
సాక్షి, అమరావతి: కేబినెట్ విస్తరణ అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో...‘అఖిలప్రియను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న వార్తలు అవాస్తవం. ఆమె బాగా పని చేస్తున్నారు. కృష్ణానదిలో బోటు ప్రమాదానికి బాధ్యులైనవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. మా కుటుంబానికి ఏపీలో ఆధార్, ఓటరు కార్డులు ఉన్నాయా? లేవా అని కొందరు వెతుకున్నారు. ఆంధ్రాలో ఓటుహక్కు లేకపోతే ఎమ్మెల్సీని ఎలా అవుతా?. మా అబ్బాయి దేవాన్షుకు కూడా ఆంధ్రాలోనే ఆధార్ కార్డు ఉంది.’ అని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని లోకేశ్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తన తండ్రి చాలా బాధపడ్డారంటూ సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment