సాక్షి,విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ నియమాకం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా కూటమి ప్రభుత్వం తాజాగా రామచంద్రమోహన్‌కి బాధ్యతలు అప్పగించింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్‌కి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాన్ ఐఏఎస్ అధికారికి దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ అధికారిని కాదని రామచంద్రమోహన్‌కి బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖలో ఏడీసీ 1 గా ఉన్న అధికారిని పక్కనపెట్టి రామచంద్రమోహన్‌కి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడమేంటని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు.
తీవ్రమైన అవినీతి ఆరోపణలు,కేసులు ఉన్న రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోగా కూడా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.సామాజికవర్గం ఎఫెక్ట్‌తోనే రామచంద్రమోమన్‌కి కీలక పోస్టు దక్కిందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment