
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేయాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజన్న, బాసర సరస్వతి దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొంది.
వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలకు కూడా సరఫరా చేస్తామని, వీటికి నెలకు 50 టన్నుల నెయ్యి అవసరమవుతుందని తెలిపింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు సరఫరా చేసేలా ఉత్తర్వులిస్తే మరింత లాభం చేకూరుతుందని, దీని కోసం ఆదేశాలివ్వాలని కోరింది. మార్కెట్ ధరకు లేదా అంతకంటే తక్కువకే నాణ్యమైన విజయ నెయ్యిని దేవాలయాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment