నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్‌ | Mla Shilpa Ravichandra Kishore Reddy Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌పై ఎమ్మెల్యే శిల్పా రవి ఫైర్‌

Published Sun, Apr 23 2023 9:41 AM | Last Updated on Sun, Apr 23 2023 12:03 PM

Mla Shilpa Ravichandra Kishore Reddy Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, కర్నూలు: లోకేశ్ తీరుపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో లోకేష్‌ పాదయాత్ర గొడవలు సృష్టించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని వద్దన్న వ్యక్తి యాత్ర చేయడం బాధాకరమన్నారు. దళితులు, మహిళా ఎమ్మెల్యేను కించపరచడం సరికాదని, ఘర్షణలు జరగాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి దుయ్యబట్టారు.
చదవండి: అసలుకే ఎసరు పెట్టిన లోకేష్‌ యాత్ర.. టీడీపీలో కొత్త ట్విస్టులు!

నారా లోకేశ్‌ నిజాలు తెలుసుకుని..
ఆదోని అర్బన్‌: 
ఎవరో అవగాహనలేని వారు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మాని, నారా లోకేశ్‌ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు జయమనోజ్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కడితోట యువగళం సభలో నారా లోకేష్‌ తనపై, తన భార్య, కుమారుడిపై కబ్జాలు, దోపిడీలు అంటూ ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా అంటూ లోకేశ్‌కు సవాల్‌ విసిరారు. తాము పుట్టుకతోనే భూస్వాములమని కబ్జాలు చేసే చరిత్ర తమకు లేదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement