‘అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’ | Kurnool MLA Hafiz Khan Slams TDP Leader Akhila Priya | Sakshi
Sakshi News home page

‘అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదు’

Published Wed, Apr 22 2020 2:21 PM | Last Updated on Wed, Apr 22 2020 2:53 PM

Kurnool MLA Hafiz Khan Slams TDP Leader Akhila Priya - Sakshi

కర్నూలు కష్టాలు తెలియని అఖిల ప్రియ మానవత్వం చూపాలి తప్ప రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, కర్నూలు: చంద్రబాబు మెప్పు కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. జిల్లా సమస్యలు తెలియని అఖిల ప్రియకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్‌ అపోహల్ని ముస్లింలపై రుద్దడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కర్నూలు కష్టాలు తెలియని అఖిల ప్రియ మానవత్వం చూపాలి తప్ప రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ముస్లింలను అవమానిస్తున్నారని, ముస్లిం ఓట్లను ఉపయోగించుకొని వారిపై బురద జల్లుతున్నారని వాపోయారు. మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకోకుండా హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం సాగిస్తున్నారని, రాష్ట్రం ప్రజానీకం కరోనాతో బాధలు పడుతుంటే చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా పని కట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement