
విద్యార్థినిలతో సెల్ఫీ తీసుకుంటున్న లోకేశ్
తాళ్లరేవు: టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తోన్న యువగళం పాదయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నీరసంగా సాగుతోంది. లోకేశ్ బస చేసిన తాళ్లరేవు మండలం సుంకరపాలెం శిబిరం నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. లచ్చిపాలెం, బాపనపల్లి, పి.మల్లవరం, తాళ్లరేవు, కోరంగి, పటవల, జి.వేమవరం మీదుగా చొల్లంగి చేరుకుంది.
షెడ్యూల్ ప్రకారం లచ్చిపాలెం, బాపనపల్లి గ్రామాల మధ్య టీడీపీ నేతలు పలు సంఘాలు, రైతులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే జనం లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన ఎంతకీ రాకపోవడంతో చేసేదిలేక స్థానిక టీడీపీ నేతలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పంపాలని యాజమాన్యాలను అభ్యర్థించారు.
దీంతో మండల పరిధిలోని పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు రహదారి వద్ద లోకేశ్‌కు స్వాగతం పలికారు. కోరంగిలో లోకేశ్ మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పారు. లిక్కర్ వేలంపాటలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, పాదయాత్రలో ఎక్కడా జనసేన కార్యకర్తలు, జెండాలు కనిపించకపోవడం గమనార్హం.
చదవండి: ఇక కాళ్ల బేరమే!
Comments
Please login to add a commentAdd a comment