Vijaya Dairy
-
ఆవు పాల ధర తగ్గింపు.. గేదె పాల ధర పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ రైతుల నుంచి సేకరిస్తున్న ఆవు పాల ధరను తగ్గించాలని యోచిస్తోంది. అదే సమయంలో గేదె పాల ధరను లీటర్‌కు రూ.4 వరకు పెంచడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గేదె పాల ధరను రూ.3 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలులోకి రాలేదు. అప్పుల భారం పైపైకి విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దాదాపు రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రతినెలా రూ.13కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. రైతులకు నెలనెలా చెల్లించాల్సిన పాల బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ వెళ్లినట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం మూడునాలుగు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆవుపాల సేకరణ ధర అధికంగా ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రైవేటు కంటే రూ.10 అదనం విజయ డెయిరీ ప్రతీరోజు 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అందులో 85 శాతం మేరకు ఆవు పాలే ఉంటున్నాయి. ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్‌కు రూ.32 నుంచి రూ.33 చెల్లించి సేకరిస్తుండగా.. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తోంది. గేదె పాలు లీటర్‌కు రూ.48 చెల్లిస్తోంది. ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వాపోయారు. మరోవైపు సంస్థలో టన్నుల కొద్దీ పాలపొడి నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం. మార్కెటింగ్‌లో బలహీనంరాష్ట్రంలో గేదె పాలకంటే ఆవు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. ఆవు పాలకు ప్రైవేట్ సంస్థలకంటే విజయ డెయిరీ అధిక ధర ఇస్తుండటంతో రైతులు ఆవు పాలు ఈ సంస్థకు పోస్తూ.. గేదె పాలను స్థానికంగా అధిక ధరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు డీలర్లకు లీటర్‌పై దాదాపు రూ.10 వరకు మార్జిన్ ఇస్తుండగా, విజయ డెయిరీ రూ.5–6 మాత్రమే ఇస్తోంది. దీంతో డీలర్లు ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులు అమ్మేందుకు ముందుకు రావటంలేదని సమాచారం. తన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలోనూ సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు కూడా ఉంది. దీంతో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోవడంలో విజయ డెయిరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంగన్వాడీలకు ప్రస్తుతం లక్ష లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు, అలాగే గురుకులాలకు కూడా పాలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దేవాలయాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది. -
‘విజయ’ పాల ధరల సవరణ!
సాక్షి, హైదరాబాద్: పాడిరైతును ప్రోత్సహించేందుకు విజయ డెయిరీ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ధరలను సవరించాలని నిర్ణయించింది. ఒక్కో లీటరు పాలపై రూ.3 వరకు పెంచాలని భావిస్తోంది. ఇప్పటికే మూడుసార్లు పాల ధరలను సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో లీటరు ఆవుపాల ధర ఇతర ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీ దాదాపు రూ.8 నుంచి రూ.9 ఎక్కువగా చెల్లిస్తోంది. రైతులను మరింత ప్రోత్సహించే దిశగా ఆవు పాలు లీటరుపై గరిష్టంగా రూ.3 వరకు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.42.24, గేదె పాలధర కూడా రూ.51.00 ఉండేలా అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం ఈ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు చేరినట్టు సమాచారం. రోజుకు 2.8 లక్షల లీటర్లు... పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ డెయిరీలు, కోఆపరేటివ్ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్‌కు రూ. 27 నుంచి రూ.32 చొప్పున ఆవుపాలను సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి మన రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ డెయిరీ అమ్మకాలపై పడుతోంది. వీటితోపాటు విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఈ సిబ్లింగ్ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజుకు విజయ బ్రాండ్ పాలు 2.8లక్షల లీటర్లు అమ్ముడు పోతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచే దిశగా కసరత్తు చేస్తున్న విజయ డెయిరీ.. పాడి రైతులందరికీ పాల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయడంతో పాటు ప్రోత్సహించే దిశగా ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా విజయ డెయిరీ యంత్రాంగం సమావేశమై మూడు ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల పాత బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా 5 నుంచి 20వ తేదీ మధ్య పాల బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
విజయ డెయిరీ డైరెక్టర్ల నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం సరికాదు
-
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు షాక్
-
భూమా కుటుంబానికి ‘విజయ’ షాక్
నంద్యాల (అర్బన్): మ్యాక్స్ చట్టం, విజయ డెయిరీ బైలా ప్రకారం విజయ పాల డెయిరీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా నష్టం కలిగించిన జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని విజయ డెయిరీ డీఫాల్టర్‌గా ప్రకటించింది. ఆదివారం విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్గా భూమా విఖ్యాత్ ఉంటూ విజయడెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకొని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలేదన్నారు. 2014–2020 వరకు జగత్ పాల డెయిరీని విజయ డెయిరీకి సమానంగా నడిపారని.. ఆ సమయంలో 30% వ్యాపారం విజయ డెయిరీకి నష్టం వచ్చిందన్నారు.జగత్ డెయిరీ మూతపడిన అనంతరం మళ్లీ విజయ డెయిరీ లాభాల్లోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లుగా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో నోటీసులిచ్చినా విఖ్యాత్ స్పందించలేదని, ప్రైవేట్ డెయిరీలో పనిచేస్తున్న వారికి విజయ డెయిరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. జగత్ విఖ్యాత్ విజయపాల డెయిరీకి సమాంతర వ్యాపారం నిర్వహిస్తూ విజయ డెయిరీ నష్టాలకు బాధ్యులయ్యారని తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశామన్నారు. -
భూమా అఖిల ప్రియపై ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం
-
రుణ వాయిదాలకే నెలకు రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి నిర్వహణ కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో రూ. 246 కోట్ల వ్యయంతో రావిర్యాలలో నిర్మించిన మెగా యూనిట్ ఈ కష్టాలకు కారణం కానుంది. త్వరలో మీద పడనున్న ఆర్థిక భారం డెయిరీకి పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. ఈ మెగా యూనిట్ నిర్వహణను పకడ్బందీగా గాడిలోకి తెచి్చన తర్వాతే పూర్తిస్థాయిలో డెయిరీకి అప్పగించాల్సిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కూడా తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా యూనిట్‌ను ఏం చేయాలి? ఎలా నడపాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తరుముకొస్తున్న కష్టాలు..సరైన అంచనాలు, సౌకర్యాల కల్పన, ప్రణాళికలు లేకుండా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగా యూనిట్ చిక్కుల్లో పడింది. నీటి సౌకర్యం లేని ప్రాంతంలో ఈ డెయిరీని ఏర్పాటు చేయడంతో కేవలం ప్లాంటును నడిపించేందుకు నీటి కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఇక, ఈ యూనిట్ కరెంటు బిల్లులు నెలకు రూ. కోటి దాటుతున్నాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి నెలకు రూ.2 కోట్ల వరకు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంది. ఇవేకాక, ప్లాంటు నిర్వహణ, సిబ్బంది జీత భత్యాలు అదనం కావడంతో ప్రారంభించిన తొమ్మిది నెలలకే మెగా యూనిట్ నిర్వహణ విషయంలో చేతులెత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని డెయిరీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి, లాలాపేటలోని యూనిట్ ద్వారా విజయ డెయిరీ రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి పంపుతోంది. ఈ యూనిట్‌ను నడుపుతూనే రావిర్యాలలో రోజుకు 5–8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు చేసే అంచనాలతో, ఆ మేరకు అత్యాధునిక యంత్రాంగంతో మెగా యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు కేవలం 3 లక్షల లీటర్ల ఉత్పత్తులను మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ఈ మేరకు ఉత్పత్తి చేసేందుకు డెయిరీకి ఆర్థికంగా భారమవుతోంది. రోజుకు 3 లక్షల లీటర్ల ఉత్పత్తికి, 8 లక్షల వరకు లీటర్ల ఉత్పత్తికి అయ్యే నిర్వహణ ఖర్చులో పెద్దగా తేడా ఉండదని, ఈ నేపథ్యంలో 8 లక్షల లీటర్ల వరకు ఉత్పత్తి జరిగితేనే యూనిట్ మనుగడ సాధ్యమవుతుందని డెయిరీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేని పరిస్థితుల్లో మెగా యూనిట్ నిర్వహణ భారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళనను వారు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
తదుపరి విచారణ వరకు విజయ్‌పాల్‌పై కఠిన చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్‌పై తదుపరి విచారణ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు నగరపాలెం పోలీసులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ప్రతివాదులుగా ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారు రఘురామకృష్ణరాజుకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 2021లో సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆధారంగా నగరపాలెం పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో నిందితునిగా ఉన్న విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, సిద్దార్థ్ దవే, న్యాయవాదులు వరుణ్ బైరెడ్డి, చోడిశెట్టి శరణ్ వాదనలు వినిపించారు. 2021లో జరిగిన ఘటనపై మూడేళ్ల తరువాత 2024లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారన్నారు. ఇంత అసాధారణ జాప్యం ఎందుకు జరిగిందో ఫిర్యాదుదారు చెప్పలేదని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. -
విజయా డెయిరీ పునఃప్రారంభానికి సీఎం జగన్ శ్రీకారం
ఆసియాలోనే గుర్తింపు పొంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాకే మణిహారంగా నిలిచిన విజయా డెయిరీ ఎంతోమంది పాడిరైతులకు ఆపద్బాంధవిగా ఉండేది. అయితే ఈ డెయిరీని రెండు దశాబ్దాల కిందట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిర్వీర్యం చేశారు. తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ కోసం విజయా డెయిరీని ఉన్నఫళంగా మూసివేశారు. దీంతో పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో వీధిన పడ్డారు. గతంలో వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనకు విచ్చేసినప్పుడు ఇదే విషయాన్ని పాడిరైతులు వివరించారు. అధికారంలోకి వస్తే డెయిరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ మేరకు విజయా డెయిరీకి జగనన్న ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. చిత్తూరు అగ్రికల్చర్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిన విజయా డెయిరీకి ప్రస్తుత రాష్ట్రప్రభుత్వం ఊపిరి పోసింది. డెయిరీ పునఃప్రారంభానికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఎంతోమంది పాడి రైతులకు బాసటగా నిలవనుంది. నగర పరిధిలో 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లోనే రోజుకు 3 వేల లీటర్ల పాలను సేకరించి, చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. అటు తరువాత 1977–78 నుంచి తిరుమల స్వామివారి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్ల నిర్వాహకులు కూడా ఈ పాలనే కొనుగోలు చేసేవారు. 1980 నుంచి ఏడాదికి రోజుకు 50 వేల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం పెరగడంతో డెయిరీ ఆవరణలో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో డెయిరీకి మరింత ప్రోత్సాహం లభించడంతో తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాలకోవా, రోస్ మిల్క్ విక్రయ కేంద్రాలను చిత్తూరు, తిరుపతి, తిరుమల నగరాల్లో ఏర్పాటు చేశారు. అంతేగాకుండా డెయిరీ నుంచి పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించే వారు. డెయిరీ సామర్థ్యం మరింతగా పెరగడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది పాడి రైతులు కుటుంబాలు రోజుకు దాదాపు 3.50 లక్షల లీటర్ల పాలను సరఫరా చేసి జీవనం సాగించే వారు. దీంతో వి.కోట, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరులో శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నిత్యం పాలను సేకరించే వారు. డెయిరీకి రైతులను మరింత చేరువ చేస్తూ గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం సహకారం అందించడంతో పాల ఉత్పత్తిదారుల వాటా కూడా ఉంది. 1988లో విజయా డెయిరీలో కార్మిక యూనియన్ను కూడా ఏర్పాటు చేశారు. పునరుజ్జీవం ఇలా... 2018లో చిత్తూరు పర్యటనకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి దృష్టికి రైతులు, కార్మికులు డెయిరీ పరిస్థితిని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన అధికారంలోకి రాగానే డెయిరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం డెయిరీ పునఃప్రారంభానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే డెయిరీకి ఉన్న అప్పులు రూ.182 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాడి రైతులను ఆదుకోవాలన్న తలంపుతో పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. రూ.385 కోట్లతో డెయిరీ అభివృద్ధికి ముందుకు వచ్చిన అమూల్ సంస్థతో ప్రభుత్వం 99 ఏళ్ల పాటు లీజు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో గత ఏడాది జూలైలో డెయిరీని పునఃప్రారంభించే పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి డెయిరీ పనులను అమూల్ సంస్థ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రూ.35 కోట్లు వెచ్చించి డెయిరీ ఆవరణలో 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్ భవన నిర్మాణ పనులు చేపడుతోంది. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసి డెయిరీని పునఃప్రారంభించే పనులు శరవేగంగా చేపడుతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాడి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. డెయిరీ నిర్వీర్యం ఇలా.... జిల్లాకే తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని చంద్రబాబునాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరిగేది. డెయిరీలో దాదాపు 800 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసేవారు. డెయిరీ నుంచి ఢిల్లీ, పుణే, ముంబై తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల పాలను రేణిగుంట రైల్వే జంక్షన్ నుంచి రైలు ద్వారా రెండు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేసి తరలించేవారు. ఇది గమనించిన చంద్రబాబుకు తన మనసులో ఎక్కడో దుర్బుద్ధి పుట్టింది. వెంటనే తాను సొంతంగా హెరిటేజ్ డెయిరీని ఏర్పాటు చేసుకున్నారు. విజయా డెయిరీలో అప్పట్లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి సహకారంతో విజయా డెయిరీకి వచ్చే పాలను హెరిటేజ్‌కు మళ్లించే పనులు చేపట్టారు. మరోవైపు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యిని విక్రయించకుండా నిల్వ ఉంచారు. అమ్ముడుపోలేదంటూ నిల్వ ఉన్న పాల పౌడర్, నెయ్యిని టెండర్ ద్వారా విక్రయించి డెయిరీని నష్టాల పాలు చేశారు. డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజుల పాటు మిల్క్ హాలిడేను ప్రకటిస్తూ, హెరిటేజ్‌కు పాలను మళ్లించుకున్నారు. తనకు అనుకూలంగా ఉన్న దొరబాబును డెయిరీ కార్మిక సంఘం నాయకుడిగా నియమించుకున్నారు. ఆఖరికి నష్టాలు చూపి 2002లో ఆగస్టు 31న డెయిరీని పూర్తిగా మూసి వేయించారు. దీంతో డెయిరీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పాడి రైతుల కుటుంబాలు, కార్మికుల బతుకులు వీధిన పడ్డాయి. పాడి రైతులను ఆదుకున్నారు విజయా డెయిరీని తిరిగి తెరిపించి, పాడి రైతులను ఆదుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు పాడిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో ఇందుకు విజయా డెయిరీ వీరికి అండగా ఉండేది. చంద్రబాబు స్వార్థం కోసం డెయిరీని మూసివేసి మాలాంటి పాడి రైతులను నట్టేట ముంచారు. – హేమచంద్ర, పాడి రైతు, బైరెడ్డిపల్లె మండలం చాలా సంతోషంగా ఉంది చిత్తూరు విజయా డెయిరీని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను రెండు ఆవులను మేపుకుంటూ రోజు 10 లీటర్ల మేరకు మహిళా సంఘాల డెయిరీకి పాలు పోస్తున్నా. పాడి ఆవులే మాకు జీవనాధారం. చిత్తూరు డెయిరీ తిరిగి తెరిపిస్తే పాలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని అనుకుంటున్నాం. – లక్ష్మి, పాడి రైతు, పాలసముద్రం మండలం ఆశలు చిగురించాయి విజయా డెయిరీ పునఃప్రారంభం కానుండడంతో ఆశ లు చిగురిస్తున్నాయి. అమూ ల్ సంస్థ ఆధ్వర్యంలో డెయిరీ ని నిర్వహించడం వల్ల పాలకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని పలుచోట్ల్ల గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ప్రైవేటు డెయిరీల దోపిడీకి కొంతమేర చెక్ పడింది. – నిర్మల, మహిళా పాడి రైతు, పెనుమూరు -
విజయ డెయిరీపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే!
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు విజయ డెయిరీలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని కర్నూలు మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. హెరిటేజ్ డెయిరీ వల్ల కో–ఆపరేటివ్‌లోని ఎన్ని డెయిరీలు మూతపడిపోయాయి.. ఎంత మంది ఉద్యోగులు, కా ర్మికులు రోడ్డున పడ్డారో తెలుసుకోవాలని నారా లోకేశ్‌కు సూచించారు. ఎవరో రాసిచ్చి న స్క్రిప్ట్ చదవడం కాదని, నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. గురువారం కర్నూలులో ఆయన మీడియాతో మాటా్లడారు. రెండేళ్లలోనే విజయ డెయిరీని రూ.33 కోట్ల నికర లాభాల్లోకి తెచ్చామన్నారు. రూ.20 కోట్లతో అధునాతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి నట్టు తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు రూ.7.50 కోట్లు, కా ర్మికులకు రూ.1.50 కోట్ల బోనస్ పంపిణీ చేశామని వివరించారు. రూ.180 కోట్లు ఉన్న టర్నోవర్‌ను 2022–23 నాటికి రూ.240 కోట్లకు పెంచామని, 2023–24 సంవత్సరం పూర్తయ్యే నాటికి టర్నోవర్‌ను రూ.270 కోట్లకు తీసుకెళతామన్నారు.పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.3 ప్రకారం బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని, ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను 550 నుంచి 750కి పెంచినట్టు తెలిపారు. చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ కారణంగా రాజమండ్రి, చిత్తూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, అనంతపురంలోని కో–ఆపరేటివ్ డెయిరీలు మూతపడ్డాయని, ఈ విషయాన్ని లోకేశ్ తెలుసుకోవాలని సూచించారు. భూమా కుటుంబం ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ ఏర్పాటు చేసిన సమయంలో విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తామనే ఒప్పందంతో రూ.1.50 కోట్లు తీసుకుని, పాలు సరఫరా చేయలేదని, ఆ డబ్బులు ఇప్పిస్తే సంతోషిస్తామని ఎస్వీ జగన్మోహన్రెడ్డి చెప్పారు. -
‘విజయ’ పాలకు ఎసరు, అధికారుల తీరుపై విమర్శలు.. కావాలనే చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల విక్రయాలపై కుట్ర జరుగుతోందా..?. అంగన్వాడీ కేంద్రాలకు విజయ పాలు సరఫరా కాకుండా అధికారులే అడ్డుపడుతున్నారా.. ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. విజయ డెయిరీకి టెండర్ దక్కకుండా అధికారులే నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఇటీవల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహా్వనించారు. కేవలం కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన డెయిరీలకే టెండర్ దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న హాకా ఆయా టెండర్లు పిలవాల్సి ఉండగా, దాన్ని పక్కనపెట్టి ఐసీడీఎస్ ద్వారా టెండర్లు పిలవడంపై కూడా వివాదం రేగుతోంది. ఏడాదికి 3 కోట్ల లీటర్ల విజయ పాలకు ఎసరు రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 4.57 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు. 10.34 లక్షల మంది ఏడాది నుంచి నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 6.67 లక్షలు 3 ఏళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు లబ్ది పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం తరపున పాలు అందజేస్తారు. ఒక్కో తల్లికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తారు. అందుకోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తుంది. ఏడాదికి అంగన్వాడీ కేంద్రాలకు దాదాపు 3 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్ పాలు సరఫరా చేస్తున్నారు. ఈ పాలను రాష్ట్రంలోని విజయ డెయిరీ వంటి సహకార డెయిరీల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నిబంధనలు మార్చడంతో విజయ డెయిరీకి భారీగా నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.120 కోట్ల విలువైన వ్యాపారానికి గండిపడుతుందనే చెప్పాలి. సామర్ధ్యానికి మించి నిబంధనలు... 20 రోజుల క్రితం హాకా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అప్పుడు సింగిల్ టెండరే వచ్చింది. దీంతో మళ్లీ టెండర్లు వేయాలనుకున్నారు. కానీ ఈసారి హాకాను పక్కనపెట్టి ఐసీడీఎస్ వర్గాలు టెండర్లకు వెళ్లాయి. విజయ డెయిరీ టెట్రాప్యాక్ పాల సామర్థ్యం రోజుకు 50 వేల లీటర్లు కాగా, టెండర్లో 3 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని పొందుపరిచారు. అలాగే గత మూడేళ్లలో ఏదో ఒక ఏడాది 1.5 కోట్ల లీటర్ల టెట్రాప్యాక్‌లు సరఫరా చేసిన సామర్థ్యం ఉండాలన్న నిబంధనను కూడా విధించారు. ఈ సామర్థ్యం కూడా విజయ డెయిరీకి లేదు. గతంలో ఇలాంటి నిబంధనలను విధించలేదు. కేవలం కర్ణాటక, గుజరాత్‌కు చెందిన డెయిరీలకే అనుకూలంగా నిబంధనలు ఉన్నాయని చెబుుతు న్నారు. ఈ నెల 20వ తేదీన టెండర్ దా ఖలుకు చివరి తేదీ కాగా, నిబంధనలు ఎలా ఉన్నా టెండర్లు వేస్తామని విజయ డెయిరీ వర్గాలు వెల్లడించాయి. -
సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. రూ.7.20 కోట్ల బోనస్ చెక్‌ను కర్నూలు మిల్క్ యూనియన్ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి సీఎంకు అందజేశారు. పాడిరైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ.27 కోట్లు లాభాలు గడించిందని ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు మిల్క్ యూనియన్ సమగ్ర పనితీరును వివరించారు. రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్ యూనియన్ (విజయడైరీ) ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్. సరళమ్మ పాల్గొన్నారు. చదవండి: (పవన్, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్) -
పట్టాలపైకి ‘పాడికుండ’.. చిత్తూరు విజయ డెయిరీకి మంచిరోజులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని పట్టాలెక్కించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. చంద్రబాబు తన పా‘పాల’ డెయిరీ హెరిటేజ్ కోసం చిత్తూరు విజయ డెయిరీని గుదిబండలా మార్చి మూయిస్తే.. దాని పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పాడి రైతులు, కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు విజయ డెయిరీ ప్రస్థానమిలా.. చిత్తూరు కేంద్రంగా 50 మంది పాడి రైతులతో 1969లో ప్రారంభమైన విజయ డెయిరీ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రోజుకు ఆరువేల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల సేకరణకు దినదినాభివృద్ధి చెందింది. 68వేల మంది పాడి రైతు కుటుంబాలకు కల్పతరువుగా మారింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటన సందర్భంగా విజయ డెయిరీని సందర్శించారు. పాడి గురించి ఆరాతీసి పాలద్వారా వచ్చే రాబడిని గ్రహించి హెరిటేజ్ కోసం అడుగులు వేశారు. చిత్తూరు డెయిరీ మూసివేసేందుకు పన్నాగం పన్నారు. టీడీపీ నేత, తన ముఖ్య అనుచరుడు దొరబాబుని డెయిరీ చైర్మన్‌గా నియమించారు. యూనియన్లు ఉన్నా ఎవ్వరూ నోరెత్తకుండా చేశారు. ఎండీ, మేనేజర్నూ తన వైపు తిప్పుకున్నారు. అనంతరం తన పథకాన్ని అమలుచేశారు. లాభాల్లో ఉన్న ఈ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ఎగుమతి అయ్యే టన్నుల కొద్దీ నెయ్యి, పౌడర్‌ను రహస్యంగా నిల్వచేసేవారు. అలా ప్రతిరోజూ 35 టన్నుల నెయ్యి, మరో 32 టన్నుల పౌడర్ని నిల్వ చూపించి టెండరుదారులకు తక్కువకే అప్పగించేవారు. ఇలా రోజువారి నష్టాలు పెరిగి చివరకు డెయిరీ మూతకు చంద్రబాబు కారణమయ్యారు. రాజకీయ అవినీతి ఊబిలో.. చిత్తూరు డెయిరీలో గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు సహకార సంఘాల ఎన్నికలు ఒక పెద్ద రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. దీంతో డెయిరీ అవినీతిలో కూరుకుపోయింది. ఫలితంగా రైతులకు సరఫరా చేసిన పాలకు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయింది. పాడి రైతుల ఆందోళనలతో అతి కష్టంపై బిల్లులు చెల్లించేవారు. చివరకు రైతులకు ఈ బిల్లులు చెల్లించలేక 2002 ఆగస్టు 31న చిత్తూరు విజయ డెయిరీ మూతపడింది. అదే సమయంలో ప్రైవేటు డైరీలు పుంజుకున్నాయి. కరువు కారణంగా పంటలు దెబ్బతింటుండటంతో జీవనాధారం కోసం ఎక్కువమంది రైతులు ఆవులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రైవేటు డెయిరీలన్నీ ఏకమయ్యాయి. పాల ఉత్పత్తిదారులను దోపిడీ చేయటం ప్రారంభించాయి. ప్రభుత్వ సహకార సంఘాల నుండి పోటీరాకుండా బాబు చక్రం తిప్పేవారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. కావాలనే నష్టాలబాట అప్పట్లో డెయిరీలో అంతా నిజాయితీగా పనిచేసేవాళ్లం. అవినీతికి పాల్పడేవారే లేరు. అయినా నష్టాలు చూపించారు. ఎవరో పనికట్టుకుని కావాలనే మూతేశారు. డెయిరీ మూసేయటంవల్ల అనేకమంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం తెరిపిస్తానంటోంది. డెయిరీకి పూర్వవైభవం తీసుకొస్తే సంతోషిస్తాం. – రామచంద్ర, చిత్తూరు డెయిరీ కార్మికుడు హెరిటేజ్ కోసమే.. చిత్తూరు విజయ డెయిరీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాల పదార్థాలు తయారయ్యేవి. ప్రత్యేకంగా ఇక్కడి చీజ్‌కు మంచి గిరాకీ ఉండేది. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 140 మందిని బయటకు నెట్టేశారు. కొందరు వీఆర్ఎస్ తీసుకున్నారు. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. లాభాల్లో ఉన్నప్పటికీ కావాలనే రైతులకు పేమెంట్ ఇవ్వకుండా మార్కెటింగ్‌ని దెబ్బతీశారు. – దశరథన్, టైమ్ స్కేల్ వర్కర్, విజయ డెయిరీ, చిత్తూరు -
హెరిటేజ్ కోసమే ‘ఈనాడు’ తప్పుడు కథనాలు.. చంద్రబాబు బాగోతం మరిచారా?
బద్వేలు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ డెయిరీ కోసమే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నదని విజయా డెయిరీ చైర్మన్ ఎస్.వి.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఈనాడు దినపత్రికలో ‘సర్వం అమూల్ పాలు’ అంటూ మంగళవారం ప్రచురించిన కథనంపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 సహకార డైరీలను చంద్రబాబునాయుడు తన హెరిటేజ్ సంస్థ కోసం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పాడిరైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి కో–ఆపరేటివ్ సంస్థ అయిన అమూల్‌ను రాష్ట్రానికి తీసుకురావడంతో పాడిరైతులకు ఇప్పటి వరకు రూ.2 వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. అయినా ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించడం సిగ్గుచేటని చెప్పారు. అభివృద్ధి దిశగా విజయా డెయిరీ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఖరితో నష్టాల్లో కూరుకుపోయిన విజయా డెయిరీని సీఎం జగన్ ఆదేశాలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ఆ డెయిరీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నెలకు రూ.5 లక్షలు లోపు ఆదాయం ఉన్న డెయిరీని నేడు కోటి రూపాయల ఆదాయం వచ్చేలా చేశామని, ఇందుకు ప్రభుత్వ సహకారం ఎంతగానో ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు మేలు జరిగిందా, ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిందా అన్న విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావులు కాణిపాకం వినాయకుని సన్నిధిలో గానీ, తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గానీ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.250 కోట్లతో మెగా విజయ డెయిరీ: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ అభివృద్ధిలో భాగంగా రూ. 250 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రస్తుతం రూ.700 కోట్ల టర్నోవర్‌కు విజయ డైరీ చేరుకుందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా నియమితులైన భరత్‌కుమార్ మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. -
దేశంలో విజయడెయిరీని నంబర్‌వన్‌గా నిలుపుతాం
సాక్షి, హైదరాబాద్: విజయడెయిరీని దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయడెయిరీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో విజయడెయిరీ రూ.750 కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు. గురువారం లుంబినీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్‌క్రీం పార్లర్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్ సిన్హాలతో కలిసి ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ అన్నిరకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 650 ఔట్లెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని వేయి వరకు పెంచాలనే లక్ష్యంతో ప్రధాన పర్యాటక కేంద్రాలు, దేవాలయాలు, హైవేలు, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌లపై కూడా ఐస్‌క్రీం పార్లర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. 50 శాతం సబ్సిడీపై పుష్‌కార్ట్‌లను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలో కూడా విజయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేవిధంగా చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా విజయడెయిరీకి పాలు పోసే రైతులకు సబ్సిడీపై పాడిగేదెల పంపిణీ, లీటర్ పాలకు రూ.4 నగదు ప్రోత్సాహకం, సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇటీవల పాలసేకరణ ధరను లీటర్‌కు రూ.5 పెంచడం వల్ల 50 వేల లీటర్లపాలు అదనంగా విజయడెయిరీకి వస్తున్నాయని తెలిపారు. పాల విక్రయకేంద్రాలు 1,500 వరకు పెరిగాయని, వ్యవసాయానికి అనుబంధంగా పాడిరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. -
పాడి రైతులకు శుభవార్త.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ పాడి రైతులకు ప్రభుత్వం వినాయక చవితికి ముందే శుభవార్త చెప్పింది. ఈ డెయిరీకి పాలు పోసే రైతులకు చెల్లిస్తున్న పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. గేదె పాలు లీటర్‌కు రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవుపాల ధరను లీటర్‌కు రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతామని, పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తలసాని మాట్లాడుతూ, పాలసేకరణ ధరతో పాటు డెయిరీ సొసైటీ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా పెంచుతామని, ఈ పెంపు వల్ల ప్రతి నెలా డెయిరీపై రూ.1.42 కోట్ల మేరకు భారం పడుతుందని చెప్పారు. అయినా పాడిరైతుల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ఇప్పుడు ఏటా రూ.800 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం కింద అనేకమంది పాడి గేదెలను కొనుగోలు చేశారని, వారంతా విజయ డెయిరీకి పాలుపోసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ ఇన్చార్జి అధర్‌సిన్హా, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు. -
విజయ పాలు ప్రియం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు డెయిరీలతో పోటీపడుతూ విజయ డెయిరీ కూడా పాల ధరలను పెంచనుంది! సోమవారం జరిగే బోర్డు సమావేశంలో పాల ధరతోపాటు పాల సేకరణ ధరను కూడా పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు బోర్డు ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని, బోర్డు సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బోర్డు భేటీకి హాజరుకావాలని జిల్లాకో రైతు చొప్పున ఆహ్వానం కూడా పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాడి రైతుకు లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇవ్వాల్సిన బకాయిల గురించి కూడా చర్చించనున్నారు. పాడి రైతుకు లీటర్ సేకరణ ధరను కనీసం రూ. 60 చేయాలని పాడి రైతుల సంఘం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శనివారం కలిసిన సంఘం నేతలు పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కానీ ప్రస్తుతం వెన్న శాతం ఆధారంగా ఇస్తున్న ధరకు రూ. 2–3 వరకు సేకరణ ధర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీటర్ పాల ధర కూడా పెరగనుంది. (నోట్: 5 శాతం తర్వాత ప్రతి పాయింట్‌కు సేకరణ ధర మారుతుంది. ఈ ధరతోపాటు ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రంలో వెన్న శాతం గరిష్టంగా 8కన్నా మించదని పాడి రైతులు చెబుతున్నారు.) చదవండి: బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే -
విజయడెయిరీ లక్ష్యం.. వెయ్యి కోట్ల టర్నోవర్
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: విజయడెయిరీ టర్నోవర్‌ను రూ.వెయ్యికోట్లకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మూసివేత దశకు చేరుకున్న విజయడెయిరీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రూ.750 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని చెప్పారు. డిమాండ్ దృష్ట్యా విజయ డెయిరీ ఉత్పత్తులను పెంచేందుకు రూ.250 కోట్ల వ్యయంతో మెగాడెయిరీని కూడా నిర్మిస్తున్నామని అన్నారు. శనివారం ఇక్కడి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో విజయ ఐస్క్రీంలకు సంబంధించిన 66 పుష్కార్ట్స్ (ట్రైసైకిల్స్)ను శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విజయడెయిరీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేదిశగా ముందుకెళుతోందన్నారు. విజయ ఔట్లెట్ల నిర్వాహకులకు 50 శాతం సబ్సిడీపై ఫ్రిజ్‌లు, పుష్కార్ట్స్ ఇస్తున్నామని, దూద్‌పెడ, బటర్‌మిల్క్, లస్సీ, ఐస్‌క్రీంలు ఇలా ఎన్నో ఉత్పత్తులను యువత విక్రయించి ఉపాధి పొందేవిధంగా ఈ కార్ట్స్ అందిస్తున్నామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హైవేలు, దేవాలయాల వద్ద విజయ ఉత్పత్తులను విక్రయించేవిధంగా ఈ ట్రైసైకిల్స్ ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు మనరాష్ట్రంలో ఉత్పత్తి కావడంలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యల నిమిత్తం అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. విజయడెయిరీకి పాలుపోసే రైతులకు లీటర్‌కు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విజయ డెయిరీ అధికారులు పాల్గొన్నారు. -
వెయ్యి కోట్ల లక్ష్యం వైపు విజయ డెయిరీ: తలసాని
మాదాపూర్ (హైదరాబాద్): మూతపడిపోతుందని ఊహాగానాలు వినిపించిన విజయ డెయిరీ రూ.650 కోట్ల టర్నోవర్ సాధించి రూ.1000 కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతోందని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మాదాపూర్ లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న డెయిరీ, ఫుడ్ ఎక్స్పోను హోంమంత్రి మహమూద్ అలీతో కలసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నగరంలో పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ఈ ఎక్స్పోను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మీడియా డే మార్కెటింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రదర్శనలో 100కు పైగా ఎగ్జిబిటర్లు, 120 బ్రాండ్లు తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శిస్తున్నాయన్నారు. మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్, నీరు రైతులకు సమృద్ధిగా లభిస్తున్నాయని చెప్పారు. నగరంలో పాల డిమాండ్‌లో 30 శాతం మాత్రమే తీర్చగలుగుతున్నామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. -
విజయ పాలధర లీటర్ రూ.2 పెంపు
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: విజయ డెయిరీ పాల ధర మరోమారు పెరిగింది. కొత్త ఏడాది నుంచే ఈ ధర అమలులోకి వచ్చింది. టోన్డ్ మిల్క్ లీటర్‌కు రూ.2 చొప్పున పెంచినట్లు డెయిరీ ప్రకటించింది. ప్రస్తుతం రూ.47గా ఉన్న టోన్ట్ మిల్క్‌లీటర్ ధర నేటి నుంచి రూ.49కి పెంచినట్లు సంస్థ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సరఫరా చేయనున్న పాలకు ఈ పెంచిన ధరలు వర్తిస్తాయని, హోల్ మిల్క్ ధర లీటర్‌కు రూ.4 చొప్పున పెంచామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ పాలను పలురకాల సైజుల్లో ఉన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నందున సైజులవారీగా ధరలను పెంచుతూ విజయ డెయిరీ నిర్ణయం తీసుకుంది. డబుల్‌టోన్డ్ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్ ధర రూ.9 నుంచి రూ.9:50కి పెరిగింది. 300 మిల్లీలీటర్ల ధర రూ.14 నుంచి రూ.15కు, 500 మిల్లీలీటర్ల ధర రూ.22 నుంచి రూ.23కు, ఆవుపాలు లీటర్‌పై రూ.48 నుంచి 50కు పెరిగింది. టోన్డ్ పాలు 200 మిల్లీలీటర్ల ప్యాకెట్ రూ.10 నుంచి రూ.10.50కు, 500 మిల్లీలీటర్ల ప్యాకెట్ రూ.24 నుంచి రూ.25కు పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచామని... కావున వినియోగదారులు సహకరించాలని విజయ డెయిరీ అధికారులు కోరారు. -
50 శాతం సబ్సిడీతో ‘ఐస్‌క్రీం సైకిళ్లు’
సాక్షి, హైదరాబాద్: విజయ పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఐస్ క్రీం పుష్ కార్ట్ (ట్రై సైకిల్)లను రాష్ట్రవ్యా ప్తంగా 50 శాతం సబ్సిడీతో అందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విజయ తెలంగాణ బోర్డు 14వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం కింద రూ. 5 వేలు, సబ్సిడీపై దాణా, ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం, మిల్క్‌షెడ్‌లకు అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న స హకారం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారు విజయ డెయిరీకే పాలు పోసేవిధంగా చూడాలని మంత్రి సూ చించారు. పాడి రైతులకు ప్రతి 7 రోజుల కు ఒకసారి బిల్లులను చెల్లించాలని సమావేశం తీర్మానించింది. పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ని యమించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రధాన పర్యాటక ప్రాంతా లు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సమ్మక్క సారక్క, కొమురెల్లి జాతర వంటి ప్రధాన జాతరలలో తాత్కాలిక ఔట్లెట్లను ఏర్పాటుచేసి విజయ డెయిరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. -
హెరిటేజ్ లాభం కోసం విజయ డైరీని మూయించిన చంద్రబాబు
-
విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు
తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
50 రకాల కొత్త ఉత్పత్తులతో వస్తున్న ‘విజయ డెయిరీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ మార్కెట్లోకి 50కిపైగా కొత్త ఉత్పత్తులతో దూసుకురానుంది. ఇప్పటివరకు పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకే పరిమితంకాగా.. త్వరలో తృణధాన్యాల లడ్డూలు, చిక్కీలు, చాక్లెట్లు, బూందీ ఇతర మిక్చర్లను అందుబాటులోకి తేనుంది. ఒకట్రెండు రోజుల్లో 12 వెరైటీలను, 10 రోజుల్లో మరో 10 రకాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డెయిరీ అధికారులు చెప్తున్నారు. దసరా నాటికి మరో 20, దీపావళి నాటికి ఇంకో 10 ఉత్పత్తులను తమ ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తామని పేర్కొంటున్నారు. డెయిరీ ఉత్పత్తులకు ఆదరణ విజయ డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దూద్‌పేడా, మిల్క్కేక్లతోపాటు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నెయ్యి మైసూర్పాక్కు కూడా మంచి గిరాకీ ఉంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఉత్పత్తులను మార్కెట్లోకి తేవాలని విజయ డెయిరీ గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలతో కూడిన స్వీట్లను అందుబాటులోకి తెస్తోంది. జొన్న, రాగి, మిల్లెట్ లడ్డూలతోపాటు బేసిన్ లడ్డూలను తయారు చేస్తోంది. ఇతర డెయిరీలకు దీటుగా సున్నుండలు, మలాయి లడ్డూ, బాదం హల్వా తయారుచేసి ఔట్లెట్లలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ►వేరుశనగతో పాటు కాజు, బాదం చిక్కీలు, గులాబ్‌జామ్, రస్మలాయ్ మిక్స్‌ల తయారీపై విజయ డెయిరీ అధికారులు ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నీళ్లలో కలుపుకొని తాగేలా బాదం మిక్స్ పొడిని తయారు చేస్తున్నారు. ►కొత్త ఉత్పత్తులన్నింటినీ మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ►ఇక అమూల్ డెయిరీకి దీటుగా చాక్లెట్ల తయారీ, కారం బూందీ, మిక్చర్ లాంటి స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తేవడంపైనా దృష్టిపెట్టారు. ►విస్తృతంగా మార్కెట్లోకి ప్రవేశించే ఏర్పాట్లలో భాగంగా ఈ నెలలోనే భారీ డెయిరీకి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. -
విజయ డెయిరీ చైర్మన్ చలసాని మాయ.. వెన్న నుంచి కమిషన్లు
అంతులేని అక్రమాలు.. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలకు ఆలవాలంగా మారిన విజయ డెయిరీలో రోజుకో అక్రమాల చిట్టా బయటపడుతోంది. భూముల కొనుగోలులో చేతివాటం మొదలుకొని.. రూ.కోట్లలో నిధులను మింగేయడం.. కమీషన్ల దందా నడిపించడం.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాల పుట్టలెన్నో విజయ డెయిరీ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం బట్టబయలు కావడంతో పాల సొసైటీల చైర్మన్లు అవాక్కవుతున్నారు. సాక్షి, అమరావతి: వెన్న నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ.. విజయ డెయిరీలో మాత్రం వెన్న నుంచి కమీషన్లు కూడా పిండారు. డెయిరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్టు ఆ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆయన హయాంలో ప్రతి వ్యవహారం అవినీతిమయంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్ల తీరు తెలుసుకుని పాల సొసైటీల చైర్మన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీటిని భారీగా కొనుగోలు చేసి కమీషన్ల రూపంలో రూ.కోట్లు మింగేశారని చెబుతున్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి వెన్న, పాల పౌడర్ కొనేవారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి పేరున్న సంస్థల నుంచే కొనుగోలు చేసేవారు. డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొద్దినెలల క్రితం 2,500 టన్నుల వెన్నను మద్రాసుకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయించారు. ఇదికాకుండా సంస్థలో మరో 500 టన్నుల వెన్న తయారైంది. మొత్తం 3 వేల టన్నుల వెన్న విజయ డెయిరీ వద్ద నిల్వ ఉంది. ఇంత వెన్న ఒకేసారి కొనుగోలు చేయడం అంటే కమిషన్ కోసమే తప్ప వేరే ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. ఎంత పక్కాగా నిల్వ చేసినా సంవత్సరం లోపు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా కమిషన్ కోసం ఒకేసారి భారీగా కొనేశారు. అప్పు చేసి కొని.. కోల్డ్ స్టోరేజీల్లో దాచారు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన రుణంలో సుమారు రూ.75 కోట్లను వెచ్చించి వెన్న కొన్నారు. తర్వాత దాన్ని విశాఖ, హైదరాబాద్‌లోని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచారు. స్థానిక కోల్డ్ స్టోరేజీల్లో అయితే ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుందని, అందుకే ఆ నగరాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టినట్టు సమర్ధించుకుంటున్నారు. అసలు కొనడమే అనవసరమని రైతులు వాపోతుంటే కొని ఎక్కడో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టామని చెప్పుకోవడం ఏమిటనే ప్రశ్నలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సుమారు వెయ్యి టన్నుల వెన్నను అతికష్టం మీద వినియోగించారు. రాబోయే రెండు నెలల్లో మహా అయితే మరో 500 టన్నులు వినియోగించే అవకాశం ఉంది. ఇంకా 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది. చివర్లో దీన్ని చిన్న డెయిరీలకు ఎంతోకొంతకు అమ్మి వదిలించుకోవాల్సిందే. దీనివల్ల సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లనుంది. చైర్మన్‌కు మాత్రం ముందే భారీగా లాభం సమకూరింది. పాల పొడి కొనుగోళ్లలోనూ కమీషన్ల పర్వం పాల పొడి కొనుగోళ్లలోనూ ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమీషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్, వెన్న కొనేవారు. ఆంజనేయులు చైర్మన్ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నారు. హర్యానా ఫుడ్స్, బోయీ బాబా, స్టెర్లిన్ ఆగ్రో, మధు డైరీస్ వంటి సంస్థల వద్ద వీటిని కొనడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్టే. కానీ.. కమీషన్లు భారీగా ముడుతుండటంతో చైర్మన్‌కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి వల్ల విజయ బ్రాండ్ మసకబారుతోందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలకవర్గాన్ని సాగనంపకపోతే విజయ డెయిరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
Vijaya Dairy: పా‘పాల’ పుట్ట!
విజయ డెయిరీ.. ఇది ఓ పా‘పాల’ పుట్ట.. అడుగడుగునా అక్రమాల చిట్టా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ఇప్పుడు అంతులేని విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత యూనియన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇప్పుడు అనేకానేక గోల్మాల్ వ్యవహారాలు గుప్పుమంటున్నాయి. భూముల కొనుగోలులో చేతివాటం మొదలు రూ.కోట్లలో నిధుల మాయం.. మితిమీరిన కమీషన్ల కక్కుర్తి.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సంస్థ భాగస్వాములే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రంలో అయితే ‘విజయ’ ముసుగులో ప్రైవేట్ దందాకు తెరతీశారు. మొత్తం మీద విజయ డెయిరీ పరిస్థితి ఇప్పుడు ‘మేడిపండు చూడ మేలిమై యుండు..’ అన్నట్లుగా ఉంది. సాక్షి, అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్‌కి చెందిన విజయ డెయిరీ అంటే ఒక బ్రాండ్. సుమారు 600 పాల ఉత్పత్తి సహకార సంఘాలు (సొసైటీలు) దీని కింద ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది రైతులున్నారు. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను సంస్థ సేకరిస్తుంది. ఇందులో కృష్ణాజిల్లా నుంచే ఎక్కువ పాలు సేకరిస్తారు. దీని వార్షిక టర్నోవర్ రూ.900 కోట్లుగా ఉంది. ఇంత ప్రతిష్ట ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్. కానీ, ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీస్తూ కొత్త పాలకవర్గం ఇష్టారాజ్యంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సంస్థను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యవహారశైలితో విజయ డెయిరీ బ్రాండ్ తన ప్రాభవాన్ని కోల్పోయిందని ఆందులో భాగస్వాములుగా ఉన్న పలు సొసైటీల చైర్మన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా అనేకచోట్ల విజయ పార్లర్లు పెట్టడం ద్వారా సంస్థ ప్రగతిపథంలో ఉందనే భ్రమ బయటకు కల్పిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలకవర్గం వచ్చిన రెండేళ్లలోనే సంస్థ పరిస్థితి దిగజారిందని, అనేక గోల్మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే మూడు, నాలుగేళ్లలో సంస్థ దివాళా తీయడం ఖాయమని వారు చెబుతున్నారు. అక్రమాల చిట్టా ఇదే.. ► కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొత్త డెయిరీ యూనిట్ పెడుతున్నామనే పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. ఇక్కడ తన స్నేహితుడికి చెందిన పొలం ఎకరం రూ.50 లక్షలుంటే రూ.75 లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అలాగే, వీరవల్లి పరిసరాల్లోనే రైల్వే ట్రాక్‌కు ఆనుకుని రూ.25 లక్షలున్న ఎకరం భూమిని రూ.50 లక్షలిచ్చి రెట్టింపు రేటుకు కొన్నారు. ఇలా సుమారు 13 ఎకరాలు కొని రూ.4 కోట్లకు పైగా జేబులో వేసుకున్నారు. ఈ భూములను ఎందుకు కొన్నారో ఇప్పటివరకు సొసైటీలకు చెప్పలేదు. మొదట్లో పెల్లెట్స్ (గుళికలు) తయారీ ఫ్యాక్టరీ కోసం భూములు కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓ కంపెనీకి రూ.90 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చి రూ.10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప లాభంలేదని తేలడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అడ్వాన్స్ మొత్తం ఏమైందో సమాధానం చెప్పే దిక్కులేదు. ► 2019లో కొత్త పాలకవర్గం వచ్చే నాటికి సంస్థలో రూ.90 కోట్ల రిజర్వు నిధులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఆ డబ్బును రెండేళ్లలోనే కరిగించేశారు. ఆ డబ్బును ఎందుకు, ఎక్కడ ఖర్చు పెట్టారో పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కొందరు అడిగినా ఇప్పటివరకు జవాబులేదు. బోనస్‌లో ఎలా బరితెగించారంటే.. గతంలో రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నప్పుడు రైతులకు రూ.65 కోట్ల బోనస్ ఇచ్చారు. ఇప్పుడు టర్నోవర్ సుమారు రూ.900 కోట్లకు చేరినా రైతులకిచ్చే బోనస్ రూ.45 కోట్లకు పడిపోయింది. గతంలో రైతులకు లీటర్‌కు రూ.32 పైసల చొప్పున 3 విడతలుగా బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15 పైసలకి తగ్గించి ఒకసారే ఇస్తున్నారు. చైర్మన్ దుబారా, ధనదాహమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. విజయ పార్లర్లలో ఇతర బ్రాండ్లు ఇక విజయ పార్లర్లలో ఇతర సంస్థల ఉత్పత్తులను విజయ బ్రాండ్ పేరిట విక్రయించడానికి గేట్లు బార్లా తెరిచారు. దీంతో బ్రాండ్ పేరు మసకబారింది. కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐస్‌క్రీం, బ్రెడ్, కేక్, బిస్కెట్లు కొని వాటిని విజయ ఉత్పత్తులుగా అమ్ముతుండడంపై సంస్థలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎలాంటి టెండర్ లేకుండా ఒక ఐస్‌క్రీం కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేశారు. అలాగే, విజయ పాలకు ఉన్నట్లే విజయ పశు దాణాకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని కూడా స్వయంగా తయారుచేయకుండా కమీషన్ల కోసం ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. దీంతో అమ్మకాలు పడిపోయి నష్టాలు వస్తున్నాయి. ► ఇక చిత్తూరు జిల్లా రైతుల నుంచి సేకరించిన లీటర్ పాలకు రూ.3 బోనస్ ఇస్తామని చెప్పి రూ.1 మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.2 మింగేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాగే వెండర్స్‌కి 7.5 శాతం బోనస్ ఇస్తామని చెప్పి డబ్బు డ్రా చేసి 3.5 శాతమే ఇచ్చారు. ఇప్పటికీ ఈ రైతులు, వెండర్లు తమ బోనస్ కోసం డెయిరీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ► అవసరం లేకపోయినా కమీషన్ల వేటలో భారీగా వెన్న, పాల పొడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్లో వీటి స్టాకు పెద్దఎత్తున నిల్వ ఉంది. ► తెలంగాణలోని కోదాడ, ఖమ్మంలో విజయ డెయిరీకి గతంలో 16 వేల లీటర్ల మార్కెట్ ఉండేది. అది ప్రస్తుతం వెయ్యి లీటర్లకు పడిపోవడం వెనుక చైర్మన్ మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా కొందరితో కలిసి అక్కడే పాలు కొని సొంతంగా ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు సమాచారం. విజయ బ్రాండ్ పేరుతో సొంత లాభం కోసం ఇలా ప్రైవేటు దందాకు తెరతీశారని చెబుతున్నారు. ► తన పబ్లిసిటీ పిచ్చికి తమ చైర్మన్ రూ.50 లక్షలు వృధా చేసినట్లు వివిధ సొసైటీల చైర్మన్లు వాపోతున్నారు. యూనియన్ చైర్మనే స్వయంగా ఫ్లెక్సీలు వేయించి వాటిని అన్ని సొసైటీలకు లారీలో పంపి కట్టించారు. -
భూమా కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి చెక్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా విజయ డెయిరీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. దివంగత మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి సమీప బంధువు భూమా నారాయణరెడ్డి 25 సంవత్సరాలుగా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. భూమా కుటుంబ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. బుధవారం నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులయిన ముగ్గురు డైరెక్టర్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు నలుగురు.. వైఎస్సార్సీపీ మద్దతు దారుడు ఎస్వీ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో విజయ పాల డెయిరీ చైర్మన్‌గా ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఎన్నికైనట్లు డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి ప్రకటించారు. చదవండి: (మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు) -
నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి
సాక్షి, నంద్యాల: ‘నిన్ను చంపితే కాని మాకు చైర్మన్ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా సీఐ దివాకర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయ డెయిరీ పాలక మండలి సమావేశం గత నెల 28వ తేదీన జరగగా డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకొని భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారు. ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో 28వ తేదీ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని విజయడెయిరీ చైర్మన్ ఎండీ ప్రసాదరెడ్డి డైరెక్టర్లకు సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్‌విఖ్యాత్ రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతునగరం గ్రామంలోని భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారు. విషయం తెలుసుకున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్, రవి తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు 1వ తేదీ రాత్రి 11.20గంటలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ‘నిన్ను చంపితే గాని చైర్మన్ పదవి మాకు రాదు అంటూ’ భూమా నారాయణ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మంగళవారం బాధితుడు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భూమా కుటుంబంలో ‘డెయిరీ’ చిచ్చు
నంద్యాల: భూమా కుటుంబంలో విభేదాలు రచ్చ కెక్కాయి. విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం మాజీ ఎంపీ, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పట్టుబడుతున్నారు. చైర్మన్‌గా ఉన్న భూమా నారాయణరెడ్డి ఇందుకు అంగీకరించడం లేదు. ఈ పదవి గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం చేతిలోనే ఉంది. ఐదురోజుల క్రితం విజయ డెయిరీ సమావేశం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ముగ్గురు డైరెక్టర్లను భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఆయన బావ(మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త)భార్గవర్ధన్ ఆళ్లగడ్డలో బలవంతంగా ఉంచారు. దీంతో వారు రాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 2వ తేదీ సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. (చదవండి: రాజధాని పేరిట చంద్రబాబు బినామీ ఉద్యమం) ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడకూడదని, విజయ డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి కొంత మంది డైరెక్టర్లను నంద్యాల శివారులోని రైతునగరంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి, భార్గవర్ధన్ నాయుడు ఆదివారం రాత్రి డైరెక్టర్లు ఉన్న రైతునగరానికి వెళ్లి భూమా నారాయణరెడ్డితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల తాలూకా సీఐ దివాకర్‌రెడ్డి తన సిబ్బందితో రైతునగరానికి ఆదివారం రాత్రి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో విజయ డెయిరీ పాలక మండలి సమావేశం సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగింది. ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 50 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశానికి 11 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. (చదవండి: బీసీలంతా వైఎస్ జగన్‌కు రుణపడ్డాం: జయరాం) మనవడి పోస్టు పోయింది భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి నా మనవడు. నిన్న భార్గవర్ధన్తో కలిసి నా ఇంటి వద్దకు వచ్చినప్పుడే మనవడి పోస్టు పోయింది. చైర్మన్ పదవి అందరితో కూర్చొని మాట్లాడి తీసుకోవాలే కాని, నేను రాజీనామా చేస్తే వారికి వస్తాదనేది వారి భ్రమ. – భూమా నారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ -
విజయ పాలు లీటర్ రూ.47
లాలాపేట : విజయ డెయిరీ లీటర్ పాల ధర రూ.47కి చేరింది. తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరి) ఈ రెండు నెలల కాలంలో లీటరు పాలపై రూ.5 పెంచింది. గత రెండు నెలల క్రితమే రూ.2 పెంచింది. తాజాగా మళ్లీ మరోసారి రూ.3 పెంచడంతో విజయ పాల వినియోగదారులు ఈ పెంపు ను భారంగా భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ప్రైవేట్ డెయిరీలు తక్కువ ధరకే విక్రయిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ పాల ధరను అధికంగా పెంచడంతో నాణ్యతకు పేరున్న విజయ పాలను కొనలేని పరిస్థితి ఉందని వినియోగదారులు వాపోతున్నారు. దీనిపై విజయ డెయిరి మార్కెంటింగ్‌అధికారులను వివరణ కోరగా.. జనవరి 26న పాడి రైతులకు ప్రొక్యూర్మెంట్ కోసం రూ.2 పెంచామన్నారు. ఆ పెంపును భర్తీ చేయడానికే తాజాగా లీటరు పాల ధరను పెంచాల్సి వచ్చిందన్నారు. ఈ పెంపు ఈ నెల 16 నుంచే వర్తిస్తుందని తెలిపారు. -
పొరుగు పాలు రుచెక్కువ!
సాక్షి, హైదరాబాద్ : అంగన్వాడీల్లోని లబ్ధిదారులకు అత్యుత్తమ పౌష్టికాహారం కింద పాలను అందిస్తున్న ప్రభుత్వం, పంపిణీ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హాకా (హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేట్ అసోసియేషన్ లిమిటెడ్)కు అప్పగించింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం తెలంగాణ విజయ డెయిరీ (తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పంపిణీ చేసే పాల బ్రాండు) పాలను హాకా కొనుగోలు చేసి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలకు చేరవేయాలి. తెలంగాణ విజయ పాలు ఆశించిన మేర సరఫరా చేయని పక్షంలో స్థానిక కంపెనీలను ప్రోత్సహించే క్రమంలో ఇక్కడి డెయిరీలకు ప్రాధాన్యత ఇవ్వొచ్చని సూచించింది. కానీ స్థానిక ప్రోత్సాహం సంగతి అటుంచితే పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీ నుంచి ఎక్కువ ధర వెచ్చించి ‘హాకా’పాలను కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం)ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గత నెల గణాంకాల ప్రకారం ఈ కేంద్రాల పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 10,42,675 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,54,165 మంది ఉన్నారు. మొత్తంగా 16.96 లక్షల మంది చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో 17.04 లక్షల ప్యాకెట్లను హాకా సరఫరా చేసింది. ఇందులో కేవలం 1.19 లక్షల ప్యాకెట్లు తెలంగాణ విజయ పంపిణీ చేయగా... మిగతావి కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ సరఫరా చేసింది. రెండు లక్షలలోపే ఆర్డర్లు... తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రోజుకు సగటున 3 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ఇందులో టెట్రా ప్యాక్ రూపంలో నెలకు సగటున 10 లక్షల ప్యాకెట్లు సరఫరా చేసే వీలున్నప్పటికీ ప్రస్తుతం 7 లక్షల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విజయ పాలకు కేవలం 2లక్షల వరకే ఆర్డర్లు పెడుతున్న హాకా... మిగతా కోటా అంతా నందిని డెయిరీకే ఇస్తోంది. ఒకవైపు ఎక్కువ ధర చెల్లించడంతో పాటు, పొరుగు రాష్ట్రానికి చెందిన డెయిరీని ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందిని పాల కొనుగోలుతో ప్రభుత్వ ఖజానాపై భారం పడడంతో పాటు పొరుగు రైతులను ప్రోత్సహించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. నందిని డెయిరీ ఎక్కువ మొత్తంలో కమీషన్ ఇస్తుండడంతో ఆ పాలవైపే హాకా మొగ్గు చూపుతుందనే ఆరోపణలున్నాయి. తెలంగాణ విజయ బ్రాండు క్షేత్రస్థాయిలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కరీంనగర్ డెయిరీ ద్వారా ముల్కనూరు పాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తి దారుల సంఘం సరఫరా చేసే ‘నార్ముల్’పాలకు కూడా మంచి పేరే ఉంది. విజయ డెయిరీకి డిమాండ్‌కు సరిపడా పాలను సరఫరా చేసే సామర్థ్యం లేకుంటే స్థానిక ప్రోత్సాహం కింద ముల్కనూరు, నార్ముల్ పాలు కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు కొందరు రైతులు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అది ప్రభు త్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
విజయ ఉత్పత్తులకు యాప్: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే వ్యవస్థను మొబైల్ ఫోన్ వరకు విస్తరించాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్‌ను త్వరలోనే సిద్ధం చేయాలని సూచించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డెయిరీ చైర్మన్ లోకభూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయ'లో పా'పాలు
నంద్యాల/బొమ్మలసత్రం: విజయ డెయిరీలో పా‘పాలు’ ఎక్కువయ్యాయి. అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయ డెయిరీ పాలకవర్గం చైర్మన్‌గా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న భూమా నారాయణరెడ్డికి అవినీతి ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కన్పిస్తోంది. బంధు ప్రీతితో నిబంధనలను తుంగలో తొక్కి సమీప బంధువులకు చెందిన జగత్ డెయిరీకి సహకరించడం, ఆ సంస్థకు భారీ మొత్తాలను అడ్వాన్స్‌గా ఇవ్వడం, నాణ్యత లేని పాలను కొనుగోలు చేయడం వంటి అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, వాహన యజమానులు, ప్రైవేటు డెయిరీల నిర్వాహకుల నుంచి కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణల కారణంగా చైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అవినీతి అక్రమాలపై విచారణ విజయ డెయిరీలో సాగిన అవినీతి అక్రమాలపై ఆ సంస్థ డైరెక్టర్ వెంకట రామారెడ్డి, పలువురు కార్మికులు.. సహకార శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె విచారణకు ఆదేశించారు. సహకార శాఖ కర్నూలు జిల్లా అధికారి రామాంజనేయులుతో సహా ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే సంస్థకు చెందిన కీలక రికార్డులు, క్యాష్ బుక్‌లు, బిల్లు బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పాతికేళ్లుగా ఆయనే.. విజయ డెయిరీకి 1995 నుంచి ఇప్పటి వరకు భూమా నారాయణరెడ్డే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. డెయిరీ పాలకవర్గంలో 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఏటా ముగ్గురు డైరెక్టర్లు పదవి నుంచి వైదొలుగుతారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకుంటారు. ఈ 15 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. డైరెక్టర్లు అధిక శాతం భూమా నారాయణరెడ్డి సన్నిహితులే ఎన్నికవుతూ వస్తున్నారు. దీనివల్ల ఆయనే చైర్మన్ అవుతున్నారు. అధిక శాతం డైరెక్టర్లు చైర్మన్ మనుషులే కావడంతో పాలకవర్గంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎవరూ అడ్డు చెప్పలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇటీవల పదవీ విరమణ పొందిన మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డికి మరో రెండేళ్ల కాల పరిమితి పెంచుతూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ఈ విషయంలో కొందరు డైరెక్టర్లు, కార్మికులు చైర్మన్‌కు ఎదురుతిరగడం, వీరు పై స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో విజయ డెయిరీ వ్యవహారాలు రచ్చకెక్కాయి. కార్మికులు, డైరెక్టర్లు ఫిర్యాదులోపేర్కొన్న అంశాలివీ.. ♦ చైర్మన్ భూమా నారాయణరెడ్డి తన బంధువులకు చెందిన జగత్ డెయిరీ నుంచి నాణ్యత లేని పాలను కొనుగోలు చేస్తూ.. ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పైగా జగత్ డెయిరీకి భారీ మొత్తాలను అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. వాస్తవానికి రూ.25 వేలు దాటితే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలి. కానీ అలా చేయలేదు. జగత్ డెయిరీ ఇప్పటికీ విజయ డెయిరీ కి దాదాపు రూ.80 లక్షల బకాయి ఉంది. ♦ చైర్మన్ తన భార్య పేరుపై ఉన్న ఏపీ21సీక్యూ 1449 వాహనాన్ని సొంతానికి వాడుకుంటూ సొసైటీ ద్వారా బాడుగ చెల్లిస్తున్నారు. ♦ బైలా 27.1 ప్రకారం డైరెక్టర్లు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరయితే పదవి కోల్పోతారు. కానీ ప్రస్తుత డైరెక్టర్ పద్మావతి వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాకపోయినా కొనసాగిస్తున్నారు. ♦ విశ్రాంత ఉద్యోగుల గ్రాట్యుటీ నుంచి రెండు శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీల నుంచి పాలు కొనుగోలు చేస్తూ.. తమ బినామీల ద్వారా కమీషన్ తీసుకుంటున్నారు. ♦ గతంలో నంద్యాల విజయ డెయిరీ రోజూ 1.30 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేది. ప్రస్తుతం 30 వేల లీటర్లు మాత్రమే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది. తద్వారా చైర్మన్ బంధువులకు చెందిన జగత్ డెయిరీకి పరోక్షంగా సహాయపడుతున్నారు. ♦ భూమా నారాయణరెడ్డి సన్నిహితుడు గోపాల్‌నాయక్‌కు హెవీ మోటార్ లైసెన్స్ లేకున్నా ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్లో కొనసాగిస్తున్నారు. అతని ద్వారా తక్కువ నాణ్యత కలిగిన స్పేర్‌పార్ట్స్‌ను కొనుగోలు చేయిస్తున్నారు. ♦ ఎండీ ప్రసాదరెడ్డి మనవడు చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసును కర్నూలులోని విజయ డెయిరీ సొసైటీ గెస్ట్‌హౌస్‌లో 19–08–2019 నుంచి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్నీచర్, ఖర్చులు డెయిరీ ద్వారానే సమకూరుస్తున్నారు. ♦ కొందరు ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తూ లంచాలు తీసుకుంటున్నారు. అవుకు శివకుమార్ అనే వ్యక్తి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో పని చేస్తూ చాలా కాలం క్రితమే ఉద్యోగం వదిలేశారు. కానీ ఇప్పటికీ రిజిష్టర్‌లో పేరు ఉంది. విచారణ కొనసాగుతోంది విజయ డెయిరీలో అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నాం. కీలకమైన రికార్డులు, క్యాష్‌బుక్‌లు, బిల్ బుక్‌లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నాం. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు విచారణ వేగవంతం చేశాం. –రామాంజనేయులు, జిల్లా సహకార శాఖ అధికారి -
టీడీపీ పా‘పాలు’
జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి.పాలకు గిట్టుబాటు ధర కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి.దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యం కలిగి ఉందని పాడిరైతులు ధ్వజమెత్తుతున్నారు. సాక్షి, కడప : జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది పంటల సాగుతో పాటు పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు పండకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485, పాలిచ్చే బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25, 900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. నిలువు దోపిడీ... పాడి రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు పాల్పడుతూ వస్తున్నాయి. గిట్టుబాటు ధర కల్పించడంలో చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు సాలీడ్ నాన్ ఫ్యాట్ (ఎస్ఎన్ఎఫ్), ఫ్యాట్ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, అందులోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్ఆర్) ఆధారంగా ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.5 మేరకు రీడింగ్ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 30 మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి.ఇవి రోజుకు 1,35,856 లీటర్ల నుంచి 1,42,716 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. చంద్రబాబు స్వలాభం కోసం విజయా డెయిరీ నిర్వీర్యం...: జిల్లాలో తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999 , 2014లో తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్ డెయిరీకి పాలను మళ్లించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనా కాలంలో పాడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. బాబుగారి హెరిటేజ్ సంస్థ లీటరు పాలను ఎన్నికల ముందు వరకు రూ.52లతో ప్యాకెట్‌ను విక్రయించారు. ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54 చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్ ధర రూ.58 చేశారు. మిగతా డెయిరీలు కాసింత తక్కువగా అంటే లీటరు రూ.54–56 ధరతో విక్రయిస్తున్నాయి. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.30 నుంచి 35లకు కొనుగోలు చేసి లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పాడి రైతు తేజోమయం... 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు డాక్టర్ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి పేద రైతులకు అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చేయించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకాల మందులు ఇచ్చేవారు. ప్రతి నెలా పశువైద్య శిబిరాలు నిర్వహించి పాడి పశువులు ఆరోగ్యంగా ఉండేలా చేశారు. మొత్తం 1.20 లక్షల లీటర్లు విజయా డెయిరీ వారు పాలసేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది. పోషణ భారంగా మారింది.. ప్రైవేట్ డెయిరీలు పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. విధలేనిపరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించడంతో మళ్లీ ప్రాణం లేచివచ్చినట్లే. ప్రైవేటు డెయిరీలను కట్టడి చేస్తూ ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీ పాలను సేకరించేలా చూడాలి. – కె.చిన్నమ్మ, పాడిరైతు, ఎస్ సోమవరం, సంబేపల్లె మండలం. -
‘డెయిరీ’ డబ్బులు కాజేశాడు?
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్) : మండలంలోని దుర్కి గ్రామ పంచాయతీ ఎదుట కొందరు రైతులు ఆందోళనకు దిగారు. పాల కేంద్ర నిర్వాహకుడు తమ డబ్బులు కాజేశాడని ఆరోపించారు. దుర్కిలో గల విజయ డెయిరీ ఆధ్వర్యంలో 13 గ్రూపులను ఏర్పాటు చేశారు. పాల ఉత్పత్తి పెంచడానికి ఈ గ్రూపులకు 2017 మేలో మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా సుమారు రూ.3.5లక్షలు చొప్పున రుణం ఇప్పించారు. ఈ గ్రూపుల లోన్ రికవరీకి విజయ డెయిరీ నిర్వాహకుడు ప్రతి నెల సభ్యుల నుంచి రూ.2వేలను తీసుకుని బ్యాంకులో చెల్లించాలి. లోన్ తీసుకున్న నాటి నుంచి కేవలం 10 నెలలు చెల్లించి ఆ తర్వాత చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి సదరు గ్రూపులకు నోటీసులు అందాయి. దీంతో సదరు రైతుల పాల డబ్బులు బ్యాంకులో కట్టకుండా వాడుకున్నాడని రైతులు ఆరోపించారు. 13 గ్రూపుల్లోని 5 గ్రూపులకు రెండో విడుత గేదెల లోన్ ఇచ్చినట్లు వాటి బకాయి వివరాలు సైతం ఉండడంతో వారు రైతులు సుమారు రూ.35 లక్షలు సొంతానికి వాడుకున్నాడని ఇప్పడు అడిగితే తనకు సంబంధం లేదని డెయిరీ నిర్వాహకుడు ఖదీర్ చెప్పాడని రైతులు ఆరోపించారు. ఇదీ అసలు సంగతి.. దుర్కిలో విజయ డెయిరీ పేరున 13 గ్రూపులో ఉన్న 76 మంది సభ్యులు గేదెల లోన్ తీసుకున్నారు. అయితే బ్యాంకుకు రైతుకు సంబంధం లేకుండా సాగుతున్న తరుణంలో ఏడాదిన్నరగా లోన్ కట్టడంలేదని బ్యాంకు వారు సదరు రైతులకు నోటీసులు అందించారు. వాటిని చూసిన రైతులు కంగుతిన్నారు. డెయిరీ నిర్వాహకుడిని సంప్రదించగా గతేడాదికి ముందు రైతుల పాల డబ్బులను ప్రతి నెల రూ.12వేల చొప్పున బ్యాంకులో కట్టేవాడు. అయితే 2018 ఆగస్టు నుంచి డబ్బులను తీసుకోవడం లేదని, తానేందుకు లోన్ కడుతానని చెప్పడంతో రైతులు కంగుతిన్నారు. బ్యాంకు లావాదేవీలు డెయిరీ నిర్వాహకుడు చూసుకునేవాడని, ఏడాదిన్నరగా డబ్బులు చెల్లించకపోవడంతో పాటు రెండో విడుత లోన్ సైతం తీసుకోలేదని గ్రామంలోని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సదరు బ్యాంకు మేనేజర్ రాకేష్‌ను వివరణ కోరగా గ్రామంలోని అన్ని గ్రూపులకు కలిసి రూ.21లక్షల బకాయి ఉందని అది కేవలం రైతులు కట్టాలన్నారు. బయటకు రావాల్సిన వాస్తవాలు.. ప్రతి నెల డబ్బులను కట్టాల్సిన డెయిరీ నిర్వాహకుడు బ్యాంకు లోన్ కట్టకపోవడంతో బ్యాంకు నుంచి ఇంత ఆలస్యంగా నోటీసులు ఎందుకు వచ్చాయి. రెండో విడుతలో లోన్ ఇచ్చే సమయంలో పశువైద్యాధికారులు గేదెలను చూసి, పరీక్షించి బ్యాంకుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు గేదెలను తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు. గతేడాది ఆగస్టు నుంచి పాల డబ్బులు పూర్తిగా చెల్లించిన వివరాలు నిర్వాహకుడి వద్ద ఉన్నా.. రైతులు తీసుకోలేదని ఎందుకు చెబుతున్నారు. లోన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుడు లేనిది మేనేజర్ లోన్ డబ్బులను ఎవ్వరికి ఇచ్చారు. నిర్వాహకుని వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు. గ్రామంలోని గల 13 గ్రూపులకు 76 మంది ఉండగా కేవలం కొందరే ఎందుకు ఆరోపిస్తున్నారు. రైతులు చెప్పేది నిజమా..? డెయిరీ నిర్వాహకుని మాటలు నిజమా? -
విజయ డెయిరీలో అక్రమాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: పాలు విక్రయించగా వచ్చే మొత్తాన్ని విజయ డెయిరీ అధికారులే మాయం చేశారు. గత రెండేళ్లుగా వరంగల్ జిల్లాలో రూ.46 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో రూ.26 లక్షలు స్వాహా చేసినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. నల్లగొండ జిల్లా ఇందుగులలోని విజయ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ప్లాంట్‌ను ఓ ప్రైవేటు వ్యక్తి మిర్యాలగూడకు తరలించుకుపోయారు. రైతుల నుంచి పాలు కొనకుండా అతనే పాలు సరఫరా చేస్తూ బోగస్ పేర్లతో బిల్లులను నొక్కేసినట్లు గుర్తించారు. రెండున్నరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపించడానికి జిల్లా అధికారులు అతనికి సహకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎలా బయటపడిందంటే... జిల్లాల్లో ఎన్ని పాలు విక్రయిస్తున్నాం... వాటిపై ఎంత ఆదాయం వస్తుందనే అంశంపై అన్ని జిల్లాల అకౌంటింగ్ అధికారులతో డెయిరీ ఎండీ శ్రీనివాసరావు ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో అకౌంట్లలో తేడాలున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేయించారు. రెండు జిల్లాల్లో రూ.72 లక్షల మేర డెయిరీకి రావాల్సిన సొమ్మును స్థానిక అధికారులు జేబుల్లో వేసుకున్నట్లు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురు అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. ప్లాంటును తరలించడంతోపాటు, బోగస్ పేర్లతో పాలు సరఫరా చేస్తూ బిల్లులను నొక్కేస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మిర్యాలగూడలో ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న 2 వేల లీటర్లు, 3 వేల లీటర్లు, ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డెయిరీ మిషనరీని స్వాధీనం చేసుకునేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి నుంచి వచ్చే పాలను గురువారం నుంచి నిలిపివేశారు. సదరు వ్యక్తికి చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయనున్నారు. ఇందుగులలో ప్లాంట్ తరలింపు సమయంలో డీడీగా పనిచేసిన అధికారిని, పాల సొమ్ము స్వాహా చేసిన రెండు జిల్లాల డీడీలను, ఇద్దరు మార్కెటింగ్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఎండీ శ్రీనివాసరావు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో అకౌంట్ విభాగంలోని డీడీ, నల్లగొండ జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న డీడీలపై బదిలీ వేటు పడింది. -
చేప పిల్లల పంపిణీపై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 21,189 జల వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు ఆమోదం తెలిపే ఫైలుపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల సమక్షంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కృత్రిమ పద్ధతి ద్వారా వీర్య సరఫరా చేసి లేగదూడలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రూ.47.50 కోట్లతో కరీంనగర్లో ఏర్పా టు చేయనున్న ప్రాజెక్టు అనుమతుల ఫైలుపై రెండో సంతకం చేశారు. ఇక రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో ఆధునీకరణ, పరికరాలను సమకూర్చేందుకు సంబంధించి రూ. 12.18 కోట్ల ప్రతి పాదనలకు ఆమోదం తెలిపే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో మంత్రికి సచివాలయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం 10.52కి మంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా తలసానికి హోంమం త్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు అభినందనలు తెలిపారు. విజయ డ్రింకింగ్ వాటర్‌కు శ్రీకారం విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, దూద్ పేడ నూతన ప్యాకింగ్, పెట్ జార్లలో నెయ్యి ప్యాకింగ్‌లను తలసాని ఆవిష్కరించారు. పశు ఆరోగ్య కార్డులను విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక, మత్స్య శాఖల కు రూ. వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీ నంబర్‌వన్ స్థానంలో నిలవడం ఖాయ మన్నారు. అనంతరం విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయదారులు నలుగురికి బెస్ట్ వెండర్ అవార్డులను మంత్రి అందజేశారు. -
తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు స్వచ్ఛమైన పాలను అందిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీల్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేశ్‌ప్రభుల చేతుల మీదుగా తెలంగాణ డైయిరీ డెవలప్మెంట్ సహకార సంస్థ (విజయ డెయిరీ) ఎండీ శ్రీనివాస్‌రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్యలు అవార్డు అందుకున్నారు. విజయ డెయిరీకి ఆహార భద్రత–ఆహార నాణ్యత’విభాగంలో అవార్డు రావడం పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయ డెయిరీ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రధానాలయాలకు విజయ నెయ్యి సరఫరా చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేయాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజన్న, బాసర సరస్వతి దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలకు కూడా సరఫరా చేస్తామని, వీటికి నెలకు 50 టన్నుల నెయ్యి అవసరమవుతుందని తెలిపింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు సరఫరా చేసేలా ఉత్తర్వులిస్తే మరింత లాభం చేకూరుతుందని, దీని కోసం ఆదేశాలివ్వాలని కోరింది. మార్కెట్ ధరకు లేదా అంతకంటే తక్కువకే నాణ్యమైన విజయ నెయ్యిని దేవాలయాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. -
లక్ష్యం.. లక్ష లీటర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాల వ్యాపార సంస్థ విజయ డెయిరీ.. మినరల్ వాటర్ విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అంతర్గతంగా మినరల్ నీటిని తయారు చేస్తూ పరిశీలిస్తున్న సంస్థ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ముందుగా లక్ష లీటర్లు లక్ష్యంగా మార్కెట్లోకి అడుగిడుతున్నామని.. 200 మిల్లీ లీటర్లు, అర లీటరు, లీటరు బాటిళ్లతో పాటు 20 లీటర్ల క్యాన్లను తీసుకొస్తున్నామని డెయిరీ వర్గాలు తెలిపాయి. తొలుత హైదరాబాద్‌లో.. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డెయిరీ ప్లాంటులోనే అత్యాధునిక వాటర్ ప్లాంటును నెలకొల్పారు. తొలుత హైదరాబాద్‌లో తాగు నీటిని సరఫరాకు టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వాటిని ఖరారు చేసి ఏజెంట్ల ద్వారా సరఫరా ప్రారంభిస్తారు. నీటి ధరపై మాత్రం యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్లోని ప్రముఖ కంపెనీల ధరలకు కాస్త తక్కువుండేలా కసరత్తు చేస్తున్నారు. అత్యంత తక్కువకు అమ్మడం సాధ్యమవదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెబుతున్నారు. ‘కొత్త’మార్కెటింగ్ విజయ డెయిరీ పార్లర్లను రాష్ట్రవ్యాప్తం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 150 డెయిరీ పార్లర్లు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను 1,000కి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లర్లలో ప్రస్తుతం 14 రకాల పాల ఉత్పత్తులు విక్రయిస్తుండగా త్వరలో మరిన్ని ఉత్పత్తులనూ పరిచయం చేయాలని నిర్ణయించారు. కొన్ని రకాల రుచుల్లో (ప్లేవర్స్) పాలను, బాసుంది, కీర్ మిక్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. టీ స్టాళ్లు, హోటళ్లను దృష్టిలో ఉంచుకొని టీ చేసుకోడానికి మాత్రమే ఉపయోగపడే పాల ను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. పాల ఉత్పత్తుల ప్యాకెట్లు, నాణ్యతలో మా ర్పులు చేయనున్నారు. మార్కెటింగ్‌లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టి మార్కెటింగ్, ప్రచార వ్యవస్థనూ పటిష్టం చేయనున్నారు. త్వరలో మెగా డెయిరీ: అధికారులు విజయ పాలు, పాల ఉత్పత్తులే శ్రేయస్కరమని డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు. శనివారం సోమాజీగూడలో విజయ పార్లర్ ప్రారంభించిన తర్వాత వారు మాట్లాడుతూ.. విజయ పాలను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం లాలాపేటలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ అందుబాటులో ఉందని, దాని స్థానంలో 10 లక్షల లీటర్లతో మెగా డెయిరీకి కసరత్తు చేస్తున్నామన్నారు. అందుకు రుణం కూడా మంజూరైందని తెలిపారు. మెగా డెయిరీని ఎక్కడ నెలకొల్పాలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. -
మధ్యలో హాకా ఏందీ?
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు విజయ సహా ఇతర సహకార డెయిరీల టెట్రా ప్యాక్ పాలను సరఫరా చేస్తామని హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం(హాకా) ప్రకటించడంపై విజయ డెయిరీ యాజమాన్యం మండిపడుతోంది. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని సెప్టెంబర్ నుంచి పాల సరఫరాకు హాకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. పాల సరఫరాకు తాము సిద్ధంగా లేమని డెయిరీ స్పష్టం చేసింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విజయ డెయిరీ ఎండీ బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ వ్యాపార సంస్థలైన విజయ డెయిరీ, హాకాల మధ్య తీవ్ర అగాథం నెలకొంది. మాకు యంత్రాంగం ఉంది తాము అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 5 లక్షల లీటర్ల టెట్రా ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని, కావాలంటే అదనంగా కూడా సరఫరా చేయగలమని విజయ డెయిరీ యాజమాన్యం చెబుతోంది. తాము సరఫరా చేస్తున్నపుడు మధ్యలో హాకా జొరబడాల్సిన అవసరమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమకు పూర్తి స్థాయి యంత్రాంగం ఉందని, హాకాకు అటువంటి పరిస్థితి లేదంటున్నారు. అంగన్వాడీలకు కాకుండా ఏదైనా కొత్త మార్కెట్ చూపిస్తే హాకాకు సహకరించేవారమని, కానీ తాము చేస్తున్న మార్కెట్‌ను వారికెందుకు ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా హాకా.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు నిర్ణయించుకుంటే ఎలాగంటున్నారు. దీనిపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది. వేరే డెయిరీల నుంచి కొంటాం: హాకా ఎండీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న హాకా.. పాల మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. సహకార డెయిరీల నుంచి పాలు కొని అంగన్వాడీలకు సరఫరా చేయడం వల్ల ఏడాదికి రూ. కోటి వరకు ఆర్జించాలని భావిస్తోంది. ఇందుకోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే విజయ డెయిరీ నుంచి టెట్రా ప్యాక్ పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ హాకాకు పాలు సరఫరా చేయబోమని విజయ స్పష్టం చేయడంతో కథ అడ్డం తిరిగినట్లయింది. దీనిపై హాకా ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా.. విజయ యాజమాన్యం ఇలా ఎందుకు అంటున్నదో అర్థం కావడం లేదన్నారు. విజయకు తొలుత ప్రాధాన్యం ఇస్తామని, లేదంటే ఇతర సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. అంగన్వాడీలకు పాలు సరఫరా చేయడానికి ఏర్పాటైన కమిటీ ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. -
‘విజయ’ పథంలో నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీలో ఏడాదిగా అమలు చేస్తున్న పలు సంస్కరణలను రద్దు చేస్తూ యాజమాన్యం సంచలన నిర్ణ యం తీసుకుంది. విజయ డెయిరీ ఎండీగా 10 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పాల విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణమైన డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను రద్దు చేశారు. దానిస్థానంలో 40 ఏళ్లు ఉనికిలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. హైదరాబాద్‌లో 1,650 మంది ఏజెంట్లు ఉన్నారు. తాజా నిర్ణయంతో వారంతా తిరిగి డెయిరీలో భాగస్వామ్యం కానున్నారు. దీంతో విజయ డెయిరీకి పూర్వ వైభవం వస్తుందని డెయిరీ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లో విజయ పాల విక్రయాలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం పాల విక్రయాలు 4 లక్షల లీటర్లుండగా, ఇప్పుడు రెండున్నర లక్షల లీటర్లకు పడిపోయాయి. దీంతో సంస్థ టర్నోవర్‌లో రూ.240 కోట్లు తగ్గిందని డెయిరీ వర్గాలు వెల్లడించాయి. 4 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకు పాల విక్రయాలు పెంచుతామంటూ గతేడాది అనేక సంస్కరణలకు తెరలేపిన సంస్థ చివరకు ఉన్న విక్రయాలనే కాపాడుకోలేని దుస్థితికి చేరింది. రాన్రాను డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు వచ్చాయి. ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో తిరోగమన బాట ఏడాది క్రితం వరకు విజయ డెయిరీ నుంచి వినియోగదారులకు పాలను ఏజెంట్లే చేరవేసేవారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లించేది. రాష్ట్రంలో విజయ డెయిరీకి పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లోనే పాల విక్రయాలు జరుగుతుంటాయి. నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలను సరఫరా చేస్తుండేవారు. కానీ డెయిరీ యంత్రాంగం వెనుకాముందు ఆలోచించకుండా ఈ ఏజెంట్ల వ్యవస్థను గతేడాది రద్దు చేసింది. వారి స్థానే సుమారు 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్ కార్యాలయాలుండగా.. వాటినీ రద్దు చేశారు. పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే పాల విక్రయాలు ఆధారపడేలా చేశారు. అయితే ఈ నిర్ణయంతో మెరుగవుతుందనుకున్న పరిస్థితి మరింత దిగజారింది. ఓ వైపు ఏజెంట్లు.. మరోవైపు ఉద్యోగులు గతంలో ఏజెంటు కమీషన్ లీటరుకు రూ.2.50 ఇచ్చేవారు. రవాణాకు అయ్యే ఖర్చుకు డెయిరీ 70 పైసలు చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ ఏకంగా రూ.3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. పైగా డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థకు ఎలాంటి అనుభవం లేదు. రాజకీయ అండదండలున్న వారికి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసిన వారంతా ఆందోళనలు చేశారు. ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణకు దిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఎండీ శ్రీనివాసరావు పాత సంస్కరణలకు చరమగీతం పాడారు. మరోవైపు ప్రైవేటు డెయిరీల నుంచి ఐదు వేల లీటర్ల పాలను విజయ డెయిరీ యాజమాన్యం తీసుకోవడానికి నిరాకరించింది. నాణ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. -
ఆగస్టులో గేదెల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పాడి గేదెల పంపిణీ విధివిధానాలపై వివిధ జిల్లాల పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి తలసాని, పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విజయడెయిరీ, ముల్కనూర్, మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీల్లో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మందికి సబ్సిడీపై పాడిగేదెలు, ఆవులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గేదెల కొనుగోలుపై లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించా రు. పంపిణీ చేసే గేదెలకు ఒక్కో దానికి యూనిట్ ధరలో 3 ఏళ్ల పాటు బీమా, 300 కిలోల దాణా ఇస్తామన్నారు. అంతేకాకుండా అదనంగా రూ.5 వేలు చెల్లిస్తామన్నారు. 31 నుంచి చేప పిల్లల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 31న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని వెల్లడించారు. చేప పిల్లల విడుదల ఏర్పాట్లపై సోమ వారం సచివాలయంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, ఇతర మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఘన్పూర్ చెరువులలో తాను స్పీకర్‌తో కలసి చేపపిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి చందులాల్‌తో కలసి ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. చేపపిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విడుదల కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అధికారులకు సూచించారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీపై వాహనాలను ఆగస్టు నెలాఖరు నాటికి అందించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభు త్వం అన్ని విధాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయపర్చుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నేల‘పాలు’ చేస్తుంటే కొత్తవేల!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం రైతుల నుంచి సేకరిస్తున్న పాలనే విక్రయించే పరిస్థితి లేక కునారిల్లుతుంటే, మరోవైపు కొత్తగా సబ్సిడీపై పాడి పశువులు ఇస్తే వాటి పాలను ఏం చేయాలో అంతుబట్టక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నాణ్యమైన పాలు కావంటూ అనేకచోట్ల రోజూ వేలాది లీటర్లు పారబోస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 2 లక్షల లీటర్ల పాలు పారబోయడంతో రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇలా వచ్చే పాలను అడ్డుకుంటుంటే, సబ్సిడీపై ఆవులు, గేదెలు ఇచ్చాక వచ్చే పాలను ఏం చేయాలన్న ఆందోళన విజయ డెయిరీలో నెలకొంది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, డెయిరీ అధికారులు కానీ ఎలాంటి ఆలోచనా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విక్రయాలేవీ..? వినియోగదారుల్లో విజయ డెయిరీ పాలపై మంచి అభిప్రాయమే ఉంది. కానీ మార్కెటింగ్‌లో సంస్కరణలు చేయడంతో ఒక్కసారిగా విజయ పాల విక్రయాలు పడిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కొనసాగిన 1,600 మంది ఏజెంట్లను, ఆ వ్యవస్థను రద్దు చేయడంతో డెయిరీ పతనం ప్రారంభమైంది. ఏజెంట్ల వ్యవస్థ స్థానంలో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, డిస్ట్రిబ్యూటర్లంతా రాజకీయ అండదండలున్న వారే కావడంతో అనుభవం లేక విజయ డెయిరీ వ్యవస్థ కుప్పకూలిందన్న ఆరోపణలున్నాయి. రోజూ లక్ష లీటర్ల మిగులు! విజయ డెయిరీకి రోజూ 65 వేల మంది పాడి రైతులు 3.6 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం డెయిరీ పాల విక్రయాలు రెండు లక్షల లీటర్లకు అటుఇటుగా ఉన్నాయి. 40 వేల లీటర్లను అంగన్వాడీలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో రోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. వాస్తవానికి మిగులు పాలను పొడి, వెన్న తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతుంటారు. కానీ ఇప్పటికే తయారు చేసిన రూ.90 కోట్ల విలువైన పాల ఉత్పత్తులు అమ్ముడుపోక డెయిరీ నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రోజూ లక్ష లీటర్ల పాలు మిగిలిపోతుంటే ఏంచేయాలో అధికారులకు అంతుబట్టడంలేదు. కొత్తగా మరో 6 లక్షల లీటర్లు! ప్రభుత్వం విజయ డెయిరీ సహా మరో మూడు డెయిరీలకు పాలు పోసే రైతులకు సబ్సిడీపై పాడి పశువులు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి గేదెలు లేదా ఆవులను సరఫరా చేస్తారు. 8 లీటర్లు ఇచ్చే గేదెలు, 10 లీటర్లు ఇచ్చే ఆవులను కొనుగోలు చేయాలని పశుసంవర్థక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చాలామంది రైతులు ఆవులనే అధికంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 65 వేల మంది పాడి రైతుల నుంచి 65 వేల సబ్సిడీ గేదెలు లేదా ఆవుల ద్వారా మరో 6 లక్షల లీటర్ల వరకు పాలు అదనంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వస్తున్న 3.5 లక్షల లీటర్లనే విక్రయించే పరిస్థితి లేక విజయ డెయిరీ యాజమాన్యం పారబోస్తుంటే, అదనంగా వచ్చే మరో 6 లక్షల లీటర్ల పాలను ఏం చేయగలరన్నది అందరినీ వేధి స్తున్న ప్రశ్న. సబ్సిడీ పాడి పశువులు వచ్చాక మొత్తం 10 లక్షల లీటర్ల పాలు రోజూ విజయ డెయిరీకి రానున్నాయి. కానీ విక్రయాలు మాత్రం 2 లక్షల లీటర్లే. ఆ ప్రకారం మరో 8 లక్షల లీటర్లు రోజూ డెయిరీ వద్ద మిగిలిపోతాయనే చర్చ జరుగుతోంది. సెలవులపై వెళ్లే యోచనలో అధికారులు నెల రోజుల వ్యవధిలో రెండు లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ పారబోసింది. పారబోసిన పాల సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని కూడా నిలిపివేసినట్లు సమాచారం. డెయిరీకి చెందిన చిల్లింగ్ కేంద్రాలు, బల్క్‌మిల్క్ యూనిట్లు, గ్రామా ల్లో ఉన్న సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలన్నీ విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వస్తుంటాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్‌లో పారబోశారు. ఇప్పటినుంచి ఆయా కేంద్రాల వద్దే నాణ్యత నిర్ణయించి తిరస్కరించాలని, రైతులకు చెల్లింపులు ఉండవన్న నిర్ణయం తీసుకునేందుకు డెయిరీ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆయా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రైతులకు ఇచ్చే సొమ్ముకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనివల్ల పాడి రైతులు తమపై దాడులు చేసే అవకాశముందన్న భయాందోళనతో ఉన్నారు. దీంతో ఓ కేంద్రంలో పనిచేసే అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. మరికొందరు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలిసింది. -
లక్షన్నర లీటర్లు నేల‘పాలు’!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులు తెచ్చే పాలను విజయ డెయిరీ నేలపాలు చేస్తోంది. నెల రోజుల్లో ఏకంగా లక్షన్నర లీటర్లకుపైగా పాలను మురుగు కాలువల్లో పారబోసింది. ఈ పాలకు సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని డెయిరీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్రమేంటంటే విజయ డెయిరీకి చెందిన చిల్లింగ్ కేంద్రాలు, బల్క్‌మిల్క్ యూనిట్లు, గ్రామాల్లోని సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలు విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వచ్చాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్ తీసుకొచ్చాక ‘నాణ్యత’పేరుతో నేలపాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలు బాగో లేకపోతే రైతుల వద్దే తిరస్కరించాల్సింది పోయి తీరా తెచ్చాక నాణ్యత లేదని పారబోయడంపై ఆరోపణలు వస్తున్నాయి. పారబోసిన పాలకు సేకరణ ధర, ప్రోత్సాహకం ఎవరిస్తారని రైతులు నిలదీస్తున్నారు. ఆయా కేంద్రాలకు చెందిన మేనేజర్లు మాత్రం డబ్బులు వస్తాయని, కంప్యూటర్లో మిస్ అయిందని నచ్చజెప్పుతున్నారు. నాణ్యత పేరుతో.. విజయ డెయిరీకి అనేక గ్రామాల్లో సేకరణ కేంద్రాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 165 బల్క్ మిల్క్ యూనిట్లు, 15 చిల్లింగ్ సెంటర్లు, 8 డెయిరీలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు పాడి రైతులు పాలు పోస్తుంటారు. ఆ కేంద్రాల నుంచి ప్రతీ రోజూ 3.60 లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ విజయ డెయిరీకి వస్తాయి. అయితే ప్రస్తుతం విజయ డెయిరీ పాల విక్రయాలు 2 లక్షల లీటర్లకు అటుఇటుగానే ఉన్నాయి. ఇక 40 వేల లీటర్లను అంగన్వాడీ కేంద్రాలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో ప్రతీరోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగిలిపోతున్నాయి. వాటిని పాలపొడి, వెన్న ఇతరత్రా అనుబంధ ఉత్పత్తులను తయారుచేయడానికి వినియోగించాలి. కానీ ఇప్పటికే కోట్ల విలువైన వెన్న, పాల పొడి చిత్తూరు జిల్లా పలమనేరులో వృథాగా పడి ఉంది. దీంతో ఏం చేయాలో విజయ డెయిరీ యాజమాన్యానికి అంతు బట్టడంలేదు. అదనంగా వచ్చే పాలను ఎలాగైనా వదిలించుకునేందుకు పారబోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేకుంటే ఆయా పాల నుంచి క్రీమ్ తీసి వెన్న, పన్నీర్ వంటివి తయారుచేసేవారు. అందుకు పాల సేకరణ ధరలో పావుశాతం చెల్లించేవారు. అది కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది. కానీ ఇప్పుడలా కాదు. యాంటీ బయోటిక్స్ ఉన్నాయని, ఇతరత్రా కారణాలు చెబుతూ పారబోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిజంగా నాణ్యత లేకుంటే జిల్లాల్లోని విజయ డెయిరీ కేంద్రాల వద్దే తిరస్కరిస్తే రైతులు వాటిని వెనక్కి తీసుకెళ్లేవారు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత? గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో విజయ డెయిరీ మన్సాన్పల్లి కేంద్రానికి చెందిన 25 వేల లీటర్ల పాలను పారబోశారు. అలాగే కొత్తపేట కేంద్రానికి చెందిన 30 వేల లీటర్లు, కందుకూరుకు చెందిన 15 వేలు, బొమ్మలరామారానికి చెందిన 10 వేలు, వనపర్తి కేంద్రానికి చెందిన 10 వేలు, చేవెళ్ల కేంద్రానికి చెందిన 12 వేలు, ఇందుగులకు చెందిన 15 వేలు, జనగామకు చెందిన 18 వేలు, ఖమ్మంకు చెందిన 7 వేలు, చౌటుప్పల్ కేంద్రానికి చెందిన 6 వేల లీటర్లను పారబోసినట్లు విజయ డెయిరీకి చెందిన కొందరు అధికారులు తెలిపారు. ఇలాగైతే మూతే.. ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున పాల సేకరణ పెరిగింది. కానీ ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల విక్రయాలు పడిపోయాయి. పాల సేకరణ వద్దనుకుంటే ముందే రైతులకు చెప్పాలి కానీ నాణ్యత పేరుతో పారబోయడం సరికాదు. విజయ డెయిరీ ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే మూతపడే ప్రమాదముంది. కె.యాదయ్య, ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎందుకు పారబోస్తున్నారు? పాల సేకరణ అధికంగా ఉంది. విక్రయాలు పడిపోతున్నాయి. ఇదే విజయ డెయిరీ ఎదుర్కొనే ప్రధాన సమస్య. దీంతో మిగిలిన పాలను గతేడాది సెప్టెంబర్ నుంచి చిత్తూరు జిల్లా పలమనేరులోని పరాగ్ డెయిరీకి పంపి పాల పొడి, వెన్న తయారు చేయించారు. రూ.90 కోట్ల విలువైన 1300 టన్నుల వెన్న, 2 వేల టన్నుల పాల పొడి అక్కడ పేరుకుపోయి ఉన్నట్లు విజయ డెయిరీకి చెందిన ఒక అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇది ఈ ఏడాది అక్టోబర్ నాటికి గడువు తీరిపోనుంది. మరోవైపు వాటిని ఇప్పుడు విక్రయించాలనుకుంటున్నా అమ్ముడుపోవడం లేదు. పాలపొడి అక్కడ తయారు చేయడానికి ఒక కేజీకి రూ.250 అవుతోంది. కానీ బయటి మార్కెట్లో రూ.100 ధరే పలుకుతోంది. ఇలా ఎటు చూసినా నష్టమే కనిపిస్తుంది. ప్రస్తుతం మిగిలే పాలను మళ్లీ వెన్న, పొడి తయారు చేయించే పరిస్థితి లేదు. దీంతో నాణ్యత లేదంటూ పాలను పారబోస్తున్నట్లుగా తెలుస్తోంది. -
పాడి రైతుపై పిడుగు
సాక్షి, హైదరాబాద్ : విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు చేదువార్త. వారికిచ్చే సేకరణ ధరను తగ్గించాలని డెయిరీ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఆవు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 తగ్గించేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. డెయిరీలోని అనేక వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా యంత్రాంగం మాత్రం వెనక్కి తగ్గనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆవు పాల సేకరణ ధరను వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ. 29.26 నుంచి రూ. 33.43 వరకు ఇస్తున్నారు. ఇక నుంచి ఆయా కేటగిరీల్లోని వాటన్నింటికీ రూ. 4 తగ్గించే అవకాశముంది. డెయిరీకి రైతుల నుంచి వచ్చే 4 లక్షల లీటర్ల పాలలో 20 వేల లీటర్లే గేదె పాలు కాగా, మిగిలిన 3.80 లక్షల లీటర్లు ఆవు పాలే. కాబట్టి ఆవు పాలు పోసే రైతులందరికీ ఇది పిడుగులాంటి నిర్ణయమంటున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే డెయిరీ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 4 లక్షల నుంచి 2 లక్షల లీటర్లకు.. విజయ డెయిరీ పాల విక్రయాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఏడాదిక్రితం రోజుకు 4 లక్షల లీటర్ల విక్రయాలు ఉండగా, ప్రస్తుతం 2 లక్షల లీటర్లకు పడిపోయాయి. కానీ రైతుల నుంచి సేకరణ మాత్రం అలాగే ఉంది. రూ. 4 ప్రోత్సాహకం ఇస్తుండటంతో దాదాపు 65 వేల మంది రైతులు విజయ డెయిరీకే పాలు పోస్తున్నారు. అయితే వినియోగదారులకు పాల విక్రయాలు పెరగకపోవడంతో అదనంగా వచ్చిన పాలను పొడి చేసి నిలువ ఉంచుతున్నారు. కానీ అవీ అమ్ముడుపోక గడువు తీరే దశకు చేరుతుండటంతో రూ.కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఏం చేయాలో అంతుబట్టక సేకరణ ధర తగ్గిస్తే పాలు పోయరనీ, దాంతో నష్టాలపాలవుకుండా చూసుకోవచ్చని యాజమాన్యం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విక్రయాలు పెంచుకోకుండా రైతుకిచ్చే ధరను తగ్గించడం డెయిరీ చరిత్రలో తొలిసారి అంటున్నారు. ఏజెంట్ల స్థానంలో డిస్ట్రిబ్యూటర్లు డెయిరీ నుంచి పాలను వినియోగదారులకు చేరవేసేది ఏజెంట్లే. 40 ఏళ్ల నుంచి ఏజెంట్ల ద్వారానే పాలు సరఫరా చేస్తున్నారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో విజయకు పూర్తి స్థాయిలో హైదరాబాద్‌లోనే విక్రయాలుంటాయి. ఆ ప్రకారం నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలు సరఫరా చేస్తుండేవారు. కానీ 40 ఏళ్లుగా డెయిరీతో పెనవేసుకుపోయిన ఏజెంట్ల వ్యవస్థను యంత్రాంగం రద్దు చేసింది. వారి స్థానంలో 112 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్ కార్యాలయాలుండగా వాటినీ రద్దు చేశారని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి. కమీషన్ రూ.3.90కు పెంపు గతంలో ఏజెంటు కమీషన్ లీటరుకు రూ. 2.50 ఇచ్చేవారు. రవాణా ఖర్చుకు గాను 70 పైసలు డెయిరీ చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ను రూ. 3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసినవారు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో పాల విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అధికారుల్లోనూ విభేదాలు పొడసూపాయి. చివరకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా డెయిరీని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా అధికారుల నిర్ణయాలు శాపాలుగా మారాయన్న చర్చ జరుగుతోంది. -
ప్రగతిపథంలో పాడి పరిశ్రమ: భూమారెడ్డి
హైదరాబాద్: పాడి పరిశ్రమాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) చైర్మెన్ లోక భూమారెడ్డి చెప్పారు. విజయ డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లాలాపేటలోని కార్యాలయంలో ఆయనను అధికారులు, ఉద్యోగులు అభినందించారు. ఏడాదికాలంలో పాల ఉత్పత్తిదారుల సంఖ్యను 44,432 నుంచి 67,259 వరకు, పాల సేకరణను 3,10,000 నుంచి 4 లక్షల లీటర్ల వరకు పెంచామని ఆయన చెప్పారు. డెయిరీలో ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి సాధించామని, ఈ మేరకు టీఎస్పీఎస్సీ చర్యలు తీసుకుంటోందని వివరించారు. కారుణ్య నియామకాల కింద 20 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఢిల్లీ, ముంబైలో విజయ పాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పించామని పేర్కొ న్నారు. సంస్థ టర్నోవర్‌ను రూ.650 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు పెంచాలనే ఉద్దేశంతో పాలను, పాల ఉత్పత్తులను అధికంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పార్లర్ల సంఖ్యను 150 నుంచి వెయ్యి వరకు పెంచుతున్నట్లు తెలిపారు. హరితహారంలో విజయ పాడి రైతులను భాగస్వామ్యం చేశామన్నారు. -
నిధులిస్తున్నా.. అభివృద్ధి లేదేం?
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోవడం విచారకరమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాల్లోనే విజయ పాలు, ఉత్పత్తులు లభించడం లేదన్న ఫిర్యాదులు అనేకం ఉన్నాయని మండిపడ్డారు. ముందుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, జాతీయ రహదారుల వెంట ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విజయ ఉత్పత్తులే వాడండి.. వివిధ పథకాల కింద డెయిరీకి నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తలసాని మండిపడ్డా రు. హోర్డింగ్‌లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్వేస్టేషన్లు, టీవీలలో విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. విజయ ఉత్పత్తుల విక్రయానికి నూతనంగా వెయ్యి ఔట్లెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు విజయ ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం విజయ ఉత్పత్తులు మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అధికారులకు విక్రయాలపై లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారం కోసం ఒక ఏజెన్సీని నియమించుకునే విషయంపై కూడా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. రైతులతో నూతన సొసైటీల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముందన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
నేటి నుంచి ‘విజయ’ ఉద్యోగుల నిరసన
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ నష్టాలబాట పట్టడంలో మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆ సంస్థ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ సంస్థ ఎండీకి నిరసన నోటీసును అందించినట్లు విజయ డెయిరీ సిబ్బంది, వర్కర్స్ బి–22, అధికారుల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిరసనలో భాగంగా శనివారం నుంచి గేట్ మీటింగ్, మహాధర్నా, పెన్‌డౌన్, నిరాహారదీక్షలు, రిలే నిరాహారదీక్షలు, నల్లబ్యాడ్జీలు ధరించడం, అర్ధనగ్న నిరసనలు చేస్తామని సంఘం నేతలు శ్రీనివాస్, యాదయ్య వెల్లడించారు. కొత్త పంపిణీ పద్ధతి ద్వారా తెలంగాణ విజయ డెయిరీ పాల విక్రయాలు 4.20 లక్షల నుంచి 3.60 లక్షల లీటర్లకు పడిపోయినట్లు వివరించారు. దీంతో నెలకు రూ. 12 కోట్లు నష్టం వాటిల్లుతుందన్నారు. డెయిరీ నష్టాలకు ప్రస్తుత ఎండీ ఏకపక్ష నిర్ణయాలే కారణమని, అందువల్ల తక్షణమే ఎండీని బదిలీ చేయాలని కోరారు. -
ప్రభుత్వ డెయిరీ బేజారు
సాక్షి, హైదరాబాద్ : ఏడాదికేడాదికి విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయాలు దారుణంగా పడిపోతున్నాయి. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన అమూల్, కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందినీ డెయిరీలు రాకెట్లా దూసుకుపోతుంటే.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ మాత్రం నిర్లక్ష్యపు మాటున చిక్కుకొని విలవిల్లాడుతోంది. డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా.. పాల సేకరణ దారుణంగా పడిపోతోంది. అధికార యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాల డెయిరీలతో కొందరు విజయ డెయిరీ అధికారుల లాలూచీ కూడా విక్రయాలు పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు. రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీల పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. అందులో విజయ డైయిరీ 3.28 లక్షల లీటర్లు మాత్రమే విక్రయిస్తోంది. మూడేళ్ల క్రితం 5.5 లక్షల లీటర్లు విక్రయించింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నా విక్రయాలు పడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015 జూలైలో విజయ పాల విక్రయాలు 4.23 లక్షల లీటర్లుంటే.. ఇప్పుడు 3.28 లక్షల లీటర్లకు పడిపోయాయి. నెయ్యి, వెన్న, పన్నీర్, మజ్జిగ, లస్సీ తదితర పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2015–16లో 12 రకాల పాల ఉత్పత్తుల విక్రయాలు రూ.179.84 కోట్లుంటే.. 2016–17లో వాటి విక్రయాలు రూ.118.67 కోట్లకు పడిపోయాయి. అంటే ఏకంగా రూ.61.17 కోట్ల విక్రయాలు తగ్గాయి. అందులో నెయ్యి అమ్మకాలు గణనీయంగా పడిపోవడం గమనార్హం. 2015–16లో నెయ్యి విక్రయాలు రూ. 106.73 కోట్లు కాగా.. 2016–17లో రూ.86.83 కోట్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రూ.30 కోట్ల విలువైన బటర్, పొడి వృథా తెలంగాణలో అదనంగా ఉండే పాలను పాల పొడి, బటర్ తయారు చేసేందుకు గతేడాది జనవరిలో ఒంగోలులోని సంగం డెయిరీకి పంపారు. పాల ద్వారా 849 టన్నుల పౌడర్, 325 టన్నుల వైట్ బటర్ తయారైంది. ఏడాదైనా తీసుకురాకుండా రూ.28 కోట్ల విలువైన పొడి, బటర్‌ను అక్కడే వదిలేశారు. తీరా ఇప్పుడు వాటి గడువు తీరిపోయింది.అలాగే గుంటూరులోని ఓ డెయిరీలో రూ.2.10 కోట్ల విలువైన 18 టన్నుల పొడి, 9.75 టన్నుల బటర్ తయారైంది. దాన్ని కూడా అక్కడ్నుంచి తీసుకురాకపోవడంతో గడువు తీరిపోయింది. ఇలా రూ.30 కోట్ల విలువైన బటర్, పాల పొడి వృథా అయింది. మన పాలతో తయారు చేసిన పాలపొడిని, బటర్‌ను ఒంగోలు, గుంటూరుల నుంచి తీసుకురాకుండా మరోవైపు ప్రైవేటు సంస్థల వద్ద ఉండే పాలపొడి, బటర్‌ను సేకరించేందుకు టెండర్లు పిలవడం విమర్శలకు దారితీసింది. ఆ పథకంతో రూ.3 కోట్ల నష్టం విజయ పాల విక్రయాలను పెంచడానికి డెయిరీ యాజమాన్యం ఓ పథకం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం 12 లీటర్ల బాక్సుకు ఒక లీటరు పాలను ఏజెంట్లకు ఉచితంగా సరఫరా చేసింది. అలా ప్రతిరోజూ 8 నుంచి 10 వేల లీటర్ల పాలను ఏజెంట్లకు అప్పనంగా పంచిపెట్టింది. దీంతో సంస్థకు ఏకంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. అలా చేసినా అమ్మకాలు పెరిగాయా అంటే పెరగలేదు. సరికదా అంతకుముందు కంటే 20 వేల లీటర్ల వరకు తగ్గిపోయినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు చెల్లించాల్సిన పాల సొమ్మును కూడా నెలల తరబడి ఆపేస్తుండటంతో వారు ప్రైవేటు డెయిరీల వైపు తరలిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. -
విజయ పథం
పాడి రైతులతో గ్రామ స్థాయిలో సొసైటీలను ఏర్పాటు చేయడానికి విజయ డెయిరీ ఏర్పాట్లు చేస్తోంది. పాలుపోసే రైతులు వేలల్లో ఉన్నా కేవలం 120 సొసైటీలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 100 సొసైటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాడి రైతులకు బీమా, సైకిళ్ల పంపిణీ, పశువుల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం వంటి వసతులను కల్పిస్తుంది. విజయ డెయిరీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక రోజుకు పాల సేకరణ :3.60 లక్షల లీటర్లు ‘విజయ’కు పాలు పోస్తున్న రైతులు :4.62 లక్షలు పాలను సేకరిస్తున్న గ్రామాలు :8,500 గుర్తింపు పొందిన సొసైటీలు : 128 బల్క్ మిల్క్ సెంటర్లు : 108 చిల్లింగ్ సెంటర్లు : 14 పాల డెయిరీలు : 06 వైఎస్సార్ హయాంలో విజయ డెయిరీ బలో పేతమైంది. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పశుక్రాంతి పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలిచారు. నెలకు రూ.40 కోట్లకు పైగా చెల్లింపులు.. పాడి రైతులకు విజయ డెయిరీ నెలకు రూ.40 కోట్లకుపైగా చెల్లిస్తోంది. 10 మిల్క్ యూనిట్ల వారీగా పాలు పోసే రైతులకు ప్రతి 15 రోజుల కొకసారి చెల్లిస్తున్నారు. రైతులతో సొసైటీలు ఏర్పాటు చేస్తే విజయ డెయిరీ దూసుకుపోనుంది. సాక్షి, జనగామ: ప్రైవేటు కంపెనీలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ పాల సేకరణలో రైతుల ఆదరణను పొందుతోంది. కార్పొరేట్ సంస్థలకు దీటుగా రోజుకు 3.60 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. భవిష్యత్‌లో మరింతగా వృద్ధి సాధించేందుకు సన్నాహాలు చేసు కుంటోంది. లీటర్ పాలలో ఫ్యాట్‌ను ఆధారంగా చేసుకుని ధర నిర్ణయించి రైతులకు నేరుగా డబ్బులను చెల్లిస్తున్నారు. అయితే ఒక్కో లీటర్‌కు అదనంగా ఇన్సెంటివ్ రూపంలో రూ.4 చొప్పున ఇస్తున్నారు. లీటర్ ధరతోపాటు ప్రోత్సాహంగా రూ.4 చెల్లించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్సెంటివ్ ప్రకటించడంతో విజయ డెయిరీకే పాలు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. అవుట్‌లెట్స్ ఏర్పాటు మన పాలు మనకే నినాదంతో విజయ డెయిరీ అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు ఏజెంట్లకు పాలు, పాల పదార్థాలను విక్రయించే బాధ్యతలను అప్పగించడంతో అనుకున్న స్థాయిలో వినియోగదారులను ఆకర్షించ లేకపోయింది. ఈ లోపాన్ని గుర్తించిన అధికారులు సొంతంగా అవుట్‌లెట్స్ ఏర్పాటు చేసుకున్నారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత గతంలో విజయ డెయిరీకి పాలు అమ్మితే డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఒక్కో పాడి రైతుకు వేలల్లో బకాయిలు పేరుకుపోయేవి. మూడు లేదా ఆరు నెలలకోమారు బిల్లులను చెల్లించడం వల్ల పాలను విజయ డెయిరీకి బదులు ఇతర కంపెనీలకు అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ విధానం పూర్తిగా మారిపోయింది. ప్రతి 15 రోజులకోమారు బిల్లులను చెల్లిస్తున్నారు. గ్రామాల్లోని బీఎంసీల వారీగా పాడి రైతులకు నేరుగా డబ్బులను ఇచ్చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడంతో విజయ డెయిరీ పాల సేకరణలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. విజయ పాల ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకుపోవడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తక్కువ పాల ఉత్పత్తి జిల్లాలు మంచిర్యాల 115, వరంగల్ రూరల్ 2,835, భూపాలపల్లి 548, మహబూబాబాద్ 1,620, యాదాద్రి 1,681, జగిత్యాల 1,453, సిరిసిల్ల 1,275, కొత్తగూడెం 320 గోడలపై పాల ధరలు, ఉత్పత్తుల వివరాలను రాయిస్తుండటంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. విజయ పాల సేకరణ లేని జిల్లాలు .. ఆదిలాబాద్, ఆసీఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి -
300 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
♦ మెగా డెయిరీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి తలసాని ♦ సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీని రూ. 300 కోట్లతో ఆధునీకరించి మెగా డెయిరీగా అభివృద్ధి చేయనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ప్రైవేటు డెయిరీలకు దీటుగా ఉత్పత్తులు, విక్రయాలను పెంచేందుకు విజయ డెయిరీలో వచ్చే 6 నెలల్లో కీలక మార్పులు తెస్తామన్నారు. శనివారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సంస్థ ఎండీ నిర్మలతో కలసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ లాలాపేట్‌లోని డెయిరీ కేంద్రంలో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్త్యంగల ప్లాంటు పనిచేస్తోందని, దీనికి అదనంగా మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంగల మరో ప్లాంట్‌ను ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయనున్నట్లు తలసాని వివరించారు. ఇందుకోసం షామీర్పేట సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లో విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రైవేటు సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించట్లేదు... విజయ పాలు, పాల ఉత్పత్తులకు రాష్ట్రంలో ఎంతో డిమాండ్ ఉందని, కానీ అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే సంస్థ పనితీరు రోజురోజుకు దిగజారిపోతుందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణాలోపంతో విక్రయాల్లో వెనుకబడిందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తున్నా ప్రైవేటు సంస్థలకంటే కూడా పాల సేకరణ, పాల ఉత్పత్తుల తయారీలో ఎంతో వెనుకబడిపోయామని అసహనం వ్యక్తం చేశారు. సంస్థ మనుగడ కోసం ముందుగా దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులను తక్షణమే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. అధికారులకు టార్గెట్లు ఇవ్వాలని, జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని సమీక్షించాలని సూచించారు. రాజధానిలో మరో 100 ఔట్లెట్లు డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న వాటికి అదనంగా 100 ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు సొసైటీలను ఏర్పాటు చేయాలన్న తలసాని...ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో డెయిరీకి పాలు పోసే రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. విజయ నెయ్యికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా ఈ సంవత్సరం అమ్మకాలు తగ్గాయని, ఇది సంస్థ మనుగడకు మంచిది కాదన్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు అవసరమైతే ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్‌కు సమానంగా ఇవ్వాలన్నారు. -
‘విజయ’కు సీఎం ఫాంహౌస్ పాలు
మర్కూక్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో ఉత్పత్తయ్యే పాలను తన దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో విజయ డెయిరీ కేంద్రంలో ఫాంహౌస్ సిబ్బంది పోస్తున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని పాడి పశువుల పాలను స్వయంగా ఎర్రవల్లిలో పోయడంతో గ్రామ పాడి రైతులు కూడా తమ పాలను పోసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎం ఫాంహౌస్‌లోని 5 ఆవులు, 6 గేదెలు ఉన్నా యి. ప్రస్తుతం పాడి పశువులు పాలు ఇవ్వ డంతో ప్రతి నిత్యం ఎర్రవల్లి విజయకేం ద్రంలో పాలను విక్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలు మొత్తం 55 లీటర్ల పాలను పోస్తున్నారని గ్రామ వీడీసీ, కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గేదెలను పంపిణీ చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం 155 మంది గేదెలను కొనుగోలు చేశారు. వీరికి పశువైద్యాధి కారు లు చెక్కును కూడా అందించారు. వారు కూడా ప్రస్తుతం పాలను విజయ డెయిరీలోని పోస్తున్నారు. రోజూ 400 లీటర్ల వరకు పాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. గేదెల కొనుగోలు కోసం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ, ఓసీలకు 80 శాతం సబ్సిడీపై పాడి పశువులను అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి గేదెను, లేదా ఆవు కొనుగోలు కు రూ.45 వేల చెక్కును అంది స్తున్నారు. మిగతా మరో పశువు కోసం జూన్, జూలైలో మరో చెక్కును అందించనున్న ట్లు గ్రామ వీడీసీ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఎర్రవల్లి పాలవెల్లిగా మారుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పాడితోనే శిరుల పంట
రుద్రవరం: గ్రామీణ ప్రాంతాల్లో పాడి ఉన్న ఇల్లు శిరుల పంటను కురుపిస్తుందని నంద్యాల విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, ఆళ్లగడ్డ పçశు సంవర్ధక సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకటేశ్వర్లులు అన్నారు. శనివారం స్థానిక పాల ఉత్పత్తిదారుల సహకార శీథలీకరణ కేంద్రం మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రవరం మండలంలో కేంద్రం ప్రారంభంలో 22 గ్రామాల ద్వారా రోజుకు 1200 లీటర్ల పాల సేకరణ జరిగేదని ప్రస్తుతం 37 గ్రామాల నుంచి 3వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందన్నారు. పాల ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసేందుకు సిటీ యూనియన్ బ్యాంక్ ద్వారా రూ.1.10 కోట్ల రుణాలు పాల ఉత్పత్తి దారులకు అందించినట్లు చెప్పారు. మహిళ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో నేషనల్ డెయిరీ కింద 52 సొసైటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రుద్రవరం మండలంలో పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, చందలూరు, రుద్రవరంలో రెండు సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీతో పరికరాలను ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో విజయ డెయిరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సుబ్బరాయుడు, పశువైద్యాధికారులు డాక్టర్ మనోరంజన్, శ్రీనివాసులు, నీల కంటేశ్వరరెడ్డి, రమణారావు, ఆయా గ్రామాల పాల ఉత్పత్తి సేకరణ దారులు పాల్గొన్నారు. -
విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తా
పాడి పరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పాడి రైతుల సంక్షేమం కోసం విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తానని కొత్తగా నియమితు లైన తెలంగాణ పాడిపరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి స్పష్టం చేశారు. బుధ వారం హైదరాబాద్ లాలాపేటలోని విజయభవన్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. విజయభవన్ ఎదుట ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. పాడి రైతులను ఆదుకునే క్రమంలో లీటరు పాలపై రూ. 4 ప్రోత్సాహాకాన్ని సీఎం అందిస్తున్నారని లోక భూమారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి.నగేశ్, శాసనసభ్యులు బాపూరావు, విఠల్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పురాణం సతీశ్, సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ముఠాగోపాల్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్ర మంలో కార్మిక సంఘం నాయకులు యాదయ్య, విజయ డెయిరీ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్‌మురళి, జీఎంలు దేవీదాస్, ప్రవీణ్, రమేశ్, డీడీలు మధు సూదన్‌రావు, కృష్ణస్వామి, వివిధ జిల్లాల నుంచి పాడి రైతులు పాల్గొన్నారు. -
విజయ డెయిరీ చైర్మన్‌గా భూమా నారాయణరెడ్డి
- 23వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక నంద్యాలరూరల్: జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయడెయిరీ) అధ్యక్షునిగా 23వ సారి భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నంద్యాల విజయ డెయిరీ పరిపాలన భవనంలో ఈ ఎన్నిక జరిగింది. ఏటా మూడు డైరెక్టర్ స్థానాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎం.కృష్ణాపురం పాల కేంద్రం అధ్యక్షుడిగా బాలీశ్వరరెడ్డి, శిరివెళ్ల పాలకేంద్రం అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, సంజామల పాల కేంద్రం అధ్యక్షుడిగా రామకృష్ణుడు నామినేషన్లను దాఖలు చేయగా వీరికి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి హరిబాబు ప్రకటించారు. అనంతరం కొత్త డైరెక్టర్లతో పాటు మిగతా డైరెక్టర్లు సమావేశమై.. భూమా నారాయణరెడ్డిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017–18సంవత్సరానికి 331లక్షల లీటర్ల పాల సేకరణ, 380లక్షల లీటర్ల పాల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2015–16లో 294లక్షల లీటర్ల పాల సేకరణ చేశామని, 378లక్షల లీటర్ల పాలు అమ్మకం జరిపి రూ.181కోట్ల వ్యాపారం చేశామన్నారు. గత ఏడాది పాల దిగుబడి పెంపునకు, సాంకేతిక వనరుల కోసం రూ.48.83లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.33లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయ డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ డీజీఎం సుబ్రమణ్యం, ప్లాంట్ డీజీఎం శంకర్‌రెడ్డి, ప్రొటెక్షన్ డీజీఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్యాంసన్‌బాబు, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పాడి రైతుకు ప్రోత్సాహకమేది?
తొమ్మిది నెలలుగా అందని డబ్బులు 14 వేల రైతులకు రూ. 5 కోట్లపైగా బకాయిలు నాగిరెడ్డిపేట : పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రతి లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తామన్న సర్కారు.. నెలల తరబడి ఆ మొత్తాన్ని అందించడం లేదు. తొమ్మిది నెలల తర్వాత ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన బకాయిలను మంజూరు చేసినా.. అవి ఇప్పటికీ రైతుల ఖాతాల్లో చేరలేదు. ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో 14వేల మంది పాడిరైతులు విజయడెయిరీ కేంద్రాల్లో పాలు పోస్తున్నారు. రైతులు రోజూ 70 వేల లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నారు. పాలను విక్రయించే రైతులకు వెన్నశాతం ఆధారంగా ధర చెల్లిస్తారు. విజయ డెయిరీ కనీసం 5 శాతం వెన్న ఉంటేనే పాలను కొనుగోలు చేస్తుంది. వెన్న శాతం ఆధారంగా ఒక్కో రైతుకు లీటర్ పాలకు రూ. 27 నుంచి రూ. 55 వరకు ధర చెల్లిస్తోంది. పాడి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పాల ధరకు అదనంగా లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీనివల్ల చాలామంది పాలను ప్రైవేట్ డెయిరీలలో కాకుండా విజయ డెయిరీలోనే విక్రయిస్తున్నారు. అయితే రైతులకు గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ప్రోత్సాహకం అందడం లేదు. ఇటీవల ఐదు నెలలకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని మంజూరైందని డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 2.31 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటిని రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఇంకా సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. ప్రోత్సాహకాన్ని వెంటనే మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా బిల్లులతో కలిపి ప్రోత్సాహకాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో జమ చేస్తాం విజయ డెయిరీలో పాలను విక్రయించే రైతులకు ప్రభుత్వం లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రోత్సాహకం మంజూరైంది. వీటిని రెండు, మూడురోజుల్లో పాడిరైతుల ఖాతాల్లో జమ చేస్తాం. మిగిలిన నిధులు ప్రభుత్వం నుంచి రాగానే రైతుల ఖాతాల్లో వేస్తాం. – ప్రదీప్, మేనేజర్, విజయ డెయిరీ, కామారెడ్డి -
పాడి రైతులకు డెబిట్ కార్డులు
-
పాడి రైతులకు డెబిట్ కార్డులు
• ‘విజయ డెయిరీ’కి పాలు పోసే రైతులకు వెసులుబాటు • పశు సంవర్థక శాఖ నిర్ణయం... త్వరలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ డెబిట్‌కార్డులు ఇప్పిం చాలని పశు సంవర్థక శాఖ నిర్ణరుుంచింది. సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి త్వరలో కార్డులను రైతులకు అందజేస్తారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ రైతులకు చెల్లించే సొమ్మును ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేయాలని డెరుురీ ఇటీ వలే నిర్ణరుుంచి ఏర్పాట్లు కూడా చేసింది. పాడి రైతులందరికీ ‘జీరో బ్యాలెన్స’ కింద బ్యాంకు ఖాతాలున్నా వారికి డెబిట్ కార్డులు ఇవ్వలేదు. ప్రత్యేక అంశంగా పరిగణించి జీరో బ్యాలెన్‌సలోనే డెబిట్‌కార్డులు ఇవ్వాలని బ్యాంకులను పశు సంవర్థక శాఖ కోరనుంది. తెలంగాణలో విజయడెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు దాదాపు 5 లక్షల లీటర్ల పాలు పోస్తుంటాన్నారు. అందుకోసం డెరుురీ ఏడాదికి రూ.350 కోట్లు రైతులకు చెల్లిస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తోంది. దాని ప్రకారం ఏడాదికి రూ.72 కోట్లు ఇస్తున్నారు. 15 రోజులకోసారి పాడి రైతు ఖాతాలకు సొమ్ము ను విడుదల చేస్తారు. సొమ్మును రైతులు డెబిట్‌కార్డుల ద్వారా ఏటీఎం నుంచి తెచ్చు కోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ సరుకులు కొనుక్కోవచ్చు. చేపల మార్కెట్లకు స్వైపింగ్ మిషన్లు హైదరాబాద్‌లో చేపల మార్కెట్లపై పెద్ద నోట్ల ప్రభావం పడింది. దీంతో ఆయా మార్కెట్లు వ్యాపారం లేక కుదేలయ్యారుు. 4 సహకార చేపల కేంద్రాలు, ఆరు మొబైల్ చేపల మార్కెట్లలో విక్రయాలు పెద్దఎత్తున నిలిచిపోయారుు. చిల్లర సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ స్వైపింగ్ మిషన్లు ఇవ్వాలని నిర్ణరుుంచినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు పేర్కొన్నారుు. స్వైపింగ్ మిషన్లకు ఆర్డర్ ఇచ్చామని, రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
పాడి రైతులకు ఆన్లైన్ చెల్లింపులు
• 15 రోజులకోసారి వారి బ్యాంకు ఖాతాల్లోకే సొమ్ము • పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ నిర్ణయం • భవిష్యత్తులోనూ ఆన్లైన్ చెల్లింపులే... సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించాలని విజయ డెరుురీ నిర్ణరుుంచింది. వచ్చే పదిహేను రోజులకు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు రైతులకు 15 రోజులకోసారి నగదు రూపంలో నేరుగా చెల్లించే పద్ధతి ఉంది. పెద్ద నోట్ల రద్దు... చిల్లర సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆన్లైన్లో రైతు ఖాతాలకు చెల్లింపు పద్దతిని కొనసాగిస్తామని... దీనివల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండబోవని పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ‘సాక్షి’కి చెప్పారు. 63 వేల మంది రైతులకు ప్రయోజనం.. తెలంగాణలో విజయ డెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు పాలు పోస్తుంటారు. దాదాపు 5 లక్షల లీటర్ల పాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇందుకోసం విజయ డెరుురీ ఏడాదికి రూ. 350 కోట్ల మేరకు రైతులకు చెల్లింపులు చేస్తుంది. దీంతోపాటు విజయ డెరుురీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ. 72 కోట్లు ఇస్తున్నారు. ప్రోత్సాహక సొమ్మును ఇప్పటికే రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. దీంతోపాటు పాలకు ఇచ్చే సేకరణ సొమ్మును కూడా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణరుుంచారు. ఇదిలావుంటే పాడి రైతులకు ఇచ్చే ప్రోత్సాహక సొమ్ము రూ. 50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పినా.. అవి ఇంకా రైతులకు చేరలేదని తెలిసింది. ఎన్సీడీసీ సభ్యునిగా సురేశ్ చందా... జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సభ్యుడిగా సురేశ్ చందా నియమితులయ్యారు. జాతీయ స్థారుులో సభ్యుడిగా నియమితులవడం వల్ల పశు సంవర్థక, పాడి శాఖలకు పెద్ద ఎత్తున ఎన్సీడీసీ నుంచి రుణాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అనేక రాష్ట్రాలకు దక్కని అవకాశం తెలంగాణకు దక్కడంపై సురేశ్ చందాకు పలువురు అభినందనలు తెలిపారు. -
రూ. 263 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
మంత్రులు ఈటల, తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విజయ డెరుురీని రూ.263 కోట్లతో ఆధునీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సచివాలయంలో మంగళ వారం పశుసంవర్థక అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు ఈటల, తలసాని మాట్లాడుతూ... ప్రైవేటు డెరుురీ ల కన్నా విజయ డెరుురీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు నూతన పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్రాల సామర్థ్యం పెంచుతామన్నారు. ఉత్పత్తుల విక్రయాలు పెంచేందుకు పలు చోట్ల ఔట్లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పెరుగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంచార వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు రైతుల ఇంటి వద్దకే వెళ్లి పశు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు వైద్య శాలల సేవలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 కోట్ల చేప పిల్లలను ఉచితంగా రిజర్వాయర్లు, చెరువుల్లో విడుదల చేశామన్నారు. ఈ నెలాఖరుకు చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చేపల విక్రయానికి అవసరమైన స్థలాలను సేకరిస్తే మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సభ్యత్వం కలిగిన ప్రతీ మత్స్యకారుడు, గొర్రెల పెంపకం దారుడికి రూ. 5 లక్షల బీమా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, టీఎస్ఎల్డీఏ చైర్మన్ రాజేశ్వర్‌రావు, విజయ డెరుురీ ఎండీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా
- విజయ డెయిరీ ఖాతా నుంచి తీసిన వైనం... - పెద్దనోట్లు రద్దు చేసిన రెండు రోజులకే వ్యవహారం - కొత్త రూ.2 వేల నోట్లు, వందనోట్లు ఇచ్చిన ఎస్బీహెచ్ - నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు అందజేసిన వైనం - బ్యాంకు అధికారుల తీరుపై పలు అనుమానాలు సాక్షి, మెదక్: పెద్దనోట్ల రద్దుతో దేశం అంతా ఇబ్బందులు పడుతోంది. ఒక్కోవ్యక్తికి రూ.4 వేలు మార్చుకోవాలని, రూ.10 వేలకు మించి నగదు డ్రా చేయవద్దని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు మెదక్ పట్టణంలోని ఎస్‌బీహెచ్‌కు ఏమాత్రం పట్టలేదు. పెద్దనోట్లు రద్దు చేసి రెండురోజులు కూడా కాలేదు. బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు, అధికారులు, సిబ్బంది బిజీబిజీ. అపుడు మెదక్ ఎస్బీహెచ్ అధికారులు విజయ డెయిరీ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో రూ.1.20 కోట్ల డబ్బు డ్రా చేసుకునేందుకు అనుమతించిన విషయం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు తోసిరాజని రూ.1.20 కోట్లు అందజేత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయ డెయిరీ పాడిరైతుల నుంచి సేకరించిన పాలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాల్సి ఉంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయ డెయిరీ పాడి రైతులకు డబ్బుల చెల్లింపులు చేయలేదు. దీనికితోడు నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించవద్దని నిబంధనలను విధించారు. ప్రభుత్వ నిబంధనలను తోసిరాజని మెదక్ ఎస్బీహెచ్ అధికారులు 11వ తేదీన విజయ డెయిరీ ఖాతా (ఎండీటీఎస్డీడీసీఎఫ్ లిమిటెడ్- 0000006221219 2509) నుంచి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రాకు అనుతించారు. సుమారు 13 సొసైటీ చెక్కులతో ఒకేరోజు ఇంతమొత్తం డ్రా చేసినట్లు తెలుస్తోంది. రూ.1.20 కోట్లలో అధికమొత్తం కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు సమాచారం. 11వ తేదీన మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకులో ఖాతాదారులు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నోట్ల మార్పిడి కోసం గొడవలు పడుతున్నారు. అలాంటి సమయంలో సైతం ఎస్బీహెచ్ అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్ల నగదు విజయ డెయిరీ సొసైటీకి ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకు అధికారులు విజయ సొసైటీ సభ్యులకు అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతించలేదు. అయితే మెదక్ ఎస్బీహెచ్ బ్యాంకు మేనేజర్ మాత్రం ఒకేరోజు రూ.1.20 కోట్ల డబ్బులు డ్రా చేసేందుకు అనుమతించటంతోపాటు రూ.2 వేల నోట్లు పెద్దమొత్తంలో ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదిలా ఉంటే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన సొసైటీ సభ్యులు పాడి రైతులకు పూర్తిస్థాయలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. బ్యాంకు అధికారులు, విజయసొసైటీ సభ్యులు కుమ్మక్కై నల్లధనం తెలుపుగా మార్చారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్బీహెచ్ బ్యాంకు అధికారులు ఒకేరోజు రూ.1.20 కోట్లు నగదు ఇవ్వటంపై ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. డబ్బులు డ్రా చేశాం మెదక్ ఎస్బీహెచ్ విజయ డెయిరీ ఖాతా నుంచి 11వతేదీన రూ.1.20 కోట్లు డబ్బులు డ్రా చేశాం. జారుుంట్ అకౌంట్ ఖాతా ఉన్నందున చెక్కులపై నా సంతకం, సొసైటీ చైర్మన్ల సంతకాలు చేసి ఒకేరోజు రూ.1.20 కోట్లు డ్రా చేశాం.కొత్త రూ.2వేల నోట్లు ఇచ్చారు.13 సొసైటీల్లోని పాడి రైతులకు ఇవ్వాల్సిన బకారుులు చెల్లించాం. - రంజిత్, విజయ డెయిరీ మేనేజర్ డ్రా చేయడం నిజమే విజయ డెయిరీ ఖాతా నుంచి 11 వతేదీన రూ.1.20 కోట్లు డ్రాకు అనుమతించింది నిజమే నని మెదక్ ఎస్బీహెచ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. డబ్బులు డ్రా చేసిన విజయ డెయిరీ సొసైటీ వారికి కొత్త రూ.2వేలనోట్లతోపాటు వందనోట్లు ఇచ్చాం. ప్రభుత్వం ఖాతాల నుంచి డబ్బులు డ్రాకు అనుమతించవద్దన్న నిబంధన మరుసటి రోజు తెలిసింది. అరుుతే ఒకేరోజు రూ.1.20కోట్లు ఒకే ట్రాన్జాక్షన్‌లో ఎలా అనుమతిస్తారన్న దానిపై ఆయన సమాధానం ఇవ్వలేదు. - శ్రీనివాస్‌రావు, ఎస్బీహెచ్ మేనేజర్ -
డైరెక్టర్ల ఎన్నికకు కసరత్తు
ఈ నెల 30తో ముగియనున్న విజయ డెయిరీ ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం 26 లోపు పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ నెల్లూరు రూరల్ : జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి(విజయ డెయిరీ) డైరెక్టర్ల పదవులకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రొటేషన్ పద్ధతిలో ప్రతి సంవత్సరం ముగ్గురు డైరెక్టర్లకు పదవీ కాలం ముగిస్తుంది. ప్రస్తుతం 15 మంది డైరెక్టర్లలో కొడవలూరు మండలం, నార్తురాజుపాళెం గ్రామ సొసైటీ(ఎంపీఎంఏసీఎస్) అధ్యక్షుడు ఇరువూరు వెంకురెడ్డి, ఆత్మకూరు మండలం, వాసిలి గ్రామ సొసైటీ అధ్యక్షుడు గంగా శ్రీనివాసులు, తోటపల్లి గూడూరు మండలం, సౌత్‌ఆమలూరు గ్రామ సొసైటీ అధ్యక్షుడు ముప్పవరపు గోపాలకృష్ణ చౌదరి పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ ముగ్గురు డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల అధికారిగా నంద్యాల వరదారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ నెల 26 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ల పదవులకు పోటీపడే ఆశావాహులు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతల అనుగ్రహం కోసం బారులు తీరుతున్నట్లు సమాచారం. పోటీ చేసే అభ్యర్థి ప్రతిపాదించు అభ్యర్థి, బలపరిచే అభ్యర్థులు ఓటు హక్కు కలిగిన పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం పదవిలో ఉన్నవారు అర్హులు. నామినేషన్ ఫీజు రూ.1000 చెల్లించాలని ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ పోటీ చేసే అభ్యర్థులు నెల్లూరు, వెంకటేశ్వరపురంలోని డెయిరీ మీటింగ్ హాల్లో ఈ నెల 21న ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల లోపు తమ నామినేషన్ దరఖాస్తులను ఎన్నికల అధికారికి అందజేయాలి. అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరగనుంది. – నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. – వెంటేశ్వరపురం డెయిరీ మీటింగ్ హాల్లో ఈ నెల 26న ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్నికలు, అదే రోజు మధ్యాహ్నం 1.00 గంటకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
లాభాల బాటలో విజయ డెయిరీ
చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నెల్లూరు రూరల్ : జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి(విజయ డెయిరీ) లాభాలబాటలో పయనిస్తోందని డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అన్నారు. స్థానిక వెంకటేశ్వరపురంలోని డెయిరీ ప్రధాన కార్యాలయంలో డెయిరీ పాలకవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో పాల విక్రయాల ద్వారా సంస్థకు రూ.4 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కావలి పాలశీతలీకరణ కేంద్రం భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవనం నిర్మించాలని, పాల సేకరణ లక్ష్యం పెంచాలని పాలకవర్గ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. సహకార చట్టం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీతో ముగ్గురు పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగుస్తుందని, ఆయా స్థానాలకు వచ్చేనెల 21 వతేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల అధికారిగా నంద్యాల వరదారెడ్డి వ్యవహరిస్తారన్నారు. సెప్టెంబర్ 30న డెయిరీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ ఎండీ కృష్ణమోహన్, అడ్మిన్ కృష్ణమోహన్, పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు. -
రైతులందరికీ పాడి ప్రోత్సాహకం
- త్వరలో నిర్ణయం... మంత్రి తలసాని వెల్లడి - పశువ్యాధులు లేని ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు సాక్షి, హైదరాబాద్ విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు లీటరుకు ఇస్తోన్న రూ. 4 ప్రోత్సాహకాన్ని ఇతర రైతులందరికీ వర్తించేలా త్వరలో జరిగే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 3.80 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింత పెంచేందుకు వాల్ పెయింటింగ్, హోర్డింగ్స్ ద్వారా విస్త్రృత ప్రచారం కల్పిస్తామన్నారు. జాతీయ రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో ఔట్లెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడు, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీని నివారించేందుకు ఫుడ్‌సేఫ్టీ, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఏ విధమైన పశు వ్యాధులు లేని ప్రాంతంగా పారిస్‌లోని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ గుర్తించిందని పశుసంవర్థకశాఖ వెల్లడించారు. ఆంత్రాక్స్, యాంటీరేబిస్ వంటి వ్యాక్సిన్లను వీబీఆర్ఐ ల్యాబ్‌లో అదనంగా తయారు చేసి రాష్ట్ర అవసరాలకే కాకుండా బయటి ప్రాంతాలకు విక్రయించే వెసులుబాటు కల్పించేలా నూతన ఫ్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వెటర్నరీ పాలిటెక్నిక్ పేరు మార్చి జిల్లాస్థాయి వెటర్నరీ ఆసుపత్రులుగా మార్చే ప్రతిపాదన ఉందన్నారు. మారుమూల గ్రామాల్లోని పశువులకు వైద్య సేవలు అందించేందుకు నియోజకవర్గానికి ఒక మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు తె లిపారు. చేపల చెరువుల్లో ప్రభుత్వపరంగా నూటికి నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లల సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేజ్ కల్చర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పశుసంవ ర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సొమ్ము రాజధాని పాలు
గతంలోనే రూ.5.80 కోట్లు విరాళం ఇచ్చిన కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజధాని నిర్మాణానికి మళ్లీ రూ.5 కోట్ల విరాళం పదవులు కాపాడుకునేందుకే పెద్దల ప్రయత్నాలని విమర్శలు\ పాలకు ఇచ్చే ధర అర్ధ రూపాయి పెంచమన్నా తిరస్కరించిన బోర్డు సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉంది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయ డెయిరీ) పెద్దల తీరు. సంస్థకు వచ్చిన లాభాల్లో రైతులకు చెల్లించే పాల సేకరణ ధర అర్ధ రూపాయి పెంచాలని కోరినా అంగీకరించని పాలకవర్గం రాజధాని నిర్మాణం కోసం మరో రూ.5 కోట్లు విరాళం సమర్పించింది. గతంలో ఇచ్చిన రూ.5.80 కోట్లకు ఈ మొత్తం అదనం. పాలకవర్గంలో ముఖ్యులు టీడీపీకి చెందినవారు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడి రైతులు విమర్శిస్తున్నారు. విజయవాడ : నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడంతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో కొంతమంది ఎక్కువగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తొలి విడత రూ.2 కోట్లు, మరోసారి రూ.2 కోట్లు, పాల సహకార సంఘాల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.5.80 కోట్లు రాజధానికి విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో రూ.5 కోట్లు ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి... వాస్తవంగా విరాళం ఇవ్వాలంటే యూనియన్ బోర్డులో ముందుగా ఆమోదం పొందాలి. ఆ తరువాత దానిని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇస్తున్న విషయం బోర్డు సమావేశంలో కాకుండా గత నెల 18న జరిగిన జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ చాకచక్యంగా వ్యవహరించారు. సమావేశం జరిగే హాలులోకి వెళ్లాలంటే బయట ఉన్న రిజిస్టర్లో పాల సహకార సంఘాల అధ్యక్షులు సంతకం చేయాలి. ఈ సంతకాలనే అడ్డుపెట్టుకుని రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు జరనల్ బాడీ ఆమోదించినట్లు మినిట్స్‌లో రాసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందంటే... జిల్లాలో 427 పాల సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ద్వారా జిల్లాలోని రైతుల నుంచి లక్షా 70 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. 427 సంఘాల అధ్యక్షులకు జనరల్ బాడీలో ఓటు వేసే హక్కు, రైతుల సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జనల్బాడీలో పాల్గొన్న సహకార సంఘాల అధ్యక్షుల్లో కొంతమంది రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని, గతంలో రూ.5.80 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని సమాచారం. తాము వ్యతిరేకిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేయాలంటూ 11 సంఘాల అధ్యక్షులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొని జనరల్‌బాడీ సమావేశం వాయిదా పడింది. మినిట్స్‌లో మాత్రం రూ.5 కోట్ల విరాళానికి ఆమోదం లభించినట్లు రాసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు అర్ధ రూపాయి పెంచమంటే... ఎండలు తీవ్రంగా ఉండి నీటిఎద్దడి ఏర్పడటంతో గ్రామాల్లో నీరు, పచ్చగడ్డి, ఎండుగడ్డి లభించక పాడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాల దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో యూనియన్ లీటర్ పాలకు చెల్లిస్తున్న ధర రూ.58ని రూ.60కి పెంచాలని రైతులు కోరారు. గత నెల 18న జరిగిన జనరల్‌బాడీలో రెండు రూపాయలు కాకపోయినా రైతుల కోరిక మేరకు కనీసం అర్ధ రూపాయి పెంచాలని అన్ని సంఘాల అధ్యక్షులు పట్టుబట్టారు. దీనిని పాలకవర్గంలో ముఖ్యులు, అధికారులు తోసిపుచ్చారు. తరువాత సొసైటీలకు బోసస్ ఇస్తామని సర్దిచెప్పారు. వాస్తవంగా బోసస్ ఇవ్వడం వల్ల సహకార సంఘానికి, పాల రేటు పెంచితే రైతులకు ఉపయోగమని పాలసంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. తెర వెనుక కథ ఇదీ యూనియన్ పాలకవర్గానికి వచ్చే సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. యూనియన్ పాలకవర్గమంతా అధికార తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. యూనియన్ కీలక పదవుల్లో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఆకర్షించి తిరిగి తమ పదవులను కాపాడుకునేందుకు రూ.11 కోట్ల విరాళాలు ఇచ్చారని విజయ డెయిరీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు తక్షణం బోసస్ ఇవ్వకుండా ఆగస్టులో ప్రకటించి తద్వారా రైతుల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రైతుల కష్టం నుంచి వచ్చిన సొమ్మును రాజధానికి ధారాదత్తం చేయడంపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వడం వెనుక పెద్ద పథకమే ఉందని యూనియన్‌లోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. పాల డెయిరీలో సుదీర్ఘకాలం పాతుకుపోయి కీలకమైన పోస్టులో ఉన్న ఒక ముఖ్య నేత తిరిగి ఆ పదవి పొం దేందుకు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన మనుమడికి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారని పేర్కొంటున్నారు. -
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
లాలాపేట: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన లాలాపేటలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ బాయిలర్, గోడౌన్, సెంట్రల్ క్వాలిటీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉన్నందున మరిన్ని అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పశుగ్రాసం కొరత లేకుండా చూస్తామన్నారు. ఇకపై సబ్‌కమిటీ మీటింగ్ డెయిరీలోనే నిర్వహిస్తామన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ నిర్మలను అభినందించారు -
పర్యాటక కేంద్రాల్లో ‘విజయ’ ఔట్లెట్లు
పశుసంవర్థక శాఖ మంత్రిగా తలసాని బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: పర్యాటక కేంద్రాలు, దేవాలయ ప్రాంతాలు, జాతీయ రహదారులపై విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకపు కౌంటర్ల(ఔట్లెట్లు)ను ఏర్పాటు చేస్తామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్థకశాఖ మం త్రిగా శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహక బకాయిలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామన్నారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వెటర్నరీ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించిందన్నారు. అయితే వెటర్నరీ వర్సిటీ ద్వారానే భర్తీ చేయాలన్న విద్యార్థుల సూచనపై ఆయా ప్రతినిధులతో చర్చిస్తామని చెప్పారు. గొర్రెల పెంపకందారులకు ఎన్సీడీసీ ద్వారా ఇచ్చే రుణాల మంజూరులో జాప్యాన్ని నివారిస్తామన్నారు. ఈ పథకం కోసం రూ. 398 కోట్లు సిద్ధంగా ఉన్నాయని... ఇందులో రుణం పొందినవారికి 20 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, ఇన్చార్జి డెరైక్టర్ తిరుపతయ్య, విజయ డెయిరీ ఎండీ నిర్మల పాల్గొన్నారు. -
పాడి రైతులకు 60 కోట్లు ఇవ్వలేరా?
♦ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రొఫెసర్ కోదండరాం ♦ పాల ప్రోత్సాహకానికి సీలింగ్ పెట్టడం సరికాదని వ్యాఖ్య ♦ ‘విజయ’కు పాలు పోసే రైతులందరికీ ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ ♦ కర్ణాటక మాదిరిగా రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజనంలో పాలు ఇవ్వాలని వినతి సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు రూ. వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం.. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ. 60 కోట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిలదీశారు. పాల ప్రోత్సాహకానికి 25 లీటర్ల సీలింగ్ పెట్టడం సమంజసం కాదన్నారు. విజయ డెయిరీకి అనుబంధంగా ఉండే సహకార, ప్రైవేటు డెయిరీలకే పాల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని.. కరీంనగర్, మదర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఇవ్వకుండా ఇతరత్రా ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. పాల ప్రోత్సాహకపు సొమ్మును రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా వేయాలని కోరారు. తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే వ్యవసాయంతోపాటు పాడి, కోళ్ల రంగాలను అభివృద్ధి చేయాలని, కోళ్ల పరిశ్రమలో చిన్న రైతులకు ఏవిధంగా లబ్ధి చేకూర్చాలన్న దానిపై సర్కారు ఆలోచన చేయాలన్నారు. 85 శాతం సన్నచిన్నకారు రైతులు 66 శాతం పాలు పోస్తున్నార ని చెప్పారు. ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో రాష్ట్రంలో విజయ డెయిరీ పాల సేకరణ చితికిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహకం ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఈ చొరవను ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ఇతర రాష్ట్రాల పోటీ నుంచి విజయ డెయిరీని కాపాడుకోవాలని కోరారు. ప్రపంచంలో పాల పొడి విక్రయంలో సంక్షోభం ఏర్పడిందనీ.. దీంతో అమూల్, నందిని వంటి ఇతర రాష్ట్రాల డెయిరీలు మన రాష్ట్రంలోకి పాలను డంప్ చేస్తున్నాయని అన్నారు. దీనివల్ల విజయ డెయిరీ సహా ఇతర సహకార పాల ఉత్పత్తిదారులు నష్టపోతున్నారన్నారు. అందువల్ల బయటి రాష్ట్రాల డెయిరీలకు షరతులు విధించాలని, మన రాష్ట్రంలోని రైతుల నుంచే పాలను సేకరించాలని ఆదేశించాలన్నారు. లేకుంటే ప్రత్యేక పన్ను వేసి అడ్డుకోవాలన్నారు. అలాగే విజయ డెయిరీ పాల ఏజెంట్ల కమీషన్ పెంచాలన్నారు. కర్ణాటకలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాలు సరఫరా చేస్తున్నారని.. దీనివల్ల అక్కడ రోజుకు 10 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయన్నారు. తెలంగాణలోనూ ఇలాగే చేస్తే విజయ డెయిరీ పాల సేకరణ పెరుగుతుందన్నారు. విద్యార్థులకూ ఆరోగ్యం పెరుగుతుందన్నారు. కందాల బాల్‌రెడ్డి మాట్లాడుతూ పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు ఇవ్వాలా? వద్దా? అని నిర్ధారించేందుకు ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని రెండు మూడు రోజుల్లో కలసి నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వం పాల ప్రోత్సాహకంపై మార్పులు చేర్పులు చేసే వరకు ఇప్పటివరకు ఉన్న జీవోనే అమలు చేయాలని కోరారు. -
ప్రైవేటు కంపెనీలతో విజయ డెయిరీ కుమ్మక్కు
ఆదర్శ పాడి రైతు సంఘం విమర్శ సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ అధికారులు బడా ప్రైవేటు డెయిరీ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆదర్శ పాడి రైతు సంఘం విమర్శించింది. విజయ డెయిరీని సమూలంగా ప్రక్షాళన చేయాలని సంఘం అధ్యక్షుడు ఎం.జితేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ప్రతులను సోమవారం పత్రికలకు విడుదల చేశారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ రూ. 4 ప్రోత్సాహకాన్ని ప్రకటించి, ఇప్పుడు షరతులు విధించడం వెనక కుట్ర ఉందన్నారు. మూడెకరాల పాలీహౌస్ నిర్మించడానికి రూ. 72 లక్షలు సబ్సిడీ ఇస్తుంటే, 10 పశువులతో పాలు అమ్ముకునే రైతులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వకూడదన్న విజయ డెయిరీ అధికారుల ధోరణి ఏమేరకు సబబని ప్రశ్నించారు. పౌల్ట్రీ కంపెనీలకు విద్యుత్, ఇతరత్రా రాయితీలు ఇస్తుంటే కరువు లో ఉన్న రైతులకు షరతులు విధించడం అన్యాయమన్నారు. హైదరాబాద్‌కు రోజూ 25 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తుండటం విడ్డూరమన్నారు. ప్రోత్సాహకం ఇచ్చాక పాల సరఫరా 5 లక్షల లీటర్లు పెరిగిందని వారు చెప్పారు. -
పాల ‘ప్రోత్సాహకం’పై సీలింగ్!
♦ ఆర్థికభారం తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు ♦ పాడి రైతుల వివరాలివ్వాలని విజయ డెయిరీకి ఆదేశం ♦ రైతులకే ప్రోత్సాహక సొమ్ము అందేలా త్వరలో మార్గదర్శకాలు ♦ మండిపడుతున్న డెయిరీ సంఘాలు ♦ భవిష్యత్తులో ప్రోత్సాహకాన్ని ఎత్తేసే కుట్రగా ఆరోపణ సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు అందిస్తున్న నగదు ప్రోత్సాహకంపై సీలింగ్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రోత్సాహక సొమ్ము చెల్లింపు వల్ల ఆర్థిక భారం పెరగడంతో దాన్ని తగ్గించుకునేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విజయ డెయిరీకి పాలు పోసే రైతుల్లో ఎంతమంది ఎన్ని లీటర్లు పాలు పోస్తున్నారో కేటగిరీలవారీగా వివరాలు ఇవ్వాల్సిందిగా డెయిరీ అధికారులను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా సన్న, చిన్నకారు రైతులు, పెద్ద రైతులు, డెయిరీ వ్యాపారుల్లో ఎందరు ప్రోత్సాహకం తీసుకుంటున్నారో తెలుసుకొని కేవలం రైతులకే ప్రోత్సాహకం అందేలా మళ్లీ మార్గదర్శకాలు రూపొందించనుంది. వ్యాపారుల నుంచి పాలు సేకరించినా వారికి ప్రోత్సాహకం ఇవ్వరాదని సర్కారు భావిస్తోంది. ప్రోత్సాహకం ఉంటుందా? విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీట రుకు అదనంగా రూ. 4 నగదు ప్రోత్సాహకం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీచేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వులను అమలు చేస్తూ ఒక్కో లీటరుకు రూ. 28 చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వులు అమల్లోకి రాక ముందు విజయ డెయిరీ గతేడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించగా ఉత్తర్వుల అమలు ప్రారంభమైన గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పాల సేకరణ సర్కారు అంచనాలకు మించి 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. అయితే ప్రోత్సాహక సొమ్ము చెల్లింపులకు 2015-16 బడ్జెట్లో సర్కారు కేటాయించిన రూ. 12 కోట్లు అయిపోవడంతో అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును సక్రమంగానే అందించిన విజయ డెయిరీ....ఆర్థిక ఇబ్బందుల కారణంగా నవంబర్ రెండో వారం నుంచి ఇప్పటివరకు రైతులందరికీ బిల్లుల సొమ్మును నిలిపేసింది. అలాగే 10 ప్రైవేటు డెయిరీలకూ పూర్తిగా చెల్లింపులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపులకు రూ. 60 కోట్లు అదనంగా కావాలంటూ లేఖ రాసినా ఇప్పటివరకు సర్కారు నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు సీలింగ్ విధానంపై కసరత్తు మొదలుపెట్టింది. అయితే సీలింగ్ వల్ల నిజమైన రైతులు కూడా అర్హత కోల్పోయే ప్రమాదముందని, భవిష్యత్తులో పాల ప్రోత్సాహకాన్ని ఎత్తివేసేందుకే సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం డెయిరీ ఫారాలకు ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం సమంజసం కాదని ఆదర్శ పాల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. పెద్ద ప్రైవేటు డెయిరీ సంస్థలను కాపాడటానికే అధికారులు సిద్ధపడుతున్నారని ఆయన ఆరోపించారు. -
పరుల‘పాలు’ కాకుండా...
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకిస్తున్న ప్రోత్సాహక సొమ్ము పక్కదారి పడుతోంది. దీంతో ప్రోత్సాహానికి కొన్ని షరతులు వర్తింపజేయాలని సర్కారు యోచిస్తోంది. గత ఏడాది నవంబర్ నుంచి పాడి రైతులకు లీటరుకు రూ. 4 ప్రోత్సాహక సొమ్ము ఇస్తున్నారు. అయితే కొందరు ప్రైవేటు డైయిరీ వ్యాపారులు అక్రమంగా దీన్ని ఎగురేసుకుపోతున్నారన్న విషయం వెలుగు చూసింది. దీంతో ప్రోత్సాహక సొమ్ము ఇతరులకు చేరకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని, కొత్తగా మరికొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. గత ఏడాది ప్రోత్సాహకమిస్తూ జారీచేసిన జీవోకు, అనంతరం విడుదల చేసిన మార్గదర్శకాలకు మధ్య కొద్దిపాటి తేడా ఉంది. జీవోలో సన్నచిన్నకారు రైతులకే ప్రోత్సాహక సొమ్ము ఇవ్వాలని పేర్కొనగా... మార్గదర్శకాల్లో రైతులు ఎవరైనా అని పొందుపరిచారు. దీంతో ప్రోత్సాహక సొమ్ము నిజమైన రైతులకే కాకుండా ప్రైవేటు డెయిరీ ఫారాలకూ చేరింది. ఈ నేపథ్యంలో దీన్ని సన్నచిన్నకారు పాడి రైతులకే వర్తింప చేయాలంటూ పశుసంవర్థకశాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఇప్పటికే ప్రైవేటు డెయిరీ ఫారాల నుంచి పాలు తీసుకుంటున్నా వాటికి ప్రోత్సాహకాన్ని నిలిపివేశారు. భారాన్ని తగ్గించే యోచన ప్రోత్సాహకం ప్రారంభమైనప్పటి నుంచి విజయ డెయిరీ పాల సేకరణ భారీగా పెరిగింది. ప్రోత్సాహక ఉత్తర్వులు రాకముందు గత ఏడాది అక్టోబర్‌లో 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వుల అమలు ప్రారంభమైన గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఏడాది కాలంలో పాల సేకరణ అమాంతం 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ప్రైవేటు డెయిరీ ఫారాల వ్యాపారులు రంగప్రవేశం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రోత్సాహకం చెల్లింపునకు ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. వాస్తవంగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ప్రోత్సాహకానికి రూ. 12 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ అది ఏమూలకూ సరిపోవడంలేదు. దీంతో విజయ డెయిరీ తన వద్ద ఉన్న ఆర్థిక నిల్వలను ప్రోత్సాహకానికి మళ్లించాల్సి వచ్చింది. మరో రూ. 12 కోట్లు సొంతంగా ప్రోత్సాహక బకాయిలు చెల్లించినట్లు సమాచారం. ఇంకా రూ. 48 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రైవేటు డెయిరీలను కట్టడి చేసి ప్రోత్సాహక భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు యోచిస్తోంది. సమాచారమంతా ఆన్లైన్లో... ప్రైవేటు డెయిరీలకు ప్రోత్సాహకం వెళ్లకుండా నిరోధించేందుకు.. పాలు పోసే రైతులందరి వివరాలను ఆన్లైన్లో పెట్టాలని విజయ డెయిరీనిర్ణయించింది. రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, విజయ డెయిరీకి ఎన్ని లీటర్లు పోస్తున్నారన్న సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో ఏ గ్రామానికి చెందిన ఏ రైతు విజయ డెయిరీకి ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నారో ఎవరైనా ఆన్లైన్లో చూడొచ్చు. మరోవైపు పాల నాణ్యత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. నాణ్యత నిర్ధారణ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. పాలల్లో ఉండాల్సిన పోషకాలన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. -
డెయిరీ రైతుల ప్రోత్సాహకానికి నిధుల కొరత
అదనంగా రూ. 48 కోట్ల కోసం సర్కారుకు పశుసంవర్ధకశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకానికి నిధుల కొరత ఏర్పడింది. ఏడాదిగా ఇస్తున్న ఈ ప్రోత్సాహకానికి నిధుల కటకటతో రైతులకు విజయ డెయిరీ బకాయి పడింది. దీంతో రైతులకు ప్రోత్సాహకానికి మరో రూ. 48 కోట్లు మంజూరు చేయాలని పశు సంవర్ధకశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా ఒక్కో లీటరుకు ప్రభుత్వం రూ. 4 చెల్లిస్తోంది. దీంతో ఒకవైపు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం.. మరోవైపు కొన్ని ప్రైవేటు డెయిరీలకు కూడా ప్రోత్సాహకం అక్రమంగా వెళ్తుండటంతో ప్రభుత్వం కేటాయించిన రూ. 12 కోట్ల బడ్జెట్ సరిపోవడంలేదు. ఇప్పటికే ఆ బడ్జెట్ నిధులన్నీ అయిపోగా... విజయ డెయిరీ తన వద్ద నిల్వ ఉన్న నిధుల నుంచి కూడా అదనంగా రూ. 12 కోట్ల మేరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా రైతులకు బకాయి ఉన్నట్లు తెలిసింది. రూ. 50 కోట్లు కావాలని విజయ డెయిరీ ప్రతిపాదించగా ప్రభుత్వం రూ. 12 కోట్లే కేటాయించింది. -
విజయ డెయిరీని ముట్టడించిన రైతులు
రాయచోటి టౌన్ (వైఎస్సార్ జిల్లా) : పాల బకాయిల కోసం పాడి రైతులు ఆందోళన బాట పట్టారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలోని విజయ డెయిరీ కేంద్రాన్ని రైతులు శుక్రవారం ముట్టడించారు. రెండు నెలలుగా తాము పోసిన పాలకు డబ్బులు చెల్లించడం లేదని, తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే మరికొంత వ్యవధి కావాలని మేనేజర్ రాజమోహన్ సర్దిచెప్పబోగా వారు వినలేదు. డెయిరీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విజయ డెయిరీ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడారు. డెరైక్టర్‌తో మాట్లాడి వారం రోజుల్లో బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
విజయ డెయిరీలో గ‘లీజు’ దందా!
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీని వీధిలో నిలబెట్టేశారు. సంస్థను అడ్డుపెట్టుకొని ఎవరికివారు అందినకాడికి దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం సొమ్ము పక్కదారి పట్టిన వైనం బయటపడి వారం గడవకముందే... విజయ డెయిరీలో మరో అక్రమం బయటపడింది. రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లలో ఎక్కువ భాగం ఒకే వ్యక్తికి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు అధికారులు అతనికే టెండర్లు దక్కేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా డెయిరీ పార్లర్ల దుకాణాలకు టెండర్లు దాఖలుకాగా.. ఆ వ్యక్తికే వచ్చేలా ఏర్పాట్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది. సబ్‌లీజులతో.. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పాల ఉత్పత్తులను రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో కొన్నింటిని తక్కువ లీజు ధరకే పాలు, పాల పదార్థాల విక్రయాల కోసం కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఏడు రైల్వే స్టేషన్లలో విజయ డెయిరీకి తక్కువ లీజుతో దుకాణాలు దక్కాయి. వీటితోపాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో విజయ డెయిరీ పార్లర్లను టెండర్ల ద్వారా వ్యాపారులకు కేటాయిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 విజయ డెయిరీ పార్లర్లు వెలిశాయి. అయితే మొత్తం డెయిరీ పార్లర్లలో దాదాపు 90 శాతం ఐదారేళ్లుగా ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. కొన్ని నేరుగా, మరికొన్ని బినామీ పేరు మీద తీసుకొని వాటిని సబ్ లీజులకు ఇచ్చి నడిపిస్తున్నాడు. దీనిపై విమర్శలు రావడంతో చిన్నాచితక పార్లర్లను పక్కనపెట్టి ప్రస్తుతం 20 పెద్ద దుకాణాలను తన చేతుల్లో ఉంచుకున్నాడు. రైల్వే స్టేషన్లలోని ఏడు దుకాణాలూ అతని చేతుల్లోనే ఉన్నాయి. దోపిడీ ఇలా.. సదరు వ్యక్తి డెయిరీ పార్లర్ల దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెల వారీ అద్దె రూ. 22,500. కానీ సదరు వ్యక్తి సబ్ లీజుదారు నుంచి నెలకు రూ. 3.30 లక్షలు వసూలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి అందిన ఫిర్యాదులో తేలింది. అంటే రోజుకు రూ. 11 వేలు వసూలు చేస్తున్నారు. ఫ్లాట్‌ఫాం నంబర్ 10లో ఉన్న పార్లర్‌కు రైల్వే శాఖ నిర్ణయించిన నెలవారీ అద్దె రూ. 18,500 కాగా.. రూ. 1.35 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక వరంగల్ రైల్వేస్టేషన్‌లోని పార్లర్‌కు రైల్వే శాఖ అద్దె నెలకు రూ. 7,600 కాగా.. సబ్‌లీజుదారుల నుంచి రూ. 34,980, నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని పార్లర్ అద్దె నెలకు రూ. 8,500 కాగా.. రూ. 75 వేలు వసూలు చేస్తున్నాడు. ఇలా సబ్‌లీజుల ద్వారా రూ. కోట్లు కాజేస్తున్నాడు. ఇక పార్లర్ల ద్వారా వచ్చే ఆదాయం సరేసరి. అయితే లీజు సొమ్ములో కొంత భాగం విజయ డెయిరీకి ఇవ్వాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కారు. అధికారులు కూడా అతనికి మినహాయింపు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అక్రమాలతో విజయ డెయిరీ రూ. 4 కోట్ల వరకు కోల్పోయినట్లు అంచనా. టెండర్ల నిలిపివేత ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో రైల్వేస్టేషన్లలోని డెయిరీ పార్లర్లకు దాఖలైన టెండర్లను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సురేష్ చందా, ఎండీగా బాధ్యతలు తీసుకున్న నిర్మల విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
పాల సేకరణలో పరిమితులు
‘ప్రైవేట్’కు సహకరిస్తున్న విజయ డెయిరీ ♦ సీఎం లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించినా పట్టించుకోని అధికారులు ♦ పెద్ద రైతులు ప్రోత్సాహకం జాబితాలోకి రారంటూ అడ్డుపుల్ల ♦ పరిమితులు పెడితే నష్టపోతామంటున్న పాడి రైతులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించినా దానిని అమలు చేయడంలో విజయా డెయిరీ పూర్తిగా విఫలమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పాలు సేకరిస్తున్న వారికి ప్రోత్సాహకం పేరుతో అధికమొత్తంలో చెల్లింపులు చేసిన విజయ డెయిరీ ఆ అక్రమం కాస్త బయటపడటంతో రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాల నుంచి పాలు సేకరిస్తున్న వారికి చెల్లింపులు ఆపేయాల్సింది పోయి రాష్ట్రంలో పాడి రైతులకు సేకరణలో పరిమితులు విధించే దుర్మార్గ చర్యలకు పూనుకుంటోంది. పెద్ద రైతులు ప్రోత్సాహకం పరిధిలోకి రారని సర్క్యులర్ ఇచ్చింది. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న పాడి రైతాంగాన్ని ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అపహాస్యం పాలు చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాన్ని దృష్టిలో ఉంచుకుని వందలాది మంది రైతులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. ఒక రైతుకు నాలుగు ఆవులు ఉంటే రోజుకు 50 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. గడచిన రెండేళ్లుగా కరువు పరిస్థితులు ఉండటంతో రైతులు పాడి రంగాన్ని ఎంచుకుని బ్యాంక్‌ల నుంచి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. అయితే ఆ రైతులను ప్రోత్సహించాల్సిన విజయ డెయిరీ పాల సేకరణ చేయకుండా పరోక్షంగా ప్రైవేట్ డెయిరీలకు సహకరిస్తోంది. విజయా సంస్థ పాల సేకరణలో చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు విధి లేక తమ పాలను ప్రైవేట్ డెయిరీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. సేకరణ కేవలం 5 లక్షల లీటర్లు తెలంగాణలో రైతాంగానికి ప్రత్యామ్నాయ ఉపాధిగా పాడి రంగం ఉపకరిస్తోంది. అయితే, వర్షాలు లేకపోవడం, పశుగ్రాసం లభించకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహక ధరను ప్రకటించింది. దీంతో రైతులు విజయా డెయిరీ పాలను సేకరిస్తుందన్న ఉద్దేశంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 25 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా విజయా డెయిరీ అతి కష్టం మీద ఐదు లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య మౌలిక సదుపాయాలు పెంచుకునే ప్రయత్నమే చేయడం లేదు. మౌలిక సదుపాయాలు పెంచితే హైదరాబాద్‌లో జనాభాకు అవసరమైన పాలను సరఫరా చేసేందుకు ఈ సమాఖ్యకు వీలు కలుగుతుంది. అయితే, ప్రైవేట్ డెయిరీలతో కుమ్మక్కై రైతులకు ప్రోత్సాహకం అందకుండా కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాజధానిలో పాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన రైతాంగానికి ప్రోత్సహకాన్ని నిలిపివేయడంపై రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వారు తమ సమస్యలను విన్నవించారు. లక్ష్యం ప్రైవేట్‌కు ప్రోత్సాహకమేనా! మౌలిక సదుపాయాలు లేవన్న సాకుతో వేలాది మంది రైతుల నుంచి పాలను సేకరించడానికి విజయా డెయిరీ వెనకాడటానికి పరోక్షంగా ప్రైవేట్‌కు సహకరించడమేనన్న ఆరోపణలు లెక్కకు మించి ఉన్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్‌లో మిల్క్ గ్రిడ్, హైదరాబాద్ సమీపంలో మెగా ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పదేపదే చెపుతున్నా ఈ పాడి సమాఖ్య మాత్రం ముందుకు రావడం లేదు. వాటిని ఏర్పాటు చేస్తే ప్రైవేట్ నుంచి తమకు వచ్చే ‘సహకారం’ ఆగిపోతుందేమోనన్న ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. ఓ వైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇప్పుడు మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నంలో విజయ డెయిరీ ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అమూల్ సంస్థ దే శ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూనే గుజరాత్‌లోని 34 లక్షల మంది పాడి రైతులను ఆదుకుంటున్న విషయాన్ని విజయా డెయిరీ విస్మరిస్తోంది. ఆత్మహత్యలకు ఆజ్యం పోసే చర్య రైతుల నుంచి పాలు సేకరించడంలో విజయ డెయిరీ అలసత్వం చూపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాన్ని నిలిపివేయడం ద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను సృష్టిస్తోంది. ఇప్నటికే ఖర్చులు పెరిగిపోయి పాడి రైతులు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నారు. ఈ చర్యతో మరిన్ని కష్టాలపాలవుతారు. ప్రభుత్వం ఈ చర్యను నిలుపుదల చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. -పాడిరైతుల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి -
విజయ పాలల్లో పందికొక్కు
ఎంహెచ్వో తనిఖీలో బయటపడిన డెయిరీ నిర్లక్ష్యం నెల్లూరు సిటీ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని విజయ డెయిరీ పాలల్లో పందికొక్కు కనిపించింది. నగరపాలక సంస్థ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. స్థానిక వెంకటేశ్వరపురంలో విజయ డెయిరీ ఉంది. వారం కిందట వెంకటేశ్వరపురానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి డెంగీ జ్వరంతో మృతిచెందింది. ఈక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్వో) వెంకటరమణ బుధవారం దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో డెయిరీ సమీపంలో అపరిశుభ్రత కనిపించింది. డెయిరీ లోపలికి వెళ్లి పరిశీలించారు. పాలు నిల్వ ఉంచిన ఒక ట్రేలో పందికొక్కు కనిపించింది. ఈ విషయాన్ని కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.ఎస్.మూర్తికి తెలిపారు. కమిషనర్ డెయిరీకి వచ్చి కోల్డ్‌స్టోరేజ్‌ను, పాలు ఫిల్టర్ చేసే పరికరాలను పరిశీలించారు. డెయిరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీని నిర్వహించే తీరు ఇదేనా? అని ఎండీ కృష్ణమోహన్‌ను ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూస్తానని, 10 రోజులు సమయం కావాలని ఎండీ కోరారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ కంపెనీనైనా సీజ్ చేసేందుకు వెనుకాడబోమని కమిషనర్ మూర్తి హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. -
‘విజయ’ పోరు..మళ్లీ షురూ!
విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ పాలకవర్గంలో ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకునేందుకు గురువారం పోలింగ్ జరగనుంది. పాలకవర్గంలో ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు మళ్లీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. చైర్మన్ మండవ జానకిరామయ్య, ఆయన వ్యతిరేక వర్గీయులు మూడు డెరైక్టర్ పోస్టులను కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా రెండు ప్యానళ్లను రంగంలోకి దించుతున్నారు. ముగ్గు రు డెరైక్టర్లకు జానకిరామయ్య తన ప్యానల్‌ను ఇప్పటికే ప్రకటించగా, ఆయన వ్యతిరేక వర్గీయులు కూడా రెండు డెరైక్టర్ పోస్టులకు పోటీ చేస్తున్నారు. జానకిరామయ్య ప్యానల్ నుంచి అద్దా వెంకట నగేష్, కాట్రగడ్డ వెంకటగురవయ్య, తిరుమల స్వర్ణకుమారి పోటీలో నిలిచారు. వ్యతిరేక వర్గం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా వేమూరి సాయివెంకటరమణ, ఎ.శ్రీపద్మ పోటీచేస్తున్నారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో మొత్తం 430 మంది సభ్యులు ముగ్గురు డెరైక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న పాల ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ఐదు గంటలకు ఓట్లు లెక్కిస్తారు. కొనసాగుతున్న ఆధిపత్య పోరు కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గం కోసం కొన్నేళ్లుగా టీడీపీలో రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఏటా ముగ్గురు పాలకవర్గ సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. ఆ ఖాళీలను భర్తీ చేయటానికి ఎన్నికలు జరుగుతుంటాయి. ఐదారేళ్లుగా మండవ జానకిరామయ్య వ్యతిరేకవర్గం ఆయనను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని పోరాడుతోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావును నియమించాలని రెండేళ్ల నుంచి జానకిరామయ్య వ్యతిరేకులు పావులు కదుపుతున్నారు. ఒక దశలో పార్టీ అధినేత వద్ద జరిగిన పంచాయితీలో దాసరి బాలవర్ధనరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది బాలవర్ధనరావు స్వయంగా రంగంలోకి దిగి డెరైక్టర్‌గా పోటీ చేశారు. మండవ జానకిరామయ్య కూడా తన వర్గాన్ని దాసరికి వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టడంతో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. చివరకు చంద్రబాబు జోక్యంతో అప్పట్లో గొడవలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. ఆనాడు జరిగిన ఒప్పందం ప్రకారం మండవ జానకిరామయ్యను మార్చాలని పాలకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గీయులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో జానకిరామయ్య జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు దగ్గరై మిల్క్ యూనియన్‌లో తన అధ్యక్ష పదవిని సుస్థిరం చేసుకున్నారు. అయినా మండవ వ్యతిరేకులు పట్టువదలకుండా మళ్లీ పోటీకి దిగారు. -
విజయ డెయిరీ ఉద్యోగుల ఆందోళన
కర్నూలు : వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాలనే డిమాండ్లతో విజయ డెయిరీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్ విజయ్‌మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఇవ్యాలని వారు కోరారు. -
ధర్మాస్పత్రిపై అధర్మవేటు!
- చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ఇక ప్రైవేటుపరం - వైద్యశాల పరిశీలనకు నేడు కమిటీ రాక - పేదలకు దూరం కానున్న వైద్యం - అన్ని సేవలకూ ఫీజుల మోత తప్పదు - పేదలు, వైద్యవర్గాల్లో ఆందోళన సాక్షి,చిత్తూరు/చిత్తూరు అర్బన్ : గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉన్నపుడు చిత్తూరు విజయా డెయిరీ మూతపడింది. మళ్లీ ఆయన పదవిలోకి ఏడాది పూర్తి కాకనే చిత్తూరు షుగర్స మూతపడేట్లు చేశారు. తాజాగా ప్రభుత్వాస్పతిని కూడా ప్రయివేటు పరంచేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉచిత వైద్యసేవలు అందించడమే ధ్యేయమని చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగించడానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక్కడున్న ఆస్పత్రిని అపోలో సంస్థలు ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి క్లీనికల్ అటాచ్మెంట్ ఇవ్వాలని ఆ సంస్థ అడగటం.. ప్రభుత్వం సైతం అంగీకరించడం తెలి సిందే. దీంతో గురువారం ఆస్పత్రిలోని అధికారులు ప్రభుత్వం అడిగిన నివేదిక ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. 300 పడకలు, రోజులు వెయ్యి మందికిపైనే అవుట్ పేషెంట్లు, 17 ఎకరాల సువిశాల స్థలం ఉన్న చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 14 విభాగాలున్నాయి. ఎక్స్‌రే, డిస్పెన్సరీ, ఆపరేషన్ థియేటర్లు, కంటి విభాగం, ప్రసూతి విభాగం, కుష్ఠు వ్యాధి నివారణ వార్డు, జీఈ షెడ్డు, రోగులకు భోజనం అందించే విభాగం, నర్శింగ్ క్వార్టర్స్, క్షయ వార్డు, పోస్టుమార్టం విభాగం, ఇటీవల నూతనంగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేంద్ర భవనం, ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ కేంద్రం, ఆయుర్వేదిక్, ఏఆర్టీ సెంటర్లు ఆస్పత్రిలో ఉన్నాయి. మొత్తం ఆస్పత్రి 2.65 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఉన్నాయి. ఇన్ని వసతులున్న ఆస్పత్రిలో ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షణ వైద్యులు ప్రవేశిస్తారు. రోగుల జబ్బులపై ప్రయోగాలు చేయడం, పోస్టుమార్టం గదిలో మృతదేహాలకు శవపరీక్షలు చేసి శిక్షణ పొందడం లాంటివి చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అంగీకరించిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిని మూడేళ్ల తరువాత ఖాళీ చేస్తారా..? చేయకుంటే పరిస్థితి ఏమిటి..? అనే విషయాలపై అధికారుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద సరైన సమాధానాలు లేవు. ఉద్యోగులపై ఆరా... మరోవైపు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారికి నెలసరి ఇచ్చే జీత భత్యాలు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వారి పనితీరు ఎలా ఉందనే అంశాలను సైతం వెంటనే సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించింది. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడేళ్ల నివేదికను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుందా..? మరో ప్రాంతానికి బదిలీ చేస్తుందా..? అపోలో సంస్థలకు తమనూ అప్పగిస్తుందా..? అనే ప్రశ్నలతో వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పేదల వైద్యానికి పాతర చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని అపోలోకు అప్పగిస్తే పేదలకు వైద్యసేవలు అందే పరిస్థితి ఉండదని వైద్య ఉద్యోగులు,యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి తగ్గకుండా వైద్యసేవలు పొందుతున్నారు. అపోలో చేతుల్లోకి వెళితే వైద్య సేవల కోసం వచ్చే పేదల నుంచి ముక్కుపిండి కనీస ఫీజులు వసూలు చేయనున్నారు. ముఖ్యంగా సీటీ స్కాన్,ఈసీజీ,ఎండో స్కోప్,ఎక్సరే తదితర టెస్ట్‌లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు. పేద,మధ్యతరగతికి చెందిన రోగులకు కష్టాలు తప్పవని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి 166ఏళ్లు చిత్తూరు ఆసుపత్రికి పెద్ద ఘనచరిత్రే ఉంది. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ఇప్పటికి 166 సంవత్సరాలు. 1849 లో ఒక చిన్న డిస్పెన్షరిగా ఓ ప్రైవేటు బిల్డింగులో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. 1867లో ఆసుపత్రికి ప్రభుత్వం సొంతభవనాన్ని నిర్మించింది. 1919 వరకు లోకల్ బోర్డు ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ప్రస్తుతం 320 పడకల ఆసుపత్రిగా చిత్తూరు ఆసుపత్రి రూ పాంతరం చెంది రోజూ వెయ్యిమంది పేదలకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం 177మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా, 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరో పదిమంది ఔట్సోర్సింగ్ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. మరో 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈఆస్పత్రిలో 252మంది ఉద్యోగ పోస్టులున్నా యి. ఇంత చరిత్ర కలిగిన ప్రజావైద్యశాలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాల ని పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. -
ఇతడే ఒక సైన్యం
రైతుల కోసం ఒంటరి పోరాటం పెరిగిన బస్సుచార్జీ నుంచే అతని ఉద్యమం విజయూ డెరుురీ తెరిస్తేనే చొక్కా ధరిస్తాడట ! చక్కెర ఫ్యాక్టరీ కోసం దీక్షబూనిన ఆదర్శ రైతు ఒంటిపై నాలుగు మూరల పంచె మాత్రమే ఉంటుంది. కాళ్లకు చెప్పులు వేసుకోడు. కిలో మీటర్ల కొద్దీ నడిచేస్త్తుంటాడు. ఎండకు కాస్త నీడనిచ్చే తలపాగా ఉంటుంది. ఎవరి తలపై చేయి పెట్టడు. జనం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నాడు. కష్టంలో ఉన్న ప్రతి రైతు పంచన ఉంటాడు. సొంత పనులు పక్కన పెట్టి నలుగురి కోసం ఉద్యమిస్తున్నాడు. గల్లీ నుంచి రాజధాని వరకు దీక్షలు, ఉద్యమాలు చేస్తూ ఆదర్శ జీవితం గడుపుతున్నాడు. ఆయనే ఈదల వెంకటాచలం నాయుడు. ఈ రైతు ఉద్యమ గాథ ఆదివారం ప్రత్యేకం. చిత్తూరు (అర్బన్): వెంకటాచలం నాయుడు స్వస్థలం పెనుమూరు మండలంలోని సాతంబాకం పంచాయతీ పెరుమాళ్ల కండ్రిగ. ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. పెద్దగా అక్షరజ్ఞానం లేదు. ఆరు ఎకరాల భూమి, నాలుగు ఆవులే ఆయన ప్రపంచం. పట్టుపురుగులు పెంచి పట్టుగూళ్లను అమ్మడం.. సేద్యం చేయడం తప్ప మరో లోకం తెలియదు. ఆవుల పాలను డెయిరీకి పోసి నెలసరి బిల్లులు తీసుకుని జీవనం సాగించేవాడు. ఒకటిన్నర దశాబ్దంగా జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అయినా సరే అన్నదాతకు కష్టమొస్తే ముందుంటాడు. ఆపదలో ఉన్న రైతుకు అండగా ఉంటాడు. నిరసన గళాన్ని విప్పుతాడు. ఆ నిరసన ఎలా ఉంటుందంటే రాజధానిలో ఏసీ గదుల్లో కూర్చున్న నేతలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తుంది. 2003లో ఓ సంఘటన వెంకటాచలంనాయుడులో ఉద్యమాన్ని మేల్కొలిపింది. చిత్తూరు నుంచి సాతంబాకం వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. రూ.5 ఇచ్చి టికెట్టు ఇమ్మన్నాడు. కండక్టర్ రూ.7 అడిగాడు. ఎందుకని అడిగితే చిత్తూరు నుంచి పెనుమూరు వెళ్లడానికి నాలుగు స్టేజీలు ఉండేవి. ఇప్పుడు ఐదో స్టేజీ పెరిగింది. అందుకే రూ.2 అదనంగా చెల్లించామని సమాధానమిచ్చాడు కండక్టర్. స్టేజీ ఇష్టప్రకారం పెంచేసి ప్రయాణికులపై భారం మోపడాన్ని నిరసిస్తూ ఆ ఏడాది జూన్‌లో దీక్షబూనాడు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 16 రోజు ల పాటు వెంకటాచలం నాయుడు ఉద్యమం సాగింది. ఇదే సమస్యపై 2004లో 65 రోజులు, 2008లో 13 రోజుల పాటు దీక్షలు చేశాడు. సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఆయన నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంది. మరో ఉద్యమం దక్షిణాసియాలోనే ఒక వెలుగు వెలిగిన చిత్తూరు విజయా డెయిరీది. 2002లో అప్పటి పాలకవర్గం డెరుురీని మూసేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. నాయుడు లోలోపల మదనపడిపోయాడు. అన్నం మెతుకు గొంతులోకి వెళ్లక అడ్డం పడినట్లయింది జిల్లాలో రైతులు, విజయా డెయిరీ ఉద్యోగుల పరిస్థితి. 2004లో చిత్తూరుకు ఓ పనిపై వచ్చిన వెంకటాచల నాయుడు విజయా డెయిరీ వైపు వెళ్లాడు. డెరుురీని, అక్కడ ఉన్న యంత్రపరికరాలు చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు విజయా డెయిరీని తెరిపించాలని నిరహారదీక్షలు, నిరవధిక దీక్షలు చేస్తూనే ఉన్నాడు. 2007 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు డెయిరీని పునః ప్రారంభించేత వరకు చొక్కా ధరించనని, కాళ్లకు చెప్పులు వేసుకోనని దీక్షబూనాడు. ఇప్పటికీ మొండి పట్టుదలతో అలాగే నడుస్తున్నాడు. పెనుమూరులోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయాన్ని శుభ్రం చేయించాలని 2008లో 18 రోజలు దీక్ష చేశాడు. డెరుురీ తెరిపించాలని గత నెలలో హైదరాబాద్ వె ళ్లి ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు నిరసన దీక్షబూనాడు. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీ యూజమాన్యం కార్మికులను తొలగించడమేగాకుండా, క్రషింగ్ ఆపేయడంపై ఫ్యాక్టరీ వద్ద ఉద్యమం చేస్తున్నాడు. ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు, కార్మికులకు బకారుులు చెల్లించాలనే డిమాండ్‌తో 20 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాడు. వెంకటాచలం నాయుడు పెద్ద కుమారుడు మేస్త్రీ పనిచేసి జీవిస్తున్నాడు. పాల డబ్బులు, పొలంలో ఆదాయంతో కుమార్తెకు పెళ్లిచేశాడు. మరో కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. ఉద్యమాల బాట పట్టడంతో ఇల్లు గడవడానికి, ఊర్లు తిరగడానికి ఆరెకరాల పొలంలో ఓ ఎకరం అమ్మేశాడు. అయినా సరే ఉద్యమాలకు ఎవరినీ ఆర్థిక సాయం అడగనని, ఇచ్చినా తీసుకోనని, ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని చెబుతున్నాడు వెంకటాచలం నాయుడు. -
తిరుమలలో హెరిటేజ్ దుకాణం
-
తిరుమలలో హెరిటేజ్ దుకాణం
సీఎం సొంత సంస్థకు నిబంధనల నుంచి మినహాయింపు సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయ డెయిరీని నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబునాయుడు.. ఈ దఫా తిరుమలలో తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలకు తెరలేపారు. టీటీడీలోని సంబంధిత శాఖల అధికారులకు కూడా తెలియకుండా, హెరిటేజ్‌కు దుకాణం కేటాయిస్తూ టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయం తీసుకునేలా బాబు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద తిరుమలలో ఆ కంపెనీ దుకాణం వెలసింది. వారం రోజులుగా ఇక్కడ పాల ఉత్పత్తులతో పాటు ఇతర తినుబండారాల అమ్మకం కొనసాగిస్తోంది. వాస్తవానికి తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా సదుపాయాల కల్పన కోసం టీటీడీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇందులో తమ ఇళ్లు, దుకాణాలు, స్థలాలు పోగొట్టుకున్న స్థానికులకు మాత్రమే టీటీడీ పునరావాసం కింద దుకాణాలు, ఇళ్లు కేటాయించాలనే స్పష్టమైన నిబంధన ఉంది. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలైంది. చంద్రబాబు సీఎం అయ్యాక 1996 నుంచి 2003 వరకు ప్రణాళికను వేగంగా అమలు చేశారు. అందులో తమ ఇళ్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధితులు.. పునరావాసం కోసం దశాబ్దాలుగా టీటీడీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ చంద్రబాబు పదవిలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరించకుండా.. తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఉత్పత్తులకు తిరుమలలో ప్రచారం కల్పించే యోచన చేశారు. ఇంకేముందీ టీటీడీ ఉన్నతాధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. పంచాయితీ, రెవెన్యూ విభాగాలకు తెలియకుండానే టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ మాజీ చైర్మన్ జేఎస్ శర్మ, మాజీ ఈవో ఎంజీ గోపాల్ నేతృత్వంలో దుకాణం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. దీనిపై అన్ని వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గుజరాత్ ‘అమూల్’ను అడ్డుకోండి
ఆ పాలు రాష్ట్రానికొస్తే మన రైతులకు నష్టం టీ సర్కారుకు విజయ డెయిరీ లేఖ రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం ‘నార్మాక్’కు నోటీసులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మార్కెట్లోకి వచ్చే నెలలో అడుగుపెట్టనున్న గుజరాత్ ‘అమూల్’ పాలపై విజయ డెయిరీ ఆందోళన చెందుతోంది. సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడి మార్కెట్లోకి వస్తున్న అమూల్‌ను అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్కారుకు లేఖ రాయడంతో సంబంధిత యంత్రాంగం రంగంలోకి దిగి, చర్యలు చేపట్టింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్).. ఆ రాష్ట్ర రైతుల నుంచి సేకరించిన పాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత 50 వేల లీటర్లతో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది లీటర్లకు విస్తరించాలనేది దాని లక్ష్యం. ఇందులో భాగంగా గుజరాత్ నుంచి తీసుకొచ్చిన పాలను ప్యాకింగ్ చేసేందుకు నల్లగొండ-రంగారెడ్డి మిల్క్ యూనియన్ (నార్మాక్)తో జీసీఎంఎంఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉన్న నార్మాక్ యూనిట్లో అమూల్ పాలను ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తారు. ఇలా అమూల్ పాలు రాష్ట్రానికి రావడం వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని విజయ డెయిరీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. తెలంగాణ రైతుల నుంచే పాలు సేకరించి, సొంత యూని ట్ పెట్టుకొని వాటిని సరఫరా చేస్తే తమకు అభ్యంతరం లేదని.. అలాకాకుండా గుజరాత్ రైతుల నుంచి సేకరించిన పాలను ట్యాంకర్ల ద్వారా తరలించి ఇక్కడ ప్యాకింగ్ చేసి అమ్మడం సహకార నిబంధనలకు విరుద్ధమని డెయిరీ అధికారులు పేర్కొంటున్నారు. గుజరాత్ సహకార సంస్థ మన రాష్ట్ర సహకార విజయ డెయిరీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి ఇలా పోటీకి రావడం తగదంటున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పాల సేకరణ ప్రోత్సాహకం కింద లీటరుకు రూ.4 అదనంగా ఇచ్చి విజయ డెయిరీకి ప్రాణం పోశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ప్రధానంగా విజయ డెయిరీపైనే ప్రభావం పడుతుందని అంటున్నారు. పైగా మన చిన్న, సన్నకారు రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిరాకీ లేకుం డా పోతుందని సర్కారుకు రాసిన లేఖలో విజ య డెయిరీ పేర్కొంది. అలాగే నార్మాక్ యూని ట్‌తో అమూల్ ఒప్పందం అంగీకారం కాదని స్పష్టంచేసింది. హయత్‌నగర్‌లోని నార్మాక్ యూనిట్ సహా దాని కింద ఉన్న 72 ఎకరాలు మొత్తం విజయ డెయిరీకి చెందిన ఆస్తులేనని... అలాంటప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా అమూల్ పాలను ఆ యూనిట్లో ఎలా ప్యాకింగ్ చేస్తారని ప్రశ్నించింది. విజయ డెయిరీ లేఖతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. లేఖలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా నార్మాక్‌పై చర్యలు తీసుకోవాలని సహకారశాఖను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆ శాఖ నార్మాక్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు అమూల్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని సహకారశాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
అగ్ని ప్రమాదంలో డెయిరీకి రూ.2 కోట్ల నష్టం
ఒంగోలు క్రైం: ఒంగోలు విజయ డెయిరీలోని పాలకేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్లు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాదం జరగటంతో ఆయన శుక్రవారం బోర్డు ఆఫ్ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక డెయిరీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాలపొడి ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిశితంగా సమీక్షించారు. ప్రమాదానికి గురైన ఎయిర్‌హీటర్ చాంబర్ పక్కనే ఆపరేటర్ ఉన్నప్పటికీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అన్నారు. పాలపొడి తయారీ నిలిచిపోయిందని, దీని వలన రోజువారి నష్టం అధికంగానే ఉంటుందని చెప్పారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలను పొడిగా మార్చే ఈ ఎయిర్ హీటర్ చాంబర్ పునరుద్ధరించేందుకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసం ఢిల్లీ మదర్ డెయిరీలో పని చేస్తున్న వెంకట్ అనే నిపుణుడ్ని పిలిపిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. విజయవాడ నుంచి కూడా సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజూ రూ.7 లక్షల చొప్పున ఎన్ని రోజులు పాలపొడి ఉత్పత్తి ఆగిపోతే అంత మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు వివరించారు. డెయిరీలో ప్రస్తుతం 6 లక్షల లీటర్ల పాలు నిల్వ ఉన్నాయని ఈ పాలను వేరే ప్రైవేట్ డెయిరీలకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. డెయిరీలో పాలపొడి ఉత్పత్తి ఆగిపోవడంతో తమిళనాడు, కర్ణాటకలోని వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. -
జిల్లా పాడి రైతులు చేసిన పాపమేంటి?
* 50 వేల మంది రైతులకు దక్కని పాల సేకరణ ధర పెంపు * జిల్లాలో పాలను సేకరించని రాష్ట్ర డెయిరీ సమాఖ్య * తమకూ వర్తింపజేయాలని కోరుతున్న జిల్లా రైతాంగం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ హుస్నాబాద్ : రాష్ట్ర డెయిరీ సమాఖ్య (విజయ డైరీ)కు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నవంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతోంది. కానీ కరీంనగర్ జిల్లా రైతులకు మాత్రం ఆ భాగ్యం రక్కడం లేదు. జిల్లాలో విజయ డైరీ ఒక్క లీటర్ పాలను కూడా సేకరించకపోవడమే ఇందుకు కారణం. గతంలో జిల్లాలో విజయ సంస్థ వేలాది మంది రైతుల నుంచి పాలు సేకరించినప్పటికీ కాలక్రమంలో దానికి పాతరేయడం, ఆ స్థానంలో ప్రైవేటు, సహకార సంఘాలు ఆవిర్భవించడంతో జిల్లా రైతాంగానికి ప్రైవేటు డెయిరీలే దిక్కయ్యాయి. విజయ డెయిరీకి పాతర రాష్ట్ర డెయిరీ సమాఖ్య కరీంనగర్ జిల్లాలో 1971లో పాలసేకరణను ప్రారంభించింది. తొలుత పది పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించిన సంస్థ కొద్దికాలానికే రెట్టింపు కేంద్రాలను విస్తరించగా విజయ డైరీకి పాలుపోసే రైతుల సంఖ్య లక్షకు చేరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2003 ఫిబ్రవరి 22న డెయిరీ సమాఖ్యను మాక్స్ చట్టం 95 పరిధిలోకి మార్చడంతో డెయిరీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా పోయింది. తరువాత జిల్లాలోని కొందరు నేతలు పథకం ప్రకారం... విజయ డెయిరీ స్థానంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని స్థాపించారు. జిల్లాలో విజయ డెయిరీ ఆధీనంలో ఉన్న ఆస్తులు సైతం కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో 50 వేల మంది రైతులు సభ్యులుగా చేరగా, వారి నుంచి నిత్యం లక్ష లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నారు. 50 వేల మంది రైతుల ఎదురుచూపులు పాల సేకరణ ధరను రూ.4కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకూ వర్తింపజేయాలని కరీంనగర్ జిల్లా పాడి రైతులు కోరుతున్నారు. పెరిగిన దాణా ధరలతో నష్టాల్లో ఉన్న తమకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వర్తింపజేస్తే కష్టాల నుంచి బయటపడతామని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకం తమకు ఎందుకు వర్తింపజేయడం లేదని... ఈ విషయంలో తాము చేసిన పాపమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో విజయ డెయిరీ పాలను సేకరిస్తే తాము కూడా ఆ సంస్థకే పాలు పోసేవారమని చెబుతున్నారు. అన్ని జిల్లాలతోపాటు తమ జిల్లాకూ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తే రైతులకు ప్రతినెలా రూ.2.4 కోట్ల మేర లాభం దక్కేదని అభిప్రాయపడుతున్నారు. ముల్కనూరుకు వర్తింపజేయండి ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ రైతులకూ వర్తింపజేయాలని స్థానిక నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముల్కనూరు డెయిరీ కేంద్రంలోనూ 30 వేల మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారని, ప్రతిరోజూ 30 వేలకుపైగా లీటర్ల పాలను సేకరిస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్‌తోపాటు ముల్కనూరు డెయిరీ రైతులకూ ప్రభుత్వ ప్రోత్సహకాన్ని అందజేస్తే జిల్లాలో 80 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి విన్నవించాం - చల్మెడ రాజేశ్వర్‌రావు, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ చైర్మన్ రైతులతో ఏర్పడిన మా సంస్థకు సైతం ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని సీఎం కేసీఆర్, పశుసంవర్ధకశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లామంత్రి ఈటెల రాజేందర్‌ను ఇప్పటికే కలిసి విన్నవించాం. సీఎం సైతం సానుకూలంగా ఉండటం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నాం. జిల్లాకూ వర్తించేలా ప్రయత్నిస్తున్నా.. - ఎంపీ వినోద్‌కుమార్ విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు మద్దతుగాా లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని కరీంనగర్ డెయిరీ రైతులకూ వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నా. త్వరలో సీఎంతో మాట్లాడి జిల్లాలోని రైతాంగానికి ప్రయోజనం కలిగేలా చేస్తా. -
రైతుకు ప్రోత్సాహకంతో విజయ డెయిరీ జోష్
* 40వేల లీటర్ల పాలు అదనంగా సేకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ. 4 పెంచడంతో విజయ డెయిరీ పాల సేకరణ గణనీయంగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం మొదటి వారంలోనే ఏకంగా 40వేల లీటర్ల అదనపు సేకరణ జరుగుతోందని సమాచారం. ప్రైవేటు డెయిరీలు మార్కెట్‌ను ముంచెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం విజయ డెయిరీకి ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం విజయ డెయిరీ రాష్ట్రంలో లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. కర్ణాటక నుంచి మరో లక్ష లీటర్లు సేకరిస్తోంది. ప్రోత్సాహకం ప్రకటించిన తర్వాత రైతుల నుంచి వచ్చిన సహకారంతో వారంలోనే అదనంగా 40 వేల లీటర్లు పెరిగిం దని విజయ డెయిరీ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటివరకు విజయ డెయిరీ రైతుకు లీటరుకు రూ. 53 చెల్లించేది. ప్రభుత్వ ప్రోత్సాహకంతో అది రూ.57కు చేరుకుంది. హెరిటేజ్ పాలను కేరళ ప్రభుత్వం నిషేధించడంతో విజయ పాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని ఆ అధికారి చెప్పారు. రానున్న రోజుల్లో మరో 3 లక్షల లీటర్ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రచించినట్లు తెలిపారు. -
మా డెయిరీ... మాగ్గావలే
రాజమణి: బర్లు పాలిస్తన్నయా దుర్గమ్మా ? పాలు కేంద్రానికే పోస్తున్నారా? దుర్గమ్మ: పాల కేంద్రాలది అంత దోపిడుంది మేడం. ఊళ్లె నాలుగు ప్రబేటు(ప్రైవేటు) డెయిరీలున్నయి. నాలుక్కు నాలుగు డెయిరీలు దోసుకునేడేగాని ఏమన్న ఉన్నదా..! బర్రె పాలకు రూ.25, ఆవు పాలకు రూ.12 సొప్పున కూడా కట్టిత్తలేరు. ఇంత మోసం ఉంటదా మేడం. మన డెయిరీ మనకుండాలే. మీరు ముఖ్యమంత్రి సారుకు జెప్పి మన దగ్గర రెండేళ్ల నుంచి మూసేసిన సర్కారు డెయిరీ(విజయ డెయిరీ)ని మళ్లా తెరిపియ్యాలే మేడం. రాజమణి: ముఖ్యమంత్రి గారు విజయ డెయిరీలో పాలుపోస్తే రూ.4ఎక్కువ కట్టిస్తమని చెప్పారు కదా? మహిళలు: విజయ డెయిరీకిపాలుబోస్తే రూ.4 ఎక్కు వ కట్టిత్తమని కేసీఆర్ సారు జెప్పిరి గని... మన ఆ డైరై లేకపాయే. అందుకే మా డెయిరీ మాగ్గావాలే. బ్యాంకోళ్లు కూడా మంచోళ్లు కాదు మేడం. ప్రబేటు డైరోడు చెప్పంగనే బర్రెలు కొనుక్కొమ్మని లోన్లు ఇత్త రు, అదే సర్కారు చెప్తే మాత్రం మాట చెవులగూడ పెట్టరు. మోసమంతా బ్యాంకొళ్లతోనే ఉంది మేడం. రాజమణి: అంతా మీటింగు పెట్టుకున్నట్టున్నారు? సరస్వతి, నాగమణి: అవును మేడం. మండల సమా ఖ్య మీటింగు పెట్టుకున్నం. అన్ని గ్రామల సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చారు. ధాన్యం కొనుగోళ్ల మీదనే లెక్కలు, పత్రాలు చూస్తున్నం. రాజమణి: అయితే నేను రావాల్సిన టైంకే వచ్చానన్న మాట (ఆ మాటకు మహిళలంతా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చారు.. ) రాజమణి: కొత్త ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? సుల్తానా: ‘కళ్యాణ లచ్చిమి’ పథకం శానా మంచి పథకవమ్మా... బిడ్డ ఎదుగుతున్నదంటే గుండెల మీద కుంపటి పెట్టుకున్నట్టే ఉండే. కేసీఆర్ పథకం మంచిగ పెట్టిండు. సంపూర్ణ: (మధ్యలో క ల్పించుకుంటూ) మా బీసీలకు కూడా ఆ పథకం పెట్టమని మీరు జెప్పాలే మేడం. ఆడపిల్ల లగ్గం అంటే అందరికీ ఖర్సేగదమ్మా. దేవమ్మ: తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం... ఇంటి మొగుళ్లు అటీటుపోయినా, మేం కేసీఆర్ సారుకు ఓట్లేసి గెలిపిచ్చినం. మా పేదోళ్లకు పెట్టేకాడా కేసీఆర్ సారు ఎన్కముందాడొద్దు. ఇప్పటిదాకా ఇంకా సర్కారు ఏంజేయలే... పని ఇక షురుజేయిరి. రాజమణి: మీకున్న సమస్యలు ఏమిటో చెప్పండి? ఎస్.సరస్వతి: మా ప్రాబ్లమ్స్ అంటే... మాకు గ్రామ సంఘాలు మీటింగ్‌లు పెట్టుకోవడానికి బిల్డిగ్స్ లేవు. అవొకటి మాకు కంపల్సరి కావాలే మేడం. బ్యాంకు లింకేజీతో శానా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం.. లోన్లు సరిగా ఇవ్వకపోవడం, క్రాఫ్ లోన్లకు లింకు పెట్టడం వల్ల శానా ప్లాబ్లం అయింతంది. శ్రీనిధికి గతంలో వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పిండ్రు. అప్పుడు ఇచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టించుకుంటున్నారు. శ్రీనిధికి వడ్డీలేని రుణం వర్తించాలని కోరుతున్నం మేడం. మేన్‌గా ఏదంటే మేడం...వీఓఎల్లకు 18 నెలల నుంచి జీతాలు లేవు. అవి కూడా రావాలె మేడం. రాజమణి: ఇంకా ఏమేమి సమస్యలున్నాయి? నాగమణి: మేం లీడర్లుగా వచ్చి రెండు ఏళ్లు అయింది. ఈ రెండేళ్లలో అన్ని విషయాలు కరెక్టుగా తెల్వలేదు. వీవో లీడర్స్ రెండు ఏళ్ల కంటే ఎక్కువగా ఉండొద్దని డీఆర్డీఏ అధికారులు మా మీద టార్చర్ చేస్తున్నరు. బైలాలో మేం 5 ఏళ్ల వరకు పని చేయవచ్చని ఉంది. రాజమణి: అధికారులు ఎందుకు అలా చేస్తున్నారు? నాగ మణి, సరస్వతి: వాళ్ల భయం ఏమిటంటే... మేం ఎక్కువ రోజులు ఉంటే ఈ కొనుగోళ్లు, ఇతర ఆఫీసు పనులల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం కదా మేడం, అన్ని తెలుసుకొని అధికారులను ఎక్కడ నిలదీస్తామోనని భయం మేడం. రాజమణి: ఏం యాదమ్మ బాగున్నవా? ఊరు నుంచి ఎప్పుడు బయలుదేరినవ్? యాదమ్మ: బాగున్నమ్మా.. మండల సమాఖ్య మీటింగ్ అంటే కైకిలి ఎగ్గొట్టొచ్చిన. గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు మండలాలలకు, జిల్లాకు మీటింగులకు ఒచ్చినప్పుడు రూ.100 ఇస్తున్నరమ్మా... మీటింగులకు ఒచ్చినప్పుడు మాకు కైకిలి పోద్ది... తిండికి తిప్పిలకు సేతిగుంటే పెట్టుకుంటన్నం. ఇట్లదిరగాలే. ఏం లాభం లేదమ్మా. రాజమణి: బ్యాంకు రుణాలు బాగా అందుతున్నాయా? లక్ష్మి: డిఫాల్టు గ్రూపులతోని పెద్ద సమస్య ఒచ్చింది మేడం. ‘సర్కారేమో మాఫీ అయిందంటున్నరు. మీరేమో అప్పుగ ట్టమని ఇంటిముందరికి ఒచ్చి అడుగుతున్నరు, మీరు తింటానికేనా’ అని మా మీదికే ఎగబడుతున్నరు. బ్యాంకొళ్లేమో ఆళ్లు అప్పులు గడితేనే మీకు లోన్లిత్తం అంటన్నరు. ఏంజేయ్యాలే మేడం. నర్సమ్మ: తెలంగాణ పభుత్వం వస్తే క్రాఫ్లోన్లు మాఫీజేస్తమని చెప్పిరి. మహిళా సంఘాలకు రుణం ఇయ్యమని బ్యాంకుకు పోతే, మీరు కాఫ్లోన్గట్టలేదుకదా.. అవికడితేనే గ్రూపు లోన్లు ఇస్తామని చెప్పుతున్నరు మేడం. వెంటనే మెహర్ ఉన్నీసా అందుకుంటూ.... మెహర్ ఉన్నీసా: గ్రూపుల్లో రాజకీయ ప్రమేయం ఎక్కువైంది. సర్పంచ్ గ్రూపు సభ్యులు, వార్డు మెంబర్ల గ్రూపు సభ్యులే ఎక్కువ డిఫాల్టర్లుగా ఉన్నారు. ఈ సర్పంచులు, ఎంపీటీసీలే మహిళలను లోన్లు కట్టనిస్తలేరు. కట్టేవారిని కూడా వద్దని చెప్తున్నారు. ప్రభుత్వమే లోన్లు కడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నర్సాపూర్‌లో డిఫాల్టర్లు ఎక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి హామీలు డ్వాక్రా మహిళలకు భవనం ఏర్పాటు విషయమై తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం, వీఓఎల్స్ జీతాల విషయం కూడా సీఎం గారి దృష్టికి తీసుకుని తొందరలోనే పరిష్కరిద్దాం. నిధికి వడ్డీ లేని రుణాలు అందించమని మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతా . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల పంట రుణాలు మాఫీ చేసింది. 25 శాతం డబ్బును కూడా ప్రభుత్వం జమ చేసింది. ఏ బ్యాంకరైనా గ్రూప్లోన్కు, క్రాఫ్ లోనుకు ముడిపెడితే వెంటనే నా దృష్టికి తీసుకు రండి. వెళ్లి ఆ బ్యాంకు మెనేజర్‌ను నిలదీద్దాం. మంత్రి హరీషన్నతో మాట్లాడి మళ్లీ సర్కారు డెయిరీని తెరిపించేందుకు ప్రయత్నం చేస్తాం. -
విజయ పాల ధరలకు రెక్కలు
లీటరుకు రూ.2 పెంపు 8 16 నుంచి అమల్లోకి నూతన ధర 8 ఐదు నెలల్లో రెండు సార్లు పెంపు విజయవాడ : విజయ పాల ధర మళ్లీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయించింది. 200 ఎం.ఎల్ ప్యాకెట్ మినహా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చెప్పున పెంచారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో ఇప్పటికి ెండుసార్లు, గత రెండేళ్లలో ఐదుసార్లు విజయ డెయిరీ పాల ధరను పెంచారు. పెరిగిన ధరల వివరాలను కరపత్రాల ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ ప్రచారం చేస్తోంది. పెరిగిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ బాబూరావు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. పాల ధర పెంపును నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. జిల్లా ప్రజలపై నెలకు రూ.1.50 కోట్ల భారం విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీ ఆధ్వర్యాన 2,500 బూత్‌లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 2 లక్షల 50 వేల లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ లెక్కన జిల్లా ప్రజలపై రోజుకు రూ.5 లక్షలు, నెలకు కోటీ 50 లక్షల రూపాయల భారం పడనుంది. పాల ధర పెంచడం వల్ల కృష్ణా మిల్క్ యూనియన్‌కు ఏడాదికి రూ.18 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. విజయ పాల అర లీటరు ప్యాకెట్ ధరలు రకం ప్రస్తుత ధర పెరిగిన ధర గోల్డ్ రూ.25 రూ.26 స్పెషల్ మిల్క్ రూ.24 రూ.25 ఎస్టీడీ ప్రీమియం రూ.21 రూ.22 ఎకానమీ రూ.19 రూ.20 ఆవుపాలు రూ.22 రూ.23 -
టీడీపీకి చుక్కెదురు
విజయ డెయిరీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన దాసరి ప్యానల్ ఆధిపత్యాన్ని నిలుపుకున్న ‘మండవ’ సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పోడిచారని దాసరి వర్గం అనుమానం పనిచేయని ఎంపీ సుజనా, మంత్రి ఉమాల మంత్రాంగం విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో బీజేపీ నేతలతో చేతులు కలిపిన మండవ జానకిరామయ్య సొంత పార్టీకి ఊహించని రీతిలో జలక్ ఇచ్చారు. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(విజయ డెయిరీ) పాలకవర్గ ఎన్నికల్లో టీడీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ప్యానల్ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీని ఎదిరించి పాలపార్టీ పేరుతో సొంతగా అభ్యర్థులను నిలబెట్టిన విజయ డెయిరీ చైర్మన్ మండవ జానకి రామయ్య ప్యానల్ నుంచి పోటీచేసిన ముగ్గురు అభ్యర్థులూ విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. లక్షలు చేతులు మారిన వైనం విజయ డెయిరీ పాలకవర్గంలో మొత్తం 15 మంది డెరైక్టర్లు ఉంటారు. వారిలో ముగ్గురి పదవీ కాలం పూర్తవడంతో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవులకు టీడీపీకి చెందిన రెండు వర్గాలు పోటీపడ్డాయి. రెండు ప్యానళ్ల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. డబ్బు, మద్యం వెదజల్లారు. ప్రస్తుతం ఉన్న 12 మంది డెరైక్టర్లలో ఏడుగురు మండవ వర్గం కాగా, ఐదుగురు దాసరి వర్గానికి చెందిన వారు. కాబట్టి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ముగ్గురు డెరైక్టర్లను గెలిపించుకుని చైర్మన్ పదవి పొందాలని దాసరి వర్గం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మండవ జానకిరామయ్య ఈ ఎన్నికల్లో కూడా ముగ్గురు డెరైక్టర్లను గెలిపించుకుని తన పదవికి డోకా లేకుండా చేసుకున్నారు. మండవ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి నిమిషంలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి యెర్నేని సీతాదేవిని తన ప్యానల్ నుంచి బరిలో నిలిపారు. మండవను చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు దాసరి వర్గం ఏడాది నుంచి ప్రయత్నిస్తోంది. అర్ధరాత్రి వరకు మంతనాలు... దాసరి బాలవర్ధనరావు ప్యానల్‌కు మద్దతుగా తొలి నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపీ సుజనా చౌదరి, మంత్రి దేవినేని ఉమాలు అర్ధరాత్రి మంతనాలు చేశారు. మండవ జానకిరామయ్యను తప్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్ని విఫలమయ్యాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి బాలవర్ధనరావుకు విజయ డెయిరీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయన గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు డెరైక్టర్లను గెలిపించకుండా ఆయనకు వెన్నుపోటు పోడిచారని దాసరి వర్గం మండిపడుతోంది. ఎన్నికల కౌంటింగ్ అనంతరం దాసరి వర్గీయులు మీడియాతో మాట్లాడుతూ ‘టీడీపీ ప్యానల్ ఓడిందని రాయండి..’ అని మీడియా ఎదుట ప్రకటించారు. ఎన్టీఆర్ బొమ్మతో గెలిచిన మండవ పాల పార్టీ పేరుతో డెరైక్టర్లను బరిలో నిలిపిన మండవ జానకిరామయ్య తనకు ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ ఫొటోను మాత్రమే ప్రచారానికి వాడుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, ఇతర నేతల ఫొటోలు వాడిన దాసరి వర్గం ఓటమి చెందడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాశంగా మారింది. కొత్త రాష్ట్రానికి రాజధానిగా మారిన జిల్లాలో ఇప్పటికీ గ్రామాల్లో చంద్రబాబు కంటే ఎన్టీఆర్కే అభిమానులు ఎక్కువ ఉన్నారనే విషయం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైందని ఆ పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
నేడే విజయ డెయిరీ డెరైక్టర్ల ఎన్నిక
మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఐదు గంటలకు ఫలితాల వెల్లడి గెలుపుపై ఇరువర్గాల ధీమా విజయవాడ : ది కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డెరైక్టర్ల ఎన్నిక కోసం గురువారం జరగనుంది. విజయవాడ పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని బోర్డు సమావేశ మందిరంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లను లెక్కించి ఐదు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 385 మంది బోర్డు సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడు స్థానాల్లో తామేవిజయం సాధిస్తామని రెండు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
వేడెక్కిన విజయ డెయిరీ రాజకీయం
చైర్మన్‌గిరి కోసం పోరాటం గద్దె దిగనంటే దిగనంటున్న మండవ రాజీనామా యోచనలో దాసరి విజయవాడ : విజయ డెయిరీ రాజకీయం వేడెక్కింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గిరి కోసం టీడీపీ నేతలు బాహాబాహీ పోరాటానికి దిగుతున్నారు. చైర్మన్ పదవి కోసం టీడీపీలో రెండు వర్గాలు ప్రతిష్టాత్మక పోరాటం చేస్తున్నాయి. పెద్దల ఒప్పందం ఏమీ లేదు.. తాను పదవిని వీడేది లేదని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య మొండికేశారు. గత ఏడాది టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావును చైర్మన్ పదవి అప్పగించాలని పార్టీ నేతలు మండవ జానకిరామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు రోజులుగా పలు ధపాలుగా టీడీపీ పెద్దలు ఆయనతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితిలోనూ తాను పదవి నుంచి వైదొలగేది లేదని మండవ తెగేసి చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పినా తాను పదవి నుంచి తప్పుకునేది లేదంటూ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకొళ్ల నారాయణ చేస్తున్న రాజీ ప్రయత్నాలను మండవ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నెల 25వ తేదీన జరగనున్ను ముగ్గురు పాలక వర్గ సభ్యుల ఎన్నికలకు ఆయన తన ప్యానల్‌ను సిద్ధం చేసుకుని పోటీకి సమాయత్తమయ్యారు. దీంతో టీడీపీ నేతలు అందుకు ప్రతి వ్యూహంగా ప్యానల్‌ను రంగంలోకి దింపారు. టీడీపీలో రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. డెరైక్టర్ పదవికి రాజీనామా యోచనలో దాసరి ఈ సారి విజయవాడ డెయిరీ చైర్మన్ పదవి దాసరికి ఇచ్చేలా గత సంవత్సరం పార్టీ అధినేత చ ద్రబాబు వద్ద చర్చలు జరిగాయి. దాసరిని గన్నవరం సీటు వదులుకునే విధంగా విజయవాడ డెయిరీ కట్టబెట్టేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో గత సంవత్సరం ఇదే రోజుల్లో దాసరి బాలవర్ధనరావు డెరైక్టర్‌గా నామినేషన్ వేశారు. గత సంవత్సరం ఖాళీ అయిన మూడు డెరైక్టర్ల పదవులకు కూడా రెండు ప్యానల్స్ పోటీకి దిగాయి. అయితే దేవినేని ఉమా, ఎంపీ కొనకొళ్ల మధ్యవర్తిత్వం వహించి పోటీ లేకుండా చివరి క్షణంలో ఒక ఒప్పందం కుదిర్చారు. ఈ ఏడాది కూడా మండవ పదవి నుంచి తప్పుకునే పరిస్థితి కనపడటం లేదని చెబుతున్నారు. ఆయన తప్పుకోకుంటే డెరైక్టర్ పదవికి రాజీనామా చేయాలని దాసరి యోచిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి యెర్నేని సీతాదేవి కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య పాలక వర్గంలో 525 మిల్క్ సొసైటీలు ఉన్నాయి. వీటిలో 426 సొసైటీలకు ఓటు హక్కు ఉంది. మొత్తం 15 మంది డెరైక్టర్లకు గానూ, ఈ సంవత్సరం ముగ్గురు డెరైక్టర్ల పదవులకు పోటీ జరుగుతోంది. మిగిలిన 12 డెరైక్టర్లలో ఏడుగురు మండవ వర్గంలో ఉండగా, ఐదుగురు ఆయనకు వ్యతిరేక వర్గమైన దాసరి ప్యానల్లో ఉన్నారు. ఎన్నికలు జరిగే మూడింటిని ఎవరు కైవసం చేసుకుంటే వారు విజయ డెయిరీ చైర్మన్ అవుతారు. ఈ క్రమంలో మండవ బీజేపీకి చెందిన యెర్నేని సీతాదేవిని రంగంలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ఆమె డెరైక్టర్‌గా బరిలోకి దిగారు. మండవ ప్యానల్లో సీతాదేవి, జాస్తి రాధాకృష్ణ, వల్లభనేని భాస్కరరావు పోటీలో ఉన్నారు. చర్చల్లో మండవ జానకి రామయ్య మాట్లాడుతూ దాసరికి మాత్రం చైర్మన్ పదవి ఇవ్వనని, ఎర్నేని సీతాదేవికైనా పదవిని ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మండవకు వ్యతిరేకంగా దాసరి ఏర్పాటు చేసిన ప్యానల్లో గద్దె రంగారావు, వేమూరి వెంకట సాయి, ఉషారాణి పోటీలో ఉన్నారు. వైరి వర్గాల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఇచ్చారు. వాటితో పోటాపొటీగా ప్రచారం చేస్తున్నారు. -
పాలూ మండుతున్నాయ్
- లీటర్‌పై రూ.2 పెంచిన ప్రైవేటు డెయిరీలు - ఆర్నెల్లలో మూడో సారి - రెండు రోజుల్లో విజయ డెయిరీ వంతు కొడవలూరు : కొండెక్కి కూర్చున్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరోసారి పాలపిడుగు పడింది. ప్రైవేటు డెయిరీలు బుధవారం నుంచి లీటర్‌కు రూ.2 పెంచాయి. పాల ధర పెరగడం ఆర్నెల్లలో ఇది మూడోసారి. ఈ ఏడాదిలో జనవరి 13న లీటరుకి రూ.2 పెంచగా, మార్చి 10న రూ.2 పెంచగా తాజాగా మరోసారి భారం వేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రైవేటు డెయిరీలు ప్రకటించి అమలు చేస్తుండగా, విజయ డెయిరీ శుక్ర, లేదా శనివారాల్లో ధరల పెంపును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ధరల పెంపుతో పాల వినియోగదారులపై నెలకు అదనంగా రూ.42 లక్షల భారం పడుతుంది. జిల్లాలో సుమారు 15 వరకు పాల డెయిరీలు ఉండగా విజయ డెయిరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తోంది. మిగిలినవన్నీ ప్రైవేటు డెయిరీలే. అయితే పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంలో విజయ డెయిరీదే సింహభాగం. మొత్తం మీద రోజుకు 70 వేల లీటర్లు పాలు విక్రయిస్తుండగా అందులో విజయ డెయిరీ వాటా 18 వేల లీటర్లు. గతంలో పాల ధర పెంపును విజయ డెయిరీ మొదట ప్రకటించగా ఈ సారి ప్రైవేటు డెయిరీలు ముందు నిలిచాయి. దీంతో రూ.46గా ఉన్న లీటరు పాల ధర రూ.48కి చేరుకుంది. కుంటి సాకులు : పాల ధర పెంపునకు ఖర్చుల పెరుగుదల, సేకరణ ధర పెంపే కారణాలని డెయిరీ వర్గాలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే అవి కుంటి సాకులేనని తెలుస్తోంది. పాల సేకరణ ధర పెంచింది ఒకసారి మాత్రమే. పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.48 చెల్లిస్తామని ప్రకటించారు. రైతులు తెచ్చే పాలలో ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే వెన్న ఉంటుంది. లీటర్‌కు రూ.35 నుంచి రూ.37 వరకు చెల్లిస్తున్నారు. పాల రవాణాకు మాత్రమే డీజిల్‌ను వినియోగిస్తున్నారు. వీటిని సాకుగా చూపి తరచూ పాల ధరను పెంచడం సబబా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
'మరోసారి పూలదండలు, బొకెలు వద్దు'
హైదరాబాద్ : తనవద్దకు వచ్చేవారు పూలదండలు, బొకేలు తీసుకు రావద్దని మంత్రి పదవి చేపట్టిన వ్యవసాయ, పాడి పరిశ్రమ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తార్నాకల డివిజన్ లాలాపేటలోని విజయ డెయిరీని ఆయన తొలిసారిగా మంత్రి హోదాలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పెద్ద ఎత్తున పూల బొకెలతో, దండలతో ఉద్యోగులు బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డెయిరీ ఎండీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో మరికొందరు ఉద్యోగులు పూల బొకెలతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. దీన్ని గమనించిన పోచారం తాను మరోసారి డెయిరీకి వస్తే ఎవరూ పూల బొకేలు, దండలు తీసుకు రావద్దని సూచించారు. డబ్బును దుర్వినియోగం చేయరాదని పోచారం కోరారు. -
చంద్ర బాబూ... జిల్లాకు ఏం చేశారు ?
హెరిటేజ్ కోసం విజయా డెయిరీని మూసేశారు లాభాల్లో ఉన్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారు సొంత జిల్లాకు మేలు కంటే కీడే ఎక్కువ చేశారు వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి సామాన్య కిరణ్ ధ్వజం జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పాలన-నారాయణస్వామి పెనుమూరు, న్యూస్‌లైన్: తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు లోకసభ అభ్యర్థి సామాన్య కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ స్థానం ఎన్నికల పరిశీలకులు,మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆమె పెనుమూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పులిగుంటీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్తరోడ్డు ఇండ్లు, ఠాణావేణుగోపాల పురం, సీఎస్ అగ్రహారం కాలనీ, చార్వాకానిపల్లె, చార్వాకానిపల్లె హరిజనవాడ, బీసీ కాలనీ, మంగళ కాలనీ, పెనుమురు చెక్ పోస్టు, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పెనుమూరు రెడ్డి రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాకు చేసిన మేలు కంటే కీడు ఎక్కువన్నారు. చంద్రగిరి మండలంలో ఉన్న హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు విజయా డెయిరీ మూసివేశారని ఆరోపించారు. అలాగే లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్నప్పుడు ఉచిత కరెంట్‌పై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని సీఎం అయిన వెంటనే తొలి సంతకంతో నెరవేర్చారన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చిత్తూరు డెయిరీని తెరిపిస్తానన్నారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లావాసులు తాగు,సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్‌ను, గంగాధరనెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి నారాయణస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. అలాగే ఎన్టీఆర్ జలాశయం నుంచి మిగులు జలాలు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు అనుసంధానం చేయడానికి సప్లయ్ చానల్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీనెల్లూరు అభ్యర్థి నారాయణస్వామి మాట్లాడుతూ సీమాంధ్రలో 130 నుంచి 140 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకోవడం ఖాయం అన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పారు. కుతూహలమ్మ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రుణపడి ఉంటానని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేను చేసిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యులు శైలజారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కారేటి గోవిందరెడ్డి, దూది కృష్ణమూర్తి, సాతంబాకం నరసింహారెడ్డి, పెద్దినేని గోపాల్ నాయుడు, మండల కన్వీనర్ మహాసముద్రం సురేష్‌రెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ దూది రవికుమార్, మండల అధికార ప్రతినిధి చింతాచెన్నకేశవులు, మండల కార్యదర్శి పెద్దరాసిపల్లె నరసింహారెడ్డి మండల యూత్ కన్వీనర్ ఐరాల మురళీకుమార్రెడ్డి, మండల బీసీ సెల్ కన్వీనర్ మనోహర్, ఎస్సీ నాయకులు దామోదరం తదితరులు పాల్గొన్నారు. -
‘ఎర్ర’ దొంగలు వ్యూహం మార్చారు
చెన్నై నుంచే ఆపరేషన్ దినకూలి నుంచి కాంట్రాక్ట్‌కు మారిన స్మగ్లింగ్ ఆరడుగుల దుంగకు రూ.5 వేలు అరెస్టులను లెక్క చేయని అక్రమార్కులు వాహనాలు మారుస్తూ రవాణా పోలీసులకు కొత్త సవాళ్లు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు వ్యూహం మార్చారు. పాత జాబితాలోని వారు, పోలీసులు వెతుకుతున్న స్మగ్లర్లు రంగంలోకి రావడం మానేశారు. చెన్నై నుంచే స్మగ్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు విజయా డెయిరీ సమీపంలో 33 మందికిపైగా ఎర్రచందనం కూలీలను శనివారం అరెస్టు చేశారు. పదిహేను ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రెం డు రోజుల క్రితం గుడిపాల పోలీసులు ఎర్రచందనం నరికేందుకు వస్తున్న 60 మంది తమిళ తంబీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. భారం అంతా కూలీలపైనే గతంలో స్మగ్లర్లు అడవి నుంచి సమీపంలోని రోడ్డులో ఉన్న వాహనం వరకే కూలీలను వాడుకునేవారు. ఎర్రచందనం నరికి తెచ్చి వాహనంలో చేరిస్తే దుంగకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చేవారు. ఇప్పుడు తాము రంగంలోకి రాకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వ్యూహం మార్చారు. ఎర్రచందనం నరికే తమిళ తంబీలను కూలీల నుంచి చిన్నపాటి కాంట్రాక్టు స్మగ్లర్లుగా మార్చేశారు. వీరు ఎర్రచందనం నరికి వాహనాల్లో చెన్నైలోని గోడౌన్లకు చేరుస్తున్నారు. ప్రతిఫలంగా ఆరు అడుగుల ఎర్రచందనం దుంగకు రూ.5 వేల వరకు స్మగ్లర్లు చెల్లిస్తున్నారు. కొత్త వ్యూహాలు ఇలా.. గతంలో అడవిలో నరికిన ఎర్రచందనం దుంగలను సమీప గ్రామాల్లో రోడ్డు పక్కనే సిద్ధంగా ఉన్న వాహనాల్లోకి చేర్చేవారు. అక్కడి నుంచి నేరుగా రవాణా చేసేవారు. ఇప్పుడు నిఘా పెరగడంతో స్మగ్లర్ల వ్యూహం మారింది. ప్రస్తుతం కీలక స్మగ్లర్లు, వారి అనుచరులు, దళారులు ప్రత్యక్షంగా రంగంలోకి రావడం లేదు. విల్లుపురం, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన తమిళ కూలీలకు డబ్బు ఆశ చూపి చిత్తూరు జిల్లాకు పంపుతున్నారు. వారే నేరుగా చెన్నై హార్బర్ సమీపంలోని స్మగ్లర్ల గోడౌన్లకు సరుకు (ఎర్రచందనం) చేర్చే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కూలీలు, వారిని నడిపించే మేస్త్రీలే పట్టుబడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రవాణా చామల, మామండూరు, బాలయపల్లె ఫారెస్టు రేంజ్‌ల్లోని శేషాచలం కొండల్లో లభించే ఎర్రచందనం దుంగలు నాణ్యంగా, బరువుగా ఉంటాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అధికం. ప్రస్తుతం తనిఖీలు అధికంగా ఉండడంతో వీటిని వేగంగా తరలించే పరిస్థితి లేదు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు నేరుగా ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలించడం లేదు. దుంగలను నరికిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామాలు లేదా అటవీ ప్రాంతం, చెరువు కట్టల కింద డంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పొదల్లో, నీళ్లలో దుంగలను దాచి ఉంచుతున్నారు. రెండు, మూడు రోజుల అనంతరం పోలీసుల అలికిడి లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల వరకు ఒక వాహనం, అక్కడ నుంచి మరో వాహనంలో తలిస్తున్నారు. దీనివల్ల వాహనం ప్రారంభ సమయంలో ఎవరైన పోలీసు ఇన్ఫార్మర్లు సమాచారం ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్తవ్యూహాలతో పోలీసులకు కొత్తసవాళ్లు ఎదురవుతున్నాయి. -
విజయ డెయిరీ చైర్మన్ గిరిపై దాసరి గురి!
సాక్షి, విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే దాసరిబాలవర్ధనరావు ఎట్టకేలకు విజయ డెయిరీ డెరైక్టరుగా ఎన్నికయ్యారు. రాబోయే రోజుల్లో విజయడైయిరీ చైర్మన్ పదవిపై ఆయన పోటీపడే అవకాశం ఉంది. విజయ డెయిరీలోకి అడుగు పెట్టేందుకు దాసరి ఏడాది క్రితమే ప్రయత్నించారు. అయితే అప్పట్లో విజయ డెయిరీ చైర్మన్ మండవ జానకీ రామయ్య దాసరి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం చివరకు చంద్రబాబు వరకు వెళ్లడంతో అప్పట్లో దాసరి బాలవర్ధనరావు వెనక్కు తగ్గారు. ఈసారి ఆయన డెయిరీలోకి అడుగుపెట్టడంతో రాబోయే రోజుల్లో దాసరి వర్గానికి, చైర్మన్ మండవ వర్గానికీ మధ్య కోల్డ్‌వార్ జరిగే అవకాశం ఉన్నట్లు డెయిరీ వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టువీడని దాసరి... ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో మూడు డెరైక్టర్ల పోస్టులు ఖాళీ అవుతాయి. ఈ ఏడాది తిరిగి దాసరి బాలవర్ధనరావు డెరైక్టర్ పోస్టు కోసం పోటీపడ్డారు. ఈ ఏడాది కూడా దాసరి బోర్డులోకి రాకుండా మండవ జానకీరామయ్య విశ్వప్రయత్నం చేశారు. తనకు అనుకూలంగా ఉన్నవారినే ముగ్గురు డెరైక్టర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా తెలుగుదేశం నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనగళ్లనారాయణ, గొట్టిపాటి రామకష్ణప్రసాద్ తదితరులు దీన్ని అంగీకరించలేదు. వారం రోజులుగా వారు మండవ జానకిరామయ్యతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. తాము సూచించిన ఇద్దరికి డెరైక్టర్ పోస్టులివ్వాలని పట్టుబట్టారు. అయితే దాసరి బాలవర్ధనరావు మినహా మిగిలిన వారిని డెరైక్టర్లుగా తీసుకుంటానంటూ మండవ షరతు పెట్టినట్లు సమాచారం. దీనికి టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో పార్టీ సూచించిన దాసరిబాలవర్ధనరావు, వాణీశ్రీలకు డెరైక్టర్లుగా అవకాశం ఇచ్చి, తన తరఫున వేమూరి రత్నగిరిరావుతో మండవ సరిపెట్టుకున్నారు. మండవకు దాసరి చెక్ పెట్టేనా!? విజయ డెయిరీలో 15 మంది డెరైక్టర్లుంటారు. వారిలో ఒకర్ని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు మండవ జానకీరామయ్య తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పటికే ఆయన వైపు ఎనిమిది మంది డెరైక్టర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేగా పనిచేసిన దాసరి బాలవర్ధనరావు బోర్డులోకి రావడంతో ఆయన చైర్మన్ పదవికి పోటీ పడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోర్డులో మండవకు వ్యతిరేకంగా ఉన్న వర్గమంతటిని దాసరి ఏకతాటిపైకి తీసుకొచ్చి చైర్మన్ గిరిని దక్కించుకునే అవకాశం ఉంది. మండవ తప్పుకుంటారా? మండవ జానకీరామయ్యకు 2016 వరకు డెరైక్టర్‌గా కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగవచ్చు. అయితే గతంలో జిల్లా టీడీపీ నేతలతో జరిగిన ఒప్పందం ప్రకారం విజయ డెయిరీ ప్రాంగణంలో ఎన్టీఆర్, క్షీర పితామహుడు కురియన్ విగ్రహాలను ప్రతిష్టించిన తరువాత బాధ్యతలు నుంచి తప్పుకుంటానని మండవ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది చివరకు విగ్రహాలు ప్రతిష్ట పూర్తి అవుతుందని ఆ తరువాత ఆయన తప్పుకుంటే దాసరి చైర్మన్ అవుతారని కొంతమంది డెరైక్టర్లు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్ట తరువాత మండవ తప్పుకుంటారంటూ హామీ ఇచ్చారనే వాదనను ఆయన అనుకూల డెరైక్టర్లు కొట్టిపారేస్తున్నారు. ఆయన చివరి వరకూ కొనసాగుతారని వాదిస్తున్నారు. కాగా ఐదారు నెలలు చూసి తప్పుకోకపోతే అవిశ్వాసతీర్మానం పెట్టి తప్పించి దాసరిని చైర్మన్ చేయాలని మరికొంతమంది డెరైక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా రాబోయే రోజుల్లో విజయడెయిరీలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాలు మధ్య కుమ్ములాట జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముగ్గురు డెరైక్టర్లు ఏకగ్రీవం.... ఎట్టకేలకు విజయ డెయిరీకి ముగ్గురు డెరైక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ డెయిరీలో మూడు డెరైక్టర్ పదవులకు 11 మంది పోటీ పడ్డారు. దాసరి బాలవర్ధనరావు(ఆముదాలపల్లి), వేమూరి రత్నగిరిరావు(దేవరకోట), నక్కలపు వాణీశ్రీ(కమ్మటూరు-విసన్నపేట)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి ఎల్.గురునాధం అధికారికంగా ప్రకటించారు. ఒకొక్క డెరైక్టర్ ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు -
విజయ డెయిరీలో మళ్లీ సవతి పోరు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య విజయవాడ డెయిరీలో సవతి పోరు మళ్లీ మొదలైంది. చైర్మన్ మండవ జానకి రామయ్యకు చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గీయులు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్దనరావును రంగంలోకి దించారు. పాలక వర్గ డెరైక్టర్ ఎన్నికల్లో దాసరితో నామినేషన్ దాఖలు చేయించారు. ఈ మేరకు శనివారం విజయ డెయిరీలో మూడు డెరైక్టర్ల ఎంపిక కోసం 15 మంది కోలాహలంగా నామినేషన్లు వేశారు. దాంతో విజయ డెయిరీ పాలకవర్గంలో టీడీపీకి చెందిన వైరి వర్గాల మధ్య విభేదాలు బయట పడ్డాయి. మండవ జానకి రామయ్యను గద్దె దించేందుకు రెండేళ్లుగా విజయ డెయిరీ పాలకవర్గ సభ్యులు పోరాడుతూనే ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖాళీ అయిన పాలకవర్గ డెరైక్టర్లకు జానకి రామయ్య వ్యతిరేక వర్గీయులు నామినేషన్లు వేసి హడావిడి చేశారు. గత సంవత్సరం కూడా దాసరిని పోటీ చేయించేందుకు తెలుగుదేశం శ్రేణులు ప్రయత్నించాయి. దాంతో జానకిరామయ్య ఈ గొడవను చంద్రబాబు వద్ద పంచాయతీపెట్టారు. చంద్రబాబు జిల్లా నాయకులను పిలిచి మాట్లాడి దివంగత నాయకుడు ఎర్రంనాయుడును సర్దుబాటు చేయమని ఆదేశించారు. ఎర్రం నాయుడు కిందామీదా పెట్టి గొడవను సర్దుబాటు చేసి వైరి వర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిర్చారు. విజయ డెయిరీ పాలక వర్గంలో మొత్తం 15 మంది డెరైక్టర్లు ఉన్నారు. జానకిరామయ్య వర్గానికి 8మంది, వ్యతిరేకవర్గంలో 7గురు డెరైక్టర్లు ఉండగా ఈ సంవత్సరం ముగ్గురు డెరైక్టర్ల పదవీకాలం పూర్తయింది. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం ఇద్దరు పురుష, ఒక మహిళా డెరైక్టర్ల పదవీకాలం పూర్తవటంతో ఈ నెల 20న ఎన్నికలు జరపటానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంలో 15 మందిలో ఆదిపత్యం సాదించి జానకి రామయ్యను అవిశ్వాసం ద్వారా గద్దె దించాలని తెలుగుదేశం పార్టీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. పోటాపోటీగా నామినేషన్లు .... విజయవాడ డెయిరీ పాలక వర్గానికి ఖాళీ అయిన మూడు డెరైక్టర్ల పోస్టులకు శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జానకిరామయ్య తన వర్గీయులతో నామినేషన్లు దాఖలు చేయించారు. జానకి రామయ్య వర్గానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు మూడు డెరైక్టర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు, తిరువూరుకు చెందిన కృష్ణమోహన్, మహిళా డెరైక్టరుగా విస్సన్నపేటకు చెందిన వాణిశ్రీ, బాల రమాదేవీ నామినేషన్లు వేశారు. జానకి రామయ్య వ్యతిరేక వర్గమైన దాసరి వర్గీయులకు మద్దతుగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు, కాట్రగడ్డబాబు, బుద్దావెంకన్నతోపాటు నగరంలో జిల్లాలో అన్ని నియోజక వర్గాలనుంచి పార్టీ ఇన్‌చార్జ్‌లు, నాయకులు కోలాహలంగా నామినేషన్ కార్యక్రమానికి హాజరవ్వటం చర్చనీయాంశమైంది. -
లెక్కల్లేవ్.. టెండర్లూ లేవ్ !
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విజయ డెరుురీ... అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక రోజురోజుకూ చతికిలపడుతోంది. ఇది చాలదన్నట్లు డెరుురీ కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న బినామీ దందా... దాన్ని అధఃపాతాళంలోకి పడిపోయేలా చేస్తోంది. నెలకు లక్షల రూపాయల మేర ఆదాయూనికి గండిపడుతున్నా... ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ డెరుురీ కదా.. అభివృద్ధి దిశ గా నడిపించాలన్న మాటేమో గానీ, అందినకాడికి దండుకునేందుకే కొందరు ఉద్యోగులు ప్రయత్నిస్తుండడంతో దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఇదీ కథ... విజయ డెరుురీలో ఏడాది క్రితం వరకు పాల నాణ్యతను గుర్తించే విభాగంలో కీలక విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి బినామీ దందాకు తెరలేపాడు. 2006లో మొదటిసారిగా డెరుురీ ప్రధాన ద్వారం వద్ద విజయ పాల ఉత్పత్తులను అమ్మేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటుందని సర్వసాధారణంగా అందరూ భావిస్తారు. కానీ... ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల్లో ఏ పనినైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటే టెండర్లు ఆహ్వానించాలి. అరుుతే డెరుురీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తన కూతురుకు ఈ కౌంటర్‌ను అప్పగించాలని అప్పటి ఉన్నతాధికారిని కోరారు. మనోడే కదా అని కరుణించిన అయ్యగారు ఎలాంటి టెండర్లు లేకుండానే ఉద్యోగి కూతురు పేరిట చేసుకున్న దరఖాస్తుపై సంతకం చేశారు. అంతేకాకుండా... కాంట్రాక్ట్ అప్పగించే సమయంలో ఎలాంటి కాలపరిమితి విధించకుండా ప్రొసీడింగ్స్ జారీ చేయడం గమనార్హం. ఇంకేముంది... ఆ తర్వాత సదరు ఉద్యోగి క్రమక్రమంగా దందాకు తెరలేపాడు. కౌంటర్ నిర్వహణ పేరుకే కూతురిది కాగా... అంతా నడిపించేది మాత్రం సదరు ఉద్యోగే. మాయూజాలం ఇలా... విజయ పాలు, పాల ఉత్పత్తులకు జిల్లాలోనే కాదు... కరీంనగర్ జిల్లాలో సైతం మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రతి రోజూ 50 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి విక్రరుుస్తున్నారు. ఈ అవకాశాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు ఉద్యోగి. ఆరేళ్లుగా కాంట్రాక్ట్ పొడిగించుకుంటుండడమే కాకుండా యథేచ్ఛగా దండుకుంటున్నాడు. పాల ఉత్పత్తులను కౌంటర్ వద్ద అమ్మడమే కాదు... కౌంటర్ కాంట్రాక్ట్‌ను చూపెడుతూ ప్రతి రోజూ సుమారు వంద నుంచి రెండు వందల లీటర్ల వరకు పాలను బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పాల నాణ్యతను ఇట్టే పసిగట్టే సదరు ఉద్యోగి... పాల దిగుమతిలో తన మాయాజాలంతో సృష్టించిన వాటిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా పాలను సరఫరా చేస్తూ డెరుురీ ఆదాయూనికి * లక్షల మేర గండికొడుతున్నాడు. ప్రతి నెలా లక్ష రూపాయల వరకు డెరుురీ ఆదాయానికి గండి పడుతుండగా... పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. అంతేకాదు... ఉన్నతాధికారులు మారిన ప్రతీసారి కొంత ముట్టజెప్పి కాంట్రాక్ట్ పొడిగించుకుంటున్నట్లు సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అదేవిధంగా బయటి వ్యక్తులకు అప్పగిస్తే అక్రమాలు బయటపడతాయనే నెపంతో కౌంటర్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నాడన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ నెలలో టెండర్లు పిలుస్తాం ప్రధాన ద్వారం వద్ద పాల ఉత్పత్తులను అమ్మే కౌంటర్‌కు కొత్తగా టెండర్లను పిలవాలని నిర్ణయించాం. ఈ నెలలోనే కొత్త వారికి అప్పగిస్తాం. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో కౌంటర్ విషయంపై దృష్టి సారించలేదు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. - పీఆర్ కృష్ణస్వామి, విజయ డెరుురీ, డిప్యూటీ డెరైక్టర్ -
లెక్కల్లేవ్.. టెండర్లూ లేవ్ !
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విజయ డెరుురీ... అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక రోజురోజుకూ చతికిలపడుతోంది. ఇది చాలదన్నట్లు డెరుురీ కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న బినామీ దందా... దాన్ని అధఃపాతాళంలోకి పడిపోయేలా చేస్తోంది. నెలకు లక్షల రూపాయల మేర ఆదాయూనికి గండిపడుతున్నా... ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ డెరుురీ కదా.. అభివృద్ధి దిశ గా నడిపించాలన్న మాటేమో గానీ, అందినకాడికి దండుకునేందుకే కొందరు ఉద్యోగులు ప్రయత్నిస్తుండడంతో దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఇదీ కథ... విజయ డెరుురీలో ఏడాది క్రితం వరకు పాల నాణ్యతను గుర్తించే విభాగంలో కీలక విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి బినామీ దందాకు తెరలేపాడు. 2006లో మొదటిసారిగా డెరుురీ ప్రధాన ద్వారం వద్ద విజయ పాల ఉత్పత్తులను అమ్మేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటుందని సర్వసాధారణంగా అందరూ భావిస్తారు. కానీ... ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల్లో ఏ పనినైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటే టెండర్లు ఆహ్వానించాలి. అరుుతే డెరుురీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తన కూతురుకు ఈ కౌంటర్‌ను అప్పగించాలని అప్పటి ఉన్నతాధికారిని కోరారు. మనోడే కదా అని కరుణించిన అయ్యగారు ఎలాంటి టెండర్లు లేకుండానే ఉద్యోగి కూతురు పేరిట చేసుకున్న దరఖాస్తుపై సంతకం చేశారు. అంతేకాకుండా... కాంట్రాక్ట్ అప్పగించే సమయంలో ఎలాంటి కాలపరిమితి విధించకుండా ప్రొసీడింగ్స్ జారీ చేయడం గమనార్హం. ఇంకేముంది... ఆ తర్వాత సదరు ఉద్యోగి క్రమక్రమంగా దందాకు తెరలేపాడు. కౌంటర్ నిర్వహణ పేరుకే కూతురిది కాగా... అంతా నడిపించేది మాత్రం సదరు ఉద్యోగే. మాయూజాలం ఇలా... విజయ పాలు, పాల ఉత్పత్తులకు జిల్లాలోనే కాదు... కరీంనగర్ జిల్లాలో సైతం మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రతి రోజూ 50 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి విక్రరుుస్తున్నారు. ఈ అవకాశాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు ఉద్యోగి. ఆరేళ్లుగా కాంట్రాక్ట్ పొడిగించుకుంటుండడమే కాకుండా యథేచ్ఛగా దండుకుంటున్నాడు. పాల ఉత్పత్తులను కౌంటర్ వద్ద అమ్మడమే కాదు... కౌంటర్ కాంట్రాక్ట్‌ను చూపెడుతూ ప్రతి రోజూ సుమారు వంద నుంచి రెండు వందల లీటర్ల వరకు పాలను బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పాల నాణ్యతను ఇట్టే పసిగట్టే సదరు ఉద్యోగి... పాల దిగుమతిలో తన మాయాజాలంతో సృష్టించిన వాటిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా పాలను సరఫరా చేస్తూ డెరుురీ ఆదాయూనికి * లక్షల మేర గండికొడుతున్నాడు. ప్రతి నెలా లక్ష రూపాయల వరకు డెరుురీ ఆదాయానికి గండి పడుతుండగా... పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. అంతేకాదు... ఉన్నతాధికారులు మారిన ప్రతీసారి కొంత ముట్టజెప్పి కాంట్రాక్ట్ పొడిగించుకుంటున్నట్లు సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అదేవిధంగా బయటి వ్యక్తులకు అప్పగిస్తే అక్రమాలు బయటపడతాయనే నెపంతో కౌంటర్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నాడన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ నెలలో టెండర్లు పిలుస్తాం ప్రధాన ద్వారం వద్ద పాల ఉత్పత్తులను అమ్మే కౌంటర్‌కు కొత్తగా టెండర్లను పిలవాలని నిర్ణయించాం. ఈ నెలలోనే కొత్త వారికి అప్పగిస్తాం. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో కౌంటర్ విషయంపై దృష్టి సారించలేదు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. - పీఆర్ కృష్ణస్వామి, విజయ డెరుురీ, డిప్యూటీ డెరైక్టర్ -
లెక్కల్లేవ్.. టెండర్లూ లేవ్ !
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విజయ డెరుురీ... అసలే అంతంతమాత్రంగా నడుస్తోంది. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక రోజురోజుకూ చతికిలపడుతోంది. ఇది చాలదన్నట్లు డెరుురీ కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న బినామీ దందా... దాన్ని అధఃపాతాళంలోకి పడిపోయేలా చేస్తోంది. నెలకు లక్షల రూపాయల మేర ఆదాయూనికి గండిపడుతున్నా... ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ డెరుురీ కదా.. అభివృద్ధి దిశ గా నడిపించాలన్న మాటేమో గానీ, అందినకాడికి దండుకునేందుకే కొందరు ఉద్యోగులు ప్రయత్నిస్తుండడంతో దాని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఇదీ కథ... విజయ డెరుురీలో ఏడాది క్రితం వరకు పాల నాణ్యతను గుర్తించే విభాగంలో కీలక విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి బినామీ దందాకు తెరలేపాడు. 2006లో మొదటిసారిగా డెరుురీ ప్రధాన ద్వారం వద్ద విజయ పాల ఉత్పత్తులను అమ్మేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటుందని సర్వసాధారణంగా అందరూ భావిస్తారు. కానీ... ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల్లో ఏ పనినైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటే టెండర్లు ఆహ్వానించాలి. అరుుతే డెరుురీలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తన కూతురుకు ఈ కౌంటర్‌ను అప్పగించాలని అప్పటి ఉన్నతాధికారిని కోరారు. మనోడే కదా అని కరుణించిన అయ్యగారు ఎలాంటి టెండర్లు లేకుండానే ఉద్యోగి కూతురు పేరిట చేసుకున్న దరఖాస్తుపై సంతకం చేశారు. అంతేకాకుండా... కాంట్రాక్ట్ అప్పగించే సమయంలో ఎలాంటి కాలపరిమితి విధించకుండా ప్రొసీడింగ్స్ జారీ చేయడం గమనార్హం. ఇంకేముంది... ఆ తర్వాత సదరు ఉద్యోగి క్రమక్రమంగా దందాకు తెరలేపాడు. కౌంటర్ నిర్వహణ పేరుకే కూతురిది కాగా... అంతా నడిపించేది మాత్రం సదరు ఉద్యోగే. మాయూజాలం ఇలా... విజయ పాలు, పాల ఉత్పత్తులకు జిల్లాలోనే కాదు... కరీంనగర్ జిల్లాలో సైతం మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ప్రతి రోజూ 50 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి విక్రరుుస్తున్నారు. ఈ అవకాశాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు ఉద్యోగి. ఆరేళ్లుగా కాంట్రాక్ట్ పొడిగించుకుంటుండడమే కాకుండా యథేచ్ఛగా దండుకుంటున్నాడు. పాల ఉత్పత్తులను కౌంటర్ వద్ద అమ్మడమే కాదు... కౌంటర్ కాంట్రాక్ట్‌ను చూపెడుతూ ప్రతి రోజూ సుమారు వంద నుంచి రెండు వందల లీటర్ల వరకు పాలను బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. పాల నాణ్యతను ఇట్టే పసిగట్టే సదరు ఉద్యోగి... పాల దిగుమతిలో తన మాయాజాలంతో సృష్టించిన వాటిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా పాలను సరఫరా చేస్తూ డెరుురీ ఆదాయూనికి * లక్షల మేర గండికొడుతున్నాడు. ప్రతి నెలా లక్ష రూపాయల వరకు డెరుురీ ఆదాయానికి గండి పడుతుండగా... పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. అంతేకాదు... ఉన్నతాధికారులు మారిన ప్రతీసారి కొంత ముట్టజెప్పి కాంట్రాక్ట్ పొడిగించుకుంటున్నట్లు సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అదేవిధంగా బయటి వ్యక్తులకు అప్పగిస్తే అక్రమాలు బయటపడతాయనే నెపంతో కౌంటర్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నాడన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ నెలలో టెండర్లు పిలుస్తాం ప్రధాన ద్వారం వద్ద పాల ఉత్పత్తులను అమ్మే కౌంటర్‌కు కొత్తగా టెండర్లను పిలవాలని నిర్ణయించాం. ఈ నెలలోనే కొత్త వారికి అప్పగిస్తాం. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో కౌంటర్ విషయంపై దృష్టి సారించలేదు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. - పీఆర్ కృష్ణస్వామి, విజయ డెరుురీ, డిప్యూటీ డెరైక్టర్