ఇదేందయ్యా లోకేశం.. ‘యువగళం’కు కర్ణాటక కిక్కు! | Transport Of Karnataka Liquor For TDP Nara Lokesh Padayatra | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా లోకేశం.. ‘యువగళం’కు కర్ణాటక కిక్కు!

Published Mon, Apr 17 2023 7:42 AM | Last Updated on Mon, Apr 17 2023 2:40 PM

Transport Of Karnataka Liquor For TDP Nara Lokesh Padayatra - Sakshi

మడకశిర: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు తరలిస్తున్నట్లు భావిస్తున్న కర్ణాటక మద్యం బాక్సులను ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (సెబ్‌) పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. 

అయితే, ఈ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మద్యం పంపిణీ చేసైనా సరే పాదయాత్రకు జనసమీకరణ చేయాలని స్థానిక టీడీపీ నాయకులు భావించారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని తుమకూరు నుంచి కర్నూలు జిల్లాకు ఓ కారులో మద్యం తరలిస్తుండగా మడకశిరలోని ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద సెబ్‌ పోలీసులు పట్టుకున్నారు.

35 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 35 బాక్సుల్లో 3,360 మద్యం ప్యాకెట్లు ఉన్నాయని సెబ్‌ సీఐ భార్గవ్‌రెడ్డి తెలిపారు. ఈ మద్యం విలువ రూ.1.68 లక్షలు ఉంటుందని చెప్పారు. కారును సీజ్‌ చేసి.. మద్యం తరలిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన సాయి ప్రకాశ్‌రెడ్డి, శేఖర్‌ను అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement