరెస్టు చేశాం. భార్గవ్‌రామ్ సహా పరారీలో ఉన్న గుంటూరు శ్రీను, గుంటూరుకు చెందిన ఎం.సిద్ధార్థ, ఎం.కృష్ణ, వి.వంశీ, దేవ ప్రసాద్, శివప్రసాద్, భాను, డి.కృష్ణ చైతన్య, అంజయ్య కోసం గాలిస్తున్నాం. కాగా, అఖిలప్రియకు సోమవారం సాయం త్రం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చట్టప్రకారమే.. భూమా అఖిలప్రియ అరెస్టుకు సం బంధించి చట్ట ప్రకారమే నడుచుకున్నాం. ఆమెను అరెస్టు చేసేప్పుడు మహిళాఇన్స్పెక్టర్ జ్యోత్స్న, ఎస్సై వెంకటలక్ష్మి ఉన్నారు. రిమాండ్‌కు తరలించే ముందు గాంధీ ఆసు పత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో డాక్టర్ల బృందం పరీక్షించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. జైళ్ల అథారిటీ సైతం ఉస్మానియా ఆసు పత్రి వైద్యబృందంతో మళ్లీ పరీక్షలు చేయించి ఫిట్ అని తేల్చింది. ఫిర్యాదులోని అంశాల ఆధారంగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ–1గా చేర్చాం. వెలు గులోకి కీలకాంశాలు రావడంతో అఖిలప్రియ అలా మారింది. సికింద్రాబాద్ కోర్టు అఖిలప్రియను 3 రోజుల కస్టడీకి అప్పగించింది. లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబడతాం. – అంజనీకుమార్, సిటీ కొత్వాల్ -
అఖిలప్రియ బయటకొస్తే సాక్ష్యుల్ని బెదిరించవచ్చు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త ఏ3 భార్గవరామ్ కోసం గాలిస్తున్నారు. బెయిల్ కోసం అఖిలప్రియ విశ్వప్రయత్నం చేస్తున్నారు. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అయితే వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. రేపు(సోమవారం) కోర్టులో అఖిలప్రియ బెయిల్, కస్టడీపై విచారణ జరగనుంది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. ( అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి ) బోయిన్పల్లి నుంచి కిడ్నాప్ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు. -
అఖిలప్రియను కస్టడీకి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అఖిలప్రియను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు శుక్రవారం సికింద్రాబాద్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. బోయిన్పల్లి నుంచి కిడ్నాప్ చేసిన ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లో బంధించిన నిందితులు వారి నుంచి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి వివరించారు. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసిన తర్వాతే కీలక ఘట్టమైన క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్‌ను చేపట్టాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్‌న్‌లో పేర్కొన్నారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకు అఖిలప్రియను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదును బట్టే ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసులో తొలుత అఖిలప్రియ ఏ–2గా ఉన్నారని, ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాలను బట్టి ఆమే సూత్రధారిగా తేలిందని, అందుకే రిమాండ్ రిపోర్టులో అఖిలప్రియను ఏ–1గా చేర్చామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, కిడ్నాప్‌లో కీలకంగా వ్యవహరించిన వారి అనుచరుడు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శీను లొంగుబాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. భార్గవ్‌రామ్ సికింద్రాబాద్ కోర్టులో లొంగిపోవడానికి వస్తున్నాడంటూ శుక్రవారం ఉదయం ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు పద్ద బందోబస్తు, నిఘా ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు ఓ దశలో కోర్టు తలుపులూ మూసివేశారు. ఈ పరిణామంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పొలిటికల్ గేమ్‌గా కనిపిస్తోంది: మౌనిక బంజారాహిల్స్(హైదరాబాద్): హఫీజ్‌పేటలోని భూ వివాదం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బతికున్నప్పటి నుంచే ఉందని ఆయన కుమార్తె, అఖిలప్రియ సోదరి భూమా మౌనికరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పొలిటికల్ గేమ్‌గా కనిపిస్తోందని, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఆందోళన ఉందని పేర్కొన్నారు. అరెస్టు చేసినప్పుడు టెర్రరిస్టులను కూడా బాగా చూస్తారని, అఖిలప్రియ అంతకంటే ఎక్కువా? అని ప్రశ్నించారు. కిడ్నాప్ చేసినప్పుడు నిందితులు ప్రవీణ్‌రావును కొట్టారు.. తిట్టారు.. అని అంటున్న పోలీసులు ఆ ఆధారాలను కోర్టుకు ఎందుకు అందించలేదని అన్నారు. ‘జైలు నుంచి మా అక్క బతికి వస్తుందా? ఈ పరిస్థితుల్లో భార్గవ్‌రామ్ బయటకు వస్తే రక్షణ ఉంటుందా?’అని ప్రశ్నించారు. -
అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు..
సాక్షి, హైదరాబాద్: కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు. (చదవండి: కిడ్నాప్ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..) ఇది ఇలా ఉండగా, అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం మాకు లేదని పోలీసులు తెలిపారు. ‘‘సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) -
మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు
ఆళ్లగడ్డ: మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు నమోదు చేసినట్టు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలో కోవిడ్ నిబంధనల మేరకు సెక్షన్–30 అమల్లో ఉన్నప్పటికీ అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో అఖిలప్రియతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. -
కర్నూలు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు
-
నా హత్యకు అఖిలప్రియ దంపతుల కుట్ర
-
ఎందుకు చంపాలనుకున్నారు?
సాక్షి, కర్నూలు: తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు చెబితేనే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పిన విషయాలు తెలుసుకుని షాక్ తిన్నానని పేర్కొన్నారు. ‘‘నేను అఖిలప్రియపై ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మని అఖిలప్రియ అంటోంది. ఆమె నాకు రాజకీయ నేర్పుతుందా. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నా.. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని’’ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) కార్యకర్తలను కాపాడుకున్న చరిత్ర తనదని తెలిపారు. భూమా నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తుంటే.. దాడులు చేస్తుంటే.. భూజాలపై ఎత్తుకునిపోయి కాపాడానని తెలిపారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు భూమా కుటుంబానికి,తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. నాగిరెడ్డి కోసం నంద్యాల సీటు వదులుకున్నానని చెప్పారు. ‘‘అఖిలప్రియ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఆళ్లగడ్డలో ఎంతమందిని చంపిస్తారో. ఆమెకు తప్పా మరెవ్వరికి అక్కడ అవకాశం ఇచ్చినా మద్దతు ఇస్తా. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. అఖిల ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని’’ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అఖిలప్రియ భర్తకు పోలీసుల నోటీసులు కడప అర్బన్: కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు విచారణకు హాజరుకావాలని కడప పోలీసులు నోటీసులిచ్చారు. సుబ్బారెడ్డి హత్యకు కడపకు చెందిన వారితో కుట్ర పన్నినట్లుగా భార్గవ్‌పై ఆరోపణలున్నాయి. -
‘అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, కర్నూలు: చంద్రబాబు మెప్పు కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. జిల్లా సమస్యలు తెలియని అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ అపోహల్ని ముస్లింలపై రుద్దడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కర్నూలు కష్టాలు తెలియని అఖిల ప్రియ మానవత్వం చూపాలి తప్ప రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ముస్లింలను అవమానిస్తున్నారని, ముస్లిం ఓట్లను ఉపయోగించుకొని వారిపై బురద జల్లుతున్నారని వాపోయారు. మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకోకుండా హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం సాగిస్తున్నారని, రాష్ట్రం ప్రజానీకం కరోనాతో బాధలు పడుతుంటే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా పని కట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. -
హత్యాయత్నం కేసులో అఖిలప్రియ అనుచరులు
బంజారాహిల్స్: వ్యాపారిపై హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు ముగ్గురిని ఆళ్లగడ్డ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 27న దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వ్యాపారి శివరాంరెడ్డి క్రషర్ వద్దకు దౌర్జన్యంగా ప్రవేశించడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అఖిలప్రియ భర్త భార్గవ రామానాయుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో మరో పది మందిపై ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆళ్ల సుబ్బయ్య, వినయ్, మంగళి పవన్ పరారీలో ఉన్నారు. వీరు నగరంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆళ్లగడ్డ పోలీసులు సోమవారం నగరానికి చేరుకున్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఇంట్లో ఉన్న నిందితులను గుర్తించిన వీరు బంజారాహిల్స్ పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. దీనిని గుర్తించిన నిందితులు అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్‌తో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. దీనిపై ఆళ్లగడ్డ పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితులను అదుపులోకి తీసుకొని ఆళ్లగడ్డకు తీసుకెళ్లారు. -
అఖిల ప్రియకు షాక్..
సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు. -
మంత్రి అఖిల ప్రియకు షాక్..!
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ నేత ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్ శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎస్వీ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. మంత్రికి ఝలక్... వైఎస్ఆర్సీపీలోకి సింగం కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. కాగా గతంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. -
మంత్రి అఖిలప్రియకు చేదు అనుభవం..
కర్నూలు, ఉయ్యాలవాడ: మంత్రి అఖిలప్రియకు కాకరవాడ గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం గ్రామంలో మంత్రి పర్యటించారు. దళిత కాలనీని సందర్శించేందుకు వెళ్లి సమస్యలు ఆరా తీశారు. ‘‘ గ్రామంలో అంతా సీసీ రోడ్లు వేస్తున్నారు.. మా కాలనీలో రోడ్లు, మురికి కాలువలు ఎందుకు ఏర్పాటు చేయరు? ఎస్సీల ఓట్లు చెల్లవా? మా సమస్యలు పరిష్కరించరా?’’ అంటూ మంత్రిని దళిత కాలనీ వాసులు నిలదీశారు. కాలనీలో సమస్యలను మంత్రి చూపించారు. దీంతో ఆమె స్పందిస్తూ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం బీసీ కాలనీని వెళ్లగా.. విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
-
అఖిలప్రియకి ఝలక్.. కీలక నేత రాజీనామా
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ తీరు కారణంగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాల్లో మంత్రి భూమా అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. టీడీపీ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. నీరు చెట్టు పథకంలో అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలిపారు. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. -
చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోం
కర్నూలు :ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టాలని మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరులు చూస్తున్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకుడు రాజారెడ్డిపై ఆదివారం జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సక్రమంగా స్పందించి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవి కావన్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ ప్రజలు పెద్ద ఫ్యాక్షన్‌ను చూశారన్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ప్రాణాలతోవెళ్తామో లేదో అనే పరిస్థితుల్లోనే ఎవరూ భయపడకుండా తిరిగారన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహిం చేది లేదన్నారు. పదిరోజుల్లో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు ఫిర్యాదులు చేశామని, మొదట ఇచ్చిన ఫిర్యాదుకే స్పందించి నిందితులను అదు పులోకి తీసుకుని, మందలించి ఉంటే ఈ ఘటనలు జరిగేవా అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని దాడులను అరికట్టాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగినా సహించబోమన్నారు. ఫ్యాక్షన్ గొడవలకు 1999 నుంచి నియోజకవర్గ ప్రజలు దూరంగా ఉన్నారని, మళ్లీ అలాంటి పరిస్థితులను సృష్టించవద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి, నాయకులు పలచాని బాలిరెడ్డి, శివనాగిరెడ్డి, రంగేశ్వర్‌రెడ్డి, పత్తి నారాయణ పాల్గొన్నారు. -
ప్రజలే మీ తాటతీస్తారు..
కర్నూలు , నంద్యాల: మంత్రి అఖిలప్రియ నంద్యాలలో ఆళ్లగడ్డ రాజకీయాలు చేయాలని చూస్తే అవి ఇక్కడ చెల్లుబాటు కావని, నంద్యాల ప్రజలు మీ తాటతీసే రోజులు దగ్గర్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని శిల్పాసేవా సమితిలో కో ఆప్షన్‌మెంబర్ దేశం సు«ధాకర్రెడ్డితో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. మంత్రి అఖిలప్రియ నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆమె బెదిరింపులకు నంద్యాలలో భయపడే వ్యక్తులు ఎవరూ లేరన్నారు. ఆళ్లగడ్డలో వస్తున్న పర్సెంటేజీలు సరిపోక నంద్యాలకు మంత్రి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. తాటతీస్తాం.. వంటి పదజాలం తాము మాట్లాడగలమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంత్రి తాట తీయడం ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చే యించి వేధిస్తున్నారన్నారు. పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు పెట్టుకుంటూ పోవడం మంచి పరిణామం కాదన్నారు. సొంతూరుకు ఏం చేశారో చెప్పండి.. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామాన్ని మాజీ సర్పంచ్ తులసిరెడ్డి హయాంలో శిల్పామోహన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేశామని శిల్పా రవి పేర్కొన్నారు. కొత్తపల్లెకు వచ్చే ముందు మంత్రి స్వగ్రామమైన డబ్లు్య. కొత్తపల్లెలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అక్కడికి వెళ్లి అభివృద్ధి పనులు చేసుకుంటే మంచిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నంద్యాలలో అమృతస్కీం కింద అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారని, ఆ నిధులను తమవి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి హయాంలోనే అమృత స్కీం మంజూరు అయిందనే విషయం ప్రజలకు తెలుసున్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పులో నష్టపోయిన బాధితులకు ఇంత వరకు పరిహారం అందివ్వలేదన్నారు. తమకు తెలిసిన టీడీపీ నాయకుల షాపుల వద్ద 17 అడుగుల నుంచి 10 అడుగుల వరకు తగ్గించి రోడ్లు వేసిన దాఖలాలు మంత్రికే చెల్లాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో టీడీపీ నాయకుల సమావేశం పెడతారా? అభివృద్ధి కార్యక్రమాలు అంటూ అధికారులను అందరినీ పిలిచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేజీపై కూర్చోబెట్టి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని మంత్రి అఖిలప్రియను శిల్పారవి సూటిగా ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అనుమతి లేకుండా ఆమె చాంబర్లోకి వెళ్లడమే కాకుండా.. ఇన్ని సదుపాయాలు ఈమెకు కల్పించడం అవసరమా అని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సీసీ టీవీ మానిటరింగ్ చైర్పర్సన్ పరిధిలో లేకపోయినా ఇక్కడ మానిటరింగ్ పెట్టవద్దని, తొలగించమని అధికారులను మంత్రి ఎలా ఆదేశిస్తారన్నారు. అసలు చైర్పర్సన్ చాంబర్లో సీసీ టీవీ మానిటరింగ్ లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగా ఏదో మాట్లాడాలని మాట్లాడితే తాము చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. చైర్‌పర్సన్‌కు మున్సిపల్ అధికారులు నంద్యాల పట్టణ అభివృద్ధికి ఏం పనులు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం ఆమెకు తెలియకపోవడం విచారకరమన్నారు. అందినకాడికి దోచుకోవడమే టీడీపీ నేతల పని వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న ఉద్దేశంతో టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని శిల్పా రవి ఆరోపించారు. భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్‌బోర్డు స్థలాలు దేనినీ వదలడం లేదన్నారు. చివరకు పట్టణ నడి బొడ్డున ఉన్న 150 ఏళ్ల చరిత్ర ఉండి పెళ్లిళ్లకు ఉపయోగపడే పాలకొమ్మ చెట్టును నరికివేశారన్నారు. నీరు–చెట్టు పథకం కింద కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. చిన్నవయస్సులో అఖిలప్రియ మంత్రి పదవి పొంది ఎలా పేరు పొందారో.. అదే విధంగా తక్కువ కాలంలోనే అవినీతి మంత్రిగా కూడా రికార్డులోకి ఎక్కనున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసాక్‌బాషా, కౌన్సిలర్లు జాకీర్‌హుసేన్, అమృతరాజు, మాబున్నిసా, చాంద్‌బీ, శోభారాణి, కన్నమ్మ, దేవనగర్‌బాషా, కిరణ్, టైలర్‌శివ, కృష్ణమోహన్, వైఎస్‌నగర్ రమణ, అహమ్మద్ హుసేన్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
మామ Vs కోడలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద పోటీపడి పనులు తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ప్రస్తుతం ఆ పనులు లేకపోవడంతో ఎర్రమట్టిపై కన్నేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే భారీఎత్తున ఎర్రమట్టిని తవ్వుతూ రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు. నంద్యాల పట్టణానికి సమీపాన మహానంది మండల పరిధిలో సాగుతున్న ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మంత్రి అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మధ్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. తన నియోజకవర్గంలో తాను మాత్రమే ఎర్రమట్టిని తవ్వుకుంటానని ఎమ్మెల్యే బుడ్డా వాదిస్తున్నారు. అయితే.. తాము పొలందారుడి నుంచి లీజుకు తీసుకున్నామని మంత్రి అనుచరులు అంటున్నారు. అటు ఎమ్మెల్యే అనుచరులు బుడ్డా స్టిక్కర్ ఉన్న వాహనాల్లో తిరుగుతూ ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. ఇటు మంత్రి అనుచరులు కూడా ఆమె స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాల్లో హల్చల్ చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. వరుస చెదిరి..చిచ్చు రేగి అఖిలప్రియను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘కోడలా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంటే మామ– కోడళ్ల మధ్య రేగిన మట్టి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి అక్రమంగా ఎర్రమట్టిని తవ్విస్తున్నారంటూ ఏకంగా విజిలెన్స్ విభాగానికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలోవిజిలెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్లే సమయానికి తన వాహనాలు తిరగకుండా ఎమ్మెల్యే తెలివిగా వ్యవహరించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మట్టి దందాపై లోతుగా విచారణ జరపవద్దంటూ విజిలెన్స్ సిబ్బందికి కూడా మంత్రి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటుకల తయారీదారులకు బెదిరింపులు ఎర్రమట్టిని అటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఇటు మంత్రి అఖిలప్రియ అనుచరులు పోటీపడి తవ్వేస్తున్నారు. ఈ విధంగా తవ్విన మట్టిని మొత్తం ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వారికి ఇరువురి నేతల అనుచరుల నుంచి తమ మట్టే తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇక ఈ పోటీ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. డబ్బు ఇవ్వకపోయినప్పటికీ ఎర్రమట్టిని ఇటుకల తయారీదారులకు ముందుగానే తోలుతున్నారు. ఒకానొకదశలో ధర కూడా పోటీపడి తగ్గించారు. ఈ వార్ కాస్తా ముదిరి ఏకంగా ఇటుకల తయారీదారులను బెదిరించే స్థాయికి చేరుకుంది. తమ ఎర్రమట్టే తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఇరువురు నేతల అనుచరులు బెదిరిస్తున్నారు. నంద్యాల చుట్టుపక్కల 400 నుంచి 500 వరకు ఎర్ర ఇటుకల బట్టీలు ఉన్నాయి. వీటి నిర్వాహకులు కాస్తా ఇరువురు నేతల అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్కటవుతున్న వైరి వర్గం ఇప్పటికే మంత్రి అఖిలప్రియకు, భూమా సన్నిహితుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పర్యాటక శాఖ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో మొదట ఏవీ సుబ్బారెడ్డి పేరును ప్రచురించలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత పర్యాటక శాఖ ఆయన పేరును ప్రచురించింది. నంద్యాలకు ఆగస్టు 15న మంత్రి హోదాలో అఖిలప్రియ వచ్చిన సందర్భంలో కౌన్సిలర్లు ఎవ్వరూ వెళ్లవద్దంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఆ కార్యక్రమానికి మంత్రితో పాటు కొద్దిమంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఎర్రమట్టి వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా.. అఖిలప్రియతో విభేదాలు ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని దగ్గరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బంధువుకు కూడా ఎర్రమట్టి తవ్వకాల్లో కొంచెం వాటా ఇచ్చారని సమాచారం. మొన్నటివరకు ‘కోడలా’ అని పిలిచిన బుడ్డానే ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా కూటమి కడుతుండడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య రేగిన చిచ్చు ఎక్కడి దాకా వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
తనిఖీల పేరుతో మంత్రి అఖిలప్రియ హల్చల్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అఖిలప్రియ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండా ఆమె లేని సమయంలో ఛాంబర్లోకి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాము చెప్పిన వాళ్లకే పనులు చేయాలని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. హౌసింగ్ విభాగంలోకి వెళ్లి.. ‘మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది ఎవరు? జాగ్రత్తగా పని చేయకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ చాంబర్లో హల్చల్ కార్యాలయంలో ఉద్యోగులపై మండిపడిన మంత్రి ఇంతటితో ఆగకుండా చైర్పర్సన్ లేని సమయంలో ఆమె చాంబర్లోకి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. చాంబర్లోకి వెళ్లీ వెళ్లడంతోనే ‘ఈమెకు (చైర్‌పర్సన్‌కు) ఇంత చాంబర్ అవసరమా?! గవర్నమెంట్ అధికారులకు కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. ఇక్కడ ఇన్ని కుర్చీలు అవసరమా? ఆఫీసంతా సీసీ కెమెరాలున్నాయి. సీసీ కెమెరాల మానిటరింగ్ చైర్పర్సన్ చాంబర్లో ఎలా పెడతారు? ఆమె ఇక్కడ కూర్చొని కార్యాలయంలోకి ఎవరెవరు వస్తున్నారు.. ఏ విభాగంలో ఏం పనులు జరుగుతున్నాయి.. అని మానిటరింగ్ చేస్తోందా? వెంటనే వీటిని తొలగించండి’ అంటూ అధికారులను ఆదేశించారు. మంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి ప్రజలు ఎన్నుకుంటే తాను మున్సిపల్ చైర్పర్సన్ అయ్యానని, వారికి ఏయే పనులు చేయాలో చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని దేశం నంద్యాల మునిసిపల్ చైర్పర్సన్ సులోచన స్పష్టం చేశారు. మంత్రి మున్సిపల్ కార్యాలయానికి వచ్చినప్పుడు తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను లేనప్పుడు చాంబర్లోకి వెళ్లి పరిశీలించే హక్కు మంత్రికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన చాంబర్లో సీసీ కెమెరాల మానిటరింగ్ లేదని, మంత్రి ఈ విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. -
మంత్రి అనుచరులా..మజాకా!
మహానంది: ఎర్రమట్టి మాఫియాతో ప్రజలకు ముప్పు పొంచి ఉంది. మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి స్టిక్కర్లతో ఉన్న వాహనాలు అతివేగంగా వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డిచెరువు వద్ద తాజాగా ఎర్రమట్టి రవాణా చేస్తున్న నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు ఇక్కడ హల్చల్ చేస్తున్నాయి. రెండురోజులుగా వీటిలో కొందరు అక్కడా ఇక్కడా తిరుగుతూ భయాందోళనలు çసృష్టిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు స్కార్పియోల్లో కొందరు హారన్స్ మోగిస్తూ అతివేగంగా వెళ్లడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే గాజులపల్లె మెట్ట వద్ద ఓ చిన్నారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం త్రుటిలో తప్పింది. అలాగే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వర్గీయుడి ఇంటి ముందుకు రాగానే.. హారన్ కొడుతూ వేగంగా వెళుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. మంత్రి అండదండలు ఉన్నాయన్న ధైర్యంతోనే ఇలా చేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అదే వాహనంలో సోమవారం సైతం అటూ ఇటూ తిరుగుతూ తాము మంత్రి మనుషులమని మరోసారి ప్రజలకు తెలిసేలా ప్రవర్తించారు. -
ఘనంగా మంత్రి అఖిలప్రియ వివాహం
సాక్షి, ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వివాహం భార్గవరామ్‌తో బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి శాసన మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్, రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ, ఆది నారాయణరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, జిల్లా కల్టెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి హాజరయ్యారు. -
కేటీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి అఖిల ప్రియ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులతో పాటు మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లను కలిశారు. ఈనెల 29న జరగనున్న తన పెళ్లికి రావాలని వారిని స్వయంగా ఆహ్వానించారు. పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్ నాయుడితో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఆమె వివాహం జరగనుంది. రాజకీయ, సినిమా ప్రముఖులను మంత్రి అఖిలప్రియ ఆహ్వానించేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వివాహ విందు ఇవ్వనున్నారు. అఖిలప్రియ, భార్గవ్ రామ్‌లకు మే 12న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. -
ఎవరి సీటుకు ఎసరు?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీలో కొత్త చర్చను...అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్ దాదాపుగా ప్రకటించారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక స్థాయిలో మండిపడగా... మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరి సీటుకు ఎసరు పడుతుందనే చర్చ అధికారపార్టీలో మొదలైంది. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశం లేదని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కర్నూలు సీటు దాదాపుగా నిర్ణయం కావడంతో మరో సీటు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏది కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. ముందుచూపుతో ఎస్వీ మోహన్ రెడ్డి పావులు కదిపి తన బెర్త్ రిజర్వ్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నంద్యాల, ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరిపై వేటు పడుతుందోనంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బులు వెదజల్లడంతో పాటు గెలిచేందుకు సెంటిమెంటు ఆటను కూడా అధికార తెలుగుదేశం పార్టీ బాగా రక్తికట్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంటు..అభ్యర్థులకు సంకటంగా మారుతోంది. సెంటిమెంటు పండుతుందా...! నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిన కొన్ని నెలల తర్వాత హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన విషయం విదితమే. ఇందుకోసం గత చరిత్రను సైతం ప్రజలకు గుర్తుచేశారు. గతంలో భూమా శేఖర్‌రెడ్డి మరణిస్తేనే నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని... భూమా నాగిరెడ్డి మరణించడంతో శేఖర్‌రెడ్డి కుమారుడికి ఇవ్వడమే సరైందనే వాదన తీసుకొచ్చారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తల్లిదండ్రులు లేని అమ్మాయి అఖిలప్రియ, తండ్రిలేని అబ్బాయి బ్రహ్మానందరెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ సెంటిమెంటును పండించే ప్రయత్నం చేసింది. అయితే, ఇప్పుడు అదే సెంటిమెంటును అధికారపార్టీ పాటిస్తుందా? లేదా అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. అదే సెంటిమెంటును పాటించి నంద్యాల సీటును బ్రహ్మానందరెడ్డికి, ఆళ్లగడ్డను అఖిలప్రియకు ఇస్తారా అన్న చర్చ అధికారపార్టీలోనే జరుగుతోంది. మరోవైపు.. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నంద్యాల తమకివ్వాలంటూ ఇప్పటికే ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒకవేళ సెంటిమెంటును పాటించి బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియకు ఇస్తే ఎస్పీవై రెడ్డితో పాటు ఫరూఖ్ వర్గం కూడా సహకరించే పరిస్థితి లేదని సమాచారం. ఈ మొత్తం చర్చ జరిగి ఎక్కడ తనకు ఎసరు వస్తుందనే ముందుచూపుతోనే ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే తన సీటు రిజర్వ్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో సీటు కష్టమే...! సెంటిమెంటుతో ఒకే కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు సీట్లు కేటాయించేది కష్టమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సెంటిమెంటుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదనేది వారి అభిప్రాయం. కేవలం ఉప ఎన్నికల కోసమే సెంటిమెంటు ఫ్యాక్టర్‌ను వాడుకున్నారు మినహా... దీని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశమేలేదని అంటున్నారు. మరోవైపు అఖిలప్రియ– ఏవీ సుబ్బారెడ్డిల వివాదాల సందర్భంగా సర్వే ప్రకారమే సీటు కేటాయిస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో మొదలైన అభ్యర్థుల ప్రకటన వ్యవహారం జిల్లావ్యాప్తంగా అధికారపార్టీలో కొత్త అలజడిని రేపిందని చెప్పవచ్చు. -
అఖిలప్రియపై చంద్రబాబుకు ఫిర్యాదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. -
నామినేటెడ్ పదవిస్తా.. సర్దుకుపో!
సాక్షి, అమరావతి: మంత్రి భూమా అఖిలప్రియతో సర్దుకుపోవాలని ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు సూచించారు. నామినేటెడ్ పదవి ఇస్తానని, గొడవలు లేకుండా ఆమెతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన ఇరువురితో సమావేశమై చర్చించారు. మంత్రి అఖిలప్రియతోపాటు ఆమె సోదరి మౌనికారెడ్డి, సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ సైకిల్ యాత్రలో తనపై దాడి చేయించింది అఖిలప్రియేనని, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. అఖిలప్రియ కూడా అక్కడ జరిగిన ఘటన గురించి వివరించినట్లు తెలిసింది. ఇద్దరి మాటలు విన్న తర్వాత.. గొడవలు పెట్టుకోవద్దని, పార్టీ కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు ఇరువురికీ సర్దిచెప్పారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే సుబ్బారెడ్డి డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం. జరిగిందేదో జరిగింది, ఆ విషయం మరచిపోవాలని, పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. అయినా సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కానీ, బయటకు వచ్చిన తర్వాత అఖిలప్రియతో కలిసి పనిచేస్తానని మీడియాకు చెప్పడం గమనార్హం. -
కొలిక్కివచ్చిన ఆళ్లగడ్డ పంచాయితి
-
ముగిసిన పంచాయితీ.. సుబ్బారెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. తన మాట చంద్రబాబు పట్టించుకోకపోవడంపై కినుక వహించిన సుబ్బారెడ్డి మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్టీ అభివృద్ధికి తాను ఎప్పటిలాగే కృషి చేస్తానని సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, ఆళ్లగడ్డ విభేదాలపై సీఎం చర్చించారని, ఈ వివాదం టీ కప్పులో తుపాన్ వంటిదని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. వివాదాలు వద్దని, అభివృద్ధిపై దృష్టి సారించమని చెప్పినట్లు తెలిపారు. చిన్న చిన్న విభేదాలు సహజమేనని, వాటిని సర్దుకుని పోవాలని చంద్రబాబు సూచించారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఓవైపు సుబ్బారెడ్డి బాధగా కనిపించగా.. మరోవైపు అఖిలప్రియ మాత్రం తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివాదం ఏంటంటే.. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సమక్షంలో పంచాయితీకి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన పంచాయితీకి అఖిలప్రియ గైర్హాజరు కాగా, శుక్రవారం రావాలని ఆదేశించారు. చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య రాజీయత్నం జరిగింది. -
‘ఆళ్లగడ్డ పంచాయితీ’ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య కర్నూలు జిల్లాలో సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగాల్సిన సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీకి పిలిచిన విషయం తెలిసిందే. మంత్రి అఖిలప్రియ రెండు రోజులపాటు రకరకాల కారణాలతో సమావేశానికి గైర్హాజరయ్యారు. అఖిలప్రియ గురువారం రాత్రి తన సోదరి మౌనిక, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో పాటు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే సమయానికి వెళ్లటంతో మీ పద్ధతి బాగోలేదంటూ ఇద్దరిపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సమయం లేనందున శుక్రవారం రావాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కూడా వచ్చారు. గొడవలు పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి వారిని హెచ్చరిస్తూ శుక్రవారం తనను కలవాలని చెప్పి పంపించేశారు. -
తేలని భూమా, ఏవీ పంచాయితీ..
సాక్షి, అమరావతి : భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరింది. రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే.. దీంతో గురువారం భూమా అఖిలప్రియ, ఆమె సోదరి మౌనికా రెడ్డి, సోదరుడు బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి తరపున ఆయన, కుమార్తె ఏవీ జశ్వంతి రెడ్డి చంద్రబాబు సమక్షంలో సుదీర్ఘ చర్చలకు కూర్చున్నారు. ఇరువర్గాలతో వేరువేరుగా చర్చలు జరిపిన చంద్రబాబు ఇరువురి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదని సమాచారం. ఇరు వర్గాలు చంద్రబాబు ఎదురుగానే పరస్పర విమర్శలకు దిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భూమా నాగిరెడ్డి మరణానంతరం సుబ్బారెడ్డి తనదైన శైలిలో ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియా మండిపడ్డారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఏవీ సుబ్బారెడ్డికి తమ మద్దతు ఉంటుందని, కానీ ఇలాంటి చవకబారు రాజకీయాలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అయితే పార్టీ కార్యక్రమాలపై దాడి చేయించడం ఏంటని ఏవీ సుబ్బారెడ్డి నిలదీశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే రాజీనామాలకు సైతం వెనుకాడబోమని అఖిల ప్రియ హెచ్చిరించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సుధీర్ఘంగా ఇరువురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం మరోసారి చర్చలకు రావాలంటూ దీంతో ముఖ్యమంత్రి, ఇరువర్గాలకు సూచించారు. -
సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా!
-
రాజధానికి చేరుకున్న ఆళ్లగడ్డ పంచాయతీ
-
ఆళ్లగడ్డ పంచాయితీకి అఖిలప్రియ డుమ్మా!
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీ ఎట్టకేలకు అమరావతికి చేరింది. సైకిల్ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటనపై అమరావతి రావాల్సిందిగా ఏపీ పర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన విషయం విదితమే. దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. కాగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...వారిద్దర్నీ బుధవారం సాయంత్రం అమరావతికి వచ్చి కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారకముందే ...మంగళవారం రాత్రి అఖిలప్రియ చేపట్టిన సైకిల్ యాత్ర అలాంటి వాతావరణాన్నే పునరావృతం చేసింది. అయితే పోలీసుల పర్యవేక్షణలో చివరకు సైకిల్‌యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది?: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. మంత్రి పేరును తొలగించి, పోలీసులే సాక్ష్యులుగా మరో కేసు నమోదుచేసి, దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిఉంది. రాళ్లదాడి అనంతరం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. (చదవండి: ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి; ఆళ్లగడ్డలో ఉద్రిక్తత) -
ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి
-
సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం
సాక్షి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సర్వత్రా భయాందోళనలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు సాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక్కసారే దాడి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి ఫొటో స్టిక్కర్లు అంటించిన వాహనంపై వచ్చిన దుండగులు.. ఏవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా దాళ్లు విసరడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగి ఉంటుందని ఏవీ సుబ్బారెడ్డి అనుమానించారు. ఈ మేరకు ఫిర్యాదులోనూ మంత్రి పేరును ప్రస్తావించారు. -
సోము వీర్రాజు వర్సెస్ అఖిలప్రియ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బుడగల పండుగ పేరిట కోట్లు ఖర్చు పెడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో టూరిజం అభివృద్ధిపై సోము వీర్రాజు, పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ మధ్య చర్చ నడిచింది. రాష్ట్రంలో టూరిజం పాలసీయే లేదని, బుడగల పండుగ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని, కేరళ కంటే పర్యాటకంగా రాష్ట్రం అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి రూ. 250 కోట్లు ఇచ్చినా లంబసింగిలో కనీసం సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. మంత్రి అఖిల ప్రియ స్పందిస్తూ.. ‘కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు ఇచ్చాం. నిధులు తక్కువగా ఉండటంతో అన్ని చోట్ల అభివృద్ధి చేయలేకపోతున్నాం. జిల్లాకు మూడు కోట్లు ఇచ్చి కలెక్టర్లను ఖర్చు పెట్టమన్నాం. గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. రోప్ వే కూడా ఏర్పాటు చేస్తున్నాం’ అని సమాధానమిచ్చారు. -
పర్యాటకం.. నిధుల పందేరం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పర్యాటక శాఖలో నిధుల పందేరం కొనసాగుతోంది. ఫెస్టివల్స్ పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక కొత్త పేరుతో ఫెస్టివల్స్ నిర్వహించడం.. సగటున రూ.2 కోట్ల మేర ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. ఒకటిన్నర ఏడాది కాలంలోనే నాలుగు ఫెస్టివల్స్‌ను పర్యాటకశాఖ నిర్వహించింది. వీటి నిర్వహణలో ఆ శాఖ సిబ్బందికి ఏ మాత్రమూ పాత్ర లేదు. పూర్తిగా ఈవెంట్ మేనేజర్లకే అప్పగిస్తున్నారు. ఒక్కో ఫెస్టివల్స్‌ను ఒక్కో ఈవెంట్ మేనేజింగ్ సంస్థకు పర్యాటక శాఖ అప్పగిస్తోంది. మరోవైపు టెంపుల్ టూరిజం సర్క్యూట్, శిల్పారామం పేరిట వివిధ పథకాలను ప్రకటించిన పర్యాటక శాఖ ఒక్క ప్రాజెక్టును కూడా ఇప్పటివరకు పూర్తి చేసిన పాపాన పోలేదు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ జిల్లాకు చెందినవారు. అయితే..జిల్లాలో దీర్ఘకాలం పనికొచ్చే కార్యక్రమాలు కాకుండా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో అఖిలప్రియ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్ మేనేజర్లదే హవా ఇప్పటివరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మూన్లైట్, కర్నూలులో ధూల్ ఫెస్టివల్స్‌తో పాటు అహోబిలం ఫెస్టివల్‌ను, తాజాగా కర్నూలులో ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్షోను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పర్యాటక శాఖ అధికారుల పాత్ర నామమాత్రమేనని చెప్పవచ్చు. ఒక్కో ఫెస్టివల్‌కు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.8 కోట్ల మేర ఖర్చు చేశారు. ఒక్కో ఫెస్టివల్ నిర్వహణను ఒక్కో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ..కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు మొత్తం పెత్తనమంతా ఈవెంట్ మేనేజర్లకే అప్పగించడం.. పర్యాటకశాఖ అధికారులకు ఏ పాత్ర లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో కనీసం జిల్లాలో వివిధ దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ కానీ, మినీ శిల్పారామాన్ని కానీ ఏర్పాటు చేసివుంటే అటు భక్తులతో పాటు శిల్పకారులకైనా మంచి జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహోబిలం ఫెస్టివల్‌కు కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం రోడ్డును బాగు చేసి ఉంటే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేది. మొత్తం మీద ఫెస్టివల్స్ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడంతో మంత్రి అఖిలప్రియ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విభేదాలు యథాతథం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించడం గమనార్హం. దీన్నిబట్టే ఇక్కడి నేతల మధ్య విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. అందరినీ కలుపుకొని పోవడం లేదని మంత్రి అఖిలప్రియను సీఎం మందలించారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో కూడా ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల బదిలీల వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య వైరం నడుస్తోంది. కర్నూలు సీటు తనదేనంటూ టీజీ భరత్ ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని సీఎం వద్ద ఎస్వీ ప్రస్తావించినట్టు సమాచారం. ఇక మంత్రి అఖిలప్రియ తనపై పనిగట్టుకుని కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సీఎం వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇదే విషయమై కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. సీఎంతో సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రమూ మార్పులేదు. కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో విభేదాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తో కూడిన కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా విభేదాలను పరిష్కరించే పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ నుంచి... వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి నెలా సమావేశమై నేతలతో చర్చించింది. అయితే, ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో తాజాగా త్రిసభ్య కమిటీ తెర మీదకు వచ్చింది. ఈ కమిటీ నేతృత్వంలో కూడా విభేదాలు తగ్గే అవకాశం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య కనీసం మాటలు కూడా లేవు. నంద్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం విషయంలోనూ అటు ఫరూఖ్ వర్గానికి, ఇటు అఖిలప్రియ వర్గానికి మధ్య రాజీ కుదరలేదు. కర్నూలు మార్కెట్ కమిటీదీ అదే పరిస్థితి. ఇక్కడ ఎస్వీ, టీజీ మధ్య రాజీ కుదరకపోవడంతో ఏడాది కాలంగా పాలకవర్గం ఏర్పాటు కావడం లేదు. నందికొట్కూరులో బైరెడ్డి రాకను శివానందరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బైరెడ్డి రాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. అయితే, త్వరలో బైరెడ్డి కూడా టీడీపీలో చేరితే.. ఆ తర్వాత విభేదాలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కోడుమూరులో ఇప్పటికీ విష్ణు–మణిగాంధీ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తమ మధ్య రాజీ ప్రయత్నం వద్దని కూడా ఇరువర్గాలు త్రిసభ్య కమిటీకి తేల్చిచెప్పే పనిలో ఉన్నాయి. మొత్తమ్మీద అధికారపార్టీలో విభేదాలు ఏ మాత్రమూ సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. -
విదేశీ పర్యటనకు మంత్రి అఖిల
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారికంగా ఈ నెల 15 నుంచి 22 వరకు స్పెయిన్ దేశంలోని మ్యాడ్రిడ్‌లో మంత్రి పర్యటించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిని అక్కడ మంత్రి అధ్యయనం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
పందెం కోళ్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సంక్రాంతి పండుగకు ముందే జిల్లాలో ‘పందెంకోళ్లు’ రె‘ఢీ’ అయ్యాయి. వచ్చే ఎన్నికల బరిలో ఉండేది తామేనంటూ ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. తామే గెలుపు కోళ్లమని కూడా ప్రకటించుకుంటున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీలో సీట్ల లొల్లి షురూ అయ్యింది. ప్రధానంగా కర్నూలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బరిలో ఉండేది ‘నేనే అంటే నేనే’ అంటూ పోటీపడుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ప్రకటిస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రతి జన్మభూమి సభలోనూ వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ ప్రకటిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సర్వే ఆధారంగా గెలుపు అభ్యర్థిని తానేనని, అందువల్ల తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ఒక అడుగు ముందుకేసి చెబుతున్నారు. ఓడిపోయే అభ్యర్థికి సీటు ఇవ్వరంటూ పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ సీట్ల పోరు కొత్త సంవత్సరం వేడుక సాక్షిగా మొదలయ్యింది. ఇక్కడ టీడీపీ తరఫున బరిలో నిలిచేది తానేనని భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా బలనిరూపణకు వేదికగా ఆయన నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ వద్దన్నప్పటికీ బలమేమిటో నిరూపించుకోగలగడం ద్వారా తానే పందెం కోడినని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నేనంటే నేనే..! కర్నూలు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓటర్లందరి ఫోన్లకు వాయిస్ మెసేజ్ పంపి సర్వే చేపట్టారు. ఇందులోనే ఎవరు మీ అభ్యర్థి అంటూ మొదటి నెంబరు టీజీ భరత్‌కు, రెండో నెంబరు ఎస్వీ మోహన్ రెడ్డికి కేటాయించడంతో అసలు పోరు మొదలయ్యింది. ఈ సర్వేతోనే సీటు గొడవ మొదలయ్యింది. గెలిచే అభ్యర్థి తానేనని, అందువల్ల సీటు తనకేనని టీజీ భరత్ స్పష్టం చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా ప్రతి జన్మభూమి సభలోనూ తానే కర్నూలు నుంచి పోటీ చేస్తానని, కొందరు కావాలని పత్తికొండ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇక ఆళ్లగడ్డలోనూ తాజాగా పోరు మొదలయ్యింది. నూతన సంవత్సర వేడుకల సాక్షిగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీట్ల గొడవ ప్రారంభమైంది. తనకే అధిక బలం ఉందని నిరూపణ కోసం ఏవీ ప్రయత్నించారు. భూమా బంధువులు కూడా తన వెంటే నడుస్తారని చెప్పుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకునే పనిలో మంత్రి అఖిలప్రియ నిమగ్నమయ్యారు. ఏవీ పార్టీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే పని చేశారు. మంత్రిగా, తన తండ్రి వారసురాలిగా తనకే సీటు అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వే గుబులు! ఇక అధికార పార్టీ నేతల్లో సర్వే గుబులు ప్రారంభమయ్యింది. మొదట్లో కేవలం కర్నూలు నియోజకవర్గంలోనే అభ్యర్థిపై సర్వే జరగగా... తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్లు వస్తుండటం గమనార్హం. పోటీలో ఎవరు నిలబడితే గెలుస్తారో చెప్పాలంటూ ఐవీఆర్ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారనే గుబులు అందరిలోనూ మొదలయ్యింది. సర్వే ఆధారంగా ఇస్తే తమ భవితవ్యం ఏమిటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సంక్రాంతి సాక్షిగా ఎన్నికల పందెం కోళ్ల పోటీ ప్రారంభమయ్యిందన్నమాట! -
‘కారుణ్యం’ చూపరా?
మంగళగిరి(తాడేపల్లిరూరల్): గుంటూరు జిల్లా వెలగ పూడిలోని రాష్ట్ర సచివాలయం ప్రధాన గేటు వద్ద మంగళ వారం అక్కాచెల్లెళ్లు షాకిరా, ఫాతిమా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. సీఎంకు గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు జిల్లా నుంచి రాగా, భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి సిద్ధమయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితులను అంబులెన్స్‌లో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కాచెల్లెళ్లతోపాటు వచ్చిన తల్లి మొహిద్దీన్‌షా.. విషయం తెలిసి విలపిస్తూ కుమార్తెల వద్దకు వెళ్లింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో మహబూబ్ పీరా అనే వ్యక్తి వ్యవసాయ కార్యాలయంలో వీఏవోగా పనిచేస్తూ 20 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తమ మూడో కుమార్తె ఫాతిమాకు తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇవ్వాలని పీరా భార్య మొహిద్దీన్‌షా అధికారులను కోరుతోంది. పెద్ద కుమార్తె బేగం భర్త చనిపోయాడని, రెండో కుమార్తె షాకిరాకు పెళ్లి చేసినా భర్త వదిలేశాడని.. దీంతో వారిద్దరూ తన వద్దే ఉంటున్నారని చెప్పారు. సాయం కోసం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కలిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఆయన కూతురైన మంత్రి అఖిలప్రియను, ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని కలిశామని, ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ, ఇప్పించడం లేదని పేర్కొంది. ముఖ్యమంత్రిని కలవడానికి ఇప్పటికే పదిసార్లు వెలగపూడి సచివాలయానికి వచ్చామని, తమ గోడు ఎవరూ వినిపించు కోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తాజాగా పదకొండోసారి కూడా పోలీసులు అడ్డగించారని అన్నారు. -
నా ఓటు ఆంధ్రాలోనే ఉంది: లోకేశ్
సాక్షి, అమరావతి: తన ఓటు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆధార్ కార్డు లేనివాళ్లు నంది అవార్డుల గురించి హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని తాను వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొందరు తన కుటుంబానికి ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు ఉందో లేదోనని వెతుకుతున్నారని చెప్పారు. మంత్రి భూమా అఖిలప్రియను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే వార్తల్లో నిజం లేదన్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచన గానీ.. కనీసం చర్చ గానీ పార్టీలో లేదన్నారు. అఖిలప్రియ బాగా పని చేస్తున్నారని, విశాఖలో జరిగిన బెలూన్ ఫెస్టివల్, సోషల్ మీడియా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆమె బాగా నిర్వహించారని చెప్పారు. కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదానికి కారణమైన వారిని వదిలేది లేదన్నారు. కాగా, నంది అవార్డుల గురించి లోకేశ్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై స్పందించకుండా లోకేశ్ మీడియాకు మొహం చాటేశారు. శాసనమండలి సమావేశం నుంచి నేరుగా తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయారు. -
‘దేవాన్షుకు ఆంధ్రాలోనే ఆధార్’
సాక్షి, అమరావతి: కేబినెట్ విస్తరణ అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో...‘అఖిలప్రియను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న వార్తలు అవాస్తవం. ఆమె బాగా పని చేస్తున్నారు. కృష్ణానదిలో బోటు ప్రమాదానికి బాధ్యులైనవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. మా కుటుంబానికి ఏపీలో ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయా? లేవా అని కొందరు వెతుకున్నారు. ఆంధ్రాలో ఓటుహక్కు లేకపోతే ఎమ్మెల్సీని ఎలా అవుతా?. మా అబ్బాయి దేవాన్షుకు కూడా ఆంధ్రాలోనే ఆధార్ కార్డు ఉంది.’ అని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని లోకేశ్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తన తండ్రి చాలా బాధపడ్డారంటూ సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. -
చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ
అమరావతి: కర్నూలు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటుచేసిన విషయం తెలిసిందే. అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలోని కౌన్సిలర్లతో ఆయన ఇప్పటికే సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలంటూ సుబ్బారెడ్డి వారిని కోరారు. ఈ విబేధాల నేపథ్యంలో జిల్లా నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. శనివారం ఆయన సమక్షంలోనే ఈ కర్నూలు పంచాయితీని పరిష్కారించనున్నారు. -
కర్నూలు జిల్లా టీడీపీలో ముసలం
కర్నూలు : కర్నూలు జిల్లా టీడీపీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి ... మంత్రి అఖిలప్రియపై తిరుగుబాటుతో టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నంద్యాల కౌన్సిలర్లతో ఆయన శుక్రవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. తనవైపు ఉన్నారా? అఖిలప్రియ వైపు ఉన్నారో తేల్చుకోవాలని సూచించారు. ఏవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమ నాగిరెడ్డి తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం అఖిలప్రియ పాతిక శాతం కూడా ఇవ్వడం లేదన్నారు. నంద్యాలలో భూమా వర్గాన్ని తానే తయారు చేశానని ఆయన అన్నారు. అసలు తనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని ఏవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. కాగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరడంతో ఈ పంచాయితీ కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. దీంతో జిల్లా నేతలు అంతా అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబు తన నివాసంలో కర్నూలు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు, ఏవీ సుబ్బారెడ్డి వ్యవహారంపై కూడా ఆయన ప్రత్యేకంగా సమీక్ష జరపనున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్టు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏవీ సుబ్బారెడ్డితో వివాదం, పార్టీ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం అఖిలప్రియ మాట్లాడుతూ ఏవీ సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తమ ఇంటి మనిషి అని, మామా అని పిలిచే చనువు ఉందన్నారు. తమ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు. తన వైపు ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అఖిలప్రియ అన్నారు. తమ మధ్య ఉన్నది జనరేషన్ గ్యాప్ మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. ఎవరినీ దూరం చేసుకునే పరిస్థితిలో తాను లేనని, సుబ్బారెడ్డి తమ కుటుంబ మనిషి అని అన్నారు. -
అఖిలమ్మ.. ఇదేంటమ్మా!
– నేరుగా ఫోన్ చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు – అందరితో సఖ్యతగా ఉండాలని హితవు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రికి కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బుధవారం ఫోన్ చేసినట్టు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది. అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా పార్టీ మారడంతో నంద్యాల నియోజకవర్గంలో మెజార్టీగా టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. పదే పదే కలిసి వెళ్లాలని.. స్వయంగా సీఎం స్థాయిలో చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మంత్రిగా ఉండి గొడవలు పెంచడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. నంద్యాల సీటు విషయంలో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పీఏ వ్యవహారశైలిపై ఆరా నంద్యాల రాజకీయాలతో పాటు మంత్రి పీఏ వ్యవహరశైలిపైనా అధికార పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నీరు–చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో పీఏ భారీగా అమ్యామ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు నేరుగా సీఎంకు వెళ్లినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఎందుకు కలుపుకుని వెళ్లడం లేదన్న అంశంపైనా మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
'నంద్యాల అభ్యర్థిని చంద్రబాబే నిర్ణయిస్తారు'
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా నంద్యాల అసెంబ్లీ సీటు తమదంటే తమదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. నంద్యాల టిక్కెట్ విషయంపై మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వేగంగా పావులు కదిపారు. శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని ఆమె తెలిపారు. మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు శిల్పామోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో రెండు, మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది. -
రసవత్తరంగా నంద్యాల రాజకీయం
-
’నేను చాలా గొప్పగా ఫీల్ అవ్వట్లేదు’
-
ఇదేం దిగజారుడు రాజకీయం ?
-
చంద్రబాబు రాజకీయాలకు పావుగా అఖిల ప్రియ
-
భూమా నాగిరెడ్డికి శాసనసభ నివాళి
⇒ సభలో సంతాప తీర్మానం ⇒ తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తా: అఖిల ప్రియ సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శాసనసభ మంగళవారం నివాళులు అర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. నాగిరెడ్డి మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించిన అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమవుతూనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ భూమా జీవిత విశేషాలను వివరించారు. చనిపోవడానికి 24 గంటల ముందు భూమా తనను విజయవాడలో కలిశారని, నియోజకవర్గ సమస్యలపై చర్చించారని, ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. నాగిరెడ్డి గుండె ధైర్యం, అంకిత భావం కలిగిన నాయకుడని కొనియాడారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే తల్లి, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆమె చెల్లెలు, తమ్ముడికి అండగా ఉంటామని, కన్నతండ్రిలాగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటిని తరలించే పైప్‌లైన్ ప్రాజెక్టుకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టడానికి అభ్యంతరమేమీ లేదని తెలిపారు. వ్యక్తులు వేరు, రాజకీయాలు వేరంటూ శివారెడ్డి, పరిటాల రవి హత్యోదంతాలను చంద్రబాబు ప్రస్తావిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తాము సహకరించామని అన్నారు. డాక్టర్లు వారించినా విజయవాడ వచ్చారు తన తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తానని, వారి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భూమా దంపతుల కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పారు. తన తండ్రి నాగిరెడ్డి ఆసుపత్రిలో బెడ్‌పై ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు. ప్రయాణం చేయవద్దని డాక్టర్లు వారించినా విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబును కలసి వెళ్లారన్నారు. తనకు మార్గదర్శకుడు తన తండ్రేనని, తన తల్లి చనిపోయిన పడక మీదనే తండ్రి కూడా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బడుగువర్గాల కాలనీకి, రహదారి విస్తరణకు, నంద్యాల పైప్‌లైన్‌కు ఆయన పేరు పెట్టాలని కోరారు. బాధను కసిగా మార్చుకుని పని చేస్తానన్నారు. భూమా కుటుంబంతో తనకు 25 ఏళ్లుగా పరిచయం ఉందని స్పీకర్ కోడెల చెప్పారు. -
‘దమ్ముంటే రా.. పోటీ చేసి గెలువు’
గుంటూరు: ఎమ్మెల్యే అఖిలప్రియపై జరగని దాడిని జరిగినట్లుగా టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఎంతో ముఖ్యమైన రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడిగాని, గొడవగాని అసలు జరగలేదని స్పష్టం చేశారు. అసలు దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి నైజం కూడా తమది కాదని అంబటి చెప్పారు. ఎనిమిదిమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని అధికారులపై దాడి చేస్తే సీఎం వత్తాసు పలికారని, ఎమ్మెల్సీ సతీశ్ టూరిజం సిబ్బందిపై దాడి చేసినా కేసు పెట్టేందుకు వెనుకాడారని, అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కాంట్రాక్టర్లను బెదిరించినా కేసు పెట్టలేదని అలాంటిది తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూమా నాగిరెడ్డికి దమ్ముంటే ఆయన, అఖిలప్రియ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. నంద్యాలకు రమ్మని సవాల్ విసిరారని కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు వస్తారని స్పష్టం చేశారు. 2015 డిసెంబర్లో పంటకు నిప్పు పెట్టిన ఘటనలో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని నిలదీశారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఈ ఘటన చిత్రించిన విలేకరిని అసభ్య పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. అలాంటివారిపై కేసులు పెట్టకుండా ప్రజల తరుపున నిలబడ్డ విపక్ష నేతలను, కార్యకర్తలను వేధించడం దారుణం అని అంబటి అన్నారు. -
‘దమ్ముంటే రా.. పోటి చేసి గెలువు’
-
పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ
కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన భూమా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అనుమతితో తండ్రి భూమానాగిరెడ్డిని అఖిల ప్రియ కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్‌కుగానీ, హైదరాబాద్‌లోని నిమ్స్ లేక కిమ్స్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల బృందం వెల్లడించింది. అయితే దీనిపై నేడు(సోమవారం) నిర్ణయం తీసుకోనున్నారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. -
గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి
కర్నూలు (బేతంచర్ల): మురికి గుంతలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా బేతంచర్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమలాబాయి, గోపాల్ బాయిలు దంపతులు. వీరికి 11 నెలల కూతురు అఖిల ప్రియ ఉంది. అయితే వీరు మార్బుల్ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వీరి కూతురు అఖిల ప్రియ కూడా వీరితో పాటు వచ్చింది. వీరు పరిశ్రమలో పనిచేస్తుండగా చిన్నారి ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందింది. -
రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?
-
ప్రజాపోరాటాలకు వెనుకాడేది లేదు: భూమా
-
అఖిలకు మంత్రి పదవి ఆశ చూపారు!
-
'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు. తాను తిరస్కరించడంతో.. ఆ కక్షతో తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు...పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు. -
సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
-
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఏకగ్రీవం
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అఖిలప్రియ పోటీ చేశారు. ఎంఎల్ఏ మరణానంతరం ఆ స్థానంలో నిర్వహించే ఉప ఎన్నికలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపరాదనే సంప్రదాయానికి కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ కట్టుబడ్డాయి. అఖిలప్రియతో పాటు ఆరుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పలు కారణాలతో తిరస్కరించారు. శుక్రవారం ఉపసంహరణకు అవకాశం కల్పించడంతో మిగిలిన ఇద్దరు స్వతంత్రులూ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తహశీల్దార్ కార్యాలయంలో నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డితో కలసి అఖిలప్రియ డిక్లరేషన్ ఫాం అందుకున్నారు. ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, భూమా నాగిరెడ్డి.. తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, ప్రజలకు అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. -
అఖిలప్రియ ఎన్నిక ఇక లాంఛనమే!
-
ఆళ్ళగడ్డ ఉపఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా..
-
'ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నిస్తాం'
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున దివంగత శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ పోటీ చేయనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడుతూ... ఆ ఉప ఎన్నికల్లో మిగిలిన రాజకీయ పార్టీలు పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని అనుసరించాలని సదరు పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఈ నెల 15న టీడీపీ నేతలను కలుస్తామన్నారు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. ఆయా పార్టీలు తమ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నాయని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో తాము ఇదే సంప్రదాయం పాటించామని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
గుండె ల నిండా శోభమ్మ జ్ఞాపకాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుండె గది నిండా అమ్మ జ్ఞాపకాలు.. కళ్లలో కదలాడుతున్న అమ్మ స్వరూపం..జనంతోఅమ్మచేసిన కరచాలనం..పలుకరింపులు. అదే ప్రేమను.. ఆప్యాయతను.. ఆత్మీయతను గుండెల్లో నింపుకుని అమ్మ గెలుపు బాధ్యతను భుజాన మోస్తూ ఊరూ.. వాడా సాగిపోతున్నారు వారు. తల్లి జ్ఞాపకాలు తరుముకొస్తున్నా... బాధ్యతను పిడికిల్లోదాచుకుని ముందుకు సాగుతున్న ఆపిల్లల రాజకీయ స్థైర్యాన్ని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చ్యర్యం వేయకమానదు. ఆళ్లగడ్డలో అమ్మకోసం.. నంద్యాలలో నాన్నకోసం.. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా జనంతో కలసి సాగుతున్నారు. ఆమ్మా.. నాన్నలను గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అభివృద్ధి మీ ముంగిట చేరుతుందంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. మరోవైపు సతీమణి వీడిపోయిన దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని.. ఆ లావాగ్నిని భరిస్తూ.. తన ముందున్న బాధ్యతను నెరవేరుస్తూ.. ధీమాతో ముందుకు కదులుతున్నారు భూమా. పత్తికొండలో అక్క నాగరత్నమ్మ ప్రచారం.... చెల్లెలు శోభమ్మను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి విజయం కోసం ఊరూ.. వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. చెల్లెలు ఇక పత్తికొండకు రాదని.. ఆ చిరునవ్వు లేదని తెలిసి బాధను గుండెల్లో దాచుకుని కోట్ల చక్రపాణిరెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా సోదరిని పోగొట్టుకున్న బాధను గుండెల్లో దాచుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు కూడా ఆమె లేరనే బాధను మదిలో దాచుకుని విజయమే లక్ష్యంగా సాగుతున్నారు. నంద్యాలలో మౌనిక ఆళ్లగడ్డలో ఆ ఇద్దరు అమ్మ కోసం ప్రచారం చేస్తుంటే.. నంద్యాలలో భూమా నాగిరెడ్డి, తన రెండో కుమార్తె మౌనిక ప్రచారం చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభారాణి, జీవితాంతం కలిసుంటుందని బాస చేసిన ఆమె ఇక లేరని తెలిసి భర్త భూమా నాగిరెడ్డి హృదయం గాయమైంది. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగి.. మదిలో బాధను బయటకు చెప్పుకోలేక.. సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ప్రచారంలో సాగుతున్నారు. ‘జగనన్న సీఎం కావాలంటే నాన్నను గెలిపించండి..ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి’ అంటూ మౌనిక ప్రచారం చేస్తున్నారు. అమ్మను పోగొట్టుకున్న దుఃఖం, నాన్నను ఈ స్థితిలో చూస్తున్న బాధను లోలోపల దిగమింగుతూ ఆ ముగ్గురు ఎన్నికల్లో ప్రచారం చేస్తుండటాన్ని చూసి జనం కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఈ స్థితిలో మీరెందుకు వచ్చారమ్మా. పార్టీని గెలిపించటం మా బాధ్యత కాదా’ అంటూ వారికి భరోసానిచ్చి పంపుతున్నారు. ఆళ్లగడ్డలో అమ్మ కోసం ఆ ఇద్దరు... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో దుఃఖాన్ని దిగమింగి ఆళ్లగడ్డలో అమ్మ విజయం కోసం భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘అమ్మను గెలిపించండి.. జగనన్నను సీఎంను చేయండి. మీరు ఓటే వేసే అమ్మకు నివాళి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారంలో సాగుతున్నారు. అమ్మ కోసం ఆ పసి హృదయాలు పడే తపన నియోజకవర్గ ప్రజలను కలచివేస్తోంది. శోభమ్మను అఖిల ప్రియలో చూసుకుంటూ.. ‘అచ్చం మా శోభమ్మలా ఉన్నావమ్మా’ అంటూ కన్నీరు పెడుతున్నారు. ‘చల్లగుండాలమ్మా’ అంటూ అందరూ వారిని దీవించి పంపుతున్నారు.