
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటే తమ ఉత్పత్తులను డోర్ డెలివరీ చేసే వ్యవస్థను మొబైల్ ఫోన్ వరకు విస్తరించాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్‌ను త్వరలోనే సిద్ధం చేయాలని సూచించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డెయిరీ చైర్మన్ లోకభూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.