కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు విజయ డెయిరీలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కర్నూలు మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. హెరిటేజ్ డెయిరీ వల్ల కో–ఆపరేటివ్‌లోని ఎన్ని డెయిరీలు మూతపడిపోయాయి.. ఎంత మంది ఉద్యోగులు, కా ర్మికులు రోడ్డున పడ్డారో తెలుసుకోవాలని నారా లోకేశ్‌కు సూచించారు. ఎవరో రాసిచ్చి న స్క్రిప్ట్ చదవడం కాదని, నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాటా్లడారు. రెండేళ్లలోనే విజయ డెయిరీని రూ.33 కోట్ల నికర లాభాల్లోకి తెచ్చామన్నారు.
రూ.20 కోట్లతో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి నట్టు తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు రూ.7.50 కోట్లు, కా ర్మికులకు రూ.1.50 కోట్ల బోనస్ పంపిణీ చేశామని వివరించారు. రూ.180 కోట్లు ఉన్న టర్నోవర్‌ను 2022–23 నాటికి రూ.240 కోట్లకు పెంచామని, 2023–24 సంవత్సరం పూర్తయ్యే నాటికి టర్నోవర్‌ను రూ.270 కోట్లకు తీసుకెళతామన్నారు.పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.3 ప్రకారం బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని, ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను 550 నుంచి 750కి పెంచినట్టు తెలిపారు.
చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ కారణంగా రాజమండ్రి, చిత్తూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, అనంతపురంలోని కో–ఆపరేటివ్ డెయిరీలు మూతపడ్డాయని, ఈ విషయాన్ని లోకేశ్ తెలుసుకోవాలని సూచించారు. భూమా కుటుంబం ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ ఏర్పాటు చేసిన సమయంలో విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తామనే ఒప్పందంతో రూ.1.50 కోట్లు తీసుకుని, పాలు సరఫరా చేయలేదని, ఆ డబ్బులు ఇప్పిస్తే సంతోషిస్తామని ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment