వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాలనే డిమాండ్లతో విజయ డెయిరీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
కర్నూలు : వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాలనే డిమాండ్లతో విజయ డెయిరీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బుధవారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం కలెక్టర్ విజయ్‌మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఇవ్యాలని వారు కోరారు.